వ్యూహమూ,యుద్ధము కురుక్షేత్ర సంగ్రామము!!

కురుక్షేత్ర మహాసంగ్రామం ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుందో చెప్పక్కర్లేదు. అయితే పద్దెనిమిది రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో ఒకో రోజు ఒకో వ్యూహాన్ని ప్రయోగిస్తూ పాండవ, కౌరవ సేనలు యుద్ధం చేసాయి. ఆ పద్దెనిమిది వ్యూహాలు, వాటిని ఎవరు ఎవరిపై ప్రయోగించారు అనే విషయాలు…...

1. క్రౌంచారుణ వ్యూహం: ధృష్టద్యుమ్నుడు క్రౌంచ పక్షి ఆకారంలో సైన్యాన్ని నిలుపుతాడు.

2. గరుడవ్యూహం: మూడవరోజున ఈ వ్యూహాన్ని భీష్యుడు నిర్మించాడు. దీనినే సువర్ణ వ్యూహం అని కూడా అంటారు.

3.శకట వ్యూహం: పదకొండవ రోజున ఈ వ్యూహాన్ని నిర్మించారు. బండి ఆకారంలో ద్రోణాచార్యుడు సైన్యాన్ని నిలిపి కేంద్ర స్థానంలో ఉంటాడు. 

4. చక్రవ్యూహం: పదమూడవ రోజు ఈ వ్యూహాన్ని నిర్మించారు. దీనిని పద్మవ్యూహం అనికూడా అంటారు. ద్రోణాచార్యుడు ఈ వ్యూహాన్ని పన్ని అభిమన్యుడ్ని బలి తీసుకున్నాడు.

5. మకర వ్యూహం : ఐదవ రోజున భీష్ముడు ఈ వ్యూహాన్ని నిర్మించాడు.

6. బార్హస్పత్య వ్యూహం: పదిహేదవ రోజున బృహస్పతి సహకారంతో కర్ణుడు ఈ వ్యూహాన్ని పన్నాడు. 

7. శృంగాటక వ్యూహం: ఎనిమిదవ రోజు నిర్మించిన ఈ వ్యూహంలో త్రికోణాకారంలో సైన్యాన్ని నిలిపారు. ధృష్టద్యుమ్నుడు భీష్మున్ని తిప్పికొట్టడానికి ఈ వ్యూహానికి  నిర్మించారు.

8. శ్యేన వ్యూహం: ఈ వ్యూహాన్ని ఐదవ రోజు నిర్మిచాడు. దీనినే చేగ వ్యూహం అని కూడా అంటారు. భీష్ముడి మకర వ్యూహాన్ని ప్రయోగించగా దాన్ని తిప్పికొట్టడానికి ధృష్టద్యుమ్నుడు ఈ వ్యూహాన్ని నిలిపాడు.

9.అర్ధచంద్ర వ్యూహం: మూడవ రోజు భీష్ముడు పన్నిన గరుడ వ్యూహాన్ని తిప్పికొట్టడానికి ధృష్టద్యమ్నుడు అర్థచంద్ర వ్యూహాన్ని నిలిపాడు.

10. మండల వ్యూహం: ఏడవ రోజున నిర్మించిన ఈ వ్యూహంలో భీష్మాచార్యుడు కురుసేనను మండలా కారంలో నిలిపాడు.

11. మండలార్ధ వ్యూహం: ద్రోణుడు పన్నెండో రోజు కురుసేనను గరుడ వ్యూహంలో నిలుపగా ధర్మరాజు పాండవ సైన్యంతో మండలార్ధ వ్యూహాన్ని రచించాడు.

12. వజ్రవ్యూహం: ఏడవ రోజున భీష్యుడు కురుసేనను మండల వ్యూహంతో నిర్మించగా ధర్మరాజు పాండవ సేనలను వజ్ర వ్యూహంతో నడిపించాడు. 

13. సూచీముఖ వ్యూహం: ఆరవ రోజు ధృష్టద్యుమ్నుడు పాండవ సేనను మకర వ్యూహంతో నిలవగా దానికి ప్రతిగా భీష్ముడు క్రౌంచవ్యూహంతో సైన్యాన్ని నడిపించాడు. రెండు వ్యూహాలు భంగపడటంతో అభిమన్యుడు సూచీ ముఖ వ్యూహాన్ని పన్నాడు.

14. వ్యాల వ్యూహం: నాలుగవ రోజు భీష్ముడు కురుసేనను చుట్ట చుట్టుకున్న లేదా ముడివేసుకున్న పాములా నిలిపాడు. ఈ వ్యూహం ద్వారా సకల సైన్యాల స్థంభనను అంచనా వెయ్యటం కష్టము.

15. సర్వతోభద్ర వ్యూహం: తొమ్మిదవ రోజు కురుసేనతో ఈ సర్వతోభద్ర వ్యూహాన్ని రచించాడు భీష్ముడు.

16. మహావ్యూహం: రెండవ రోజు భీష్ముడు ఈ వ్యూహాన్ని అనేక విధాలుగా నిర్మించి అజేయుడై హడలు కొట్టించాడు.

17. మహావ్యూహం: ఎనిమిదవ రోజు కూడా మహావ్యూహాన్ని నిర్మించాడు భీష్ముడు. 

18. మహావ్యూహం: భీష్ముడు నిర్మించిన సర్వత్ భద్ర వ్యూహాన్ని ప్రతిగా ధృష్టద్యుమ్నుడు మహావ్యూహాన్ని నిర్మించాడు.

ఇలా పద్దెనిమిది వ్యూహాలు ప్రయోగించి జరిగిన యుద్ధంలో పాండవులు విజేతగా నిలుస్తారు. అయితే యుద్దమనేది ఎంతటి నష్టాన్ని కలిగిస్తుందో చెప్పడానికి ఈ కురుక్షేత్ర సంగ్రామానికి ముందు సంగ్రామం తరువాత పాండవ, కౌరవ సైనికుల సంఖ్య తెలిస్తే యుద్దమంటే అసహ్యం ఏర్పడుతుంది కాబోలు.

యుద్ధానికి ముందు పాండవుల వైపు సైనికుల సంఖ్య దాదాపు పదహాయిదు లక్షలా, ముప్పై వేలా, తొమ్మిది వందల మంది, అదే కౌరవుల వైపు ఇరవై నాలుగు లక్షలా, అయిదు వేలా, ఏడు వందల మంది. 

కానీ యుద్ధం ముగిసిన తరువాత పాండవులలో కేవలం ఎనిమిది మంది మాత్రమే బతికారు. వాళ్లలో అయిదు మంది పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి, యుయుత్సుడు బతికారు.

కౌరవులలో కేవలం ముగ్గురు మాత్రమే బతికారు. వాళ్ళు అశ్వత్థామ, కృత, కృతవర్మ. 

కాబట్టి యుద్ధమనేది ఎంతటి నష్టాన్ని చేకూరుస్తుందో అర్థం చేసుకుని, నిజ జీవితంలో అందరూ అలాంటి వాటికి దూరంగా ఉండాలి.

◆ వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories