Read more!

ప్రదోషకాలంలో విష్ణుస్వరూప ఆరాధన!!

 

ప్రదోషకాలంలో విష్ణుస్వరూప ఆరాధన!!

 

ప్రదోషకాల పూజ గురించి చాలా కొద్దిమందికే తెలిసి ఉంటుంది. సూర్యుడు అస్తమించిన తరువాత, చంద్రుడు ఉదయించడానికి మధ్య ఏర్పడే శూన్య కాలాన్ని ప్రదోష కాలం అంటారు. ప్రదోష కాలంలో ముఖ్యంగా శివుడికి భస్మంతో అభిషేకం చేయడం వల్ల ఎంతో గొప్ప పలితం ఉంటుందని చాలామంది నమ్మకం. అయితే ఈ ప్రదోష కాలంలో కేవలం శివుడి అభిషేకం మాత్రమే కాదు, మహావిష్ణువు దశావతారాలలో ఒకటైన నరసింహ అవతార స్వరూపుడు నరసింహస్వామికి మరియు సకల కార్యాలలో వేడుకగా జరుపుకునే సత్యనారాయణ స్వామికి ప్రదోష కాలంలో పూజ చేస్తే ఎంతో మంచిదని పురాణ శాస్త్ర పండితులు చెబుతున్నారు. 

ముఖ్యంగా పౌర్ణమి రోజు, సూర్యుడు అస్తమించిన తరువాత, చంద్రుడు ఉదయించేలోపు వచ్చే ప్రదోషకాలంలో లక్ష్మీనరసింహ స్వామిని, సత్యనారాయణ స్వామి వంటి విష్ణుమూర్తి రూపాలను పూజిస్తే ఎందరికో పెద్ద సమస్యగా ఉన్న ఏలినాటి శనిగ్రహ ప్రభావం తొలగిపోతుంది. అలాగే తమ ప్రమేయం లేకుండా జరుగుతున్న తప్పులు, ఇంట్లో అశాంతి, మనశాంతి కరువు అవ్వడం, మనుషుల మధ్య సఖ్యత లేకపోవడం, బయట వల్ల నుండి సమస్యలు ఎదురవ్వడం ఇలాంటివన్నీ తొలగిపోతాయి. అలాగే అనుకున్నానులు, తలపెట్టిన కార్యాలు ఎలాంటి సమస్య రాకుండా పూర్తవుతాయి.

 శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ప్పౌర్ణమి రోజు ప్రదోష కాలంలో అలాగే స్వాతి నక్షత్రం కలసివచ్చినపుడు ఆ సమయంలో కొబ్బరి నీళ్లు(చెట్టు మీద తెంపిన కాయ, అంటే  నేల మీద పడకుండా ఉండే కాయ నీళ్లు శ్రేష్టం), పాలు, పన్నీరు, తేనె, పసుపు, సుమంగళి చందనం, తిరుమంజన పొడి వంటి అభిషేక వస్తువులను సమకూర్చుకుని వాటితో అభిషేకం చేయించాలి. ఇలా చేయించడం వల్ల  సకల సంపదలు చేకూరుతాయి. అలాగే అభిషేకం  పూర్తయిన తర్వాత తులసీ మాలను లక్ష్మీనరసింహస్వామికి వేయాలి. సాధారణ పూమాలల కంటే తులసి మాల శ్రేష్టం మరియు నరసింహస్వామికి అదే ఇష్టం. ఇలా అభిషేకం, తులసి మాలతో ఆ నరసింహ స్వామిని పూజించే వాళ్లకు సమస్యలు అన్నీ తొలగిపోయి, సుఖసంతోషాలు జీవితంలో చోటు చేసుకుంటాయి.  

నరసింహ స్వామిని ప్రదోషకాలంలో ఆరాధించినట్టే, సత్యనారాయణ స్వామిని కూడా ఆరాధిస్తారు. సత్యనారాయణ స్వామి ఆరాధన వల్ల కూడా అదే పలితం ఉంటుంది. 

లక్ష్మీ నరసింహ స్వామిని, సత్యనారాయణ స్వామిని పై తిథులలో ఆరాధించే వారికి జీవితంలో ఎదుగుదల లేదని బాధపడేవారికి ఎదుగుదల, విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేసేవారికి వారి ప్రయత్నం ఫలించడం వంటి కూడా నెరవేరుతాయి. అంతే కాదు నరసింహ స్వామిని ఆరాధించడం వల్ల ప్రత్యేకంగా  రుణబాధలు, మానసికాందోళనలు తొలగిపోతాయి. 

కాబట్టి పౌర్ణమి నాటి  ప్రత్యేక ప్రదోషకలాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆ స్వామిని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో సుఖసంతోషాలు లేవని బాధపడే సమయం రాదు.

◆ వెంకటేష్ పువ్వాడ