తెలంగాణలో మళ్ళీ విజృంభిస్తున్న కరోనా.. తాజాగా ఎన్ని కేసులంటే..
posted on Aug 29, 2020 @ 10:20AM
తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం రోజు రెండు వేల లోపు పాజిటివ్ కేసులు నమోదవుతుండగా తాజాగా రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 2,751 కేసులు నమోదయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 9 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మరణాల సంఖ్య 808కి చేరింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,20,116 కి చేరింది. అయితే నిన్న 1675 మంది కరోనా నుండి కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 89350కి చేరింది. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం తెలంగాణలో 30008 యాక్టివ్ కేసులు ఉండగా వీరిలో 23049 మంది పేషెంట్లు ఇళ్లలోనే ఉంటూ ట్రీట్‌మెంట్ పొందుతున్నారు.
తెలంగాణలో నిన్న మొత్తం 62300 మందికి కరోనా టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 1266643కి చేరింది. అయితే మరో 1010 టెస్టుల రిపోర్టులు రావాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా GHMCలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. నిన్న కొత్తగా 432 పాజిటివ్ కేసులొచ్చాయి. అలాగే నిన్న కరీంనగర్‌లో 192, రంగారెడ్డి 185, నల్గొండ 147, ఖమ్మం 132, మేడ్చల్ మల్కాజిగిరిలో 128, నిజామాబాద్ 113, సూర్యాపేట 111, వరంగల్ అర్బన్ జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి.