• Prev
  • Next
  • Saradaga Kasepu Naluguru Veda Panditulu

    Saradaga Kasepu Naluguru Veda Panditulu

    సరదాగా కాసేపు నలుగురు వేద పండితులు

    ప్రతి సోమవారం '' సరదాగా కాసేపు '' అంటూ స్పెషల్ గా మిమ్ముల్ని నవ్విస్తున్న ఈ

    శీర్షికలో ఈ వారం కూడా " నలుగురు వేద పండితులు " అంటూ నవ్వించడానికి రెడీ

    అయి వచ్చింది. మరి ఆలస్యం ఎందుకు సరదాగా కాసేపు అంటూ చదువుకొని హాయిగా

    నవ్వుకోండి. ఈ శీర్షిక మీద మీ అభిప్రాయాలు కామెంట్స్ తెలియజేయగలరు.

    నలుగురు వేద పండితులు ఒక చోట కూర్చొని దాపరికాలు లేకుండా కబుర్లు

    చెప్పుకుంటున్నారు.

     

    " అందరూ మనవాళ్ళే కనుక చెప్పుతున్నాను. రాత్రి నాలుగు పంచపాత్రాల సారాయి

    సేవిస్తే కాని నిద్ర పట్టడం లేదు " అన్నాడు మొదటి వేద పండితుడు.

    " ఆప్తులు కాబట్టి చెప్పుతున్నారు. పదిహేను రోజుల నుండి ఒక రజక స్త్రీతో సంపర్కం

    పెట్టుకున్నానండీ " అని చెప్పాడు రెండో పండితుడు.

    " మీరంతా మనస్సు విప్పి మాట్లాడిన తరువాత నేనెందుకు ఆపాలి. రోజు గుడి వెనకాల

    కూర్చొని పేకాడితేగాని ఏమి తోచడం లేదు " చెప్పాడు మూడో వేద పండితుడు.

    వెంటనే నాలుగో పండితుడు నోరు తెరిచి " నాక్కూడా ఓ దురలవాటు లేకపోలేదు." అని

    అన్నాడు.

    " చెప్పండీ ! ఈ విషయాలన్నీ మనల్ని దాటి బయటికి పోవు. త్వరగా చెప్పండి " అని

    అన్నారు ముగ్గురు వేద పండితులు ఆతృతగా.

    " నానోట్లో నువ్వుగింజ కూడా దాగదండీ ! విన్న ప్రతి విషయాన్ని నలుగురితో

    చెప్పేస్తాను " అంటూ అక్కడి నుండి పరుగులు తీశాడు నాలుగో పండితుడు.

    " ఆ..." అని ఆశ్చర్యంగా నోర్లు తెరిచారు మిగిలిన ముగ్గురు పండితులు.

     

  • Prev
  • Next