పంతం నెగ్గించుకున్నడిప్యూటీ సీఎం
posted on Oct 28, 2012 9:28AM
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తన పంతం నెగ్గించుకున్నారు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోల్ నియోజకవర్గానికి సింగూరు నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నంలో విజయం సాధించారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రతిపాదన పెండింగ్‌లో ఉండడం, ముఖ్యమంత్రి నుంచి సానుకూల స్పందన లేకపోవడంతో మెదక్‌లో జరిగే ఇందిరమ్మ బాటలో పాల్గొనకూడదని దామోదర నిర్ణయించుకున్నారు. దీంతో పార్టీలోని సీనియర్లు సీఎం, డిప్యూటీ సీఎం మధ్య సయోధ్య కుదిర్చేందుకు రంగంలోకి దిగారు. చిన్న పథకంలో బెట్టుచేయడం ఎందుకని సీఎంకి నచ్చజెప్పడంతో, సింగూర్ లిఫ్ట్ ఏర్పాటుకి కిరణ్‌కుమార్‌డ్డి అంగీకరించారు. ఈ మేరకు సదరు ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు జారీ చేయాలని భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌డ్డికి సూచించారు. ఇందిరమ్మ బాటలో భాగంగా మెదక్ జిల్లాలో సోమ, మంగళ, బుధ వారాల్లో సీఎం పర్యటిస్తున్నారు. సంగాడ్డి నుంచి యాత్ర మొదలవుతుంది. యాత్రను నిర్ణయించే సమయంలో దామోదరను పిలవకుండానే సీఎం, మెదక్ జిల్లా నాయకులతో తేదీలు ఖరారు చేశారు. దీనిపై దామోదర కొద్ది రోజులుగా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. డిప్యూటీ ఆగ్రహాన్ని గ్రహించిన పార్టీ నేతలు దామోదరతో చర్చలు ప్రారంభించారు. ఈ చర్చల సందర్భంగా దామోదర సీఎం తీరుపై తీవ్రంగా మండిపడట్లు సమాచారం. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ, ఉప ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా ఇవ్వడం లేదని, స్వయంగా తన శాఖ పరిధిలోనే నిర్ణయాలు తీసుకుంటున్నారని బొత్సకు వెల్లడించినట్లు సమాచారం. దీనిపై బొత్స సీఎంతో కూడా మాట్లాడారు. హైదరాబాద్‌కు తాగునీటితో పాటు.. నిజాం సాగర్, ఘనపురం ప్రాజెక్టులకు నీటి సరఫరా చేసే ప్రాజెక్టుగా మిగిలిపోయిన సింగూరు ప్రాజెక్టు నుంచి.. స్థానిక రైతులకు నీటి వాటా కల్పించడం చాలా కాలంగా ఒక ప్రధాన డిమాండ్‌గా ఉంది. అది క్రమంగా దామోదర ఓట్ల భవిష్యత్తును నిర్దేశించేదిగా మారిపోయింది. ఇంత చిన్న ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల ద్వారా సాగునీరు ఇవ్వటం సాధ్యం కాదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి అంటున్నారు. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది.