• Prev
  • Next
  • Tamasha Kanthatho Tuntari Mukamukhi

    Tamasha Kanthatho Tuntari Mukamukhi

    తమాషా కాంతంతో తుంటరి ముఖాముఖీ

    తమాషా అనేది ఆమె ఇంటి పేరు అనుకుంటే మనం పప్పులోనే కాదు బురదలో కూడా 

    కాలు వేసిన వాళ్ళం అవుతాం. మరి ఆ కాంతం పక్కన ఈ తమాషా ఏంటి అనే డౌట్

    మనకు రావచ్చు. వస్తుంది కూడా. పేరులోనే తమాషా ఉన్న ఈ కాంతం...ఒక గొప్ప

    కవయిత్రి. రచయిత్రి. లెక్కలేనన్ని పత్రిక కవితలు, సినిమా కథలు, వీక్లీ మంత్లీ నవలలు,

    టీవీ సీరియల్స్...ఇలా అన్ని రంగాలలో తమాషాగా అలవోకగా కృషి చేసి చేసి రాసి రాసి

    చివరకు తమాషా కాంతంగా మిగిలిపోయారు. అలా మిగిలిపోయినా కాంతం గారు కొంటె

    కొశ్శెన్లకు ఎలాంటి తుంటరి జవాబులు యిస్తుందో చూద్దాం.

    ************

    కొంటె కొశ్శెన్ : అమాయకుడికి సంస్కృతం నేర్పిస్తే !?

    తుంటరి జవాబు :అప్పుకోసం వరుణ దేవుణ్ణి ప్రార్ధిస్తాడు.

    ***********

    కొంటె కొశ్శెన్ : ఆప్టర్ యూత్...

    తుంటరి జవాబు :ఎన్విరిథింగ్ స్మూత్...!

    **********

    కొంటె కొశ్శెన్ : లాయర్లు, జడ్జిలు, వాదనలు, శిక్షలు లేని కోర్టు ?

    తుంటరి జవాబు : టెన్నిస్ కోర్టు

    ***********

    కొంటె కొశ్శెన్ : తడపకపోయినా తడిగా వుండేది ?

    తుంటరి జవాబు : నాలుక

    ********

    కొంటె కొశ్శెన్ : పాస్ట్ ఈజ్ హిస్టరీ ఫ్యూచర్ ఈజీ మిస్టరీ అన్నారు...మరి ప్రజెంట్ ?

    తుంటరి జవాబు : వడ్డించిన విస్తరి

    ********

    కొంటె కొశ్శెన్ : మనిషికి కంప్యుటర్ కి తేడా ?

    తుంటరి జవాబు : సెన్సుకి సైన్సుకి ఉన్నదే !

    రచన - శాగంటి నర్సింగరావు

  • Prev
  • Next