• Prev
  • Next
  • నాలిక కరుచుకున్న గోపిక

    నాలిక కరుచుకున్న గోపిక

    గోపిక గోపి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు.

    అయితే గోపికకి ఇంతకు ముందే పెళ్లి అయింది. ఆ విషయం గోపికి తెలియనీయకుండా

    జాగ్రత్త పడుతూ గోపితో ప్రేమగా మాట్లాడుతుంది. కాని ఒక రోజు గోపిక నాలిక జారే

    పరిస్థితి వచ్చింది.

    ప్రతిరోజూలాగే ఆ రోజు కూడా పార్కులో కలుసుకున్నారు ఇద్దరూ.

    చిలిపిగా కబుర్లు చెప్పుతూ, గోపిక చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు గోపి.

    గోపిక కూడి చేతి వెళ్ళని మెత్తగా తాకుతూ ఉంటే అతనికి నిన్న పెట్టిన ఉంగరం గుర్తుకు

    వచ్చింది.

    " గోపిక ! నిన్న నీ చేతికి ఉంగరం పెట్టాను కదా ! అది కనిపించడం లేదు ? " అని వెంటనే

    అనుమానంగా అడిగాడు గోపి.

    " దానిని మా ఆయన తాకట్టు పెట్టుకున్నాడు గోపి..." అని అసలు విషయం చెప్పి

    గబుక్కున నాలిక కరుచుకుంది గోపిక.

  • Prev
  • Next