Home » Ladies Special » రాజరాజేశ్వరిదేవి షోడశోపచార పూజవిధి

రాజరాజేశ్వరిదేవి షోడశోపచార పూజవిధి

 

Information about dussehra special goddess Rajarajewari Devi shodashopachara puja vidhanam shodashopachara puja

 

ఆచమనం
ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,
మధుసూదనాయ నమః ,త్రివిక్రమాయ నమః,
వామనాయ నమః, శ్రీధరాయ నమః,
ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,
దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,
వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,
అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,
అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,
అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,
ఉపేంద్రాయ నమః, హరయే నమః,
శ్రీ కృష్ణాయ నమః

సంకల్పం
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,సర్వదేవతా స్వరూపిణీ శ్రీ దుర్గాంబికా ప్రీత్యర్ధం యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
శ్రీ దుర్గాదేవిపూజాం కరిష్యే శ్రీ సువర్ణ కవచ లక్ష్మి దుర్గాదేవ్యై నమః

ధ్యానం:
శ్లో || చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః
శ్రీ దుర్గాదేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి
(పుష్పము వేయవలెను).

ఆవాహనం:
ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజితస్రజాం
చంద్రాం హిరణ్మయీం జాతవేదో మ మావహ
శ్లో || శ్రీ వాగ్దేవిం మహాకాళిం మహాలక్ష్మీం సరస్వతీం
త్రిశక్తిరూపిణీ మంబాం దుర్గాంచండీం నమామ్యహమ్
శ్రీ దుర్గాదేవ్యైనమః ఆవాహయామి
(పుష్పము వేయవలెను).

ఆసనం:
తాం ఆవహజాతదో లక్ష్మీమనపగామినీమ్ యస్యాం హిరణ్యం
విందేయంగామశ్వం పురుషానహమ్
శ్లో || సూర్యాయుత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే
రత్న సింహాసనమిధం దేవీ స్థిరతాం సురపూజితే
శ్రీ దుర్గాదేవ్యైనమః ఆసనం సమర్పయామి
(అక్షతలు వేయవలెను.)

 

Information about dussehra special goddess Rajarajewari Devi shodashopachara puja vidhanam shodashopachara puja

 



పాద్యం:
అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రభోధినీం
శ్రియం దేవీముపహ్వమే శ్రీర్మాదేవిజుషతాం
శ్లో || సువాసితం జలంరమ్యం సర్వతీర్థ సముద్భవం
పాద్యం గృహణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే
శ్రీ దుర్గాదేవ్యైనమః పాదయోః పాద్యం సమర్పయామి
(నీరు చల్లవలెను.)

అర్ఘ్యం:
కాంసోస్మి తాం హిరణ్య ప్రాకార మార్ద్రాంజ్వలంతిం తృప్తాం తర్పయంతీం
పద్మేస్ఠఃఇతాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం
శ్లో || శుద్దోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం
అర్ఘ్యం దాశ్యామి తే దేవి గృహణ సురపూజితే
శ్రీ దుర్గాదేవ్యైనమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి
(నీరు చల్లవలెను.)

ఆచమనం:
చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతిం శ్రియంలోకేదేవజుష్టా ముదారం
తాం పద్మినీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీ ర్మేనశ్యతాం త్వాం వృణే.
శ్లో || సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతాం
మధుపర్కం గృహాణత్వాం దుర్గాదేవి నమోస్తుతే
శ్రీదుర్గాదేవ్యైనమః ఆచమనీయం సమర్పయామి
(నీరు చల్లవలెను.)

