Home » Sree Sree » Annapurna Vari Chitralalo Sri Sri Geetalu
కళ్లలో పెళ్లి పందిరి
ఆత్మీయులు (1969)
సంగీతం : సాలూరు రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, సుశీల
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : మధుసూదనరావు
సూర్యం :
కళ్ళలో పెళ్ళిపందిరి కనపడసాగె
పల్లకీలోన వూరేగే ముహూర్తంమదిలో కదలాడే
జయ :
కళ్ళలో పెళ్ళిపందిరి కనపడసాగె
పల్లకీలోన వూరేగే ముహూర్తంమదిలో కదలాడే
సూర్యం :
నుదుట కళ్యాణ తిలకముతో
పసుపు పారాణి పదములతో
పెదవిపై మెదిలే నగవులతో
వధువు నను ఓరగ చూస్తుంటే
జీవితాన .......పూలవాన ||కళ్ళలో||
జయ:
సన్నాయి చల్లగా మ్రోగి
పన్నీటి జల్లులే రేగి
మనసైన వరుడు దరిజేరి
మెడలోన తాళీకడుతుంటే
జీవితాన ...... పూలవాన ||కళ్ళలో||
సూర్యం : వలపుహృదయాలు పులకించి
జయ : మధుర స్వప్నాలు ఫలియించి
సూర్యం : లోకమే వెన్నెల వెలుగైతే
జయ : భావియే నందనవనమైతే
సూర్యం : జీవితాన
జయ : పూలవాన ||కళ్ళలో||
వీర భారతీయ పౌరులారా
జైజవాన్ (1970)
సంగీతం : సాలూరు రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, సుశీల
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : డి. యోగానంద్
వీరభారతీయ పౌరులారా!
దేశమాత పిలుపు వినలేదా!
హిమాలయంలో మంటలురేగి
ప్రమాద సమయం వచ్చింది
స్వతంత్రభారత యోధుల్లారా
సవాలేదుర్కొని కదలండి ! ||స్వతంత్ర||
అంతా స్నేహితులనుకున్నాము
అందరి మేలు ఆశించాము
పరులమంచిపై నమ్మకముంచి
పగటికలలలో కనువిప్పు
నేటికి కలిగెను కనువిప్పు
ముంచుకు వచ్చెను పెనుముప్పు ||స్వతంత్ర||
వీరమాతలారా! సుతులకు
చందన గంధం పూయండి!
వీరవనితలారా! పతులకు
కుంకుమ తిలకం తీర్చండి!
నెత్తురుపొంగే యువకుల్లారా
కత్తులుదూసి దూకండి!
బానిసతనమున బ్రతికే కన్నా
చావే మేలని తలచండి ||స్వతంత్ర||
మనమంతా ఒక జాతి / సమైక్యమే మన నీతి
కులమేదైనా మతమేదైనా / వేషం భాష వేరే అయినా
జనమొకటే అని చాటండి !/ ధర్మదీక్షయే మన కవచం
తప్పక మనదే ఘనవిజయం ||స్వతంత్ర||
భరతమాత పరువు నిల్పగా / జయపతాక చేతబూనరా /
సమర విజయ శంఖమూదరా||
ఈ రోజు మంచి రోజు
ప్రేమ లేఖలు (1977)
సంగీతం : సత్యం
గానం : జానకి, వాణీ జయరాం.
