Only For Gents

మగవాళ్ళకు మాత్రమే

ఒక సాప్ట్ వేర్ కంపెనీలో అందరూ మగాళ్ళను, అందునా పెళ్ళైన వాళ్ళనే రిక్రూట్

చేసుకుంటున్నారు.

పైగా ఆడవాళ్ళు అర్హులు కాదంటూ నోటిఫికేషన్‍లో స్పెషల్ గా పెద్ద పెద్ద అక్షరాలతో

రాశారు.

అది చూసి మండిపడ్డ మహిళా సంఘాలు ధర్నా చేశాయి.

ఆ కంపనీని మూసివేయాలని, యాజమాన్యం నశించాలని, ఆడవాళ్ళని చిన్నచూపు

చూడకూడదని, నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్లి ఆ కంపెనీ చుట్టుముట్టారు.

అసలు విషయం కనుక్కుంటే ఆ కంపెనీ యజమాని ఒక మహిళ.

ఈ విషయం తెలిసిన మహిళా సంఘాల నేతలకు మరింత కోపం కలిగింది. ఆ మహిళను

కోపంగా ప్రశ్నించారు "ఒక మహిళ అయ్యుండీ ఏమిటా నోటిఫికేషన్?" అని.

" అబ్బే... మాకు ఎలాంటి విపక్షా లేదండి. ఇది ఇప్పుడిప్పుడే పైకొస్తున్న కంపెనీ. చెబితే

వినేవాళ్ళు, ఆదేశాల్ని తక్షణం పాటించేవాళ్ళు, కోపంతో ఏమైన అంటే ఎదురుతిరగని

వాళ్ళు కావాలి మాకు. అన్నిటికంటే ముఖ్యంగా ఆఫీస్ అవర్స్ అయిపోగానే తక్షణం

ఇంటికి వెళ్ళాలనిపించకూడదు." అంటూ అసలు విషయం చెప్పింది ఆ మహిళ.

అక్కడికి చేరుకున్న మహిళలు అవాక్కయ్యారు.