TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Bharyabhartala Saradalu Sarasalu
భార్యాభర్తల సరదాలు, సరసాలు
(2).png)
" ఏమండీ...నాకు నాకు దెయ్యాన్ని చూడాలని వుంది " అని కాస్త సిగ్గు పడుతూ
చెప్పింది భార్య.
" ఓస్ అంతేనా...! ఓసారి నిన్ను నువ్వు అద్దంలో చూసుకో సరిపోతుంది " అని పకపకా
నవ్వాడు భర్త
*******************
భర్త అన్నం తినడానికి కంచంముందు కూర్చున్నాడు.
అన్నంగిన్నెలో చూస్తే అన్నీ వెంట్రుకలే.. " ఏమేవ్...అన్నం నిండా ఈ వెంట్రుకలేంటి ?"
అని భార్యను అడిగాడు.
" ఏం చేయమంటారు మరి...హెయిరాయిల్ అయిపోయిందని వారం నుండి చెబుతున్నా
మీరు పట్టించుకుంటేనా.." రాగం తీసింది భార్య
*********
భార్యాభర్తలిద్దరు ఓ సాయంత్రం సరదాగా నడుచుకుంటూ వెళ్తున్నారు.
గాడిద ఎదురొచ్చింది.
భర్తని ఆట పట్టించాలనుకున్నభార్య "ఏమండీ మీ బంధువొస్తోంది...పలకరించండి" అంది
నవ్వుతూ.
వెంటనే భర్త "నమస్తే అత్త గారు....బాగున్నారా? నేను మీ అమ్మాయి ఈవెనింగ్ వాక్ కి
వచ్చామండి " అని పలకరించాడు ముసి ముసిగా నవ్వుతూ.
**********
" మంచి నాణ్యమైన అద్దం కొనుక్కునిరాండి. అందులో నా మొహం వెలిగిపోయేలా
కనిపించాలి " అని చెప్పి భర్తను బజారుకు పంపించింది భార్య.
భర్త బజారు మొత్తం తిరిగి ఉత్తచేతుల్తో ఇంటికొచ్చాడు.
" ఏమేవ్...ఏ షాపులో వెతికినా నా మొహమున్న అద్దం తప్పించి నీ మొహమున్న అద్దం
కనిపించలేదు" అని చెప్పాడు.
***********
భర్త ముఖం మటమటలాడించుకుంటూ భోం చేస్తున్నాడు.. భార్య మెల్లగా దగ్గరికొచ్చింది..
" మీరంత కష్టంగా తినాల్సిన పనిలేదులెండి. సంతోషంగానే తినొచ్చు.. ఎందుకంటే
ఇవాళ వంట చేసింది నేనుకాదు.. మీ అమ్మగారే.. " అని చురకంటించి చక్కాపోయింది.
|
|