మధుపర్కం:
(పెరుగు,తేనె,నేయి,నీరు,పంచదార వీనిని మధుపర్కం అంటారు.)
శ్లో || మధ్వాజ్యదధిసంయుక్తం శర్కరాజలసంయుతం
మఢఃఉపర్కం గృహాణత్వం దుర్గాదేవి నమోస్తుతే
శ్రీ దుర్గాదేవ్యైనమః మధుపర్కం సమర్పయామి
(పంచామృత స్నానానికి ముందుగా దీనిని దేవికి నివేదన చేయాలి.పంచామృతాలతో సగం అభిషేకించి మిగిలిన దనిని దేవికి నైవేద్యంలో నివేదన చేసి స్నానజలంతో కలిపి ప్రసాద తీర్ధంగా తీసుకోవాలి.)

పంచామృతస్నానం:
శ్లో || ఓం ఆప్యాయస్య సమేతు తే విశ్వతస్సోమ
వృష్టియంభవావాజస్య సంగథే
శ్రీ దుర్గాదేవ్యైనమః క్షీరేణ స్నపయామి.
(దేవికి పాలతో స్నానము చేయాలి)

శ్లో || ఓం దధిక్రావుణ్ణో అకారిషం జిష్ణరశ్వస్య వాజినః
సురభినో ముఖాకరత్ప్రన ఆయూగం షి తారిషత్
శ్రీ దుర్గాదేవ్యైనమః దధ్నా స్నపయామి.
(దేవికి పెరుగుతో స్నానము చేయాలి)

శ్లో || ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవోవస్సవితోత్పునా
తచ్చి ద్రేణ పవిత్రేణ వసోస్సూర్యస్య రశ్శిభిః
శ్రీ దుర్గాదేవ్యైనమః అజ్యేన స్నపయామి.
(దేవికి నెయ్యితో స్నానము చేయాలి)

శ్లో ||  ఓం మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః
మాధ్వీర్నస్సంత్వోషధీః,మధునక్తముతోషసి మధుమత్పార్థివగంరజః
మధుద్యౌరస్తునః పితా,మధుమాన్నొ వనస్పతిర్మధుమాగుం
అస్తుసూర్యః మాధ్వీర్గావో భ్వంతునః
శ్రీ దుర్గాదేవ్యైనమః మధునా స్నపయామి.
(దేవికి తేనెతో స్నానము చేయాలి)

శ్లో || ఓం స్వాదుః పవస్వ దివ్యాజన్మనే స్వాదురింద్రాయ సుహవీతునమ్నే,
స్వాదుర్మిత్రాయ వరుణాయవాయవే బృహస్పతయే మధుమాగం అదాభ్యః
శ్రీ దుర్గాదేవ్యైనమః శర్కరేణ స్నపయామి.
(దేవికి పంచదారతో స్నానము చేయాలి)

ఫలోదకస్నానం:

 

Information about dussehra special goddess Rajarajewari Devi shodashopachara puja vidhanam shodashopachara puja

 


శ్లో || యాః ఫలినీర్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః
బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగం హసః
శ్రీ దుర్గాదేవ్యైనమః ఫలోదకేనస్నపయామి.
(దేవికి కొబ్బరి నీళ్ళుతో స్నానము చేయాలి)

శ్రీదుర్గాదేవ్యైనమః పంచామృత స్నానాంతరం శుద్దోదక స్నానం సమర్పయామి.
స్నానం:
ఆదిత్యవర్ణే తపోసోధి జాతో వనస్పతి స్తవవృక్షో థబిల్వః
తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ
శ్లో || గంగాజలం మయానీతం మహాదేవ శిరస్ఠఃఇతం
శుద్దోదక మిదం స్నానం గృహణ సురపూజితే
శ్రీ దుర్గాదేవ్యైనమః స్నానం సమర్పయామి
(దేవికి నీళ్ళుతో స్నానము చేయాలి/ నీరు చల్లాలి)

వస్త్రం:
ఉపై తుమాం దేవ సఖః కీర్తిశ్చ మణినాసహ
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రేస్మికీర్తిమృద్ధిం దదాతుమే.
శ్లో || సురార్చితాంఘ్రి యుగళే దుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహణ సురపూజితే
శ్రీ దుర్గాదేవ్యైనమః వస్త్రయుగ్మం సమర్పయామి.

