తెలంగాణలో ‘ఆ ముగ్గురు’
posted on Oct 31, 2012 8:44AM
రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతలు తెలంగాణపై దృష్టి సారించారు. కాంగ్రెస్, తెలుగు దేశం, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేతలు సోమవారం తెలంగాణ ప్రాంతంలో పర్యటించారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి మెదక్ జిల్లాలో ఇందిరమ్మ బాటలో పాల్గొన్నారు. ఆయన మరో రెండురోజులు జిల్లాలోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశాఖపట్నంలో ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న ముఖ్యమంత్రి ఆ కార్యక్రమం వాయిదా పడటంతో మెదక్ జిల్లాకు వెళ్ళారు. ఇక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈనెల 2న అనంతపురం జిల్లాలో పాదయాత్ర ప్రారంభించి, కర్నూలు జిల్లా మీదుగా మహబూబ్‌నగర్ జిల్లాకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఆ జిల్లాలో బాబు యాత్ర కొనసాగుతోంది. నల్లగొండ జిల్లాకు చెందిన యువ తెలంగాణ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొన్నారు. విజయమ్మ సమక్షంలో జిట్టా పార్టీలో చేరారు.