రావి కుమార్తె రిసెప్షన్‌కు బాలయ్య
posted on Dec 1, 2012 @ 1:59PM
ప్రముఖ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుడు నందమూరి బాలకృష్ణ గుడివాడ నియోజకవర్గ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు కుమార్తె రిసెప్షన్‌కు హాజరుకానున్నారు. రావి వెంకటేశ్వకరరావు కుమార్తె వివాహం నవంబర్ 29న హైదరాబాద్‌లో జరిగింది. గుడివాడలో జరిగే రిసెప్షన్‌కు బాలకృష్ణ వస్తున్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా జిల్లాలోని పార్టీ నాయకులతో ఆయన సమావేశమవుతారని కొందరు అంటున్నప్పటికీ, అందులో వాస్తవం లేదని జిల్లా పార్టీ నాయకుడొకరు చెప్పారు.
కేవలం రిసెప్షన్‌లో పాల్గొనేందుకే ఆయన గుడివాడ వస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలలో తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని బాలకృష్ణ ఇటీవల స్పష్టం చేశారు. కృష్ణా, అనంతపురం జిల్లాలోని ఏదోక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే బాలయ్య ఇంతవరకు తన అంతరంగాన్ని బయటపెట్టలేదు. గుడివాడలో జరిగే రిసెప్షన్‌కు వస్తున్న బాలయ్య అక్కడ జిల్లా నాయకులతో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉందని అంటున్నారు.