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : కె. రాఘవేంధ్రరావు
ఈరోజు మంచిరోజు
మరుపురానిది ..... మధురమైనది
మంచితనం ఉదయించిన రోజు
ఈరోజు మంచిరోజు
మరుపురానిది ..... మధురమైనది
ప్రేమసుమం వికసించిన రోజు
తొలిసారి ధృవతార దీవించెను
ఆ కిరణాలే లోకాన వ్యాపించెను
తొలిప్రేమ హృదయానపులకించెను
అది ఆనంద దీపాలు వెలిగించెను
తెలికాంతులలో సుఖశాంతులతో
జీవనమే పావన మీనాడు
ఈరోజు మంచిరోజు
మధురమైనది ...... మరపురానిది
ప్రేమసుమం వికసించిన రోజు
రెండు నదుల సంగమమే అతిపవిత్రము
మతములన్నీ ఒకటయితే మానవత్వము ||రెండు||
మనసు మనసులొకరికొకరు తెలిపేరోజు
తీరని కోరికలన్నీ తీరే రోజు
అనురాగాలు - అభినందనలు
అందించే శుభసమయం నేడు
ఈరోజు మంచిరోజు
మధురమైనది ...... మరుపురానిది
మంచితనం ఉదయించిన రోజు
ప్రేమసుమం వికసించిన రోజు ||మంచితనం||
ముసి ముసి నవ్వుల
పెళ్ళీడు పిల్లలు (1982)
ముసిముసి నవ్వుల రుసరుసలూ
చిరుచిరు అలకలే సరదాలు
నడివయసులో శృంగారం
ఆ వెలుగు నీడలే సరసాలు
||ముసిముసి||
పూవూదారం తీపీకారం
ఇంతే సంసారం
ఆలూ మగలూ రాజీపడితే
ఎంతో సింగారం
ఆ బతుకే బంగారం ||ముసిముసి||
సన్నజాజులూ - సంపెంగలూ - అవి
పెంచును మమతలు రెండింతలు
సన్నజాజులది చల్లదనం
సంపెంగపూలది - వెచ్చదనం
కోపం తాపం రాజీపడితే
ఎంతో సింగారం ఆ బతుకే బంగారం
||ముసిముసి||
పరువపు వలపుల సంగీతం
పెళ్లీడు పిల్లలు (1982)
సంగీతం : ఎమ్. ఎస్. విశ్వనాధన్
గానం : సుశీల
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : బాపు
పరువపు వలపుల సంగీతం
ఉరకలు వేసే జలపాతం
పరుగులు తీసే అనురాగం
దానికిలేదే ఆటంకం
||పరువపు||
లైలా మజ్నూ దేవదాసుల
కాలం చెల్లిపోయింది
జూలీ బాబీ లవ్ నిలిచేకాలం వచ్చింది
నువ్వూ నేను ఒకటై వెలిగే కాలం వచ్చింది
||పరువపు||
పూవూ తావీ వేరై వుండవు
వెన్నెల చంద్రుని విడిపోదు
పెద్దలు ప్రేమకు అడ్డం పడితే
పిన్నలు పాఠం చెబుతారు
మనసు లేకమయి నిలుచువారలకు
చేతికందగల దాకాశం
జదుపుమాని ముందడుగు వేయమని
యువతరానికిది సందేశం
||పరువపు||
వయసే వెల్లువగా
పెళ్లీడు పిల్లలు (1982)
సంగీతం : ఎమ్. ఎస్. విశ్వనాద్
గానం : ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, సుశీల
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : బాపు
వయసే వెల్లువగా - వలపే వెన్నెలగా
పులకరించి - పరిమళించి
ఊగేసులే ఉయ్యాలగా
||వయసే||
వయసే వెల్లువగా - వలపే వెన్నెలగా
మనసు నేడు కలతదీరి-
ఊగిందిలే ఉయ్యాలగా
||వయసే||
చెలరేగెను సుడిగాలులూ
విడిపోయెను మన దారులూ
వలపు చిందించి జడివానలూ
చిగురు వేయాలి మన ఆశలు
చెలిమినిండి కలలు పండి
చేరాలిలే చేరువగా
||వయసే||
మది కల్యాణ శుభవేదిక
ఇది వాసంత సుమవాటిక
హృదయ భావాలు - సిరిమల్లెలై
మధుర గీతాలు - పలికించేలే
గులాబీలే గుబాళించి
కురిపించేనులే దీవనలే
||వయసే||
* సమాప్తం *