విధికి ఎదురు నిలిచిన... ఓ సెల్వి కథ     ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 కోట్లమంది ఆడపిల్లలకు 18 ఏళ్లలోపు వయసులోనే పెళ్లి జరిగిపోతోంది. అందులో మూడోవంతు బాల్య వివాహాలు మన దేశంలో జరుగుతున్నట్లు అంచనా. ఆడపిల్లలను గుండెల మీద కుంపటిలాగా భావించేసి, వారిని ఎలాగైనా వదిలించేసుకోవాలనుకునే తల్లిదండ్రుల ఆలోచనలకు ఇది ప్రతిఫలం కావచ్చు. కానీ అలా వదిలించుకున్న తరువాత ఆ పిల్లల పరిస్థితి నిజంగానే కుంపట్లపాలవ్వడం విషాదకరం. అత్తింతి ఆరళ్ల దగ్గర్నుంచీ అనారోగ్య సమస్యల వరకూ వీరి జీవితం ఓ నరకంగా మారిపోతోంది. అలాంటి నరకం నుంచి బయటపడే ప్రయత్నం చేసిన ఓ సెల్వి కథే ఇది.     బాల్యవివాహంతో మొదలు కర్ణాటకకు చెందిన సెల్వికి 14వ ఏటే పెళ్లి జరిగిపోయింది. మొగుడు మహా దుర్మార్గుడు! తిట్టడం, కొట్టడం, అదనపు కట్నం కోసం వేధించడంలాంటి అవలక్షణాలతో పాటుగా... సెల్వితో వ్యభిచారం చేయించి పబ్బం గడుపుకొనేవాడు. అలాంటి భర్తతో కలిసి జీవించడంకంటే ఈ లోకం నుంచి నిష్క్రమించడం మేలనుకుంది సెల్వి. ‘‘కానీ అలా చేస్తే నన్ను నేను నిరూపించుకునే అవకాశం ఉండదు కదా! అందుకనే నేను పారిపోయాను’’ అంటుంది సెల్వి.     ఆశ్రయం లభించినా సెల్వి తన భర్త నుంచి పారిపోయాక అటుతిరిగీ ఇటుతిరిగీ మైసూరులోని ‘ఒడనాడి’ అనే స్వచ్ఛంద సంస్థలో ఆశ్రయం తీసుకుంది. వ్యభిచార వృత్తిలో చిక్కుకున్న మహిళలకు ఆ సంస్థ ఆశ్రయం కల్పిస్తూ ఉండేది. జీవితంలో అన్నేసి కష్టాలు పడిన సెల్వికి నిజంగానే అది ఒక ఊరట. కానీ తను అక్కడితో ఊరుకోలేదు. తన కాళ్ల మీద తాను నిలబడాలని అనుకొంది. అదే సమయంలో తన ప్రత్యేకతని చాటుకోవాలని అనుకుంది. అలా సెల్వికి కారు డ్రైవింగ్ మీద మనసైంది. సెల్వికి సంస్థ అధికారులు తోడుగా నిలవడంతో ఆమె టాక్సీ డ్రైవరుగా జీవనం మొదలుపెట్టింది. కొన్ని పత్రికల ప్రకారం ఆమె దక్షిణ భారతదేశంలోనే తొలి మహిళా టాక్సీ డ్రైవర్‌!     అయినా ఆగలేదు సైకిల్‌ కూడా తొక్కడం రాని సెల్వి టాక్సీ డ్రైవర్‌గా నిలదొక్కుకుంది. మగవాళ్లకే పరిమితం అనుకునే రంగంలో.... అనుమానపు చూపులనీ, ఆకతాయి ప్రశ్నలనీ దాటుకుని సత్తా చాటుకుంది. కానీ ఆమె అక్కడ కూడా ఆగలేదు. ప్రస్తుతం మహిళా డ్రైవర్లు మాత్రమే ఉండే ఒక టాక్సీ సంస్థకి యజమానురాలిగా మారింది. సెల్వి వ్యక్తిత్వాన్ని చూసి మనసుపడిన విజీ అనే తోటి డ్రైవర్‌ని వివాహం చేసుకుంది. వారికిప్పుడు ఇద్దరు పిల్లలు.     డ్రైవింగ్‌ విత్‌ సెల్వి 2004లో సెల్వి ఆశ్రయం తీసుకొంటున్న సంస్థని చూసేందుకు కెనడాకి చెందిన ఒక పర్యటకురాలు వచ్చారు. ఆమె పేరు ‘ఎలిసా పొలాస్చి’. ఎలిసా ఏదో సరదాగా సెల్వి గురించి అప్పట్లో వీడియో తీసుకుని కెనడాకు వెళ్లిపోయింది. కానీ కొన్నాళ్ల తరువాత ఇండియాకి మళ్లీ వచ్చిన ఎలిసా, సెల్వీ సాధిస్తున్న విజయాలను గమనించింది. దాంతో గత 11 సంవత్సరాలుగా ఆమె సెల్వీ జీవితాన్ని వీడియోల ద్వారా రికార్డు చేస్తూ వచ్చింది. వాటన్నింటినీ కలిపి గత ఏడాది ‘డ్రైవింగ్ విత్‌ సెల్వీ’ పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ అనేక అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో చోటు సంపాదించుకుంది. ఆ డాక్యుమెంటరీతో పాటుగా సెల్వి పేరు కూడా మారుమోగిపోతోంది. స్త్రీలకు సంబంధించిన అనేక సెమినార్లలో పాల్గొనాలంటూ సెల్వీకి అనేక ఆహ్వానాలు అందుతున్నాయి. కర్ణాటకలోని వాడవాడలా సెల్వితో కలిసి స్త్రీల హక్కుల గురించి ప్రచారం చేయాలని స్వచ్ఛంద సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి.   సెల్వి సాధించిన విజయం ఏదో అయాచితంగా లభించినది కాదు. దాని వెనుక దాచలేని కష్టాలున్నాయి, మర్చిపోలేనంత శ్రమ ఉంది. కానీ ఇంత దూరం వచ్చిన తరువాత సెల్వి తన తోటివారందరికీ చెప్పే మాట ఒక్కటే- ‘‘కష్టాల్లో ఉన్న మనల్ని ఆదుకునేందుకు అన్నో, అమ్మో వస్తారనుకుని ఎదరుచూస్తూ కూర్చుంటే ఉపయోగం లేదు. మనకోసం మనం ఏం చేయగలమో ఆలోచించాలి. మనం ఏం సాధించగలమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ తరువాత మనమే అడుగు ముందుకు వేయాలి!’’ సెల్వి చెబుతున్న మాటలు వాస్తవానికి ఎంత దగ్గరగా ఉన్నాయో కదా! ఆ మాటల వెనుక ఆమె జీవితమే ఉందయ్యే...   - నిర్జర.  

  అమ్మతో కాసేపు   గోరుముద్దలు - గోరింటాకులు, పాల బుగ్గలు - పట్టుపావడాలు, చందమామ కథలు - చద్దిఅన్నాలు ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ మనకిచ్చే తీపి జ్ఞాపకాలు ఎన్నో లెక్కకి కూడా అందవు. మనసు వాకిటిని తడితే చాలు దొర్లుకుంటూ వచ్చే తల్లి తలపులకు ఆనకట్ట వెయ్యటం కొంచెం కష్టమే. స్కూల్ నుంచి వచ్చాకా అక్కడ జరిగినవన్నీ అమ్మకి చెప్పకపోతే  నిద్ర పట్టదు. మనం సైకిల్ తొక్కినా అమ్మ చూడాలి, చెట్టెక్కి గెంతాలన్నా అమ్మే చూడాలి. మొత్తానికి మనం ఏం చేసినా అమ్మ పక్కనే ఉండాలి. మనతో ఇంతలా అల్లుకుపోయిన అమ్మని విడిచి దూరంగా వెళ్ళాల్సి వస్తే మన ప్రాణాలని ఎవరో తెలియకుండా లాగేసుకుంటునట్టు ఉండదూ. ఎన్నేళ్ళు వచ్చినా మనం ఇంకొకరికి అమ్మ అయినా మన అమ్మ మీదున్న ప్రేమ ఇసుమంతైనా తగ్గదు.   పెద్ద చదువులకి వెళ్ళాకా పెద్ద ఉద్యోగాలు వచ్చాకా అమ్మతో గడిపే సమయం కరువవుతుంటే ఏం చేయటం. నిజంగానే మీకు అమ్మతో కాసేపు గడపి ఆమెని సంతోషంగా ఉంచాలంటే  ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చూద్దామా.   అమ్మకి ఇష్టమైన కాఫీని ఆమె లేచే లోపే తయారుచేసి రెడీగా ఉంచితే? లేవగానే ఒక చిరునవ్వుతో కాఫీని అందించి చూడండి. తనకోసం ఎవరెస్ట్ శిఖరాన్ని గుమ్మం ముందు తెచ్చి ఉంచితే ఎంత ఆశ్చర్యపోతుందో అంత ఆశ్చర్యాన్ని, దాని వెనక ఆనందాన్ని అమ్మ కళ్ళల్లో చూడచ్చు.     అలాగే తనకిష్టమైన ప్లేస్ ఏముందో తెలుసుకుని ఆ ప్లేస్ కి సడన్ గా తీసుకెళ్ళి ఆమె కళ్ళల్లోకి తొంగి చూడండి. ఆ రోజంతా అమ్మని అంటిపెట్టుకుని ఉండి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ బయటనే చేసి ఇంటికి తిరిగి రండి. అంతలా తిరిగి వచ్చినా అమ్మ కళ్ళల్లో కనిపించని నీరసాన్ని చూసి మీకు నీరసం రావాలి.   అమ్మకిష్టమైన వ్యక్తులని ఇంటికి పిలిచి సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసి ఆమెకి ఆనందాన్ని ఇవ్వచ్చు. ఎప్పుడూ మన పనులతో బిజీగా ఉండే ఆవిడ తనకిష్టమైన వాళ్ళతో గడిపుతూ ఎలా సేద తీరుతుందో మీ కళ్ళతో మీరే చూడచ్చు.   ఒక మంచి ఫోటో ఆల్బం కొని  అమ్మకి సంబందించిన అన్నీ ఫొటోస్ పెట్టి  దాన్ని గిఫ్ట్ గా ఇవ్వచ్చు. తనే మరిచిపోయిన ప్రపంచాన్ని తన కళ్ళ ముందు పరవచ్చు. ప్రతిక్షణం  మనకోసమే అలోచించి తన ఉనికినే మర్చిపోయే అమ్మకి ఆనందాన్ని గుర్తుచేద్దాం.   ఇలా ఒక రోజు అమ్మని ఆనందంలో ముంచెత్తి మిగిలిన రోజుల్లో తన గురించి ఆలోచించకుండా ఉండటం మాత్రం ఎంతమాత్రం సబబు కాదు. నిజంగా అమ్మంటే ప్రేముంటే ప్రతిరోజూ ఆమె గురించి ఆలోచిద్దాం. ప్రతి క్షణం ఆమెని సంతోషంగా ఉంచుదాం.   కళ్యాణి

  ఆ మూడు రోజులూ!   ఆడవాళ్లను అన్నిటికంటే ఇబ్బంది పెట్టే సమస్య... నెలసరి. నెల నెలా వచ్చే ఈ ఇబ్బందిని భరించడం అంత తేలికేమీ కాదు. కడుపునొప్పి, కాళ్లు లాగడం, వికారం, విసుగు... ఇలా ఒకటి కాదు రెండు కాదు... ఆ సమయంలో ఎన్నో రకాల సమస్యలు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, కొన్ని నియమాలు పాటిస్తూ ఆ మూడు రోజుల్నీ మూడు క్షణాల్లా గడిపేయవచ్చంటున్నారు నిపుణులు. దానికేం చేయాలంటే...   చాలామంది కడుపు నొప్పిగా ఉందనో, విసుగ్గా ఉందనో భోజనం సరిగ్గా చేయరు. ఏదో కాస్త తినేసి ఊరుకుంటారు. అది చాలా తప్పు. రక్తస్రావం వల్ల శరీరంలోని శక్తి సన్నగిల్లుతూ ఉంటుంది. కాబట్టి సమయానుకూలంగా తగిన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో అవసరం. అలాగే వీలైనంతవరకూ కష్టతరమైన పనులు చేయకూడదు. బరువులు ఎత్తడం లాంటివి చేయడం వల్ల కడుపు, నడుము నొప్పులు ఎక్కవవుతాయి. శానిటరీ న్యాప్ కిన్ ని తరచూ మార్చుకుంటూ ఉంటే చిరాకు ఉండదు. కొందరు రోజంతా ఒక్కటే న్యాప్ కిన్ తో నెట్టుకొచ్చేస్తుంటారు. దానివల్ల మనకు తెలియకుండా కాస్తంత చిరాకు ఉంటుంది. అది లేకుండా ఉండాలంటే రెండు మూడుసార్లు న్యాప్ కిన్ మార్చుకోవాలి. రక్తస్రావం అవుతోంది కదా అని జననాంగాలను పదే పదే శుభ్రం చేసుకోవడం కూడా పొరపాటే. అక్కడ మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది. మితిమీరి శుభ్రం చేయడం వల్ల అది పోతుంది. అంతేకాదు... ఈ సమయంలో వీలైనంత వరకూ శృంగారానికి దూరంగా ఉండాలి. లేదంటే ఇన్ఫెక్షన్లు రావడమే కాదు... కడుపు, నడుము నొప్పి తీవ్రమయ్యే అవకాశం కూడా ఉంది.   బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే... మనసుకు నచ్చే పనులు చేయాలి. ఎందుకంటే నెలసరి సమయంలో మానసికంగా కూడా కొన్ని తేడాలు వస్తుంటాయి. అందుకే నచ్చని పనులు చేస్తే విసుగు, కోపం, ఒత్తిడి వంటివి కలుగుతాయి. దానికి అవకాశం లేకుండా ప్రశాంతంగా ఉండటానికి ట్రై చేయాలి. మ్యూజిక్ వినడం లాంటి హాయిపర్చే ఇష్టాలకు సమయం కేటాయించండి. అలాగే ఏది పడితే అది తినేయకూడదు. ఈ సమయంలో వీలైనంత వరకూ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. నూనె, కారం, మసాలాల జోలికి పోవద్దు. లైట్ ఫుడ్ తీసుకుంటేనే అంతా పీరియడ్స్ ఇబ్బందుల్ని కూడా లైట్ గా తీసుకోగలం.   ఇప్పటివరకూ మీరు కనుక ఈ కేర్ తీసుకుని ఉండకపోతే ఇప్పుడు తీసుకుని చూడండి. కచ్చితంగా తేడాను గమనిస్తారు. ఎప్పడూ ఇబ్బందిగా ఫీలయ్యే ఆ మూడు రోజులూ ఈసారి ఎప్పుడు గడిచిపోయాయో తెలియనంతగా రిలీఫ్ ఫీలవుతారు. ట్రై చేయండి. - Sameera

ఆడవాళ్లలో ప్రేమ పాళ్లు ఎక్కువట     కుటుంబసభ్యులతో కానీ.. సన్నిహితులతో కానీ.. సహచరులతో కానీ ప్రేమానుబంధాలు బలంగా ఉండాలంటే మీరు ముందుగా ప్రేమను పంచటం లేదా ప్రేమగా మాట్లాడటం అత్యంత ఆవశ్యకం.. అయితే ప్రేమను ఆడవాళ్లు బాగా పంచుతారా...? మగవాళ్లు పంచుతారా..? అన్న ప్రశ్న చాలా సందర్భాల్లో.. చాలా వేదికల మీద విని ఉంటాం. ఆడవాళ్లది ఏముందండి..? మేమే బాగా చూపించగలమని మగవాళ్లు.. కాదు.. కాదు మేము అని ఆడవాళ్లు ఇలా రకరకాలుగా వాదించుకుంటూ ఉంటారు. ఇలాంటి వారికి సమాధానం చెప్పడానికి యూనివర్శిటీ ఆఫ్ జ్యూరిచ్ పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు.   సహాయగుణం, ప్రేమతత్వం మగవారిలో కంటే ఆడవారిలోనే ఎక్కువని తేల్చారు. మగువల మస్తిష్కంలో ఎల్లప్పుడూ స్నేహపూర్వకమైన, ప్రేమపూర్వకమైన ఆలోచనలు మెదులుతూ ఉంటాయని.. పరిశోధకుల బృందం తేల్చింది. కాగా, ఇదే సమయంలో మగవారి ఆలోచనలు మోసపూరితంగా, లాభాపేక్షతో కూడినవిగా ఉంటాయని తెలిపింది. మగవారి కంటే ఆడవారు మృధు స్వభావం కలిగినవారని, నలుగురితో కలుపుగోలు తనంగా ఉండటమే కాకుండా.. వారి శ్రేయస్సును కాంక్షిస్తారని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు తేల్చాయని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన డాక్టర్ అలెగ్జాండర్ సౌట్స్‌చెక్ చెప్పారు. లాభం కోసం నిర్ణయాలు తీసుకోవడంలో మగవారు ముందుంటారని ఆయన అన్నారు. మెదడు పనితీరు, ఆలోచనా విధానం వల్లే స్త్రీ, పురుషుల మధ్య ఇలాంటి వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ సర్వేలో వివిధ దేశాలకు చెందిన 27 ఏళ్ల పురుషులు, 26 ఏళ్ల మహిళలు పాల్గొన్నారు. 

విజయానికి చిరునామా ఈ విజయ గొల్లపూడి..!  

స్వశక్తితో గెలిచి నిలిచిన స్త్రీశక్తి దుర్గ డింగిరి..  

మధ్య తరగతి మహిళ సాధించిన విజయాలు  

Bridal Makeup Tips      Usually bridal makeup is heavy as the girls want to look special, but less is more and keep it minimal. It's a good idea for a bride to start taking care of her skin and hair a couple of months before the wedding day. With a glowing skin, the job gets much easier for a makeup artist to achieve a flawless base. The makeup starts with primer to smoothen out the skin. After that, comes foundation. Get the base right. Most of us want to look fairer than what we already are, which is a very bad idea as you end up looking made up. Even the pictures come out very badly. So make sure the base is applied and blended very well and matches skin tone. Many brides go for glitter on their eyes along with heavy eye makeup. It's a complete bad idea. "It's important to do up the eyes really well. But make sure not to use too many colours or too much glitter as it looks tacky. Use highlighter under the brow bone. Use eyeliner to make the eyes stand out. Eye lashes are also a good option, but it's very important to use natural lashes with real hair. For the cheeks,coral colour looks better. as it blends well with Indian skin tone. While doing lip makeup, apply lip liner before lipstick. But make sure the lip line doesn't look different from the lipstick. Avoid using a gloss as it ends up bleeding and smudging the lipstick. Once the makeup is done, spray a makeup fix on the face to make it stay longer and fresh.  

చిటికెలో బెడ్ లాంప్ తయారీ ఎలా?     మాములుగా పడుకునే సమయంలో బెడ్ లాంప్ లాంటివి ఆన్ చేసి పడుకోవడం మనం రోజు చేసే పని. ఒకవేళ మన ఇంట్లో బెడ్ లాంప్ లేకుంటే? లేదంటే మీరు వాడె బెడ్ లాంప్ మీకు నచ్చకపోతే ? షాప్ కి వెళ్లి కొత్త బెడ్ లాంప్ కొని తెచ్చుకుంటారు అంతే కదా! దీనివల్ల డబ్బులు వృధా అయినట్లే. ఒకవేళ మీ ఇంట్లోని వస్తువులతోనే... మీకు నచ్చినట్లుగా బెడ్ లాంప్ ను డిజైన్ చేసి తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి !. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్రింది విధంగా బెడ్ లాంప్ ను తయారు చేసుకోండి. మరి ఈ బెడ్ లాంప్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా...!   కావలసిన వస్తువులు : ఒక మీడియం సైజ్ వాటర్ బాటిల్, ప్లాస్టిక్ చెంచాలు (స్పూన్స్), బల్బు, కట్టర్, అంటించడానికి కావలసిన వస్తువు(ఫెవికోల్, హీటర్ లాంటివి).   తయారు చేయు పధ్ధతి : ముందుగా చెంచాల యొక్క స్టిక్ భాగాన్ని కట్ చేసుకోవాలి. అదే విధంగా బాటిల్ యొక్క కింది భాగాన్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క చెంచాను పైన ఫోటోలో చూపించినట్లుగా హీటర్ తో అతికించుకుంటూ డెకరేట్ చేయాలి. ఇలా పూర్తిగా చేసిన తర్వాత పైన బాటిలో యొక్క మూత (క్యాప్) కు రంద్రం చేసి, దాని నుండి వైర్ ను తీసి బల్బును అమర్చుకోవాలి. ఆ తర్వాత ఆ క్యాప్ ను ఆ బాటిల్ కు బిగించేసి.. ఆ బాటిల్ ను మీకు కావలసిన ప్రదేశంలో తగిలించుకొని, బల్బు కు కరెంట్ కనెక్షన్ ఇస్తే బెడ్ లాంప్ వెలుతురుతో అదిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ గదిలో ఇలాంటి బెడ్ లాంప్ ను మీరే తయారుచేసి పెట్టుకోండి.

    దేశానికి తిరిగివ్వాలంటే శ్రీమంతుడు కానక్కర్లేదు   గ్రామాలను దత్తతు తీసుకోవడం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. డబ్బున్న వ్యాపారవేత్తలు, పేరున్న సినిమా హీరోలు ఏదో ఒక గ్రామాన్ని దత్తతు తీసుకుని వార్తల్లో నిలుస్తున్నారు. కానీ ఒక సాదాసీదా వైద్యురాలు ఓ మారుమూల గ్రామాన్ని దత్తతు తీసుకుని వారి జీవితాల్లో భాగమైపోయిన్న వార్తని ఎప్పుడన్నా విన్నారా. ఆ వైద్యురాలే ‘సీమా సాదికా’     వైద్యురాలిగా దాదాపు ఓ దశాబ్దం క్రితమే సీమా సాదికా వైద్యవృత్తిలో పట్టా పుచ్చుకున్నారు. అయితే మారుతున్న అవసరాలకు అనుగుణంగా వైద్యంలో ఏదన్నా ప్రత్యేకమైన విభాగాన్ని ఎంచుకోవాలని సీమా అనుకున్నారు. రకరకాల అవసరాలనీ, వేర్వేరు అనుభవాలనీ దృష్టిలో ఉంచుకొని చివరికి ‘యాంటీ ఏజింగ్’ విభాగంలో ముందుకు సాగేందుకు నిర్ణయించుకున్నారు. పోషకాహారం మొదలుకొని స్టెమ్‌ సెల్‌ థెరపీ వరకూ రకరకాల పద్ధతుల ద్వారా ఒక మనిషిని మరింత యవ్వనంగా చూపించే ప్రక్రియే ఈ యాంటీ ఏజింగ్‌! యాంటీ ఏజింగ్ విభాగంలో తగినంత నైపుణ్యం సాధించిన సీమా 2009లో AURA ANTI-AGING CENTREని స్థాపించారు. కొద్దిరోజుల్లోనే ఈ కేంద్రం బెంగళూరులో మంచి పేరుని తెచ్చుకుంది.     ఆలోచన రేకెత్తించిన ప్రశ్న సీమాకి మొదటి నుంచి సామాజిక సేవ చేయడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఆ ఇష్టంతోనే ఆమె కర్ణాటకలోని మారుమూల గ్రామాలలో వైద్యశిబిరాలను నిర్వహించేవారు. అలా ఒకసారి ఎక్కడో వైద్యశిబిరం నిర్వహిస్తుండగా ఒకామె సీమా దగ్గరకు వచ్చింది. ‘‘మీరు ఆర్నెళ్లకి ఓసారి వైద్యశిబిరాలను నిర్వహిస్తారు. ఆ సమయంలో మాలో ఏవన్నా రోగాలు కనిపిస్తే మందూమాకూ ఇస్తారు. కానీ మీరు వెళ్లిపోయాక మా పరిస్థితి ఏంటి! అప్పుడు ఏమన్నా అనారోగ్యం వస్తే చికిత్స తీసుకునేందుకు మా దగ్గర డబ్బులు ఉండవు కదా!’’ అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నతో సీమాకి ఆలోచనలు మొదలయ్యాయి. ఏదో తాత్కాలికంగా వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తే వారి జీవితం బాగుపడదనీ... విద్య, ఉపాధి, పారిశుద్ధ్యం, పోషకాహారం వంటి ఎన్నో రంగాలలో వాళ్లు ముందుకు అడుగు వేయనిదే బతుకులు మారవనీ అర్థం అయ్యింది. ఆ ఆలోచనతోనే గత సంవత్సరం ‘నమ్మ మిత్ర’ (మన స్నేహితుడు) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటయ్యింది.     ఊరినే మార్చేశారు నమ్మ మిత్ర సంస్థ ఆధ్వర్యంలో సీమా, కర్ణాటకలోని బనాదూర్‌ గ్రామం (ధార్వాడ్‌ జిల్లా) బాగోగులను చూడాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తులలో ఉండే కుమ్ములాటలు, అభిప్రాయబేధాలు, రాజకీయాలు... వంటి అడ్డంకులన్నింటినీ దాటుకుని ఆ గ్రామాన్ని అభివృద్ధి వైపుగా నడిపిస్తున్నారు. - గ్రామంలో ఒక సోలార్‌ గ్రిడ్‌ని ఏర్పాటు చేసి 70 ఇళ్లకి విద్యుత్‌ సౌకర్యాన్ని అందించారు. - E-Shala పేరుతో గ్రామంలోని 6-10 తరగతి పిల్లలు రాత్రివేళల్లో చదువుకునేలా ఒక ఉపాధ్యాయుడినీ, దృశ్యశ్రవణ పరికరాలనీ సమకూర్చారు. - గ్రామంలో మొబైల్‌ ఫోన్‌ రిపేరింగ్‌ సెంటర్‌, కుట్టు శిక్షణా కేంద్రాలు వంటివి ఏర్పాలు చేశారు. ఊరిబడిలో కంప్యూటర్‌ ల్యాబ్‌ని ఏర్పాటుచేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. - నమ్మ మిత్ర తరఫున పనిచేసే స్వచ్ఛంద సేవకులు ఎప్పటికప్పుడు గ్రామంలోని పరిస్థితులను అంచనా వేస్తూ, అవసరమైన చోట తమ సేవలను వినియోగిస్తూ ఉంటారు. ‘నమ్మ మిత్ర’ బనాదూర్ గ్రామంలో చేస్తున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇవ్వడంతో, రాష్ట్రంలోని మిగతా గ్రామాలకు కూడా ఈ సేవలను విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశానికి ఉపయోగపడాలి, గ్రామాలకు ఏమన్నా చేయాలి అన్న లక్ష్యాలు కేవలం శ్రీమంతులకే పరిమితం కాదనీ... మంచితనం, సంకల్పం ఉంటే ఎవరి పరిధిలో వారు అద్భుతాలు సాధించగలరనీ సీమా సాదికా నిరూపిస్తున్నారు.   - నిర్జర.

