బాబు ఎఫెక్ట్.. ఇండియాకు ఏపీ గ్రోత్ ఇంజిన్!
posted on Sep 11, 2025 @ 1:50PM
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంగా జాతీయ సగటును దాటి వృద్ధి రేటు సాధించింది. 2025-26 తొలి త్రైమాసికంగా ఆంధ్రప్రదేశ్ 10.5 శాతం వృద్ధి రేటును సాధించింది. ఇది జాతీయ సగటు వృద్ధి రేటు కంటే ఎక్కువ. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతి వేగంగా బలోపేత మౌతోందనడానికి తార్కానంగా ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. జగన్ హయాంలో రాష్ట్రంలో ఆర్థిక అరాచకత్వం రాజ్యమేలింది. దీంతో రాష్ట్రం వృద్ధిలోనే, అభివృద్ధిలోనూ కూడా తిరిగి కోలుకోవడం సాధ్యం కాదనిపించేంతగా దిగజారింది. అయితే ఎప్పుడైతే గత ఏడాది జరిగిన ఎన్నికలలో అద్బుత విజయంతో తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టిందో అప్పటి నుంచీ రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పాట పట్టింది. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ పెట్టుబడుల ఆకర్షణ, ఆర్థిక పరిపుష్టి, రైతు ప్రయోజనాలు, ప్రజా సంక్షేమంపైనే దృష్టిపెట్టారు.
రాష్ట్రంలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఐటీ వృద్ధితో పాటు అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు వంటి అంశాలపై దృష్టి పెట్టారు. పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలలో రాష్ట్రంపై విశ్వాసం, నమ్మకం పెరిగేలా చేశాయి. అది ఎంతగా అంటే మళ్లీ రాష్ట్రంలో అడుగుపెట్టేదే లేదంటూ తమ వ్యాపారాలు, పరిశ్రమలను ఇతర రాష్ట్రాలకు తరలించేసిన లూలూ వంటి పరిశ్రమలు మళ్లీ రాష్ట్రానికి తిరిగి వచ్చేంతగా.చంద్రబాబు ఈ విధానాలే ఏపీ ఆర్థిక వ్యవస్థ అనూహ్య వేగంతో పుంజుకోవడానికి కారణమైందని ఆర్థిక రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బాబు సర్కార్ అవలంబిస్తున్న నూతన విధానాల ఏపీలో డూయింగ్ ఆఫ్ బిజినెస్ సులభతరం కావడానికి దోహదపడటమే కాకుండా.. ప్రజల జీవన ప్రమాణాలు పెరగడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ న దేశంలోనే ఒక మోడల్ రాష్ట్రం అన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆయన దార్శనికత ఇప్పడు ఫలితాలను అందిస్తోంది. ఆయన ట్రాక్ రికార్డ్ కూడా ప్రపంచం నలుమూలల నుంచీ పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం వైపు చూసేలా చేస్తున్నాయి. చంద్రబాబు ఆచరణాత్మక దృక్ఫథానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఏపీ అభివృద్ధి దర్పణమని చెప్పవచ్చు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో అభివృద్ధి అనూహ్య వేగంతో ఉండటానికి చంద్రబాబు నాయకత్వంపై విశ్వాసం, ఆయన దార్శనికతపై నమ్మకం కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే వేగం, ఇదే ఒరవడి కొనసాగితే ఇండియాకు ఏపీ గ్రోత్ ఇంజిన్ గా మారడం తథ్యమని అంటున్నారు.