ఎప్పటి కోపమో ఇప్పుడు ?
posted on Dec 13, 2012 @ 11:27AM
పార్లమెంట్ లో ఎన్ టి ఆర్ విగ్రహాన్ని ప్రతిష్టించే విషయం లో ఉన్న వివాదాన్ని ఆసరాగా తీసుకొని తెలుగు దేశం ఎంపి హరి కృష్ణ చంద్ర బాబు నాయుడు ఫై ఎప్పటి నుండో, ఏదో విషయంలో ఉన్న కోపాన్ని ప్రస్తుతం ప్రదర్శించారని భావిస్తున్నారు. వీరిద్దరి మధ్య సంభందాలు ఎప్పటి నుండో సరిగా లేని విషయం తెలిసిందే.
ఎఫ్ డి ఐ లఫై పార్లమెంట్ లో ఓటింగ్ జరుగుతున్న సమయంలో ఓటింగ్ కు దూరంగా ఉన్న ముగ్గురు పార్టీ ఎంపి లు దేవేందర్ గౌడ్, సుజన చౌదరి, గుండు సుధా రాణి లను క్షమించి వదిలేయడాన్ని కూడా హరి కృష్ణ సీరియస్ గా తీసుకున్నారు. పార్టీ విప్ ను ధిక్కరించిన వారిఫై ఎలాంటి చర్య తీసుకోకుండా వదిలేయటం ఏమిటని హరి కృష్ణ ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్యం సరిగా లేదనే వివరణ సరి కాదని, తనకు కూడా ఆ రోజు ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ ఓటింగ్ కు హాజరయ్యననీ, ఓటింగ్ కు హాజరయ్యేందుకు కొంత మంది సభ్యులు ప్రత్యేక విమానాల్లో వచ్చారని ఆయన గుర్తు చేస్తున్నారు.
ఎన్ టి ఆర్ విగ్రహ ప్రతిష్ట అనేది ఆయన కుమారులు, కూతుళ్ళకు సంభందించిన విషయమని,ఈ విషయంలో అల్లుళ్ళు, పార్టీ ప్రస్తావన ఉండకూడదని హరి కృష్ణ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అంటే, చంద్ర బాబు కు ఈ విషయం తో సంభందం లేదని సూటిగా చెప్పడమే కదా ?