Ninnu Pellichesukuntaanani

Ninnu Pellichesukuntaanani

" నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేయి డియర్ " అని తను ప్రేమిస్తున్న కిశోర్ ను

అడిగింది కమల.

" మా నాయనమ్మ సాక్షిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేస్తున్నాను కమల "

అని ప్రేమగా  కమల చేతిలో చేయి వేసి చెప్పాడు కిశోర్.

" అదేంటి..ఎవరైనా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేస్తారుగాని నువ్వు నాయనమ్మ మీద

ప్రమాణం చేస్తున్నావు " అని కొంచం ఆశ్చర్యంగా అడిగింది కమల.

" వాళ్ళింకా బతికే ఉన్నారుగా " అని గబుక్కున నాలిక్కరుచుకున్నాడు కిశోర్. " ఆ..." అని

ఆశ్చర్యంగా నోరు తెరిచింది కమల.