• Prev
  • Next
  • Bus Driver Joke

    Bus Driver Joke

    తెలివైన బస్సు డ్రైవర్

    బస్సు యాక్సిడెంట్ కేసు కోర్టులో విచారణ జరుగుతుంది.

    జడ్జి డ్రైవరును ప్రశ్నిస్తున్నాడు.

    " నీ పేరు ? "

    " శంకరం "

    " నువ్వు నడుపుతున్న బస్సు రూట్ ఎక్కడి నుంది ఎక్కడి వరకో తెలుసా ? "

    " తెలుసండి "

    " చెప్పు "

    " ఉప్పల్ నుండి ఘటకేసర్ వరకు "

    " నువ్వు నడుపుతున్న ఉప్పల్ నుండి ఘటకేసర్ కి వెళ్ళే బస్సు అన్నోజీగూడలో

    మాధవి అనే అమ్మాయిని చంపింది ఔనా..."

    " ఔనండీ..."

    " మరి ప్రమాదం జరిగిన తరువాత వెనకబడి జనం అరుస్తూ గోలచేస్తుంటే కూడా నువ్వు

    బస్సు ఎందుకు ఆపలేదు...? " అని కొంచెం కోపంగా అడిగాడు జడ్జి గారు.

    " అది నాన్ స్టాప్ బస్సండీ...అన్నోజీగూడలో ఆపకూడదు..." అని తెలివిగా సమాధానం

    చెప్పాడు డ్రైవర్.

    అందరూ పకపక నవ్వారు.

  • Prev
  • Next