Home » Fashion » ఎపిసోడ్ -72


    "ఏయ్: ఇదేమిటి?" అన్నాడు ఉత్తిత్తి కోపంతో.

 

    "మీరు చెప్పినట్లు నేను బట్టలు విప్పేస్తున్నాను. నేను చెప్పినట్లు మీరు కళ్ళకి గంతలు కట్టుకోవాలి."

 

    "ఇంక లాభమేముంది? యిది అన్యాయం:" అన్నాడు భోజా ఆక్రోశంగా.

 

    నవ్వింది వినీల.

 

    "మీకు ఉత్త తొందర: చెప్పేది వినిపించుకోరేం? ఇప్పుడు మనిద్దరం దాగుడుమూతల్లాంటి ఆట ఆడుతామన్నమాట: మీరు కళ్ళకు గంతలుకట్టుకుని నన్ను తాకాలి:"

 

    "ఎక్కడయినా తాకొచ్చా?" అన్నాడు భోజా ఆశగా.

 

    "ఆహాఁ: తాకగలిగితే:" అంది వినీల కవ్వింపుగా. "గంతలుగనక విప్పేశారా నేను చావనన్నా ఛస్తానుగానీ ఇంక జన్మలో మీకు మాత్రం లొంగను: అది మాత్రం బాగా గుర్తుంచుకోండి:"

 

    "నేను అంతటి మూర్ఖుణ్ణా ఏమిటి?" అని నవ్వాడు భోజా. "నేను రెడీ:"

 

    నెమ్మదిగా షర్టువిప్పి అతడిమీద పడేసింది వినీల. దాన్ని అందుకుని, ఆత్రంగా తడిమి చూశాడు భోజా.

 

    తర్వాత బ్రా విసిరేసింది వినీల.

 

    భక్తిగా అందుకున్నాడు.

    తర్వాత ప్యాంట్, దాని లోపల వున్న స్ట్రెచ్ నైలాన్ ప్యాంటీస్ విప్పేసింది.

 

    ఉప్పొంగి పోతున్నాడు భోజా. వినీల తాలూకు అత్యంత గోప్యమైన దుస్తులనికూడా తను తాకగలుగుతున్నందుకు ఆవేశం ముప్పిరిగొంటూ ఉండగా ఆ బట్టలలో తన మొహాన్ని దూర్చేసి ఆమె వళ్ళో తన తల పెట్టినట్లు ఆనందపడుతూ కొంతసేపు మైమరచి ఉండిపోయాడు.  

 

    ఇలాంటి వింత ప్రవృత్తులనే సైకాలజీలో 'సేక్సుయాల్ ఫెటిషెన్' అంటారు.

 

    యిదంతా చూస్తుంటే కడుపులో తిప్పినట్లవుతోంది వికారం కలిగింది వినీలకి. ఈ వ్యవహారాలన్నిటికీ దూరంగా పారిపోదామా అనిపిస్తోంది.

 

    గూఢచారి వృత్తిలో ఉన్న వాళ్ళకి స్త్రీ సహజమైన లజ్జ ఉండడం ఈ వృత్తిలో ఇబ్బంది అవుతుందని చెప్పి, ఆ లజ్జను పోగొట్టటం కూడా తన ట్రైనింగ్ లో ఒక భాగంగా చేసిన ప్రతాప్ గుర్తొచ్చాడు. అతడి బోధలు గుర్తొచ్చాయి దేశభక్తీ. కర్తవ్యం గుర్తు వచ్చాయి మనసుని కంట్రోల్ లోకి తెచ్చుకుంది.

 

    ఒక ఆడపిల్ల పర పురుషుడి ముందు సిగ్గూ లజ్జ వదిలెయ్యడం మామూలు పరిస్థితుల్లో తప్పే కావచ్చు.

 

    కానీ ఇది తను సరదాకోసం చేస్తున్నపని కాదు. దేశం కోసం చేస్తోంది.

 

    తన శరీరంలోని అణువణువుకూ, దేశానికే ధారాదత్తం. తనవంట్లోని కణం కణం దేశం దేశం అని కలవరిస్తూ ఉంటుంది క్షణం క్షణం.

 

    అలా తయారుచేశాడు ప్రతాప్ తనని:

 

    "కమాన్:" అంది వినీల.

 

    గుడ్డెద్దు చేలో పడ్డట్లుగా చేతులు బారజాపి అటూ ఇటూ తిప్పుతూ ఆమెకోసం వెదకడం మొదలెట్టాడు భోజా.

 

    కొద్ది నిమిషాలపాటు అతడికి అందీ అందనట్లు ఆటలు పట్టించింది ఆమె.

 

    ఆ తర్వాత...

 

    అకస్మాత్తుగా అతడి పర్సనల్ రూంలోకి వెళ్ళిపోయింది. కళ్ళనే కెమెరాలుగా మార్చి ఫోటోలు తీస్తున్నట్లు అక్కడ వున్న ఫైళ్ళనీ పుస్తకాలనీ, అన్నీ పరీక్షగా చూసి, జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని విధంగా గుర్తుపెట్టుకుంది.

 

    తర్వాత మరో గదిలోకి వెళ్ళిపోయింది ఆమె.

 

    మరో గదిలోకి...

 

    మరో గదిలోకి...

 

    ఆ అందమైన ఆడపిల్ల వంటిని తాకాలనే అబగా ఉన్న జనరల్ భోజా అదంతా ఆటే అనుకుంటున్నాడుగానీ అది ఆమె వేసిన మాస్టర్ స్ట్రోక్ అనీ, కలలో కూడా పరులకి ప్రవేశం దొరకని తన సీక్రెట్ ఛాంబర్స్ లోకి ఆమె వెళ్ళిపోతోందనీ, తన రహస్యాలన్నీ ఒకదాని తర్వాత ఒకటిగా చూస్తోందనీ కనిపెట్టలేకపోయాడు.

 

    అరగంటలో, తను తెలుసుకోదల్చుకున్నదంతా తెలుసుకుంది ఆమె. తృప్తిగా నవ్వుకుంది. అప్పుడు ఆమె దృష్టి అక్కడ వున్న కేసెట్ల మీద పడింది.

 

    అందులో ఒక కేసెట్ ఇదివరకు భోజా పెట్టుకుని వింటూంటే తనుకూడా కొద్దిగా వినడం తటస్థించింది. వింటుంటేనే జుగుప్సగా అనిపించింది తనకి:

 

    ఆ కేసెట్ లో పాటలు లేవు. మ్యూజిక్ లేదు.

 

    కేవలం రతిపారవశ్యం అనుభవిస్తున్న ఒక అమ్మాయి మూలుగు రొప్పులాంటి శ్వాస - మధ్య మధ్యలో ప్రియుణ్ణి తొందర చేస్తూ పలికిన అసభ్యపదాలు:

 

    అంతే: అలాంటి కలెక్షన్ చాలా వుంది భోజా దగ్గర:

 

    అది టేప్ రికార్డర్ లో పెట్టి ప్లే బటన్ ఆన్ చేసింది వినీల.

 

    అమ్మాయి మూలుగు వినబడడం మొదలెట్టింది.

 

    అప్పటికే బాయిలింగ్ పాయింట్ కి వచ్చేశాడు భోజా.

 

    ఇంక ఆగలేనట్లు. ఒక కాబరే డాన్సర్ నెంబర్ రింగ్ చెయ్యడం మొదలెట్టాడు.

 

    చులకనగా నవ్వుకుని, త్వరత్వరగా బట్టలేసుకుని బయటికి నడిచింది వినీల.

 

                              *    *    *    *


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.