గబ్బర్ సింగ్ డబుల్ సెంచరీ
posted on Nov 28, 2012 @ 12:44PM
గబ్బర్ సింగ్ మూవీ సూపర్ హిట్.. చాలా రోజుల తర్వాత పవన్ కల్యాణ్ సినిమాకి అభిమానులు ఆశించిన స్థాయిలో హిట్టొచ్చింది. ఐదు సెంటర్లలో ఈ బొమ్మ రెండొందల రోజులు ఆడింది. పవన్ కల్యాణ్ తోపాటు ఇది అభిమానులక్కూడా చాలా సంతోషకరమైన విషయం.
కానీ.. ఆ ఆనందం పైకి పెద్దగా కనిపించడంలేదు. ఎందుకంటే ఈ సినిమాకి 50 రోజుల ఫంక్షన్, వంద రోజుల ఫంక్షన్ జరగనేలేదు. ఇప్పుడు అన్నీ కలిపి రెండొందల రోజుల ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలని అభిమానులు తెగ ముచ్చటపడుతున్నారు.
హిందీలో సల్మాన్ చేసిన దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్.. హిందీలో అప్పుడే సల్మాన్ సీక్వెల్ కూడా మొదలుపెట్టేశాడు. తెలుగులో మాత్రం ఇంకా సీక్వెల్ తీస్తారా లేదా అన్నదానిపై అస్సలు క్లారిటీ లేదు. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పినా ప్రచారం జోరుగా సాగుతూనే ఉంది.
పవన్ ఓకే అంటే తాను సీక్వెల్ కి రెడీ అంటున్నాడు దర్శకుడు. దర్శకుడు, పవర్ హీరో సరేనంటే సీక్వెక్ నేను రెడీ అంటూ నిర్మాత స్టేట్ మెంట్. ముగ్గురూ కలిసి ఓ మాటమీద నిలబడితేనేగానీ ఈ విషయంలో క్లారిటీ వచ్చే సూచనలు కనిపించడంలేదు. పవన్ కల్యాణ్ మాత్రం హిందీలో దబాంగ్ 2 కి వచ్చే రెస్పాన్స్ ని చూసి తెలుగులో సీక్వెల్ గురించి ఆలోచిస్తామని చెబుతున్నాడు.