Next Page 

డెత్ సెంటెన్స్ పేజి 1

   
                                  డెత్ సెంటెన్స్


                                                   - రావులపల్లి సునీత


                                                

       

    నా దేవుడికి నమస్కారం!

 

    'ఏమిటి వెర్రిపిల్ల' అని నవ్వకండి డాక్టర్! నాకు మళ్ళీ ప్రాణం పోసిన మిమ్మల్ని మించిన దేవుడు నాకు మరొకడు వుంటాడని నేను అనుకోను.

 

    ఒకే ఒక్క మనిషి ఈ ప్రపంచాన్నంతా మార్చడం అసాధ్యమట! కానీ ఓ వ్యక్తి యొక్క ప్రపంచాన్ని మార్చేయడం మాత్రం ఒక మనిషికి అసాధ్యం కాదు!

 

    మీరు నా ప్రపంచాన్నంతా మార్చేశారు.

 

    ఏ ఆసక్తి లేని నా నిర్వికార ప్రపంచాన్ని ఆశలతో నింపి వేశారు.

 

    ఏం పాపం చేశానో ... నా గుండెలోని నాలుగు గదుల్నీ చిల్లుల జల్లెడ చేసి నన్ను భూమ్మీదికి పంపించాడా భగవంతుడు!!

 

    లేత చూపులతో అమాయకంగా ఈ ప్రపంచంలోకి వచ్చిన నాకు అమ్మ కడుపులోనే మరణశిక్ష విధించే అధికారం ఎవరు ఇచ్చారీ భగవంతుడికి?

 

    మరణశిక్ష విధించడం మాత్రమే అతనికి తెలుసు!

 

    దాన్ని ఎప్పుడు అమలు చేస్తాడో చెప్పడు.

 

    ఏ క్షణంలో నేను పోతానో ... ఇంకా ఎన్నేళ్ళు బ్రతుకుతానో నాకు తెలీదు!

 

    ఇంతకన్నా కఠినత్వం మరొకటుంటుందా??

 

    ఈ భగవంతుడికన్నా మనిషి విధించే మరణశిక్షే నయం! ఎప్పుడు ఉరి తీస్తారో మనకు తెలుస్తుంది!

 

    క్షణకాలం గిలగిలలాడి ప్రాణం వదలవచ్చు.

 

    మరణించేవాడికి తన నేరం ఏమిటో కూడా తెలియజేస్తారు.

 

    కానీ చేసిన పాపమేమిటో కూడా తెలీకుండానే మృత్యుదేవతని భుజాల మీద మోస్తూ ఈ లోకానికి వచ్చిన నేను ... ప్రతిక్షణం భయపడుతూ... నా గుండెలో రోగం నన్ను పీల్చి... పీల్చి... మెల్ల మెల్లగా నా ప్రాణాలు తోడుతూంటే... ఆఖరి క్షణం కోసం ఎదురుచూస్తూ... ఈ బ్రతుకును పదహారేళ్ళ ప్రాయందాకా మోసుకొచ్చాను.

 

    అసలు నేనేందుకు చచ్చిపోవాలి?

 

    చచ్చిపోవడం కోసమే నేను ఈ లోకంలో కొచ్చానా?

 

    నా తోటి పిల్లలతో లేడిపిల్లలా నేను గెంతలేను!

 

    గడ్డిపరక మీది మంచు బిందువులా... నాది కాని ఈ ప్రపంచంలోకి ఎందుకోసం నేను వచ్చానో అర్ధం కాదు.

 

    మందుబిళ్ళల రూపంలో ఆయుష్షు కొనుక్కుంటూ - ఆయాసాన్ని ఆక్సిజన్ గా మార్చుకుంటూ ఈ నరకాన్ని నేనెందుకు పొడిగించాలో అర్దంకాదు!

 

    ఎప్పుడు ఆగిపోతుందో... ఎన్నాళ్ళు కొట్టుకుంటుందో తెలీని నా గుండెని తీసుకొచ్చి మీ దోసిటిలో వుంచారు అమ్మా, నాన్నా.

 

    ఏం జరుగుతుందోనన్న భయం నాకు లేదు.

 

    బ్రతకాలన్న ఆశా లేదు!

 

    భవిష్యత్తు గురించిన కలలూ లేవు!

