Read more!

ఒకే మ్యాచ్ .. ఒక వైపు సంబరాలు.. మరో వైపు విధ్వంసం

ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో  ఒక మ్యాచ్ కారణంగా  బెల్జియంలో ఒక వైపు సంబరాలు హోరెత్తితే.. మరో వైపు విధ్వంసం చెలరేగింది. ఇంతకీ విషయమేమిటంటే.. ఫిఫా వరల్డ్ కప్ లో బాగంగా మోరాకో, బిల్జియంల మధ్య మ్యాచ్ జరిగింది.

ఈ మ్యాచ్ లో బెజ్జియం 0-2 తేడాతో ఘోరంగా ఓడిపోయింది.  మొరాకో గెలుపు, బిల్జియం  ఓటమితో బ్రస్సెల్స్ లో సంబరాలు,  విధ్వంస కాండ ఓకే సమయంలో చెలరేగాయి. కారణమేమిటంటే.. బ్రెజిల్ లో దాదాపు 5లక్షల మంది మోరాకో వాసులు ఉంటారు.

వారంతా మొరాకో విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు..  వారంతా వీధుల్లోకి వచ్చి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అదే సమయంలో తమ దేశం జట్టు ఓటమిని జీర్ణించుకోలేని బెల్జియం వాసులు బ్రస్సెల్ లో విధ్వంస కాండకు తెగబడ్డారు. 

కొందరు ఆందోళనకారులు దుకాణాలను ధ్వంసం చేసి వాహనాలను దగ్ధం చేశారు. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు వాటర్ కేనన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. అల్లర్లకు సంబంధించి 12 మందిని అరెస్ట్ చేశారు.