కాదేదీ హ్యాకింగుకు అనర్హం?
posted on Nov 2, 2012 8:54AM
ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారం హ్యాకింగు. ఎంతటి పెద్ద సంస్థను అయినా ఈ హ్యాకర్లు ఇబ్బంది పెడుతుంటారు. ఎంతో కష్టపడి పూర్తి సమాచారంతో తయారు చేసుకున్న వెబ్‌సైట్‌ను హ్యాకింగు చేయటం ద్వారా ఆ సమాచారం ఉపయోగపడకుండా పోతుంది. ఇలా సమాచారం వృధా అవటమే కాకుండా కొన్నేసార్లు సంస్థలు సకాలంలో అందుబాటులో లేక హ్యాకర్ల వల్ల వినియోగదారులకు దూరమై భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తోంది.
వ్యాపారంలో తమ ప్రత్యర్ధుల న దెబ్బ తీసేందుకు కొన్ని సంస్థలు ఈ హ్యాకర్లను ఆశ్రయిస్తున్నాయి. వారు కోరినంత ధనమిచ్చి ప్రత్యర్ధి సమాచారాన్ని సొంతం చేసుకుంటున్నారు. ప్రత్యేకించి హ్యాకింగుపై ఆధారపడి బతికేవారు ఎక్కువగా అమెరికా, యుకె, హంగేరీ, అల్జీరియా, నైజీరియా, రష్యా దేశాల్లో ఉన్నారు.
తాజాగా చేసిన పరిశోధనలో మన భారతదేశానికి ఎక్కువ మంది హ్యాకర్లు వలస వస్తున్నారట. నైజీరియన్లు అయితే ఇక్కడే నివాసముండి లాటరీల పేరిట హ్యాకింగు ద్వారా మెయిల్స్ పెడుతున్నారు. ఈ హ్యాకింగు వల్ల ఒకవైపు ఆర్ధికంగా నష్టపోయి, మరోవైపు సమయాన్ని వృధా చేసుకున్న కంప్యూటర్ నిపుణుల జాబితాలో ఇండియానే ఎక్కువ.
తాజాగా డీఆర్‌డీవోతో పాటు మరో ఐదు ప్రభుత్వ విభాగాల వెబ్‌సైట్లు హ్యాకింగుకు గురయ్యాయి. శాస్త్రవేత్తల నియామకాలకు సంబంధించిన ఈ వెబ్‌సైట్ హ్యాకింగుకు గురవటంతో ప్రభుత్వంలోని అన్ని విభాగాల అధికారులు అప్రమత్తమయ్యారు.