రాజకీయాల్లోకి రాను..అధికారం మాదే : జూ. ఎన్టీఆర్
posted on Jan 18, 2013 9:10AM
దివంగత ముఖ్యమంత్రి, నటుడు నందమూరి తారక రామారావు గారి 17వ వర్ధంతి సంధర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఎన్టీఆర్ సమాధికి నివాళులు అర్పించారు. ఆయన తన భార్య లక్ష్మి ప్రణతితో విచ్చేసి నివాళులు అర్పించారు. ఇతర కుటుంబ సభ్యులు ఎవరూ ఆయన వెంట రాలేదు.
మీడియాతో మాట్లాడుతూ మామయ్య చంద్రబాబు చేస్తున్న "వస్తున్నా మీకోసం" పాదయాత్ర మూలంగా ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతుందని, రాబోయే ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధిస్తుందని అన్నారు. ప్రజల నుండి పాదయాత్రకు వస్తున్న స్పందనను చూసి దానిని పొడిగించడం మంచిదేనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను ప్రచారంలో పాల్గొంటానని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సినిమాలపైనే దృష్టి పెడుతానని తెలిపారు.