ఆడవాళ్లని వస్తువులుగానే చూస్తారు!     ఆడది విలాసవస్తువు కాదు. ఆడవాళ్లని సెక్స్ సింబల్స్‌గానే భావించడం సంస్కారం కాదు... ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాము. ఆ మాటల వెనుక నిజం ఉన్నదనీ మనకు తెలుసు. కానీ నిజంగా మన మెదడు ఆడవాళ్లని, మగవాళ్లని చూసే తీరులో ఏమన్నా మార్పు ఉందా? అన్న అనుమానం వచ్చింది ఓ పరిశోధకుడికి. బెల్జియంకు చెందిన Philippe Bernard అనే ఈ పరిశోధకుడు తనకు వచ్చిన అనుమానాన్ని ఓసారి నిజమో కాదో తేల్చుకోవాలనుకున్నాడు. మన మెదడు వస్తువులని వేరేగా, మనుషులని వేరేగా గమనిస్తుంది. అందుకు ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక పెన్ను ఉందనుకోండి. అందులోని క్యాప్ మాత్రమే చూపిస్తే.... అది పెన్నుకి సంబంధించిన భాగమని పసిగట్టేస్తాం. అదే ఒక మనిషి ముక్కుని మాత్రమే చూపిస్తే, అది ఎవరితో కనిపెట్టేందుకు చాలా ఇబ్బంది పడతాము. వస్తువులనీ, మనుషులనీ పసిగట్టడంలో మరో తేడా కూడా ఉంది. మనుషులని తిరగేసి చూసినప్పుడు, వారు ఫలానా అని గుర్తించడం కొంచెం కష్టం. కానీ వస్తువులని తిరగేసి చూసినా, మామూములుగా చూసినా... ఇది పెన్ను, ఇది పుస్తకం, ఇది టీవీ అని ఠక్కున చెప్పేయగలుగుతాం. వస్తువులనీ, మనుషులనీ మెదడు ప్రాసెస్ చేసే తీరునిబట్టి, జనం ఆడవాళ్లని ఎలా చూస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు. ఇందుకోసం తక్కువ దుస్తులలో ఉన్న మోడల్స్ బొమ్మలని ఎన్నుకొన్నారు. వీరిలో మగవారి ఫొటోలు, ఆడవారి ఫొటోలు రెండూ ఉన్నాయి. ఈ ఫొటోలను కొందరికి తిరగేసి చూపించారు. ఆ తర్వాత కాసేపటికి అదే ఫొటోని సరిగ్గా నిలబెట్టి చూపించి... ‘ఇందాక మీరు చూసిన ఫొటోలో వ్యక్తే ఇందులో ఉన్న వ్యక్తీ ఒకరేనా!’ అని అడిగారు. పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయేలా... ప్రేక్షకులు ఆడవారి ఫొటోలను సరిగ్గానే పోల్చుకోగలిగారు. కానీ మగవారి ఫొటోలని పోల్చుకోవడంలో కాస్త ఇబ్బంది పడ్డారు. అంటే! ఆడవారిని వస్తువులుగానూ, మగవారిని మనుషులుగానూ గుర్తిస్తున్నారన్నమాట. ఇలా గుర్తించినవారిలో ఆడవారు, మగవారు ఒకేవిధంగా తప్పు చేయడం మరో విచిత్రం! ఈ వివక్ష కేవలం ప్రకటనలో కనిపించే మహిళల పట్లేనా లేకపోతే, మన నిజజీవితంలో ఎదురుపడే ప్రతి ఆడవారినీ మనం వస్తువులుగానే చూస్తున్నామా అని తేల్చేందుకు త్వరలోనే మరో పరిశోధన చేపట్టనున్నారట. Philippe Bernard చేసిన ఈ పరిశోధన ఫలితం కాస్త బాధ కలిగించేదే! అయితే తరతరాలుగా మన సమాజం ఆడవారిని చూస్తున్న తీరు వల్లే, మన మెదడు కూడా ఇలా మారిపోయి ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. మరి దీని పర్యవసానం ఏమిటో !!! - నిర్జర.