 

    నిర్లిప్తత! నిర్లిప్తత!! నిర్లిప్తత!!

 

    పుట్టిననాటి నుండి ఈ ప్రపంచం నాకు ఎప్పుడయినా ఆసక్తికరంగా గానీ, అందంగా గానీ కనిపిస్తే కదా! ఆశపడటానికి!?

 

    ఆపరేషన్ కి ముందు "భయమేస్తుందా పాపా?" అని ప్రేమగా అడిగారు.

 

    లేదని తలూపాను.

 

    "మీదే వూరు?"

 

    చెప్పాను-

 

    "ఆపరేషన్ తర్వాత నన్ను మీ వూరు తీసికెళతావా?"

 

    "వూ...!"

 

    ఆసక్తి లేకపోయినా వూ కొట్టాను.

 

    "మా పిల్లలతో మీ వూరు వస్తాను. గోదావరి ఇసుక తిన్నెల మీద మనందరం ఆడుకొందాం" చెరగని చిర్నవ్వుతో ఆశని నామీద కుమ్మరిస్తున్నట్లు అన్నారు.

 

    "నేనా....?" ఆశ్చర్యపోయాను.

 

    "వైనాట్ బేబీ? ఇసుకని చెల్లాచెదురుగా కాళ్ళతో తన్నుకుంటూ నీళ్ళలోకి పరుగెట్టడం ఎంత బావుంటుంది కదూ! ఆపరేషన్ తర్వాత నువ్వలా పరిగెడతావ్" అన్నారు మీరు.

 

    "ఇంకో నాలుగేళ్ళయితో పెళ్ళి చేసుకుని వాళ్ళాయనతో పరిగెడుతుంది" అనస్థటిస్ట్ జోక్ చేశాడు.

 

    "ఇంతకీ నీ పెళ్ళికి మమ్మల్ని పిలుస్తావా?" మళ్ళీ మీరే అడిగారు.

 

    మనసులోనే ఉలిక్కిపడ్డాను.

 

    "నాకు పెళ్ళా? నాకూ ఒక తోడు కూడానా?" నమ్మలేని ఆలోచన గుండెలో దడ పుట్టించింది.

 

    ఆ దడలో ఏదో తియ్యదనం అనుభూతమయింది!

 

    జీతంలో మొదటిసారి మధురంగా సిగ్గుపడ్డాను.

 

    నాలోని ఆస్టిమిస్ట్ అప్పుడే జీవం పోసుకోవడం మొదలెట్టిందని అప్పుడు తెలీలేదు.

 

    చేతికి పెట్టిన గోరింటాకు.. ఎండి రాలిపోయాకే దాని తాలూకు ఎరుపు కనిపించినట్లే... ఆపరేషన్ ఆటుపోట్ల నుండి తేరుకుని జీవితాన్ని చూడటం మొదలుపెట్టాకే మీ మాటలోని ఆశ విలువ నాకు తెలుసొచ్చింది.

 

    వణికిస్తున్న చలిలో చీకటి దుప్పటి చాటున ముడుచుకుపోయిన ప్రపంచాన్ని చూసి, మెరిసే కిరణాలని ఆర్తిగా నేలమీదకి జాలువారుస్తూ లోకాన్ని నులివెచ్చగా ఆక్రమించుకుంటున్న ఉదయపు సూర్యుడిలా - మీరు ఆశాకిరణాలని వెచ్చగా జాలువార్చి నా హృదయానికి తాకించారు!

 

    ఆ ఆశ పెరిగి పెరిగి ఈ జీవితానికెంత వెచ్చదనం ఇచ్చిందో-ఇప్పుడీ లోకం ఎంత అందంగా నాకగుపిస్తుందో... ఈ ప్రపంచమంతా నా కోసమే సృష్టించబడినట్లు నన్నెంత ఉత్తేజితురాలిని చేస్తూందో మీకు ఎలా చెప్పను డాక్టర్?

 

    ఇప్పుడు నాకు ఏ ఆయాసమూ లేదు! అపురూపంగా బ్రతుకు కనిపిస్తోంది!

 

    ఆశని ఓపలేక... ఆనందం పట్టలేక 'చిల్లులులేని' నా పిచ్చి గుండె గొంతుకలో చేరి ఒకటే ఢమరకం మోత....!

