Next Page 

తృప్తి పేజి 1


                                             తృప్తి

                                                                      _ బలభద్రపాత్రుని రమణి

                                    


    ఉరుకులు, పరుగుల్తో శక్తికొలదీ పరిగెడ్తోంది సింధు.
    ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసింది.
    చాలాదూరం వచ్చేసింది కానీ, ఇంకా ఇంకా చాలాదూరం పరిగెత్తాల్సిందే.
    తన తోటివారంతా చాలా దూరంగా కనిపించారు. చాలా కులాసాగా, హాయిగా, నవ్వుతూ, తుళ్ళుతూ!
    ఎలా? ఇదెలా సంభవం?
    అలసటగా వుంది.
    అయినా పరిగెడ్తోంది.
    దూరంగా అరుణ్, పిల్లలూ చేతులూపుతున్నారు. వాళ్ళని చేరుకోవాలని ప్రాణాలుగ్గబట్టి పరిగెడ్తోంది.
    ఇంతలో 'అమ్మా' అన్న కేకతో ఒక్కసారిగా పడిపోయింది పెద్ద గుంటలో.
    తలెత్తి చూసింది.
    తను చాలా లోయగా వున్న అగాధంలో పడిపోయింది.
    ఎలా పైకి రావడం?
    "హెల్ప్, హెల్ప్"
    పిచ్చిగా కేకలు పెడ్తోంది. వెక్కి, వెక్కి ఏడుస్తోంది.
    "సింధూ, సింధూ! ఎందుకరుస్తున్నావ్ అర్థరాత్రిపూటా? కలొచ్చిందా?"
    గట్టిగా జబ్బపట్టి కుదిపాడు అరుణ్.
    మగతగా వున్నప్పటికీ సింధుకు అర్థమయింది అదంతా కలని.
    అయినా జవాబు చెప్పలేదు. అలాగే పడుకుంది.
    "పీడకలొచ్చిందా?"
    "వూ"
    "భయపడ్డావా"
    "లేదు"
    ఆ తర్వాత అటుతిరిగి పడుకున్నాడు కాబోలు, కాసేపటికే సన్నగా గురక వినిపించింది.
    సింధు ఆలోచిస్తోంది.
    పీడకల అంటే పీడించే కల కాబోలు. అవును...పీడిస్తోంది. ఎందుకొస్తోందీ కల?
    నెమ్మదిగా గుండెలమీద చెయ్యేసుకుంది. తన గుండె చాలావేగంగా కొట్టుకుంటున్నట్లు గమనించింది. నోరు తడారిపోయి, ఒళ్ళంతా చెమట్లు పట్టాయి. ఈ అనుభూతిని 'భయం' అంటారు కాబోలు.
    'భయం'
    ఈ మాటెవరైనా అంటే తను ఆటపట్టించేది. చేతకానితనానికి మారుపేరు భయం అని తన ప్రగాఢ విశ్వాసం. చిన్నప్పటి నుంచీ సింధుకి భయం అంటే తెలీదు. ఒక్కతే చీకట్లో ఎంతెంత దూరాలైనా వెళ్ళిపోయేది. బూచాడన్నా, పోలీసన్నా ఎవరన్నా భయపడేది కాదు.
    డాక్టరు దగ్గరకెళ్ళి ధైర్యంగా "ఇంజెక్షన్ ఇవ్వండి' అని అడిగి మరీ తీసుకునేదిట.
    చిన్నపిల్లలందరూ సహజంగా టీచర్లంటే భయపడ్తారు. సింధుకి అదీలేదు.
    ప్రతిక్లాసులో ఫస్ట్ మార్కులు సింధువే కావడం వల్ల ఎవరూ ఏమీ అనేవారు కారు. 'దెయ్యాలు, రాక్షసుల' కథలు చెప్తే, 'చూపించండి, చూడాలనుంది' అని మారాంచేసేది.
    పరీక్షలంటే అందరూ భయపడ్తుంటే సింధు సరదా పడేది. ఇంజనీరింగులో సీటొస్తుందా రాదా అనికానీ, ఆ తర్వాత తనకు నచ్చినచోట వుద్యోగం వస్తుందా రాదా అనికానీ, ఎటువంటి భర్త లభిస్తాడో అనికానీ సింధు భయపడలేదు. చివరకు నెలలు నిండాక ప్రసవం ఎలా జరుగుతుందో అనికూడా సింధుకి భయం వెయ్యలేదు.
    మరిప్పుడు ఇలా ఎందుకు జరుగుతోంది?
    జీవితంలో అతి ముఖ్య ఘట్టాలన్నీ సునాయాసంగా జరిగిపోయి, జీవితంలో స్థిరపడిపోయాక ఇప్పుడు భయం ఎందుకు?
    మెడ కింద తడి తగిలింది. నెమ్మదిగా వొత్తిగిల్లి కళ్ళు తుడుచుకుంది సింధూర.