ఉపవీతం:
క్షుత్పిపాసా మలాంజ్యేష్టాం అలక్ష్మీర్నాశయా మ్యహం
అభూతి మసమృద్ధించ సర్వా న్నిర్ణుదమే గృహతే
శ్లో || తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ వీభూషితం
ఉపవీతం ఇదం దేవి గృహణత్వం శుభప్రదే
శ్రీ దుర్గాదేవ్యైనమః ఉపవీతం (యజ్ఞోపవీతం) సమర్పయామి.

గంధం:
గంధం ద్వారాందురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం
ఈశ్వరీగం సర్వభూతానాం త్వామిహోపహ్వయే శ్రియం.
శ్లో || శ్రీఖంఠం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం
విలేపనం సురశ్రేష్ఠే చందనం ప్రతిగృహ్యతాం
శ్రీ దుర్గాదేవ్యైనమః గంధం సమర్పయామి
(గంధం చల్లవలెను.)

ఆభరణములు:
శ్లో || కేయూర కంకణ్యైః దివ్యైః హారనూపుర మేఖలా
విభూష్ణాన్యమూల్యాని గృహాణ సురపూజితే
శ్రీ దుర్గాదేవ్యైనమః ఆభరణార్ధం అక్షతాన్ సమర్పయామి.
పుష్పసమర్పణం (పూలమాలలు):

మనసఃకామ మాకూతిం వాచస్పత్యమశీమహి
పశూనాగం రూపామన్నస్య య శ్శ్రీ శ్రయతాం యశః.
శ్లో || మల్లికాజాజి కుసుమైశ్చ చంపకా వకుళైస్థథా
శతపత్రైశ్చ కల్హారైః పూజయామి హరప్రియే
శ్రీ దుర్గాదేవ్యైనమః పుష్పాంజలిం సమర్పయామి.

పసుపు:
అహిరివభోగైః పర్యేతి బాహుం జ్యాయాహేతిం పరిబాధ్మానః
హస్తఘ్నో విశ్వావయునాని విద్వాన్ పుమాన్ పుమాగంసం పరిపాతు విశ్వతః ||
హరిద్రా చూర్ణమేతద్ది స్వర్ణకాంతి విరాజితం
దీయతే చ మహాదేవి కృపయా పరిగృహ్యతామ్ ||
ఓం శ్రీ మహాకాళీ.......దుర్గాంబికాయై నమః హరిచంద్రాచూర్ణం సమర్పయామి.


కుంకుమ:
యాగం కుర్యాసినీవాలీ యా రాకా యా సరస్వతీ
ఇంద్రాణీ మహ్య ఊత మేవరూణానీం స్వస్తయే ||
ఓం శ్రీ మహాకాళీ......దుర్గాంబికాయైనమః కుంకుమ కజ్జలాది సుగంద ద్రవ్యాణి సమర్పయామి.

అథాంగపూజా:

 

Information about dussehra special goddess Rajarajewari Devi shodashopachara puja vidhanam shodashopachara puja

 


దుర్గాయైనమః - పాదౌ పూజయామి
కాత్యాయన్యైనమః - గుల్ఫౌ పూజయామి
మంగళాయైనమః - జానునీ పూజయామి
కాంతాయై నమః - ఊరూ పూజయామి
భద్రకాళ్యై నమః - కటిం పూజయామి
కపాలిణ్యై నమః - నాభిం పూజయామి
శివాయై నమః - హృదయం పూజయామి
జ్ఞానాయై నమః - ఉదరం పూజయామి
వైరాగ్యై నమః - స్తనౌ పూజయామి
వైకుంఠ వాసిన్యై నమః - వక్షస్థలం పూజయామి
దాత్ర్యై నమః - హస్తౌ పూజయామి
స్వాహాయై నమః - కంఠం పూజయామి
స్వధాయై నమః - ముఖం పూజయామి
నారాయణ్యై నమః - నాశికాం పూజయామి
మహేశ్యై నమః - నేత్రం పూజయామి
సింహవాహనాయై నమః - లలాటం పూజయామి
రుద్రాణ్యై నమః - శ్రోత్యే పూజయామి
శ్రీ దుర్గాదేవ్య నమః - సర్వాణ్యంగాని పూజయామి
తదుపరి ఇక్కడ ఏ రోజు ఏ దేవిని పూజిస్తారో ఆరోజు ఆ దేవి అష్టోత్తరము చదువవలెను.
తదుపరి ఈ క్రింది విధము గా చేయవలెను


ధూపం:
కర్దమేన ప్రజా భూతా సంభవ కర్దమ శ్రియం వాసయమేకులే మాతరం పద్మమాలినీమ్
శ్లో || వనస్పత్యుద్భవైర్ధివ్యై ర్నానాగందైః సుసంయుతః
ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం
శ్రీ దుర్గాదేవ్యైనమః ధూపమాఘ్రాపయామి.

దీపం:
అపసృజంతు స్నిగ్ధాని చిక్లీతవసమే గృహనిచ
దేవీం మాత్రం శ్రియం వాసయమేకులే.
శ్లో || సాజ్యమేకార్తిసంయుక్తంవహ్నినాయోజితంప్రియం
గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహం
భక్తాదీపం ప్రయచ్చామి దేవ్యైచ పరమాత్మనే
త్రాహిమాం నరకాద్ఘోరా ద్దివ్య జ్యోతిర్నమోస్తుతే
శ్రీ దుర్గాదేవ్యైనమః దీపం దర్శయామి

నైవేద్యం:

 

Information about dussehra special goddess Rajarajewari Devi shodashopachara puja vidhanam shodashopachara puja

 


ఆర్ద్రాంపుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలీనీమ్
చంద్రాం హిరన్మయీం లక్ష్మీం జాతవేదోమమా అవహ.
శ్లో || అన్నం చతురిధం స్వాదు రసైః సర్పిః సమనిత్వం
నైవేద్యం గృహ్యతాం దేవి భక్తిర్మే హ్యచలాంకురు
(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)

ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా,
ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా
ఓం సమనాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.
అమృతాభిధానమపి - ఉత్తరాపోశనం సమర్పయామి
హస్తౌ పక్షాళయామి - పాదౌ ప్రక్షాళయామి - శుద్దాచమనీయం సమర్పయామి.

తాంబూలం:
ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమ మాలినీం
సూర్యాం హిరన్మయీం లక్ష్మీం జాతవేదోమమా అవహ.
శ్లో || పూగీఫలైశ్చ కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతం
కర్పూరచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్
శ్రీ దుర్గాదేవ్యైనమః తాంబూలం సమర్పయామి

నీరాజనం:
తాం మ అవహజాతవేదో లక్ష్మీమనపగామినీం య స్యాంహిరణ్యం
ప్రభూతంగావోదాస్యోశ్యాన్ విధేయం పురుషానహమ్
శ్లో || నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవీ గృహేణ సురపూజితే
సంతత శ్రీరస్తు,సమస్తమంగళాని భవంతు,నిత్యశ్రీరస్తు,నిత్యమంగళాని భవంతు.
శ్రీ దుర్గాదేవ్యైనమః కర్పూర నీరాజనం సమర్పయామి
(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)

మంత్రపుష్పమ్:

 

Information about dussehra special goddess Rajarajewari Devi shodashopachara puja vidhanam shodashopachara puja

 


