ఆరు నూరైనా పాదయాత్ర కొనసాగుతుంది: చంద్రబాబు
posted on Nov 30, 2012 @ 10:16AM
ఆరోగ్య సమస్యలెలా ఉన్నా పాదయాత్ర ఆపే ప్రసక్తి లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు. ఆరు నూరైనా పాదయాత్ర ఆపేది లేదు. ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకొన్న తర్వాత వెనకడుగు ఉండకూడదు. బయట తిరిగేటప్పుడు ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. తట్టుకోవాలి. పాదయాత్రను జనవరి 26తో ముగించాలనుకొన్నాం. కానీ అప్పటికి అనుకున్న చోటుకు చేరడం సాధ్యమయ్యేలా లేదు. అవసరాన్ని బట్టి ఆ తర్వాత కూడా పాదయాత్ర కొనసాగుతుంది అని చెప్పారు.
నేడు చంద్రబాబు పాదయాత్ర నిజామాబాద్ జిల్లా జుక్కల్, బాన్సువాడ నియోజక వర్గాలలో జరుగుతుంది. పిట్లం మండలంలోని బోల్లక్ పల్లి నుండి పాదయాత్ర ప్రారంభమై, బాన్స్ వాడ, తాడ్ కోల్ చౌరస్తా, బస్సు స్టాండ్ ఎదురుగా అంబేద్కర్ విగ్రహం మీదుగా బీర్కూర్ క్రాస్ రోడ్డుకు చేరుతుంది. భోజన విరామం తరువాత సోమేశ్వరం, దేశాయిపేట, దుర్గి క్రాస్ రోడ్డు, అంకోల్ క్యాంప్, నెమలి, కామిశెట్టిపల్లి బిర్కూర్ క్రాస్ రోడ్ మీదుగా మైలారం క్రాస్ రోడ్ వద్దకు పాదయాత్ర చేరుకుంటుంది.