హైదరాబాద్ కు స్వచ్ఛతలో 19 వ స్థానం
posted on Feb 16, 2016 @ 2:59PM
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న స్వచ్ఛనగరాల సర్వేలో హైదరాబాద్ 19 వ స్థానం దక్కించుకుంది. జనాభా ప్రాతిపదికన తీసుకున్న 73 మహానగరాల్లో హైదరాబాద్ కు స్వచ్ఛతలో 19వ స్థానం దక్కించుకుంది. తెలంగాణా రాష్ట్రం నుంచి మరో నగరం వరంగల్ 32వ స్థానంలో నిలిచింది. మరో తెలుగు నగరం విశాఖపట్టణం ఐదో స్థానంలో నిలవడం విశేషం. ఈ లిస్ట్ లో మైసూర్ అత్యంత స్వచ్ఛమైన నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసికి 65వ స్థానం దక్కింది. ఈ సర్వేలో నగరంలోని జనాభా, నీటి లభ్యత, ప్రజల జీవనవిధానాన్నిలాంటి వాటిని కూడా పరిగణించారు. స్వచ్ఛభారత్ మిషన్ దేశంలో ఏ మేరకు పనిచేస్తుందో పరిశీలించడానికి ఈ సర్వేను కేంద్రం చేపట్టింది.
టాప్ 10 క్లీనెస్ట్ సిటీస్
1.మైసూర్, 2. ఛండీగఢ్, 3.తిరుచిరాపల్లి, 4. న్యూఢిల్లీ, 5. విశాఖపట్టణం, 6. సూరత్, 7. రాజ్ కోట్, 8. గ్యాంగ్ టక్, 9. పింప్రీ చించ్వాడ్(మహారాష్ట్ర) 10. గ్రేటర్ ముంబై