Home » Baby Care » గిల్లికజ్జాలతో కాస్తంత జాగ్రత్త

 

గిల్లికజ్జాలతో కాస్తంత జాగ్రత్త

 

చిన్నతనంలో ఇంట్లో  పిల్లలు ఒకరిని ఇంకొకరు ఏడిపించుకోవటం మాములే. కాని అలంటి గిల్లికజ్జాలను మనం చూసిచూడనట్టు  ఊరుకోవటం కూడా అంట మంచిది కాదంటున్నారు మానసిక శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఇలాంటివి పిల్లల మనసు మీద మాత్రమే కాదు, వారి చదువు, నిద్ర, ఆహారం మీద కూడా ఎంతో ప్రభావాన్ని చుపిస్తాయట.

ఇంట్లో ఉండే తోడపుట్టినవారు ఒకరు ఇంకొకరిని అదే పనిగా ఆటపట్టిస్తూ,ప్రతి నిమిషం ఏడిపిస్తూ ఉండటం కనిపిస్తే దానిని ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకుని వారిని గమనించాలట. ఎందుకంటే ఏడిపించే పిల్లల బిహేవియర్ లో ఎలాంటి మార్పు లేకపోయినా వాళ్ళు ఎవరినైతే ఏడిపిస్తున్నారో వారిలో మాత్రం ఎన్నో మార్పులు కనిపిస్తాయట.

మన దేశంలో నూటికి 35 శాతం మంది పిల్లలు ఇలాంటి సమస్యతో బాధపడుతున్నారట. పేరెంట్స్ ఇద్దరు ఉద్యోగస్తులు అయిన ఇళ్ళల్లో ఇలాంటి సమస్య ఎక్కువగా తలెత్తుతుందిట.

దీనిని గుర్తించటం ఎలా?

ఇదో పెద్ద సమస్యా  అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ సమస్యతో బాధపడే పిల్లలు వచ్చి పేరెంట్స్ తో వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు చూడు అని చెపితే అది అందరి ఇళ్ళల్లో ఉండే గోలగానే మనం చూస్తాం.కాని అదే వాళ్ళకి చెప్పుకోలేని ప్రొబ్లమ్. ఇటువంటి సమస్యని ఎదుర్కొనే పిల్లలు సరిగా భోజనం చెయ్యరు,చదువుపై సరిగా దృష్టి పెట్టలేకపోతారు,అందరిలో తొందరగా కలవరు. ఏవిషయానికి వెంటనే స్పందించరు. మొహంలో  ఎక్స్ప్రెషన్ చూపించరు. ఏదో కోల్పోయిన వాళ్ళలా దిగాలుగా కూర్చుంటారు.  

 

అంతేకాదు ఇంట్లో ఉండే పిల్లలు ఒకరిని ఇంకొకరు కావాలని ఎవోయిడ్ చేస్తూ ఉంటారు. ఇలా ఉండే వీరు వాళ్ళ అక్కగాని అన్నయ్యగాని ఊరు వెళ్లి పేరెంట్స్ దగ్గర ఒక్కరు ఉంటే ఏంటో హుషారుగా ఉంటారు. చెప్పలేని హాపినేస్స్ వారి ముఖంలో కనిపిస్తుంది.

దీనికి పరిష్కారం ఎలా?

ఇలాంటి సమస్య ఎదురైనప్ప్పుడు ముందుగా దీనిని గుర్తించటం అవసరం. ఇంట్లో సాధారణంగా పేరెంట్స్ పెద్ద పిల్లలకు వాళ్ళ కన్నా చిన్నవాళ్ళని చూసుకునే భాద్యతని అప్పగిస్తూ ఉంటారు. దానితో పెద్దవారు దీనినే ఆసరాగా తీసుకుని తమ అజమాయిషీ చెలాయించే ప్రయత్నాలు మొదలుపెడతారు. ఎక్కడ కూర్చోవాలో,ఎవరితో ఆడాలో, ఎవరితో మాట్లాడాలో అన్ని విషయాల్లో తమ పెద్దరికాన్ని చూపిస్తూ ఉంటారు. ఇలా మొదలైన సమస్యని చిన్నగా ఉన్నప్పుడే తల్లితండ్రులు గుర్తించి వాళ్ళ ఇద్దరి మధ్య సానుకూల వాతావరణాన్ని పెంపొందించేలా చేయాలి. తిరిగి వాళ్ళు మామూలు స్థితికి వచ్చే దాకా ఒంటరిగా ఇద్దరినీ వదలకూడదు. వీలయితే సమస్య సర్దుకునేదాకా ఇద్దరినీ కాస్త దూరంగా ఉంచాలి. అల దూరంగా ఉంచిన సమయంలో ఇద్దరి మద్య ఆప్యాయత నెలకోనేలాగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి.

 

ఎంతో చిన్నవిగా కనిపించే సమస్యలని సరైన సమయంలో పట్టించుకుని సరైన పరిష్కారాలు వెతకకపోతే అవే పెద్దవిగా మారి పిల్లల మానసిక,శారీరిక ఆరోగ్యంపై తమ ప్రభావాన్ని చూపిస్తాయి.

...   కళ్యాణి


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.