                                          *    *    *    *


    "పాలు"
    తలుపుమీద టకటకా కొట్టిన చప్పుడయింది. ఉలిక్కిపడి లేచింది సింధు.
    పక్కమీంచి లేవాలంటే బద్ధకంగా వుంది. నెమ్మదిగా తడిమి గడియారం తీసుకుని కళ్ళు చికిలించి చూసింది. ఐదుంపావైంది. అమ్మో! ఇప్పటికే పావుగంటాలశ్యమైపోయింది. ఐదునిమిషాలటూ ఇటూ అయినా మొత్తం టైం టేబుల్ తలకిందులవుతుంది.
    ఈ ఆలోచన రావడమే తరువాయి దిగ్గున లేచింది. బయటినుంచి పాల పాకెట్టు తెచ్చి గిన్నెలో పోసి స్టౌమీద పెట్టింది. పాచిమొహంతోటే కుక్కరు పడేసి బాత్రూంలో దూరింది.
    బయటికొచ్చి పిల్లల్ని లేపుదామని వాళ్ళ గదిలోకెళ్ళేటప్పటికి అమాయకమైన మొహాలతో నిద్రపోతూ కనిపించారు. నిండా ఏడేళ్ళైనా లేని రమ్యా, మొన్ననే మూడు నిండిన తేజా ఆదమరచి నిద్రపోతున్నారు. కానీ లేపక తప్పదు. ఏడుంపావుకల్లా ఆటోవాడొస్తాడు. ఈ గంటన్నరలో కాలకృత్యాలన్నీ తీర్చుకుని, తిని, తాగి తయారవ్వాలి.
    తల్లి మనసుని కట్టేసి, పిల్లల్ని గట్టిగా కుదిపి లేపేసింది. తేజ రాగం మొదలెట్టాడు. వాళ్ళని బలవంతంగా బాత్రూంలోకి తోసి వంటింట్లోకొచ్చి బూస్ట్ కలిపి టేబుల్ మీద పెట్టింది. ఫ్రిజ్ లోంచి క్యాలీఫ్లవర్ తీసి కోస్తుండగా అరుణ్ లేచాడు. మొహం కడుక్కోకుండానే పేపరు పుచ్చుకుని "కాఫీ" అన్నాడు. సింధు టకటకా తరగడం మొదలెట్టింది.


Next Page 

array(15) { [0]=> array(8) { ["cat_id"]=> string(4) "1765" [0]=> string(4) "1765" ["cat_name"]=> string(7) "Midunam" [1]=> string(7) "Midunam" ["thumb_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" [2]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" ["big_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" [3]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" } [1]=> array(8) { ["cat_id"]=> string(4) "1741" [0]=> string(4) "1741" ["cat_name"]=> string(20) "Prema Pelli Vidakulu" [1]=> string(20) "Prema Pelli Vidakulu" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" [2]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" [3]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" } [2]=> array(8) { ["cat_id"]=> string(4) "1739" [0]=> string(4) "1739" ["cat_name"]=> string(23) "Nari Nari Naduma Murari" [1]=> string(23) "Nari Nari Naduma Murari" ["thumb_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" [2]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" ["big_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" [3]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" } [3]=> array(8) { ["cat_id"]=> string(4) "1737" [0]=> string(4) "1737" ["cat_name"]=> string(11) "First Crush" [1]=> string(11) "First Crush" ["thumb_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" [2]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" ["big_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" [3]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" } [4]=> array(8) { ["cat_id"]=> string(4) "1731" [0]=> string(4) "1731" ["cat_name"]=> string(15) "40 Years of TDP" [1]=> string(15) "40 Years of TDP" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" [2]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" [3]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" } [5]=> array(8) { ["cat_id"]=> string(4) "1729" [0]=> string(4) "1729" ["cat_name"]=> string(23) "Vasundara Short Stories" [1]=> string(23) "Vasundara Short Stories" ["thumb_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" [2]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" ["big_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" [3]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" } [6]=> array(8) { ["cat_id"]=> string(4) "1728" [0]=> string(4) "1728" ["cat_name"]=> string(21) "Diviseema Uppena 1977" [1]=> string(21) "Diviseema Uppena 1977" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" [2]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" [3]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" } [7]=> array(8) { ["cat_id"]=> string(4) "1702" [0]=> string(4) "1702" ["cat_name"]=> string(17) "Trick Trick Trick" [1]=> string(17) "Trick Trick Trick" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" [2]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" [3]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" } [8]=> array(8) { ["cat_id"]=> string(4) "1701" [0]=> string(4) "1701" ["cat_name"]=> string(17) "Pelli Chesi Chudu" [1]=> string(17) "Pelli Chesi Chudu" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" [2]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" [3]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" } [9]=> array(8) { ["cat_id"]=> string(4) "1700" [0]=> string(4) "1700" ["cat_name"]=> string(28) "Chikati Podduna Velugu Rekha" [1]=> string(28) "Chikati Podduna Velugu Rekha" ["thumb_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" [2]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" ["big_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" [3]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" } [10]=> array(8) { ["cat_id"]=> string(4) "1699" [0]=> string(4) "1699" ["cat_name"]=> string(13) "Agni Pariksha" [1]=> string(13) "Agni Pariksha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" } [11]=> array(8) { ["cat_id"]=> string(4) "1698" [0]=> string(4) "1698" ["cat_name"]=> string(19) "D Kameswari Kathalu" [1]=> string(19) "D Kameswari Kathalu" ["thumb_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" [2]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" ["big_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" [3]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" } [12]=> array(8) { ["cat_id"]=> string(4) "1696" [0]=> string(4) "1696" ["cat_name"]=> string(13) "Cine Bethalam" [1]=> string(13) "Cine Bethalam" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" [2]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" [3]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" } [13]=> array(8) { ["cat_id"]=> string(4) "1695" [0]=> string(4) "1695" ["cat_name"]=> string(20) "Teeram Cherina Naava" [1]=> string(20) "Teeram Cherina Naava" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" [2]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" [3]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" } [14]=> array(8) { ["cat_id"]=> string(4) "1694" [0]=> string(4) "1694" ["cat_name"]=> string(13) "Intinti Kadha" [1]=> string(13) "Intinti Kadha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" } }