• Prev
  • Next
  • అలవాట్లో పొరపాటు

    అలవాట్లో పొరపాటు

    "ఏవండీ... మీ హోటల్లో మంచి గదులు ఉన్నాయా?" అని అడిగాడు ఒక హోటల్ కి

    వచ్చిన సుబ్బారావు.

    "ఉన్నాయండీ" అని వినయంగా చెప్పాడు ఆ హోటల్ అతను.

    "మంచి టిఫిన్, కాఫీ..." అని అడిగాడు సుబ్బారావు.

    "supply చేస్తాం సార్" అని వినయంగా చెప్పాడు ఆ హోటల్ అతను.

    "భోజనం అదీ...." అని అడిగాడు సుబ్బారావు.

    "supply చేస్తాం సార్" అని వినయంగా చెప్పాడు ఆ హోటల్ అతను.

    "కావాలంటే మందూ..." అని అడిగాడు సుబ్బారావు.

    "supply చేస్తాం సార్" అని వినయంగా చెప్పాడు ఆ హోటల్ అతను.

    "వెరీ గుడ్... అయితే ఒక రూమివ్వండి." అని అడిగాడు సుబ్బారావు.

    " అలాగే సార్ " అని ఒక గది తాళాలు తీసుకున్నాడు ఆ హోటల్ అతను.

    " రూములో దోమలున్నాయా ? " అని అడిగాడు సుబ్బారావు.

    "లేవు సార్.... supply చేస్తాం సార్ " అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు ఆ

    హోటల్ అతను.

  • Prev
  • Next