కుంతీ రహస్యం!!

పాండురాజు భార్య, పాండవుల తల్లి, శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుని సోదరి అయిన కుంతి  అసలుపేరు పృథ. కుంతి భోజుడు అనే రాజుకి పిల్లలు కలగకపోవడంతో పృథను దత్తత తీసుకున్నాడు. ఆయన కూతురిగా పెరిగినందువల్ల కుంతిగా ప్రసిద్ధి కెక్కింది.

కుంతి ప్రస్తావన అంతా మహాభారతంలోనే కనిపిస్తుంది. పాండురాజుకు భార్య కాకముందు ఈమె  కుంతిభోజుని ఇంట్లో అతిథులను గౌరవించుట ఎంతో చక్కగా గౌరవించేది. ఒక రోజు దుర్వాస మహర్షి అక్కడికి వచ్చినపుడు అతనికి చక్కగా గౌరవమర్యాదలు చేసింది.  అతడు మెచ్చి ఓ మంత్రోపదేశం చేశాడు. అంతేకాక ఆ మంత్రోచ్చారణ చేసి దేవతను కోరుకున్న వారు ప్రత్యక్షమై వారి అంశతో పిల్లలు పుడతారని  ఆశీర్వదిస్తాడు.

దుర్వాసుడు వెళ్లిపోయిన తర్వాత ఆ మంత్రం నిజంగా పనిచేస్తుందా లేదా అని పరీక్షించబోయి మంత్రాన్ని ఉచ్చరించి సూర్యదేవున్ని తలచుకోగా అతడు ఓ బ్రాహ్మణ రూపంలో వస్తాడు. కుంతి సూర్యుడితో  నేను ఇంకా పెళ్లికాని దాన్నని, తొందరపాటులో మంత్రోచ్చారణ చేశానని చెప్పగా ఇది మంత్ర ప్రభావం కాబట్టి జరిగి తీరుతుంది. అయితే దీనివల్ల నీకు ఎలాంటి  నష్టం లేదని చెప్పి కర్ణుడిని ఆమె చేతుల్లో పెట్టి పోతాడు.  అందరూ ఏమనుకుంటారో అని భయపడి  ఆమె కర్ణుడిని ఓ పెట్టెలో వుంచి నదిలో వదలి వేసింది.

కుంతిభోజుడు స్వయంవరం ప్రకటించగా కుంతి పాండవ రాజుని పెళ్లిచేసుకుంది.  పాండురాజు మద్రదేశాన్ని జయించి మాద్రిని కూడా పెళ్లి చేసుకున్నాడు. కుంతి, మాద్రి, పాండురాజు ఒకసారి అడవికి వేటకు వెళ్ళి జంతువుల రూపంలో వున్న ఒక ముని, అతని భార్య ఏకాంతంలో ఉన్నపుడు నిజంగా జంతువులు అనుకుని పాండురాజు బాణం వదిలాడు. ఆ బాణం దెబ్బకు  ముని భార్య చనిపోగా ముని పాండు రాజుని "నీ భార్యతో పిల్లలు కనాలని ప్రయత్నిస్తే  మరణిస్తావు" అని శపిస్తాడు.

ఆ తర్వాత పాండురాజు తన భార్యలతో మన సమస్యను అర్థం చేసుకునే గొప్ప వ్యక్తులతో పిల్లలు కని మన వంశాన్ని నిలబెట్టండి నాయి అడగగా కుంతి తనకున్న వరం చెప్పి పాండురాజు అంగీకారంతో ఇంద్రుని వల్ల అర్జునునికి, యముని వల్ల భీమసేనుడికి జన్మనిస్తుంది. మాద్రికి కూడా ఆ మంత్ర ఫలితంగా అశ్వనీ దేవతలవల్ల నకుల సహదేవులు జన్మిస్తారు. ఓ చలికాలంలో పాండురాజు ఆగలేక మాద్రితో ఓ రాత్రి గడపగా  బ్రాహ్మణుని శాపంవల్ల పాండురాజు చనిపోతాడు. కుంతి తన సంతానమైన పాండవులతో హస్తినకు వెళ్ళిపోతుంది. మాద్రి పాండురాజు చితిపైబడి తనూ మరణిస్తుంది.

హస్తినాపురంలో కుంతి జీవితం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. కౌరవులతో పాటు పాండవులు విలువిద్య నేర్చుకొంటారు. కౌరవ పాండవుల మధ్య గొడవలు కుంతిని కృంగదీస్తాయి. మాయాజూదంలో రాజ్యంపోయి పాండవులు వనవాసం చేయగా కుంతి హస్తినలో విదురుని ఇంట్లో గడుపుతుంది. వనవాసం తరువాత  పాండవులు తమ రాజ్యభాగం ఇవ్వమని అడిగితే కౌరవులు నిరాకరించగా శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ప్రోత్సహిస్తాడు. కుంతి మొదటి సంతానమైన కర్ణుడు మహావీరుడే కాక దుర్యోధనుని స్నేహితుడు అని అర్థం చేసుకుని కర్ణుడు యుద్ధం చేయకుండా ఆపడానికి ఓ నదీ తీరంలో కర్ణుడిని కలసి అతడి జన్మవృత్తాంతం అంతా చెప్పి యుద్ధ చేయద్దని అడుగుతుంది. అతడు నాకు స్నేహమే ముఖ్యం.  తల్లిగా నీవు కోరుతున్నావు కాబట్టి అర్జునుణ్ణి తప్ప మిగిలిన పాండవులలో అవకాశం వచ్చినా ఎవరినీ చంపను, నేను మరణించినా, అర్జునుడు మరణించినా పాండవులు ఐదుగురే అని తేల్చి చెప్పాడు.

ఇదంతా అందరికీ తెలిసింది అయితే కుంతి చివరి రోజులు గురించి తెలిసిన వాళ్ళు కొందరే. మహా భారత యుద్ధం తరువాత కర్ణుడితో పాటు ఎంతోమంది కౌరవులు చనిపోయారు. అదంతా చూసి కుంతి బాధపడింది.  ధృతరాష్ట్రుడు గాంధారిలతో పాటు వనవాసం వెళ్లి కొంతకాలానికి అడవిలో వాళ్ళిద్దరితో పాటు అగ్నిలో మరణించింది కుంతి. 

◆వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories