సుగంధ నూనెలతో ఇల్లు పరిమళభరితం     ఇల్లు పరిమళభరితంగా ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఐతే కొన్నిసార్లు వంట చేసిన తరువాత ఏర్పడే ఘాటు వాసనలతో, గాలి, వెలుతురు లేక ఏర్పడే దుర్వాసనలతో ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అటువంటి సమస్యలని రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించుకోవచ్చు.   * అరబకేట్ నీటిలో పావుకప్పు వెనిగర్, పెద్ద చెంచా నిమ్మరసం నూనె కలిపి గదిలో కాస్త చల్లితే.. గదిలోని వంట వాసనలు పోయి హాయి వాతావరణంతో నిండిపోతుంది. * కార్పెట్లు మురికిగా మారి దుర్వాసన వస్తుంటే.... కప్పు బేకింగ్ సోడాకి, చెంచాడు ఏదైనా సుగంధ నూనేలని కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ పై చల్లి తెల్లారి వాక్యుమ్ క్లీనర్ తో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. * కిటికీ అద్దాలు దుమ్ముపట్టి ఉంటే కప్పు వెనిగర్ కి చెంచా లావెండర్ పరిమళన్ని జోడించి తుడిస్తే సరి. అవి తలుక్కుమనడమే కాకుండా సువాసనభరితంగా కూడా ఉంటాయి. * వంట చేసిన తరువాత గది అంతా ఆవరించే ఘాటు వాసనలు తొలగిపోవడానికి ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకొని దానిలో దాల్చిన చెక్కని వేసి మరిగిస్తే గది చక్కని పరిమళాలు వెదజల్లుతుంది. * దుస్తులు ఒక్కచోట పోగుపడి.. ముక్కిపోయిన వాసన వస్తుంటే ఎండలో ఆరవేయ్యాలి. వీలుకానప్పుడు నిమ్మ, లావెండర్ వంటి ఏదైనా పరిమళంలో ఒక జేబు రుమాలుని ముంచి దానిని దుస్తుల మధ్య ఉంచితే సరిపోతుంది.  

'మౌనం' మంచిదే   * "రోజూ ఒక్క అరగంట మౌనంగా ఉంటే చాలు చక్కటి శారీరక మానసిక ఆరోగ్యం మీ సొంతం మవ్వటమే కాదు-మీ ఆశలు ,ఆశయాలు, కలలు, కోరికలు అన్ని నెరవేరుతాయి" అని చెబితే నమ్మగలరా? నమ్మలేం కదూ? కాని ఇది నిజం. అదెలా సాధ్యం? ప్రయత్నిస్తే తెలుస్తుంది ఎలా సాధ్యమో? ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరుకు ఎంత సేపు మనం మాట్లాడతాం? ఎప్పుడైనా లెక్కేశారా? పోనీ ఎంత సేపు మౌనంగా ఉంటాం? ఒక్కళ్ళు ఇంట్లో ఉంటే మౌనంగా ఉంటాం కదా? అప్పుడు ఎవరితో మాట్లాడతాం అంటారా? దానికి నిపుణుల సమాధానం ఏంటో చూద్దాం. * మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ, లేదా ఏ టి.వి లోని కార్యక్రమాన్ని చూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్  బ్రౌజ్ చేస్తూ ఇది కాదు మౌనమంటే. అచ్చంగా మౌనంగా ఉండటం - ఈ పనులు అన్నీ చేస్తున్నపుడు మన నోరు మాట్లాడక పోయినా, మనసు అలోచనలు పరుగులు పెడుతూనే ఉంటాయి. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయ. అదే కళ్ళుమూసుకుని మాటని, మనసుని మౌనంలోకి జార్చామనుకోండి...ఓ పదినిమిషాలు చాలు.. కళ్ళు తెరిచాకా చూస్తే... హాయిగా ఉంటుందిట.   * మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది. రోజంతా ఎవరెవరితోనో మాటలు, వాదనలు, కోపాలు,  అరుపులు... అక్కడితో అయిపోతుందా? అవన్నీమనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వదిలించుకోవటం ఎలా? సింపుల్. కాసేపు మౌనంగా కళ్ళు మూసుకోవటమే దాన్ని ధ్యానమనండి, మెడిటేషన్, ప్రాణామాయం... ఎదైనా కావచ్చు ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు అ తరువాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు, ఇట్టే మాయమవుతుంది. అంతేకాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి. ఎలా అంటారా? * మౌనం మనల్ని అంతర్ముఖులని చేస్తుంది. దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడు సూటిగా, స్పస్టంగా ఉంటాయి. బెరుకు, బెదురు అనవసరమైన కబుర్లు ఏవీ ఉండవు. అవి ఎదుట వ్యక్తులకు మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఆచి తూచి మాట్లాడటం చేతకాని తనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును తెలియచేస్తుంది. చేజారిన కాలం, పెదవి దాటినా పలుకు" వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి. * ఉదయం లేచిన దగ్గుర్నుచి అన్ని రకాల అనుభూతులు, భావపరంపరాలు మనల్ని పట్టి ఆపేస్తుంటాయి. వాటి ప్రభావం మనస్సు పై పడుతుంది. ఒత్తిడి, చికాకు మొదలవుతుంది. అవి మన మాటలపై, చేతలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా మానవ సంబంధాలు కోపతాపాలు, ఆరోపణల మధ్య ఇరుక్కుంటాయి. తిరిగి వాటి ప్రభావం మన మనస్సుపై.. ఇలా ఓ చక్రం తిరిగినట్టు ఒకదాని వలన మరొకటి. ఈ చక్రాన్ని ఆపే అవకాశం మన చేతుల్లోనే వుంది.  అదే" మౌనం". ఆ మౌనం లో ఏ అలోచనలు ఉండకూడదు. ప్రశాంతంగా మనసుతో మమేకమై , ఓ పదినిమిషాలు అయినా ఉండగలిగితే చాలు. ఫలితం ఏమిటన్నది  చెప్పటం ఎందుకు, మీరే తెలుసుకోండి. ఒకసారి అ ప్రశాంతతని రుచి చూసాక దాని గరించి మీరే మరో పదిమందికి చెబుతారు. ఇక ఇప్పటికైతే నేను మౌనంలోకి వెళ్ళిపోతున్నా. -రమ

  ఉద్యోగంలో రాణించాలంటే...     ఉద్యోగం చేసే చోట ఉద్యోగస్తుల్లా మెలగాలి కాని ఆడపిల్లల్లా కాదు అంటున్నారు నిపుణులు. అంటే సున్నితత్వం, లాలిత్వం ఆడవారి నైజం అయినా ఉద్యోగస్తులుగా ఉన్నప్పుడు వాటిని దూరంగా పెట్టడమే మంచిదట. అలాగే మేం ఆడవాళ్ళం అని గుర్తుచేసేలా కొన్ని పనులు అలవాటుగా చేసేస్తుంటారు కొందరు. వాటికి దూరంగా ఉండటం కూడా ఎంతో అవసరం అంటున్నారు నిపుణులు. ఆ అలవాటుల్లో ముందుగా చెప్పుకోవాల్సింది. వంటలని పంచిపెట్టడం. ఏ కొత్త స్వీటో చేసినపుడు, ఏ కొత్త వంటకాన్నో తయారు చేసినపుడు స్నేహితులకి రుచి చూపించటం తప్పు కాకపోయినా, ఆఫీసులోని కొలిగ్స్ కి కూడా ఆ రుచులను పంచాలనుకోవటం కరెక్ట్ కాదట. పూర్తి ప్రొఫెషనల్ రిలేషన్ మెయింటేన్ చేయాలంటే అలా వంటల రుచులు చూపించకపోవటమే మొదటి సూత్రం.   మన శారీరక కదలికలు, నుంచోవటం, నవ్వటం, నడవటం ఇవన్నీ మన ఆత్మవిశ్వాసాన్ని బహిర్గత పరిచేలా వుండాలి. అలా కాక నలుగురు ఉన్నచోట సర్దుకుపోవాలని ఆలోచించినపుడు మన బాడీ లాంగ్వేజ్ కూడా ఆ ఆలోచనలకి తగ్గట్టే ఉంటుంది. ఇది మిమ్మల్ని మీపై అధికారులు అంచనా వేసేటపుడు తప్పుడు సంకేతాలు అందిస్తుంది. సర్దుకుపోవటమనేది మీ ఆప్షన్ గా ఉండలే గాని, ప్రతీ విషయంలో అదే పరిష్కారం కాకుడది గుర్తుంచుకోవాలి అంటున్నారు నిపుణులు.   "లీడర్"కి ఉండాల్సిన మొదటి లక్ష్యం ఇతరులతో సమర్థవంతంగా పనిచేయించగలగటం... అన్నీ తన బాధ్యత అనుకుంటూ ఎన్నో పనులని పైన వేసుకొని ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు. చాలా మంది తాము లేకపోతే ఆర్గనైజేషన్ నడవదన్నట్టు మాట్లాడుతుంటారు మరికొందరు. అయితే తన పని తాను చేస్తూనే, తన కిందివారు కూడా తమ పనులని సమర్థవంతంగా చేసేలా చేయటం నాయకత్వ లక్షణమని గుర్తించి అలా నడుచుకోగలిగితే తప్పకుండా ఓ మంచి లీడర్ అనిపించుకుంటారట ఆడవారు. అలాగే ఆర్డర్ చేయాల్సిన చోట రిక్వెస్టింగ్ గా చెప్పటం కూడా మిమ్మల్ని ఎదుటవారు తక్కువ అంచనా వేసేందుకు కారణమవుతుంది కాబట్టి ఇతరులతో వ్యవహరించేటపుడు స్పష్టమైన వైఖరి అవసరం అంటున్నారు నిపుణులు.   ఇతరులతో మాట్లాడేటపుడు తలవంచుకోవటం, అటు ఇటు చూడటం కాకుండా... ఎదుటి వ్యక్తితో నేరుగా చూస్తూ మాట్లాడటం మంచి పద్ధతట. అలాగే ఆఫీసు వాతావరణంలో నవ్వుల్ని ఆచితూచి వాడలట. సరదా అంటూ అతి చనువుని ప్రదర్శించే వారిని ముందే కట్టడి చేయాలట. ఆఫీసులో వారు మిమ్మల్ని ఏ విధంగా గుర్తించాలని మీరు కోరుకుంటున్నారు అన్నీ విషయాలపై మీకు ముందే అభిప్రాయం ఉండాలి. అప్పుడే మీరు అందుకు తగ్గట్టు ప్రవర్తించటం సులభమవుతుంది అంటున్నారు నిపుణులు.   ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా పురుషులతో కరచాలనం చేయాల్సి వచ్చినపుడు చాలా మంది ఇబ్బంది పడతారు. మొహమాటంగా అందీ అందనట్టు చేయి ముందుకు చాపటం మనలోని ఆత్మవిశ్వాసరాహిత్యాన్ని సూచిస్తుందట. అందుకే కరచాలనం చేయాల్సి వచ్చినపుడు ఆత్మవిశ్వాసంతో నిటారుగా నిలబడి, ఎదుట వ్యక్తిని చూస్తూ చేయి కలపాలి. మన మాటలు కూడా సూటిగా, స్పష్టంగా క్లుప్తంగా ఉండేలా చూసుకోవాలి. అనవసర గాసిప్స్ కి దూరంగా ఉండాలి. ఇవన్నీ మన ఉద్యోగ బాధ్యతల్ని మనం సమర్థవంతంగా నిర్వర్తించటానికి సహాయపడే అంశాలు.   -రమ

  Girl who inspired Priyanka Chopra Priyanka Chopra is now a world renowned actress. Her journey to Bollywood has inspired thousands of women across the world. But do you know that Priyanka was acting in a movie that was based on a girl named Aisha choudhary. Priyanka was so moved when she heard about the life of Aisha that she has immediately signed the biopic called `The sky is pink’. Priyanka would be acting as the mother of Aisha in the movie. Well! what is so special about Aisha. Let’s find out...     Aisha is the daughter of Niren Chaudhary, an employee with great status. He works as president with South Asia operations of YUM brand. Her mother Aditi is a social worker. Aisha has an elder brother too! This might look as a perfect frame for a great home. But here comes the fate to snatch the happiness out of their lives.     Aisha was diagnosed with severe auto immune disease called ` Severe Combined Immuno-Deficiency’ (SCID). It was such a harsh disease where your immunity doesn’t work at all. Even a common cold could kill you in such circumstances. Aisha had to undergo a bone marrow transplantation to combact the disease. That’s not the end of the story. Aisha was just 14 years old when she was found to be suffering with pulmonary fibrosis. This has severely affected her lungs. The capacity of her lungs has fallen to 35%. Aisha had to leave her favourite school and spend her time on bed. Her friends started to avoid her. But while Aisha’s breath is taking her closer and closer to death... her mind got more awakened.     Aisha began to think about her life in positive manner. She started cherisihing every moment of her breath. And she has decided to share her confidence with others. Aisha began to give inspirational talks on renowned stages such as TEDX and INK. Soon her words started to inspire many gloomy lives. ``If death is the ultimate truth, what should really matter most in life? I felt the only thing that really matters to me is being happy. And happiness is a choice one makes. It’s simply an attitude…’’ is a sampler that reveals immense positive attitude burstling in her.     As days passed by the lungs of Aisha grew weaker and weaker. In 2014, she was left with no other option except to stay on her bed. But her mind of course is as vigilant as ever. She began to record her words on recorder. These recordings were turned into a book called `My Little Epiphanies ‘. Aisha felt very happy after looking at the first copy of her book. Unfortunately she died just a few hours after the release of the book. The story of Aisha is undoubtedly one of the most inspiring tale of our times.. which is the reason why Shonali Bose and Farhan Akhtar has written a script for the movie `The Sky is Pink’. Dangal fame Zaira Wasim is expected to play the role of Aisha for the movie.

  20 వేల జీవితాలను మార్చిన తులసి ఆపా!   ఒడిషాలోని మారుమూల గ్రామం. ఆ ఊరే కాదు... దాని చుట్టపక్కల వంద కిలోమీటర్ల వరకూ కటిక దారిద్ర్యం రాజ్యమేలుతూ ఉంటుంది. అక్కడి చిన్నాపెద్దా అందరూ కలిసి పనిచేసినా కూడా కుటుంబం ఆకలి తీరని పరిస్థితి. అలాంటి చోట చదువుకు చోటేది. మార్పుకు అవకాశం ఏది. కానీ చదువు సాధ్యమనీ, ఆ చదువుతోనే మార్పు కూడా వస్తుందని ఒకరు నమ్మారు. తన జీవితాన్ని సైతం పణంగా పెట్టి ఆ మార్పుని సాధించారు. ఆమే తులసీ ముండా! తులసీ ఒడిషాలోని కైంషి అనే చిన్న ఊరిలో 1947లో పుట్టారు. అది మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరమే. కానీ తులసీ పెరుగుతున్న కొద్దీ, దేశానికి వచ్చిన స్వాతంత్ర్యం మన జీవితాల్లోకి ఇంకా ప్రవేశించలేదని అర్థం చేసుకుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. తండ్రి లేని ఆ కుటుంబంలో తులసీతో సహా పిల్లలంతా పనికి వెళ్తే కానీ నాలుగు మెతుకులు రావు. దాంతో కొన్నాళ్లు మేకలని మేపుతూ మరికొన్నాళ్లు ఇనుప గనులలో పనిచేస్తూ గడిపేవారు తులసి. ఏ పని చేస్తున్నా ఎందుకో తులసిలో చదువు పట్ల విపరీతమైన అభిమానం ఉండేది. నిరక్షరాస్యతని మించిన బానిసత్వం లేదని ఆమె నమ్మేది. తన చుట్టూ ఉన్న పేదరికానికీ, వ్యసనాలకీ, భయాలకీ, మూఢనమ్మకాలకీ, నైరాశ్యానికీ... చదువు లేకపోవడమే కారణం అనుకొనేది. కానీ ఈ పరిస్థితి మారేదేలా! తనకే చదువు రాదు, ఇక తను మరొకరికి ఎలా సాయపడగలదు? ఇలా తులసీ మనసు రకరకాల సందేహాలతో సతమతం అవ్వసాగింది. కానీ ఆమెలో ప్రజ్వలంగా ఉన్న ఆకాంక్ష మాత్రం ఏదో దారి కోసం ఎదురు చూస్తోంది. ఆ సమయంలో భూదాన్ ఉద్యమకర్త వినోబా భావే, 1963లో తులసి ఉండే ప్రాంతానికి వచ్చారు. వినోబా భావే వ్యక్తిత్వానికి తులసి ముగ్ధురాలైపోయారు. ఎలాగైనా సరే తన లక్ష్యాన్ని చేరుకునేందుకు అడుగు ముందుకు వేయాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో తులసి తన అక్కగారి ఊరైన సెరెండా అనే పల్లెటూరిలో ఉంటున్నారు. వెంటనే తను ఉంటున్న ఆ ఊరిలో పిల్లలని చేరదీసి వారికి చదువు చెప్పాలని నిర్ణయించుకున్నారు. అలా తను ఉండే ఇంటి వరాండాలో ఒక రాత్రిపూట బడిని ఏర్పాటు చేశారు. ఒక పక్క తను చదువుకుంటూ మరో పక్క పిల్లలకు అక్షరాలు నేర్పసాగారు.     మొదట్లో సెరెండా గ్రామస్తులెవ్వరూ తులసి బడిని పట్టించుకోనేలేదు. కానీ ఇంటింటికీ తిరిగి మనిషి మనిషినీ ప్రాధేయపడటంతో ఓ 30 మంది పిల్లలు మాత్రం పోగయ్యారు. పగటివేళల్లో వాళ్లు ఎలాగూ గనుల్లోని పనికి వెళ్తారు కాబట్టి రాత్రివేళల్లో ఏదో నాలుగు ముక్కలు నేర్చుకుంటారులే అని సరిపెట్టుకున్నారు. కానీ ఆ పిల్లల్లో చదువు తీసుకువచ్చిన మార్పు చూసి గ్రామం ఆశ్చర్యపోయింది. పెద్దలంతా తాము పనికి వెళ్తూ, పిల్లల్ని తులసి దగ్గర వదిలిపెట్టి వెళ్లసాగారు. క్రమేపీ విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆ విద్యార్థుల కోసం తగిన వసతులు కల్పించేందుకు తులసి కూరగాయలు, మరమరాలు అమ్మిమరీ, వారికి లోటు రాకుండా చూసుకునేవారు. తులసిలోని నిబద్ధతని గమనించిన గ్రామస్తులు స్వయంగా ఒక పాఠశాలను నిర్మించి అందించారు. ఊళ్లో చదువు రావడంతో... వారి జీవితాల్లో మార్పు కూడా వచ్చేసింది. గనుల్లో తమకి జరుగుతున్న అన్యాయాలని ప్రశ్నించే ధైర్యం వచ్చింది. ఒకరి దగ్గర దేహీ అనకుండా తమకి తోచిన ఉపాధిని ఎంచుకునే స్వేచ్ఛ వచ్చింది. మొత్తంగా వారి జీవితాల్లో ఒక వెలుగు వచ్చింది! ఇదంతా జరిగి 40 సంవత్సరాలకు పైనే గడుస్తోంది. ఇప్పటివరకూ ‘ఆదివాసి వికాస్ సమితి’ పేరుతో తులసి ఆరంభించిన పాఠశాల దాదాపు ఇరవై వేల మందికి చదువుని అందించి, వారి జీవితాలతో ఓనమాలు దిద్దించింది. దూరం నుంచి వచ్చే విద్యార్థులు కేవలం 200 రూపాయలు చెల్లిస్తే చాలు, వారు బడిలోనే ఉండి చదువుకునే అవకాశాన్ని కూడా కల్పించారు. ఒడిషాలోని మారుమూల గ్రామంలో తులసి సాగిస్తున్న ఈ ఉద్యమం క్రమేపీ ప్రపంచానికి తెలిసింది. కేంద్రం పద్మశ్రీ బిరుదుతోనూ, ఒడిషా రాష్ట్రం లివింగ్ లెజెండ్ అవార్డుతోనూ సత్కరించాయి. తులసికి ఆర్ధికంగా సాయపడేందుకు టాటా స్టీల్ వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. అంతేకాదు స్ఫూర్తి రగిలించే ఆమె జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ‘తులసి ఆపా’ పేరుతో ఒక చిత్రం కూడా ఒడిషా భాషలో రూపొందింది. పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులతో పాటుగా ఒడిషా ప్రభుత్వం సినీరంగానికి అందించే అవార్డులలో ఆరు అవార్డులను సొంతం చేసుకుంది. ఒక్కడితో మార్పు సాధ్యం కాదు అనుకుని వెనకడుగు వేసేవారికి తులసి జీవితమే ఓ ముందడుగు. - నిర్జర.    

మీ చీరకీ మీ బ్లౌజ్ మ్యాచింగా...!!!     * సాధారణంగా చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోవడం అనేది ఎప్పటినుండో వస్తున్న సాంప్రదాయం. రానురాను  ట్రెండ్ మారుతూవస్తోంది. * పూర్వం మన అమ్మమ్మలు, నాయనమ్మలు చీరకి మ్యాచింగ్ బ్లౌజ్లు వేసుకునేవారు కాదు. White Blouse వాడేవారు లేదా Black, Maroon, Green ఇలా కొన్ని Base Colors మాత్రమే వాడేవారు. Next Generation వచ్చేసరికి మ్యాచింగ్ లేదా కాంట్రాస్ట్ బ్లౌజ్ని మాత్రమే వాడేవారు.      * ఇప్పటి  జనరేషన్కి  బ్లౌజ్ ఒక ఫాషన్గా మారిపోయింది. అసలు చీరకి సంబంధం లేకుండా బ్లౌజ్ వేసుకోవడమే నేటి ఫాషన్. దీనిలో భాగంగా Kalamkari, Ikat, Khadi మరియు Handloom Printed Fabrics ఎన్నో ట్రెండ్లో నడుస్తున్నాయి. *  మ్యాచింగ్ కి అస్సలు సంబంధం లేకపోయినా మ్యాచింగ్ కి ఈ బ్లౌజ్ ఎంతో అందంగా హుందాగా ఉంటున్నాయి. * ఏ వయస్సు వారైనా వేసుకుని Enjoy చేసుకొనేలా ఉంటున్నాయి.  So, పదండి మనం కూడా ట్రెండ్ని Follow అయి Enjoy చేద్దాం..

వంటగదిలో మీకు తెలియని కొత్త షెల్ఫ్ ప్రదేశాలు...!   * పనికిరాని వస్తువులన్నిటిని కూడా స్టోర్ రూమ్ లోపెట్టేస్తుంటాం. ఎందుకంటే ఈ పనికిరాని వస్తువులను తీసేయడం వలన కాస్త ఖాళీ స్థలం దొరుకుతుంది. అదే ఒకవేళ వంటగదిలో అనేక వస్తువులను పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ వాటికోసం మరో స్థలాన్నివెతుక్కోకుండా వంటగదిలోనే మనకు నచ్చినట్లుగా ఎలా అందంగా మార్చుకోవచ్చో కొన్ని సూచనల ద్వారా తెలుసుకుందామా...! * వంటగది చిన్నగా ఉందనుకోండి.. అందులో మళ్ళీ షెల్ఫ్ లు అంటూ చేస్తే అది ఇంకా ఇరుకుగా మారిపోతుంది. అలాంటప్పుడు సింక్ క్రింది స్థలాన్ని వాడుకొని మన వస్తువులను అమర్చుకోవచ్చు. మరి సింక్ కింది భాగాన్ని ఎలా వాడుకోవచ్చో చూద్దామా...! * సింక్ కింది భాగంలో షెల్ఫ్ లాంటివి అమర్చుకోవడం వలన మీకు అవసరమయ్యే వస్తువులను అక్కడే పెట్టుకోవచ్చు. అలా చేయడం వలన అందంగా ఉండటంతో పాటు స్థలం కూడా మనకు ఉపయోగపడుతుంది. * పైగా శాశ్వతంగా అక్కడే ఉండే షెల్ఫ్ లను మీరు ఎంచుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైన రిపెర్లకు ప్లంబర్ వస్తే ఈ మొత్తం క్యాబినెట్ నే తొలగించాల్సి కూడా రావచ్చు. అందుకే అటూఇటూ కదల్చడానికి వీలైన ఎన్నో అండర్ సింక్ షెల్ఫ్ లు ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి. * టూ టైర్, త్రీ టైర్ ఫుల్ అవుట్ బాస్కెట్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటు ధరలలోనే లభిస్తున్నాయి. అనువైన దానిని ఎంచుకుని సింక్ కింద అమర్చండి. * అందులో డిటర్జెంట్లు, లిక్విడ్ సోప్ బాటిల్స్, బ్లీచింగ్ పౌడర్ డబ్బాలు, బ్రష్ లు, చివరకు హ్యాండ్ టవల్స్ తో సహా చక్కగా సర్దుకోవచ్చు. చిన్న చిన్న బాటిల్స్ లాంటివి ఉంటే వాటన్నింటిని ఒకే ట్రే లో సర్దుకోవచ్చు. మీరు ఈ షెల్ఫ్ లను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకోవచ్చు.  

  మానసిక సమస్యలకు చెక్ పెట్టాలంటే     ఒత్తిడి ..ఎంతటి వారిని అయినా చిత్తు చేసేస్తుంది . అందులోను మహిళల విషయం లో ఈ ఒత్తిడి మరింత ప్రభావాన్ని చూబిస్తుంది , ఎందుకంటే వారు ఎన్నో విధాలుగా నిత్యం ఒత్తిడికి గురి అవుతూనే వుంటారు , అందులోను , ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగినిలు కంటే గృహిణులు గా ఇంట్లో వుండే మహిళలలోనే ఒత్తిడి ఎక్కువ అట. సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలలో ఒత్తిడి ఎక్కువగా వుంటుంది అనుకుంటారు. కాని తాజాగా చేసిన ఒక అధ్యయనం లో ఇంటికే పరిమిత మయిన మహిళలలోనే  ఒత్తిడి ఎక్కువ అని తేలింది. హార్మోన్ల స్తాయి ని లెక్కించి వారి ఒత్తిడిని అంచనా వేసారు. చివరికి వారు తేల్చిన విషయం ఏంటంటే ఎవరయినా , ఎప్పుడు అయినా తను చేసే పనికి తగిన గుర్తింపు కావాలని కోరుకుంటారు. ఉద్యోగినులకి అయితే శ్రమకి తగిన జీతం , పదోన్నతలు, ప్రశంసలు వంటివి వుంటాయి. కాని గృహిణులుగా ఎంత బాధ్యతతో వున్నా వారికి చిన్నపాటి గుర్తింపు కూడా ఉండదు. పైగా వారు చేసే పనిని కూడా ఎవరు కష్టమయినదిగా గుర్తించరు. దానితో పనికి గుర్తింపు లేకపోవటం అన్నది వారిని చాలా మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది అని తేలింది. పైగా ఉమ్మిడి కుటుంబాలలో ఉండే మహిళలలో ఈ ఒత్తిడి మరింత అధికంగా వుండటం గుర్తించారుట. చేసే పనికి చిన్నపాటి గుర్తింపు కుటుంబ సబ్యుల నుంచి దొరికితే వారిలో అసహనం, కోపం, వత్తిడి వంటివి తగ్గుతాయని , దానివలన ఇతర అనారోగ్యాలు కూడా తగ్గుతాయని వీరు గట్టిగా చెబుతున్నారు. చిన్న పాటి ప్రశంస మహిళల మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని అధ్యయనాలు చెబుతున్నా కూడా  , ఇప్పటికి ఆ ప్రశంస దొరకటం కష్టం గా వుంది అంటే ...ఆ సమస్యకి పరిష్కారం గట్టిగా ఆలోచించాల్సిందే. నిపుణులు ఈ విషయం లో మహిళలకి కొన్ని సూచనలు చేస్తున్నారు. అవి ఏంటంటే 1. మొదటిగా, మిమ్మల్ని మీరు ప్రేమించు కొండి 2. మీతో మీరు కొంత సమయం గడపండి 3. మీకోసం మీరు ఆలోచించటం మొదలు పెట్టండి ఎప్పుడు అయితే మీ గురించి మీరు ఆలోచించటం మొదలు పెడతారో , ఆత్మవిశ్వాసం మీ స్వంతం అవుతుంది . అప్పుడు బయట వ్యక్తుల ప్రశంసల కోసం ఎదురు చూడరు . వారినుంచి ప్రశంస దొరికినా , లేకపోయినా కూడా ఆనందం గానే వుంటారు. ఈ చిన్న విషయాన్ని గమనిస్తే చాలు ...ఎన్నో మానసిక సమస్యలు కి చెక్ చెప్పినట్టేనట.

ఆడు మగాడ్రా బుజ్జీ!   మనం ఏ శతాబ్దంలో అయినా ఉండవచ్చుగాక. ఆడవాళ్లు ఎంతైనా సాధించవచ్చుగాక. కానీ ఆడపిల్లలు బలహీనురు, తెలివితక్కువవారు అన్న నమ్మకం మాత్రం మన మెదళ్లలో ఉండిపోయింది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఈ విషయాన్ని సమాజం నిరంతరం తరతరానికీ అందచేస్తూనే వస్తోంది. అనుమానంగా ఉంటే ఈ పరిశోధన గురించి చదవండి.. హీరో అంటే మగవాడే చిన్నపిల్లల మనసులో ఆడ, మగ తేడాలకు సంబంధించి ఎలాంటి అభిప్రాయాలు స్థిరపడిపోతాయో తెలుసుకునేందుకు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేపట్టారు. ఇందుకోసం వారు 5 నుంచి 7 సంవత్సరాల వయసు మధ్య ఉన్న కొందరు పిల్లలను ఎన్నుకొన్నారు. వీరందరికీ ఓ కథని వినిపించారు. ఆ కథలోని ముఖ్యపాత్ర ఎవరన్నది చెప్పకుండానే, ఆ పాత్ర చాలా చాలా తెలివైనదని చెప్పుకొచ్చారు. కథంతా చెప్పేసిన తరువాత ఆ తెలివైన పాత్ర ఆడవారై ఉంటారా మగవారై ఉంటారా అని అడిగితే... 5 ఏళ్ల ఆడపిల్లలు ఆడవారనీ, మగపిల్లలు మగవారనీ ఊహించారు. కానీ 6,7 వయసు ఆడపిల్లలు, మగపిల్లలు మాత్రం ఆ తెలివైన ముఖ్యపాత్ర మగవాడే అయి ఉంటాడని తేల్చేశారు. ఏ జాతి పిల్లలైనా, వారి ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా కూడా చిన్నపిల్లల్లో ఈ వివక్ష కనిపించడం గమనార్హం. అంతటితో ఆగలేదు కేవలం కథ చెప్పడంతోనే పరిశోధకులు ఆగలేదు. తమ ప్రయోగంలోని రెండో దశలో భాగంగా వారికి ఓ రెండు ఆటలని పరిచయం చేశారు. నిజానికి ఆ రెండు ఆటలు ఒకే తీరున ఉన్నాయి. వాటిని ఆడే పద్ధతి, విధివిధానాలలో పెద్దగా తేడాలు లేవు. కానీ వాటి గురించి చెప్పేటప్పుడు మాత్రం ఓ ఆట ‘చాలా చాలా తెలివైనవారి కోసం’ అనీ, రెండో ఆట ‘బాగా కష్టపడేవారి కోసం’ అనీ చెప్పుకొచ్చారు. మగపిల్లలు ఈ రెండు రకాల ఆటలనీ ఆడేందుకు సిద్ధపడిపోయారు. ఆశ్చర్యంగా 6,7 వయసు ఉన్న ఆడపిల్లలు మాత్రం ‘తెలివైనవారి కోసం’ ఆడే ఆట జోలికి పోనేలేదు. అయితే 5 ఏళ్ల వయసులో మాత్రం ఆడ, మగ మధ్య ఇలాంటి తేడాలు ఏమీ కనిపించలేదు. అదీ సంగతి! ఆడవారు మగవారు సమానమే అంటూ పైకి ఎన్ని కబుర్లు చెబుతున్నా, సమాజంలో ఆ వివక్ష ఇంకా కనిపించకుండా కొనసాగుతూనే ఉంది. మనం చూసే సినిమాలు, టీవీ సీరియల్స్, చదివే పుస్తకాలు... ఆఖరికి జానపద కథలు సైతం స్త్రీలకంటే పురుషులు బలవంతులు, సమయస్ఫూర్తి కలిగినవారు అన్న అభిప్రాయాన్ని కలగచేస్తాయి. ఇక ‘నువ్వు ఆడపిల్లవి’ అంటూ పరోక్షంగా వినిపించే హెచ్చరికలు, పరిమితులు సరేసరి. ఇవన్నీ కూడా ఆడపిల్లల మనసు మీద చిన్నవయసులోనే ముద్ర వేసేస్తాయి. భవిష్యత్తులో వారి వ్యక్తిత్వాన్నీ, ఎంచుకునే చదువునీ, చేసే వృత్తినీ ప్రభావితం చేసేస్తాయి.     - నిర్జర.

  షోకేసు బొమ్మలు కూడా మోసం చేస్తాయి   ఆడవాళ్ల చర్మం రంగు ఎలా ఉండాలో, ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, ఎంత సన్నగా ఉండాలో... సూచించే ప్రకటనలకి కొదవే లేదు. మీడియాలో ఎక్కడ చూసినా ఇలాంటి ప్రకటనలు వెంటాడుతూనే ఉంటాయి. ఇలా కాకుండా వేరే విధంగా ఉండే ఆడవాళ్లని సమాజం పట్టించుకోదనీ, అసలు విజయమే దక్కదనీ హెచ్చరిస్తుంటాయ. మనం షాపులో చూసే నిలువెత్తు ప్లాస్టిక్ బొమ్మలు (mannequins) కూడా ఇందుకు మినహాయింపు కాదంటున్నారు పరిశోధకులు. ఈ రోజుల్లో ఎంత చిన్న బట్టల షాపులోకి అడుగుపెట్టినా mannequins పలకరిస్తూనే ఉంటాయి. సన్నగా పీలగా ఉండే ఈ షోకేసు బొమ్మల్ని చూసి ఇంగ్లండులోని కొందరు పరిశోధకులకు అనుమానం వచ్చిందట. వెంటనే ఆ దేశంలోని రెండు పెద్ద నగరాల్లో ఓ సర్వేని నిర్వహించారు. అక్కడ రద్దీగా ఉండే బట్టల దుకాణాల్లోని mannequins కొలతలు తీశారు. చాలా బట్టల దుకాణాల్లో కనిపించే mannequins పీనుగుల్లా ఉన్నాయని తేలింది. షాపులోకి అడుగుపెట్టిన ఆడవాళ్లని ఈ బక్కపలచ బొమ్మలు తప్పుదారి పట్టించడం ఖాయం. ఇది Body Image Problem అనే తరహా సమస్యలకి దారితీస్తుదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ సమస్య మొదలైనవారు, ఇలాంటి పోలికలు చూసి... తమ శరీరం ఆకర్షణీయంగా లేదేమో అని అనుమానించడం మొదలుపెడతారు. దాంతో ఆత్మన్యూనత, సరైనా ఆహారం తీసుకోకపోవడం వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఇప్పటికే సెలబ్రెటీల దగ్గర్నుంచీ న్యూస్ రీడర్ల వరకూ బక్కపల్చగా కనిపిస్తున్నారు. మన శరీరం కూడా ఇలా ఉండాలి కాబోసు అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. ఆ జాబితాకి ఇప్పుడు షోకేసు బొమ్మలు కూడా తోడయ్యాయి! తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పరిశోధకులు. పైపై మెరుగులకంటే ఆరోగ్యమూ, ఆత్మవిశ్వాసమూ ముఖ్యమని హెచ్చరిస్తున్నారు. - నిర్జర.    

ఐర్లండ్‌ దేశాన్ని కుదిపేస్తున్న భారతీయురాలి చావు...   ఇంగ్లండ్ దేశానికి పక్కనే ఉండే ఐర్లండ్‌ దేశం గురించి తెలియనివారుండరు. నిన్న ఆ దేశంలో ఓ ముఖ్యమైన విషయం మీద రిఫరెండంను నిర్వహించారు. ఇవాళ ఆ రిఫరెండం ఫలితాలు వెలువడనున్నాయి. ఇంతకీ ఏమిటా రిఫరెండం? దానికీ ఓ భారతీయురాలికీ సంబంధం ఏమిటి?   ఐర్లండ్‌లో ఎక్కువ మంది క్రైస్తవ మతాన్నే అనుసరిస్తుంటారు. అందుకే ఆ దేశంలో కొన్ని చట్టాలు క్రైస్తవ సంప్రదాయాల మీద ఆధారపడి ఉంటాయి. వాటిలో ఒకటి- అబార్షన్లకు సంబంధించిన నిబంధన! క్రైస్తవ మతం ప్రకారం అబార్షన్ చేయడం అంటే హత్య చయడమే! అందుకే అక్కడ అబార్షన్లను నిషేదించారు. ఒకవేళ ఎవరన్నా కన్నుగప్పి అబార్షన్‌ చేయించుకుంటే వారికి భారీ జరిమానాతో పాటు 14 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది. ఈ చట్టమే ఓ భారతీయురాలి పాట యమపాశంగా మారింది.   ఐర్లండులో దంతవైద్యురాలుగా స్థిరపడిన సవిత హలప్పనావర్‌ అనే మహిళ 2012లో తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరింది. అప్పటికామె మూడు నెలల గర్భిణి. సవిత కడుపులోని బిడ్డ చాలా విషమంగా ఉందని వైద్యులు తేల్చారు. దానివల్ల సవిత కూడా చనిపోతుందని హెచ్చరించారు. కానీ చట్టానికి భయపడి వైద్యులు అబార్షన్ చేయలేదు. ఫలితం! సవిత రక్తంలో ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ఆమె చనిపోయింది.   సవిత మరణంతో ఐర్లండ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. నిజానికి ఇలాంటి వార్తలు వాళ్లకి కొత్తకాదు. ఐర్లండ్‌లో అత్యాచారానికి గురైన స్త్రీలు కూడా గర్భం తీయించుకోవడానికి వీల్లేదు. అందుకనే వాళ్లు రహస్యంగా ప్రమాదకరమైన మందులు వాడటమో, పక్క దేశాలకి వెళ్లి అబార్షన్‌ చేయించుకోవడమో చేస్తుంటారు. కానీ సవిత కేసు తర్వాత చట్టాలు మార్చాలన్న ఒత్తిడి మొదలైంది.   ఐర్లండులో ప్రస్తుతం ఉన్న అబార్షన్‌ చట్టాన్ని మార్చాలా వద్దా అని నిర్ణయించేందుకే నిన్న రిఫరెండంని చేపట్టారు. అక్కడి ప్రస్తుత ప్రధానమంత్రి లియో వరాద్కర్‌ కూడా భారతీయ మూలాలు కలిగిన వ్యక్తి కావడం వల్ల, ఈ రిఫరెండంకు మరింత బలం చేకూరింది. ఇందుకోసం ఏకంగా 35 లక్షల మంది ఓటర్లు తమ నిర్ణయాన్ని తెలియచేయనున్నారు. ఇప్పటికే ఐర్లండ్‌లో క్రైస్తవ నిబంధనల ప్రాధాన్యత తగ్గుతోంది. కాబట్టి ఈ రిఫరెండంను ఎలాగైనా అడ్డుకోవాలన్న ఆలోచన కూడా చాలామందిలో కనిపిస్తోంది. కాబట్టి ఇవాళ సాయంత్రం ఫలితం వచ్చే వరకు సవిత ఆత్మకు శాంతి చేకూరుతుందో లేదో చెప్పలేం! -Nirjara  

నేచురల్‌ ఫ్లోర్‌ క్లీనర్‌ ఇలా తయారుచేసుకోండి...   మార్కెటింగ్‌ పుణ్యమా అని ఇప్పుడు ప్రతి ఇంట్లో రకరకాల ఫ్లోర్‌ క్లీనర్స్ వాడేస్తున్నారు. వీటిలో ఉండే స్ట్రాంగ్‌ కెమికల్స్ వల్ల ఫ్లోర్‌ శుభ్రంగా ఉండటం మాటేమో కానీ, రకరకాల జబ్బులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. వీటితో కేన్సర్‌లాంటి తీవ్రమైన సమస్యలూ వస్తాయని పరిశోదనలు సూచిస్తున్నాయి. అందుకే మనమే ఓ ఫ్లోర్‌ క్లీనర్‌ని తయారుచేసుకుంటే ఏడాదికి రెండు మూడు వేలు ఆదా అవడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. కెమికల్‌ క్లీనర్స్‌తో పోల్చుకుంటే వీటివల్ల లాభాలు కూడా ఎక్కువే! * నేచురల్‌ ఫ్లోర్‌ క్లీనర్‌ కోసం పటిక, ఉప్పు, కర్పూరం బిళ్లలు ఉంటే సరిపోతుంది. పటిక ఫ్లోర్‌ మీద ఉండే చిన్న చిన్న క్రిములను చంపే యాంటిబయాటిక్‌లా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇంట్లో పసిపిల్లలు ఉన్నవారు పటికతో ఫ్లోర్‌ శుభ్రం చేస్తే, పిల్లలకి ఎలాంటి అలెర్జీలు రాకుండా ఉంటాయి. * ఉప్పుతో మార్బుల్‌ ఫ్లోరింగ్‌ తళతళలాడిపోతుంది. చీమలు, చిమట్లు నేల మీద పాకకుండా చేస్తుంది. * ఇక కర్పూరం ఓ గొప్ప రిపెల్లంట్‌గా పనిచేస్తుంది. దీంతో ఈగలు, దోమలు, బొద్దింకలు అంత త్వరగా ఇంట్లో రావు. పైగా కర్పూరం వల్ల మంచి వాసన కూడా వస్తుంది. ఈ పదార్థాలన్నీ నీటిలో వేసి అవి కరిగిపోయేదాకా ఉంచాలి. తర్వాత వాటిని కాస్త సర్ఫ్‌, ఫినాయిల్‌ కలిపిన నీళ్లలో కలిపి ఫ్లోర్‌ క్లీన్ చేసుకోవాలి. ఒకటి రెండు సార్లు ఈ హోమ్‌ మేడ్ క్లీనర్‌ వాడి చూడండి. ఆ తర్వాత ఇంక మీరు కెమికల్స్ జోలికి పోనేపోరు.

దీంట్లో కూడా ఆడవారే ముందుంటున్నారా.?   ప్రస్తుత ఆధునిక యుగంలో తాము పురుషులకు ఏ విషయంలోనూ తీసిపోమని నిరూపిస్తున్నారు.. రంగమేదైనా సరే అందులో మగవారిని సైతం వెనక్కునెట్టి టాప్ ప్లేస్‌లో కూర్చొంటున్నారు. అయితే అన్నింట్లో ముందున్నట్లే అనారోగ్యంలోనూ నెంబర్‌వన్ ప్లేస్ తమదే అంటున్నారు. వాటిలో ప్రధానమైనది డిప్రెషన్.. మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, హర్మోన్ల అసమతౌల్యత ఇలా కారణం ఏదైనా అది అంతిమంగా డిప్రెషన్‌కు దారి తీసి మహిళలను కృంగదీస్తోంది. ఈ నేపథ్యంలో అసలు దీనికి కారణాలు.. డిప్రెషన్ లక్షణాలు, చికిత్సా విధానం తదితర వివరాల కోసం ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=Z7RduReslBo  

ఇంట్లోనే హోలీ రంగులు ఇలా చేసుకోవచ్చు..  

How to make 3D Paper Quilling flowers..    

పెళ్లికి ముందు అమ్మాయిలు కోరుకునేవి ఇవే..!   ప్రతీ ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఒక మధురమైన ఘట్టం. వయసుకొచ్చినప్పటి నుంచే పెళ్లి గురించి రకరకాల కలలు కంటూ ఉంటారు అమ్మాయిలు. తనకు కాబోయేవాడు అందంగా ఉండాలని.. మంచివాడై ఉండాలని.. తనను, తన కుటుంబాన్ని బాగా చూసుకునేవాడు కావాలని అనుకుంటారు. కానీ ఇటీవలి కాలంలో పెళ్లి విషయంలో అమ్మాయిల ఆలోచన సరళి పూర్తిగా మారిపోయింది. అదేంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి. https://www.youtube.com/watch?v=VhI_6urqrSk

నీటిలో దీపాలు.. ఇళ్లంతా అందం   దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపం దీప్తినిస్తుంది.. చైతన్యాన్ని ప్రతిఫలిస్తుంది. మనదేశ సంస్కృతికి అద్దం పడుతుంది. దీపావళి రోజున సాయంసంధ్య వేళ నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి దీపలక్ష్మీకి నమస్కరించుకుంటారు. అనంతరం దీపాలను తులసికోట వద్ద.. వాకిట్లో ఉంచుతారు.. పండుగనాడు మట్టిప్రమిదలను వాడటం ఆనవాయితీగా వస్తోంది. అయితే కాస్తంత క్రియేటివిటీ జోడించి మన ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతో దీపాలు వెలిగించవచ్చు. కుందన్స్, రంగు రంగుల రాళ్లతో దీపాలను తయారు చేసి వాటిని నీటిలో ఉంచితే వచ్చే అందమే వేరు. అవి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.  https://www.youtube.com/watch?v=iG0MqO5maXg  

మట్టిప్రమిదను ఇలా మోడ్రన్‌గా తయారు చేసుకోండి..!   దీపావళి వస్తుందంటే ముందుగా అందరూ చేసే పని ఇంటిని శుభ్రపరచడం, తర్వాత ఇంటిని అందంగా అలంకరించుకోవడం, డిఫరెంట్ లైట్లు, ఆకర్షించే ముగ్గులు, రంగు రంగుల ప్రమిదలు ఇలా రకరకాలుగా ఇంటిని డెకరేట్ చేస్తుంటారు. అయితే తరతరాలుగా దీపావళీ నాడు మట్టిప్రమిదలను వాడటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఎప్పుడూ పాత పద్దతులేనా..? కొత్తగా ప్రయత్నించరా..? అంటూ కొందరు మొహం మీద అనేస్తూ ఉంటారు. ఇలాంటి వారికి సమాధానంగా కేవలం మట్టి ప్రమిదనే ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే ఎంతో ఆకర్షణీయంగా తయారు చేసుకోవచ్చంటున్నారు ఇంటీయర్ డిజైనర్లు. అలా ప్రమిదలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూడండి.  https://www.youtube.com/watch?v=yDqvkzbgWcE