 

    ఊహ తెలిసినప్పటినుండీ, లోకంలోని సానుభూతినంతా నాకోసం మోసుకొచ్చినట్లుండే మనుషులూ... వాళ్ళ జాలిచూపులూ తప్ప నా మీద నాకు నమ్మకం కలిగించే ఒక్కమాటనీ... ఒక్క మనసునీ ఇప్పటిదాకా అనుభూతించి ఎరుగదు మరి... నా అమాయక హృదయం.

 

    నన్ను మీరెప్పుడో మర్చిపోయి వుండవచ్చు!

 

    మృత్యువుతో యుద్ధం చేయడం మీకు ప్రెస్టీజియస్ ఛాలెంజ్ కావచ్చు!

 

    నా ఆపరేషన్ మీకో రొటీన్ కావచ్చు!!

 

    కానీ... నాకు మరో జీవితం! అర్ధవంతమైన నిండు జీవితం!!

 

    గుండెకోతకు రెండర్ధాలున్నాయని మిమ్మల్ని చూశాకే నాకు తెలిసింది!

 

    ఒకటి... మాటలతో చేతలతో గుండెని ముక్కలుగా కోసి మనిషిని మానసికంగా చంపేదయతే...

 

    రెండవది... గుండెని కోసి చెదిరిన అరలను సరిచేసి మనిషిని శారీరకంగానే గాక మానసికంగా కూడా బ్రతికించేదీననీ!!

 

    మీరు కార్డియాక్ సర్జన్ ఎందుకయ్యారో... మీ ఆశయమేమిటో నాకు తెలీదు. కానీ మీ చేతిలో బ్రతికిన నాలాంటివాళ్ళ మానసిక ప్రపంచాన్ని మీరెంతగా మార్చారో తెలిస్తే... మీకిదొక ఉత్తేజనం కాగలదనే ఈ ఉత్తరం రాస్తున్నాను.

 

    యువర్స్ ఈజ్ ద గ్రేట్ జాబ్ డాక్టర్!

 

    మీ చేతిలో మరణం తప్పించుకున్న నాలాంటివాళ్ళ స్ఫూర్తితో మీరు బతకండి!

 

    ఆ స్ఫూర్తితో తిరిగి మాలాంటి వాళ్ళని బ్రతికించండి!

 

    మీరు బ్రతికిస్తున్నది మా గుప్పెడు గుండెని కాదు.

 

    గడియారంలోని ముల్లులా గాయం చిన్నదే! కానీ ఒక జీవిత కాలాన్ని శాసిస్తుంది!! వుంటాను.

 

                                                          నమస్సుమాంజలులతో మీ పేషెంట్                                                                                                                  - స్మృతి
        
    ఉత్తరం మడిచి భద్రంగా డైరీలో దాచిపెట్టుకున్నాడు డాక్టర్ శరత్ చంద్ర... ఆ ఉత్తరం చదవడం అతనికి అది మొదటిసారి కాదు.


