చేతులెత్తేసిన సిఎంను చూడలా
posted on Mar 28, 2011 @ 3:04PM
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కూడా అసెంబ్లీలో రౌడీయిజం చేయడానికి భయపడే వారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అన్నారు. టిడిపి పార్టీ శాసనసభ్యులపై వ్యవసాయ శాఖమంత్రి వైయస్ వివేకానందరెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం తీరు గర్హనీయమన్నారు. ఎమ్మెల్యేలపై దాడిని తాను ఖండిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి సమక్షంలోనే సభలో దాడి జరిగినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి చేతులెత్తేశారన్నారు. చేతులెత్తేసిన సిఎంను తాను ఎన్నడూ చూడేదన్నారు. అసెంబ్లీలో రౌడీయిజం చేయడం దారుణమన్నారు. ప్రతిపక్షాలకే భద్రత లేనప్పుడు ఇక రాష్ట్రంలో సామాన్యుని పరిస్థితి ఏమిటన్నారు. మండలిలో లీడర్ వైయస్ వివేకా ఇలా వ్యవహరిస్తారని తాను నుకోలేదన్నారు. అయితే ప్రజా సమస్యలపై స్పందించడానికి టిడిపి ఎప్పుడూ ముందుంటుదన్నారు. ఎవరు బెదిరించినా భయపడేది లేదన్నారు. వైయస్ హయాంలో జరిగిన భూకేటాయింపులపై జెఎల్పీ వేయాల్సిందేనని ఆయన అన్నారు.