భారత్ లో కరోనా ఉగ్ర రూపం.. నిన్న ఒక్క రోజే వెయ్యికి పైగా మృతి
posted on Aug 27, 2020 @ 10:26AM
కరోనా తో ప్రపంచం మొత్తం అల్లాడుతోంది. ఇప్పటికే అమెరికా, బ్రెజిల్ లో కరోనా మరణ హోమం సృష్టించగా తాజాగా భారత్ లో నిన్న ఒక్క రోజే 1,023 మంది మృతి చెందారు. ఇక గత 24 గంటల్లో కొత్తగా 75,760 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 33,10,235 కు చేరుకోగా, మృతుల సంఖ్య 60,472కి పెరిగింది. ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 25,23,772 మంది కోలుకోగా.. 7,25,991 మంది ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్నాటక, యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్‌లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 9,24,998 మంది నుండి సేకరించిన శాంపిల్స్‌ను పరీక్షించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 3 కోట్ల 85 లక్షల 76 వేల 510 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలియచేసింది.