Brahmanandam Natinchina Cinema Joke

Brahmanandam Natinchina Cinema Joke

బ్రహ్మానందం నటించిన సినిమా జోక్

రంగనాథం, గురునాథం ప్రాణా స్నేహితులు. ఒకరంటే ఒకటికి అమితమైన గౌరవం,

అభిమానం, ఇష్టం. ఒకరి మీద ఒకరు ఎప్పటికప్పుడు కుళ్ళు జోకులు వేసుకుంటూ

కడుపు పగిలిపోయేలా నవ్వుకుంటారు.

" ఈ రోజు వాడి కంటే ముందుగా నేనే వాడి మీద ఒక కుళ్ళిపోయిన జోకోకటి వేస్తాను "

అని తనలో అనుకుంటూ ఇంటి నుండి బయలుదేరాడు రంగనాథం.

" నిన్నవాడు నా మీద ఒక కుళ్ళిపోయిన జోక్ వేశాడు. ఈ రోజు నేను ఎలాగైనా వాడి

మీద ఒక కుళ్ళిపోయిన జోకోకటి వేయాల్సిందే " అని అనుకుంటూ ఇంటి నుండి

బయలుదేరాడు గురునాథం.

ప్రతిరోజులాగా ఆ రోజు కూడా ఇద్దరూ బస్టాప్ లో కలుసుకున్నారు. ఒకరికి ఒకరు

పలకరించుకున్నారు.

" ఏరా గురు..రాత్రి బ్రహ్మానందం నటించిన సినిమా చూసొచ్చావా ఏంటి ?" అని

పలకరింపు కాగానే అడిగాడు రంగనాథం.

" అరె ఎలా కనిపెట్టావురా ?" అని రవ్వంత ఆశ్చర్యంగా అడిగాడు గురునాథం.

" నీ కడుపు అంతలా ఉబ్బిపోయి వుంటేను..." అని చెప్పి పకపక నవ్వాడు రంగనాథం.

అయోమయంగా చూస్తూ వుండిపోయాడు గురునాథం.