జాతవేదసే సుననామ సోమమరాతీయతో నిదహాతి వేదః |
సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః ||
తామగ్ని వర్ణాం తపసాజ్వలంతీం వైరో చనీం కర్మ ఫలేషు జుష్టామ్
దుర్గాం దేవీగం శరణమహం పపద్యే సుతరసి తరసే నమః
అగ్నే త్వం పారయా నవ్యో అస్మాన్ స్వస్తిభి రతి దుర్గాణి విశ్వా
పూశ్చ పృథ్వీ బహులాన ఉర్వీ భవాతోకాయ తనయాయ శంయోః
విశ్వాని నోదుర్గహా జాతవేద స్సింధుం ననావా దురితాతి పర్షి
అగ్నే అత్రివన్మనసా గృహణానో స్మాకం బోధ్యవితా తనూనామ్
పృతనాజితగం సహమాన ముగ్ర మగ్నిగం హువేమ పరమాత్సధస్దాత్
సనః పర్షదతి దుర్గాణి విశ్వక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః
ప్రత్నోషికమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతా నవ్యశ్చ సత్సి
స్వాంచాగ్నే తనువం పిప్రయస్వాస్మభ్యంచ సౌభగ మాయజస్వ
గోభి ర్జుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణొ రనుసంచరేమ
నాకస్య పృష్ఠ మభిసంవసానో వైష్ణవీం లోక ఇహ మదయంతామ్
కాత్యాయనాయ విద్మహే కన్య కుమారి దీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||
ఓం తద్భ్రహ్మా | ఓం తద్వాయుః | ఓం తదాత్మా | ఓం తత్సత్యం | ఓం తత్సర్వం |
ఓం తత్సురోర్నమః | అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు | త్వయజ్ఞస్త్వం |
వషట్కారస్త్వం మింద్రస్త్వగం | రుద్రస్త్వం | విష్ణుస్త్వం | బ్రహ్మత్వం |
ప్రజాపతిః | త్వంతదాప అపోజ్యోతి రసోమృతం బ్రహ | భూర్భువస్సువరోం
ఓం శ్రీ మహాకాళీ....దుర్గాంబికాయై నమః సువర్ణమంత్ర పుష్పం సమర్పయామి.

సాష్టాంగ నమస్కారం:
ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పధ్బ్యాం కరభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే
శ్రీ దుర్గాదేవ్యైనమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి

ప్రదక్షిణ
(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)
శ్లో || యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే
పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ
త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల
అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ
తస్మాత్ కారుణ్య భావేన రక్ష మహేశ్వరి
శ్రీ దుర్గాదేవ్యైనమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

ప్రార్ధనం:
శ్లో ||  సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి స్వరూపిణి
పూజాం గృహాణ కౌమురి జగన్మాతర్నమోస్తుతే
శ్రీ దుర్గాదేవ్యైనమః ప్రార్దనాం సమర్పయామి

సర్వోపచారాలు:
చత్రమాచ్చాదయామి,చామరేణవీచయామి,నృత్యందర్శయామి,
గీతంశ్రాపయామి,ఆందోళికంనారోహయామి
సమస్తరాజోపచార పూజాం సమర్పయామి.
శ్రీ దుర్గాదేవ్యైనమః సర్వోపచారాన్ సమర్పయామి

క్షమా ప్రార్థన:
(అక్షతలు నీటితో పళ్ళెంలో విడువవలెను)
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశవ్రి
యాత్పూజితం మాయాదేవీ పరిపూర్ణం తదస్తుతే
అనయా ధ్యానవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్ సర్వాత్మిక
శ్రీ దుర్గాదేవ్యైనమః సుప్రీతా స్సుప్రసన్నో వరదో భవతు సమస్త సన్మంగళాని భవంతుః
శ్రీ దేవి పూజావిధానం సంపూర్ణం

(క్రింది శ్లోకమును చదువుచు అమ్మవారి తీర్థమును తీసుకొనవలెను.)
అకాల మృత్యుహరణమ్ సర్వవ్యాది నివారణం
సర్వపాపక్షయకరం శ్రీదేవి పాదోదకం శుభమ్ ||

 

(దేవి షోడశోపచార పూజ సమాప్తం.)


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.