సృష్టి అంతా శ్రీపతి లీలలోనే

 

పూర్వం  శూరసేనదేశమును పాలిస్తూ చిత్రకేతుడు అనే  ఒక రాజు ఉండేవాడు. ఆయనకు సంతానం లేదు. సంతానం కొరకు కోటిమంది స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. అయినా ఫలితం దక్కలేదు. ఒకరోజు అంగీసరుడు అను ముని తన కొలువుకు రాగా, రాజు అతనిని పూజించి తనకు సంతానం కలగడానికి ఏమి చేయాలో చెప్పండి అని మునిని అడుగుతాడు చిత్రకేతుడు. అప్పుడు అంగీసరుడు,రాజు చేత పుత్రకామేష్టి వ్రతము చేయించి యజ్ఞ ప్రసాదమును రాజు పట్టపు రాణి అగు కృతద్యుతికి ఇస్తాడు. ఆ యాగ ఫలం చేత రాజుకి కొడుకు పుడతాడు. పుట్టక పుట్టిన ఒక్కగానొక్క ఒక్క కొడుకుని రాజు అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు. పూర్తిగా పుత్రుని మొహంలో తరించిపోతాడు. ఆ బిడ్డని, అతని తల్లిని మిగతా భార్యలకంటే కొంచెం ఎక్కువ సంతోషపెట్టడం తకిమా భార్యలకు నచ్చలేదు. దానితో తీవ్ర అసూయా భావంతో వారు ఆ పిల్లాడికి విషం పెట్టి చంపేశారు. పుత్ర శోకం చేత మిక్కిలి దుఃఖంతో విలపిస్తున్న రాజు దగ్గరకి నారధుడు, ఆయన వెంట అంగీసరుడు వచ్చి ఇలా అంటారు. "రాజా! ఋణానుబంధరూపేణ పశుపత్ని సుతాలయః” అందురు. (పశువులు, భార్యలు, కొడుకులు ఇండ్లు మొ|| ఋణమును బట్టి వచ్చుచు పోవుచుందురు.) జగత్తు స్వప్నమువంటిది. స్వప్నము నిజమగునా? కర్మవశమున జీవులు పుట్టి గిట్టుచుందురు. నీకు వీ డే మగును? వానికి నీవే మగుదువు? ఇదంతయు భౌతికదేహ మున్నంతవరకే. నీవు శ్రీహరిని ధ్యానించుచు మొహవికారములను త్యజింపుము”. నారదుడు, “రాజా! నీకును వీనికిని బంధుత్వ మేమున్నదో చూడు” మని బాలుని దేహమును జూచి, “జీవా! మీ తల్లిదండ్రులును బంధువులును నీకై దుఃఖించుచున్నారు. నీవు తిరిగి ఈ దేహములో ప్రవేశించి వీరికి సంతోషము గలిగింపు” అని పలుకుతారు.

ఆ కుమారుడు " కర్మ జీవిని అయిన నేను అనేక జన్మముల యందు పుట్టి మరనిస్తున్నాను. ఒక్కొక్క జన్మలో వేర్వేరు తల్లిదండ్రులు, బంధువులు నాకు ఏర్పడుతున్నారు. సమస్త సృష్టి స్థితి లయకారుడైన శ్రీపతి తన మాయ చేత జీవులను పుట్టించి తిరిగి తనలో లీనము చేసుకుంటాడు"

   పతులెవ్వరు? సతులెవ్వరు?
   సుతు లెవ్వరు? మిత్రశత్రుసుజన ప్రియసం
   గతు లెవ్వరు? సర్వాత్మక
   గతుడై గుణసాక్షి యైన ఘను డొక్కనికిన్!!

   కర్మవశమున నెందు సుఖమ్ములేక
   దేవ తిర్యజ్ఞృయోనుల దిగురు నాకు
   వెలయ నే జన్మమందున వీరు తల్లి
   దండ్రు లైనారు? చెప్పవే తాపసేంద్ర!

అని చెప్పి ఆ జీవుడు వెళ్లిపోగా, చిత్రకేతుడు మోహమువిడిచి బాలునికి యమునానదిలో ఉత్తరక్రియలు చేస్తాడు. నారదునకు నమస్కరింపగా అతడు రాజునకు నారాయణమంత్రము ఉపదేశించి వెళ్లిపోతాడు. సత్యం గ్రహించిన చిత్రకేతుడు నరాయణున్ని సేవించి తరిస్తాడు. తర్వాత గోవిందుడు ప్రసన్నంతో విద్యాధరాదిపత్యమును, విమానమును సాదిస్తాడు.

◆ వెంకటేష్ పువ్వాడ


 


More Purana Patralu - Mythological Stories