‘తెలంగాణా’ ఫై పార్టీకి మంత్రుల అల్టిమేటం !
posted on Dec 15, 2012 @ 3:20PM
ప్రత్యెక తెలంగాణా విషయంలో కాంగ్రెస్ సానుకూలంగా లేకపొతే తెలంగాణా మంత్రులంతా పార్టీకి, ప్రభుత్వానికి దూరంగా ఉంటారనీ, అవసరమైతే తమ దారి తాము చూసుకుంటామని తెలంగాణా ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యానారాయణ కు తేల్చి చెప్పారు.
రేపు కాంగెస్ సదస్సు జరగనున్న తరుణంలో జానా రెడ్డి నాయకత్వంలో ఎనిమిది మంది మంత్రులు ఈ రోజు బొత్సను కలిసారు. ఢిల్లీ లో తెలంగాణా ఫై జరగనున్న అఖిల పక్ష సమావేశానికి పార్టీ నుండి ఒక్కరినే పంపించాలని, సదస్సు లో తెలంగాణాఫై తీర్మానం చేయాలని మంత్రుల బృందం బొత్స కు సూచించింది. ఈ సమావేశానికి ఒక్కరినే పంపించాలని తాము సోనియా గాంధీ కి లేఖ రాస్తామని జానా రెడ్డి వెల్లడించారు. అలాగే, ప్రత్యెక రాష్ట్రం విషయంలో పార్టీ వైఖరి వెల్లడించాలని గులాం నబీ అజాద్ ను కూడా కోరతామని జానా అన్నారు.
తెలంగాణా విషయంలో మంత్రులందరికీ బాధ్యత ఉందని, అందరికన్నా ఎక్కువ బాధ్యత సీనియర్ మంత్రిగా తనఫైన ఉందని జానా ప్రకటించారు. తెలంగాణా రాష్ట్ర ప్రక్రియ కీలక దశకు చేరుకొందని కూడా మంత్రి అన్నారు.