Next Page 

array(15) { [0]=> array(8) { ["cat_id"]=> string(4) "1765" [0]=> string(4) "1765" ["cat_name"]=> string(7) "Midunam" [1]=> string(7) "Midunam" ["thumb_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" [2]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_small.png" ["big_pic"]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" [3]=> string(49) "../contentpics/admin_1669252920_midunam_large.png" } [1]=> array(8) { ["cat_id"]=> string(4) "1741" [0]=> string(4) "1741" ["cat_name"]=> string(20) "Prema Pelli Vidakulu" [1]=> string(20) "Prema Pelli Vidakulu" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" [2]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" [3]=> string(62) "../contentpics/admin_1668820920_prema-pelli-vidakulu_large.png" } [2]=> array(8) { ["cat_id"]=> string(4) "1739" [0]=> string(4) "1739" ["cat_name"]=> string(23) "Nari Nari Naduma Murari" [1]=> string(23) "Nari Nari Naduma Murari" ["thumb_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" [2]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_small.png" ["big_pic"]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" [3]=> string(52) "../contentpics/admin_1668561720_cover-page_large.png" } [3]=> array(8) { ["cat_id"]=> string(4) "1737" [0]=> string(4) "1737" ["cat_name"]=> string(11) "First Crush" [1]=> string(11) "First Crush" ["thumb_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" [2]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_small.png" ["big_pic"]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" [3]=> string(53) "../contentpics/admin_1668216120_first-crush_large.png" } [4]=> array(8) { ["cat_id"]=> string(4) "1731" [0]=> string(4) "1731" ["cat_name"]=> string(15) "40 Years of TDP" [1]=> string(15) "40 Years of TDP" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" [2]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" [3]=> string(57) "../contentpics/admin_1652746920_40-years-of-tdp_large.png" } [5]=> array(8) { ["cat_id"]=> string(4) "1729" [0]=> string(4) "1729" ["cat_name"]=> string(23) "Vasundara Short Stories" [1]=> string(23) "Vasundara Short Stories" ["thumb_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" [2]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_small.png" ["big_pic"]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" [3]=> string(65) "../contentpics/admin_1644024060_vasundara-short-stories_large.png" } [6]=> array(8) { ["cat_id"]=> string(4) "1728" [0]=> string(4) "1728" ["cat_name"]=> string(21) "Diviseema Uppena 1977" [1]=> string(21) "Diviseema Uppena 1977" ["thumb_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" [2]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_small.png" ["big_pic"]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" [3]=> string(62) "../contentpics/admin_1643160060_divi-uppena-45-years_large.png" } [7]=> array(8) { ["cat_id"]=> string(4) "1702" [0]=> string(4) "1702" ["cat_name"]=> string(17) "Trick Trick Trick" [1]=> string(17) "Trick Trick Trick" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" [2]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" [3]=> string(59) "../contentpics/admin_1636593660_trick-trick-trick_large.png" } [8]=> array(8) { ["cat_id"]=> string(4) "1701" [0]=> string(4) "1701" ["cat_name"]=> string(17) "Pelli Chesi Chudu" [1]=> string(17) "Pelli Chesi Chudu" ["thumb_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" [2]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_small.png" ["big_pic"]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" [3]=> string(57) "../contentpics/admin_1636593660_pallichasi-sudu_large.png" } [9]=> array(8) { ["cat_id"]=> string(4) "1700" [0]=> string(4) "1700" ["cat_name"]=> string(28) "Chikati Podduna Velugu Rekha" [1]=> string(28) "Chikati Podduna Velugu Rekha" ["thumb_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" [2]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_small.png" ["big_pic"]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" [3]=> string(69) "../contentpics/admin_1635380460_chikati-podduna-velugurekha_large.png" } [10]=> array(8) { ["cat_id"]=> string(4) "1699" [0]=> string(4) "1699" ["cat_name"]=> string(13) "Agni Pariksha" [1]=> string(13) "Agni Pariksha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1635380460_agni-pariksha_large.png" } [11]=> array(8) { ["cat_id"]=> string(4) "1698" [0]=> string(4) "1698" ["cat_name"]=> string(19) "D Kameswari Kathalu" [1]=> string(19) "D Kameswari Kathalu" ["thumb_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" [2]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_small.png" ["big_pic"]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" [3]=> string(61) "../contentpics/admin_1634084460_d-kameswari-kathalu_large.png" } [12]=> array(8) { ["cat_id"]=> string(4) "1696" [0]=> string(4) "1696" ["cat_name"]=> string(13) "Cine Bethalam" [1]=> string(13) "Cine Bethalam" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" [2]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" [3]=> string(55) "../contentpics/admin_1632615660_cine-bethalam_large.png" } [13]=> array(8) { ["cat_id"]=> string(4) "1695" [0]=> string(4) "1695" ["cat_name"]=> string(20) "Teeram Cherina Naava" [1]=> string(20) "Teeram Cherina Naava" ["thumb_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" [2]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_small.png" ["big_pic"]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" [3]=> string(59) "../contentpics/admin_1632442860_teramcharina-nava_large.png" } [14]=> array(8) { ["cat_id"]=> string(4) "1694" [0]=> string(4) "1694" ["cat_name"]=> string(13) "Intinti Kadha" [1]=> string(13) "Intinti Kadha" ["thumb_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" [2]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_small.png" ["big_pic"]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" [3]=> string(55) "../contentpics/admin_1628122860_intinti-kadha_large.png" } }