నేటినుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి

బ్రహ్మోత్సవాలు :

Sri Lakshminarasimha Swamy Temple or Yadagirigutta or Bhongir is a popular Hindu ... The annual brahmotsavam is held in the month of March, which includes Yedurkolu, The Celestial Wedding and Divya Vimana Rathotsavam and more ...

నల్లగొండ జిల్లాలో... ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తులు తమ భాగ్యోత్సవాలుగా భావించే శ్రీస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటితో ఆరంభం కానున్నాయి. శ్రీ యాదగిరిగుట్ట వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతీ ఏటా ఫాల్గుణశుద్ధ విదియ నుంచి మొదలై ద్వాదశి వరకు 11 రోజుల పాటు కన్నుల పండవగా కొనసాగుతాయి. ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు 11 రోజుల పాటు బ్రహ్మోత్సావాలు అత్యంత వైభంవంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉద యం 10 గంటలకు స్వస్తి వచనం, సాయంత్రం 6 గంటలకు మృత్యుగ్రహణంతో స్వామి వారి బ్రహ్మో త్సవాలకు శ్రీకారం జరుగుతుంది. 4వ తేదీన ఉదయం 1 గంటలకు ధ్వజా రోహనం, సాయంత్రం 6 గంటలకు భేరి పూజ, దేవతాహ్వానం, హవనం గావించబడు తుంది. 5వ తేదీ ఉదయం 9 గంటలకు వేద పారా యణలు ప్రారంభిస్తారు. రాత్రి 10 గంటలకు శేషవాహన సేవ ఊరేగింపు జరుగుతుంది. 6వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీకృష్ణుడి అలంకారంలో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. రాత్రి 10 గంటలకు హంస వాహన సేవ నిర్వహిస్తారు. 7వ తేదీ ఉదయం 10 గంటలకు వటపత్ర శాయి అలంకార సేవ. రాత్రి 10 గంటలకు పొన్న వాహన సేవ, 8వ తేదీ ఉదయం 10 గంటలకు గోవర్ధన గిరిధారి అలంకార సేవ, రాత్రి 10 పది గంటలకు సింహ వాహన సేవ, 9వ తేది ఉదయం 10 గంటలకు జగన్మోహిని అలంకార సేవ రాత్రి 9.45 గంటలకు అశ్వవాహన సేవ, 10వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీరామ అలంకార సేవ, రాత్రి 9.45 గంటలకు గజవాహన సేవ, 11వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీమహావిష్ణు అలంకారం, రాత్రి 9 గంటలకు స్వామి వారి దివ్య విమాన రథోత్సవం, 12వ తేదీ ఉదయం 11 గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, రాత్రి 10 గంటలకు శ్రీస్వామి వారి శ్రీపుష్ప యాగం, దోపోత్సవం, 13వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి 10 గంటలకు శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయి.

Sri Lakshminarasimha Swamy Temple or Yadagirigutta or Bhongir is a popular Hindu ... The annual brahmotsavam is held in the month of March, which includes Yedurkolu, The Celestial Wedding and Divya Vimana Rathotsavam and more ...

బ్రహ్మోత్సవాలలో ముఖ్య ఘట్టాలైన శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం 9వ తేదీ ఆది వారం రాత్రి 10.45 గంటలకు జరుగుతుంది. 10వ తేదీ సోమవారం రాత్రి 10.45 గంటలకు శ్రీస్వామి వారి తిరు కల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. 11వ తేదీ మంగళవారం రాత్రి 9 గంటలకు శ్రీస్వామి వారి దివ్య విమాన రథోత్సవము తిరువీధులలో ఊరేగించ బడుతుంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ సరస్వతి సంగీత భవనంలో ఈ నెల 5 నుండి వారం రోజుల పాటు ధార్మిక- సాహిత్య- సంగీత మహాసభలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

మార్గం :

Sri Lakshminarasimha Swamy Temple or Yadagirigutta or Bhongir is a popular Hindu ... The annual brahmotsavam is held in the month of March, which includes Yedurkolu, The Celestial Wedding and Divya Vimana Rathotsavam and more ...

 యాదగిరి గుట్ట హైదరాబాద్‌ నుంచి 60 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులున్నాయి. హైదరాబాద్‌ - వరంగల్‌ జాతియ రహదారిలో రాయగిరిక్రాస్‌ రోడ్డు నుంచి రావొచ్చు. రైలుమార్గంలో భవనగిరి, రాయగిరి, ఆలేరు రైల్వేషేషన్లలో దిగి స్వామి సన్నిధికి చేరుకోవచ్చు. ఈ క్షేత్రాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌ నుంచి సరికొత్తగా 'యాదగిరి రోడ్డు' పేరిట 8 లైన్ల రహదారి నిర్మాణపనులు చేపట్టారు.  బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అదనపు బస్సు సర్వీసులను నడుపుతోంది. ప్రధానంగా విజయవాడ, వేములవాడ, సిద్ధిపేట, మెదక్, హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, శ్రీశైలం నుంచి గుట్టకు అదనపు బస్సులు నడుపుతున్నారు.

వసతి :

Sri Lakshminarasimha Swamy Temple or Yadagirigutta or Bhongir is a popular Hindu ... The annual brahmotsavam is held in the month of March, which includes Yedurkolu, The Celestial Wedding and Divya Vimana Rathotsavam and more ...

 వసతి విషయానికి వస్తే...ఆలయాన్ని ఆనుకునే అనేక వందల గదులు గల ఎన్నో సత్రాలు ఉంటాయి. ఇందులో కొన్ని ఉచితంగా ఇచ్చే గదులు కూడా ఉంటాయి. అద్దె గదులు వంద రూపాయలలోపు దొరుకుతుంటాయి. ఇక భోజన సౌకర్యం కోసం ఈ ప్రాంతంలోనే భక్తులను, పర్యాటకులను ఆకర్షించే విధంగా పలు రకాల హోటళ్లు ఉన్నాయి

More Others