కోస్తాంద్ర కాంగ్రెస్ లో రాజుకుంటున్న నిప్పు
posted on Oct 28, 2012 @ 4:22PM
మోస్టు సీనియర్లను కాదని నిన్న మొన్నటి ఎంపిలకు పదవులు కట్టబెట్టటంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ వర్గాల్లో నిప్పురాజుకుంటుంది. అందులో కోస్తాంద్రనుండి ఐదు సార్లు ఎంపిగా ఎన్నికయిన కావూరి ముఖ్యులు అలాగే గుంటూరు నుండి రాయపాటి. తమ సామాజిక వర్గం వారైన ఎన్ టీ రామారావు కావూరిని తన పార్టీలోకి ఆహ్వానించినా కాంగ్రెస్ కు వీరాభిమానిగా ఉన్నారు. అంతే కాకుండా పివి నరహింహారావు ప్రదానిగా ఉన్నప్పుడు కూడా సోనియాకు వీర విధేయులు గా ఉండి ఆమె పార్టీ లోకి రావడానికి తన వంతు కషి సల్పారు.
కోస్తాంధ్రకి చెందిన కావూరి,రాయపాటి, పాలడుగు, పిన్నమనేని, చిట్లూరి, చెన్నుపాటి, దొడ్డపనేని, చిట్టినేని కుటుంబాల వారు తెలుగుదేశం హవాలో కూడా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయత చూపినవారే. కాగా పదవుల పంపకాలలో మాత్రం వెనుకబడ్డారు. కావూరికి పదవి దక్కక పోవడంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ వర్గీయులంతా ఆయనకు సానుభూతిని తెలుపుతున్నారు.
గుంటూరు, కృష్ణా, ప్రకాశం,పశ్చిమ గోదావరి,జిల్లాలలో 30 శాతం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతికూల పవనాలు ఎదుర్కొవలసి వుంటుందని సీనియర్లు భయపడుతున్నారు.
మంత్రి దానంనాగేందర్, మర్రి శశిధర్ రెడ్డి తమను పార్టీ సమావేశాలకు పిలవడమే మానుకున్నారని కాని వారి నియోజక వర్గాలలో కమ్మవారే ఎక్కువగా ఉన్నారని రాబోయే ఎన్నికలలో వారి ఓట్లు ఎంతవరకు పడతాయో చూడాలని కావూరి చెబుతున్నారు. దీంతో సీను రివర్స్ అవుతోందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు.