Read more!

మూసి వాయనాల నోము - 2 (Moosi Vayanala Nomu – 2)

 

మూసి వాయనాల నోము - 2

(Moosi Vayanala Nomu – 2)

 

పాట

“మూసి వాయనాల నోచిన భామకు

మోసుకు పోయిందాకా పసుపు కుంకుమ

మూసి వాయనాలు నోచిన కాంతకు

మోసుకు పోయిందాకా - పాడీ పంట

మూసి వాయనాలు నోచిన యింతికి

మోసుకు పోయిందాకా కడుపు చలువ

మూసి వాయనాల నోచిన పడతికి

మోసుకు పోయిందాకా పెనిమిటి అనురాగం

మూసి వాయనాలు నోచిన నెలతకు

మోసుకు పోయిందాకా చుట్టాల ప్రేమ

మూసి వాయనాలు నోచిన ముదితకు

మోసుకు పోయిందాకా ఇహం మోసుకు పోయాక వరం !!

విధానం

ప్రతిరోజూ ఈ పాట పాడుకుని, అక్షతలు వేసుకుంటూ వుండాలి. ఎన్నాళ్ళంటే అన్నాళ్ళలా చేసి, తోచినప్పుడు ఉద్యాపనం చేసుకోవాలి.

ఉద్యాపనం

ఒక కొత్త చేట నిండా పసుపు పోసి, దానిమీద యింకొక కొత్త చేటని బోర్లించి, దానిమీద నల్ల పూసల కోవ, లక్క జోళ్ళు, పళ్ళు, పువ్వులు, కొత్త రవికెల గుడ్డ, దక్షిణ తాంబూలాలూ పెట్టి, ఒక ముత్తయిదువుకు పసుపు రాసి, బొట్టు పెట్టి వాయన దానమివ్వాలి. అలాగే ఇంకో చేటలో కుంకుమ నిండా పోసి, మరో చేటతో మూసి, ఆ పైన దక్షిణ తాంబూలాలూ వగయిరాలుంచి, మరో ముత్తయిదువుకు యివ్వాలి. అదే పద్ధతిని మూడవ చేట నిండా నల్లపూసల తోటీ, నాలుగవ చేట నిండా పువ్వులతోనూ, అయిదవ చేట నిండా పండ్లతోనూ , ఆరవ చేట నిండా గాజులతోను, వాయనాలివ్వాలి.