Home » Sree Sree » Annapurna Vari Chitralalo Sri Sri Geetalu
హాయి హాయిగా జాబిల్లి
వెలుగు నీడలు (1961)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల, సుశీల బృందం
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : ఆదుర్తి సుబ్బారావు
వరలక్ష్మీ:
హాయిహాయిగా జాబిల్లి - తొలి
రేయి వెండిదారాలల్లి
మందు జల్లి నవ్వసాగె ఎందుకో - మత్తు
మందు జల్లి నవ్వసాగె ఎందుకో
||హాయి హాయిగా||
తళతళ మెరిసిన తారక - తెలి
వెలుగుల వెన్నెల దారుల
చంద్రం:
కోరి పిలిచెనో తన దరిచేరగా - మది
కలచెనో తీయని కోరిక
||హాయి హాయిగా||
మిలమిల వెలిగే నీటిలో - చెలి
కలువల రాణీ చూపులో
వరలక్ష్మీ:
సుమదళములు పూచిన తోటలో - తొలి
వలపుల తేనెలు రాలెనో
||హాయి హాయిగా||
విరిసిన హృదయమె వీణగా-
మధురసముల కొసరిన వేళల
చంద్రం :
తొలిపరువము లోలికెడు సోయగం - కని
పరవశమందేనొ మానసం
||హాయి హాయిగా ||
చిట్టీ పొట్టీ చిన్నారి
వెలుగు నీడలు (1961)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : సుశీల, స్వర్ణలత
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : ఆదుర్తి సుబ్బారావు
సుగుణ , వరలక్ష్మీ :
చిట్టీ పొట్టీ చిన్నారి పుట్టినరోజు
చేరి మనం ఆడిపాడే పండుగరోజు
సుగుణ :
వేడుకగా ఈ పూట
ఆడుదమా దొంగాట
||చిట్టీ పొట్టీ||
సుగుణ :
కళ్ళకి పట్టీ చల్లగకట్టీ వీపుతట్టి పోతాం
తాకినవారి పేరొకసారి చెప్పవోయి చూతాం
వరలక్ష్మీ:
కన్నులుండి చూడలేరు కొంతమంది జనం
దారితప్పి తిరగడమే తెలివిలేనితనం
సుగుణ :
మెదడు పదును పెట్టాలి
అసలు దొంగను పట్టాలి
||చిట్టీ పొట్టీ||
సుగుణ :
'అంబా' అనే అరుపు వినీ తల్లిని చేరు లేగ
నేలమీది పిట్టను పోల్చు నింగి నెగురు డేగ
వరలక్ష్మీ :
చీకటైనా చిటారుకొమ్మ చేరును కోతి
గురితెలిసి మసలుకొనే నిదానమే నీతి
||చిట్టీ పొట్టీ||
ఓహో నిన్నే కోరెగా
ఇద్దరు మిత్రులు (1961)
సంగీతం : సాలూరు రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, సుశీల
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : ఆదుర్తి సుబ్బారావు
సరళ:
ఓహో ఓహో నినే కోరెగా
కుహూ కుహూ అనీ కోయిలా
వసంత వేళలా - పసందు మీరగా
అపూర్వగానమే - ఆలపించే తీయగా
||ఓహో||
విజయ్:
అదా కోరిక - ఒయ్యారి కోయిలా
జగాలె నీ చూపులో - జలదరించేనే
వరాల నవ్వులే - గులాబి పువ్వులై
వలపు తేనె నాలోన - చిలకరించేనే ||ఓహో||
సరళ :
ఫలించె నేను కన్న కలలు - తీయ తీయగా
విజయ్ :
సుఖాలలో సోలిపో - హాయి హాయిగా
సరళ :
ఉయాలలూగె నా మది - చిటారుకొమ్మలా
విజయ్:
నివాళి అందుకో ఈవేళ పండుగా
ఇద్దరూ:
సదా సుధాతరంగాల తేలిపోదమా
ఓహో ఓహో నినే కోరితి కుహూకుహూ అనీ పాడితి
పాడవేల రాధికా
ఇద్దరు మిత్రులు (1961)
సంగీతం : సాలూరు రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, సుశీల
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : ఆదుర్తి సుబ్బారావు
పద్మ:
పాడవేల రాధికా - ప్రణయ సుధాగీతికా
ఈ వసంత యామినిలో - ఈ వెన్నెల వెలుగులలో
జీవితమే పులకించగ - నీ వీణను సవరించి
పాడవేల రాధికా
గోపాలుడు నిను వలచి - నీ పాటను మది తలచి
ఏ మూలనొ పొంచి పొంచి - వినుచున్నాడని యెంచి
పాడవేల రాధికా
ప్రణయ సుధాగీతికా
పాడవేలా రాధికా
మనసున మనసై
డాక్టర్ చక్రవర్తి (1964)
సంగీతం : సాలూరు రాజేశ్వరరావు
గానం : ఘంటసాల
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : ఆదుర్తి సుబ్బారావు
మనసున మనసై బ్రతుకున బ్రతుకై
తోడోకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము ||
ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో
తోడోకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము ||
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీ కోసమె కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడోకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము ||
చెలిమియే కరువై వలపే అరుదై
చెదరిన హృదయమె శిలయైపోగా
నీ వ్యధ తెలిసీ నీడగ నిలిచే
తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము ||
వలపులు విరిసిన పూవులే
ఆత్మగౌరవం (1966)
సంగీతం : సాలూరు రాజేశ్వరరావు
గానం : ఘంటసాల, సుశీల
నిర్మాత : దుక్కిపాటి మధుసూదనరావు
దర్శకుడు : కె. విశ్వనాద్
వాసు : వలపులు విరిసిన పూవుల్
కురిపించె తెలియలే
సావిత్రి : మానసులు కలిసిన చూపులే
పులకించి పాడెలే
సావిత్రి : బరువు కనుల నను చూడకు
మరులు గొలిపి మది రేపకు
వాసు : చెలి తలపే తెలిపేనులే
సిగలోని లేమల్లెలు
||వలపులు||
వాసు: ఉరిమిన జడిసే నెచ్చెలి
అడుగక యిచ్చెను కౌగిలి
సావిత్రి : నీ హృదయములో ఒదిగినచో
బెదురింక ఏమున్నది
||వలపులు||
సావిత్రి : తొలకరి చినుకుల చిటపటలు
చలి చలి గాలుల గుసగుసలు
వాసు : పెదవులపై మధురిమలే
చిలికించ మన్నాయిలే ||వలపులు||