Family Jokes in Telugu

Family Jokes in Telugu

" మీ ఆవిడా, మీ అమ్మా ఎప్పుడూ పోట్లాడుకుంటూనే వుంటారు కదా. అప్పుడు నువ్వు

ఎవరి పక్కన నిలబడతావు " అని సందీప్ ను అడిగాడు కిషోర్.

" ఇద్దరి పక్కన కాకుండా గోడపక్కన నిలబడతాను " అని చెప్పాడు సందీప్.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు కిశోర్.

****************

" ఓరేయ్ రవి....నువ్వు బాగా చదువుతున్నావట్రా " అని కొడుకును అడిగాడు తండ్రి.

" బాగానే చదువుతున్నాను నాన్న. నాకు అన్నీ సబ్జెక్టుల్లో ఫస్ట్ మార్కులే " అని

సంబరంగా చెప్పాడు కొడుకు.

" గుడ్...అలా చదవాలి.ఇంతకీ ఏఏ సబ్జెక్టుల్లో ఎలా వచ్చాయి మార్కులు " అని ఆ తండ్రి

సంతోషంగా  అడిగాడు.

" ఇంగ్లీషులో ఒకటి, తెలుగులో ఒకటి, సోషల్ లో ఒకటి, హిందీలో ఒకటి,

ఇలా అన్నిట్లోనూ ఫస్ట్ మార్కులే నాన్న " అని అమాయకంగా చెప్పాడు కొడుకు.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు ఆ తండ్రి.

*************

" పెళ్ళికాకముందు అమ్మాయి బాగా పొదుపు చేస్తుందని చెబితే మంచిదే కదా

అని పెళ్లి చేసుకున్నాను " అని తన ఫ్రెండ్ సుబ్బారావు దగ్గర దిగులుగా

చెప్పుకున్నాడు గుర్నాధం.

" మరి ఇప్పుడు ఏమైందిరా ?" అని అడిగాడు సుబ్బారావు.

" గడ్డాన్ని కత్తిపీటతో గీసుకోమంటుందిరా " అని బోరుమన్నాడు గుర్నాధం.

" ఆ..." అని ఆశ్చర్యంగా నోరు తెరిచాడు సుబ్బారావు.

*****************

" భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడినప్పుడు ఎవరో ఒకరు సర్దుకుపోవాలి....అని

మా ఆయనతో అప్పుడెప్పుడో అన్నాను నేను " అని కన్నీళ్లు పెట్టుకుంది

గీత దగ్గర శ్రీదేవి.

" ఇప్పుడేమైంది " అని అడిగింది గీత.

" ఈరోజు నాతో గొడవపడి ఆయన బట్టలు సూటుకేసులో సర్దుకుని ఎటో

వెళ్ళిపోయారు " అని భోరున ఏడిచింది శ్రీదేవి.

" ఆ...." అని ఆశ్చర్యంగా నోరు తెరిచింది గీత.

******************

ఒక తాగుబోతు భర్త పూర్తిగా తాగి యింటికి వచ్చాడు. వాడి భార్య అతడిని

సంతోషపెడదామని పూరీలు, బూరెలు, గారెలు చేసింది. భర్త రాగానే ఆ విషయమే

చెప్పింది.

" వచ్చారా....నేను మీ కోసమే ఎదురుచూస్తున్నాను ?" అని తను చేసిన వాటి గురించి

చెప్పాలనే సంతోషంతో అన్నది భార్య.

" రాకుండా పోతాననుకున్నావా " అని తూలుతూ అన్నాడు ఆ భర్త.

" మీ కోసం పూరీలు, బూరెలు, గారెలు చేశానండీ " అని సంబరంగా చెప్పింది భార్య.

" అవునా....పూరీలు ఎందుకు చేశావు ?" అని అడిగాడు భర్త.

" తినడానికి " అని మరింత సంబరంగా చెప్పింది భార్య.

" మరి బూరెలు ఎందుకు చేశావు ?" అని అడిగాడు భర్త.

" అవి కూడా తినడానికే " అని చెప్పింది భార్య.

" పూరీలు, బూరెలు తినడానికి చేశావు బాగానే వుంది. మరి గారెలు ఎందుకు

చేశావు " అని అడిగాడు భర్త.

" అవి కూడా తినడానికేనండి " అని చెప్పింది భార్య.

" అన్ని తినడానికి చేస్తే...మరి నాకోసం అంటావేంటి " అని అక్కడి వెళ్ళిపోయాడు భర్త.

ఏమి చేయాలో అర్థంకాక జుట్టు పీక్కుంది ఆ భార్య.