• Prev
  • Next
  • Kantamma Batikipoyindi

    Kantamma Batikipoyindi

    కాంతమ్మ బతికిపోయింది

    తెలిసిన ఇద్దరూ స్నేహితురాళ్ళు ఫోనులో వాళ్ళ బాగోగుల గురించి

    మాట్లాడుకుంటున్నారు.

    కాంతమ్మ : హల్లో ఆమని.. నేనుర కాంతాన్ని !

    ఆమని : హల్లో కాంత ! ఎలా ఉన్నావే ? ఇన్ని రోజులు ఎక్కడున్నావు ?

    కాంతమ్మ : హాస్పిటల్లో ఉన్నానే !

    ఆమని : అయ్యోపాపం ! ఏమి జరిగింది ?

    కాంతమ్మ : అంతా మంచే జరిగింది ! అక్కడి కాంపౌండర్ ని పెళ్లి చేసుకున్నాను.

    ఆమని : అవునా ! లైప్ ఎలా ఉంది మరి ?

    కాంతమ్మ : బాగాలేదే ! అతనికి ఇంతకు ముందే పెళ్లి అయిందటరా ! ఐదుగురు పిల్లలు

    కూడా ఉన్నారంటా !

    ఆమని : మరి నీకు ఈ విషయం ముందు తెలియదా ?

    కాంతమ్మ : లేదురా ! కాని అతడు ఒక పెద్ద భవంతికి ఏకైక వారసుడు !

    ఆమని : మంచిదేకదా !

    కాంతమ్మ : కాదు ! ఆ ఇల్లు మంటల్లో తగలబడిపోయింది ?

    ఆమని : అయ్యో పాపం ! చాలా బాధగా ఉందా !

    కాంతమ్మ : లేదే ! అతడు కూడా తన పిల్లలతో ఆ మంటల్లో చనిపోయాడు !

    ఆమని : అయ్యయ్యో...సమయానికి నువ్వు ఆ ఇంట్లో లేక బతికిపోయావు.

    కాంతమ్మ : అవునే ! యిప్పటికి నేను నిజంగానే బతికిపోయాను.

    - శాగంటి నర్సింగరావు

  • Prev
  • Next