వాళ్ళ మాట - ప్రజల తూటా: 2
posted on Aug 3, 2013 @ 2:32PM
వాళ్ళ మాట - ప్రజల తూటా: 2
వాళ్ళ మాట :
* ఢిల్లీ పెద్దలు - సీమాంధ్ర సమస్యలకు మరో కమిటీ వేస్తాం.
ప్రజల తూటా :
* ఇది వరకు శ్రీకృష్ణ కమిటి వేసి ఏం ఏడ్చారో అందరికి తెలుసు.
వాళ్ళ మాట :
* దిగ్విజయ్ సింగ్ - హైదరాబాద్ కంటే అద్భుతమైన రాజధానిని నిర్మించడానికి సాయం చేస్తాం.
ప్రజల తూటా :
* సాయం చేయడానికి వృద్ధులైన మీరంతా అన్ని సంవత్సరాలు బతికుంటారా అసలు ?
వాళ్ళ మాట :
* చంద్రబాబు - తెలంగాణకు కట్టుబడి ఉండాలి.
ప్రజల తూటా :
* ముందు ఆయన రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో ఆయన అభిమాన ప్రాంతమైన తెలంగాణా నుండి పోటీ చేస్తే బాగుంటుంది.
వాళ్ళ మాట :
* KCR.. ఆంధ్ర వాళ్ళంతా వారి వారి ప్రాంతాలకు వెళ్లిపోవాలి.
ప్రజల తూటా :
* అయితే కేసిఆర్ విజయనగరం వెళ్ళిపోతాడన్నమాట !
వాళ్ళ మాట :
* పళ్ళం రాజు, పురంధరేశ్వరి వగైరా దిగ్విజయ్ సింగ్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల తూటా :
* వ్యక్తం చేయాల్సింది ఆవేదన కాదు - ఆగ్రహం!
వాళ్ళ మాట :
* KCR - ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణా సాధన ఇంక్రిమెంట్ ఇస్తాం. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సర్వీసులతో సమానంగా జీతాలు ఇస్తాం.
ప్రజల తూటా :
* అప్పుడే రాష్ట్రం ఏర్పాటు అయిపోయినట్టు, దానికి ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయినట్టు అనుకుంటున్నాడు. ముందు ముందు కనీసం పార్టీ కార్యకర్తగా కూడా ఆ పార్టీ వాళ్ళు ఆయన్ని తిరస్కరిస్తారు.
వాళ్ళ మాట :
* దిగ్విజయ్ సింగ్ - హైదరాబాద్ కంటే అద్భుతమైన రాజధాని కర్నూల్ లోనో, గుంటూరులోనో, ఒంగోలు లోనో నిర్మించవచ్చు.
ప్రజల తూటా :
* అద్భుతమైన రాజధానిని కరీంనగర్ లోనో, నిజామాబాద్ లోనో , వరంగల్ లోనో నిర్మించుకోవచ్చని వాళ్ళకి చెప్తే మంచిది.
వాళ్ళ మాట :
* నన్నపనేని రాజకుమారి - దిగ్విజయ్ సింగ్ ఇక్కడికి వస్తే గుండు గీయించి పంపిస్తాం.
ప్రజల తూటా :
* అంతేనా?