నచ్చినవాడితో పరిచయం ఎలా పెంచుకోవాలి....? ప్రతి అమ్మాయికి కూడా అందరూ అబ్బాయిల యొక్క దృష్టిని తమ వైపు చూసేలా చేసుకోవడం చాలా సులభం. కానీ తనకు ఇష్టమైన అబ్బాయితో మొదటిసారిగా మాట్లాడటం ఎలాగో తెలియక కంగారు పడుతుంటారు. మీకు నచ్చిన అబ్బాయిని ఆకర్షించేలా చేయడంతో పాటు, ఇద్దరి మధ్య సంభాషణ ఎలా మొదలు పెట్టాలో కొన్ని చిన్ని ప్రయత్నాలు చూద్దామా...!   మీకు ఇష్టమైన వ్యక్తి దగ్గరకు ఆత్మ విశ్వాసంతో వెళ్ళి ‘హాయ్, మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా?'' అని ఇలా పలకరించండి. అతని దగ్గర నుండి ఎటువంటి సమాధానం వచ్చినా సరే.. మీ మధ్య ఖచ్చితంగా సంభాషణ మొదలవుతుంది. దీనివల్ల మీకు ఇష్టమైన వ్యక్తితో మాట కలుపుకోవడానికి ఇది ఒక మంచి ప్రయత్నం.     ప్రపంచంలో తల్లిదండ్రులకైనా సహాయం చేస్తారో లేదో తెలియదు కానీ.. అమ్మాయిలు అడిగిన వెంటనే అబ్బాయిలు ఏ పనైనా చేయడానికి ముందుకు వస్తారు. మీకు నచ్చిన వ్యక్తి దగ్గరగా ఉంటే అతడిని ఏదైనా సహాయం అడగండి. మీరు అతన్ని అలా అడగడం వల్ల అతను లక్కీగా ఫీల్ అవుతాడు. ఇంకా మీరేదైనా అడ్రెస్ కనుక్కోవాలనుకొన్నప్పుడు, మీ చేతిలో ఏదైనా బరువైన వస్తువు ఉన్నప్పుడు, లేదా అతను కూర్చున్న పక్కనే ప్లేస్ ఉంటే.."కుర్చోవచ్చా" అంటూ ఏదో ఒక విధంగా వారి సహాయం అడగండి. అమ్మాయిలకు హెల్ప్ చేయడం అంటే అబ్బాయిలకు చాలా ఇష్టం. సరదా. ఎప్పుడైతే అతను మీకు హెల్ప్ చేస్తారో అప్పుడు ఇక చిరునవ్వుతో థాక్స్ చెప్పండి అక్కడి నుండే మొదలవుతుంది మీ మధ్య అసలైన ముచ్చట్లు.     మీకిష్టమైన వ్యక్తితో దగ్గరగా మాట్లాడాలి అనుకుంటే... అతనికి దగ్గరగా వెళ్ళుతున్నప్పడు తెలియకుండానో లేదా పోరపాటుగానో మీ దగ్గర ఉన్న పెన్, బుక్స్, కూరగాయలు, ఖర్చిఫ్ వంటి ఏదైనా ఒక వస్తువును వదిలేయండి. దాంతో వాటిని మీకు ఖచ్చితంగా తీసి ఇస్తాడు. కానీ మీరు పడేసుకున్న వస్తువు అతనికి కనిపించేలా మాత్రమే పడేయండి. లేకపోతే అతని స్థానంలోకి మరో హీరో దిగిపోతాడు. అతను చేసిన సహాయానికి చిరునవ్వు నవ్వి, కృతజ్ఞతలు తెలియజేయండి. ఇలా చేయడం వల్ల అప్పుడు అతను కూడా బదులిస్తాడు. దీనివల్ల మీరు ఇపుడు మాట్లాడకపోయినా మరోసారి కలిసినపుడైనా.. ఈ విషయం గుర్తు చేసి అతనితో మాట్లాడవచ్చు.     ఈ సలహాలతో ఖచ్చితంగా అబ్బాయిలు ఫ్లాట్ అయిపోతారు. ఇంకెందుకు ఆలస్యం. మీ గ్రీకువీరుడు కోసం మీ ప్రయత్నాలు మొదలుపెట్టండి మరి.

  Steps to make your WORK FROM HOME Life Easy     Managing to work and having a young child is not atall an easy task. Everyday starts with a thought and a worry if we can handle things in a better way today or not. Having a child who needs our attention and having kids who go to School/ College is totally different. Every moment of our day should be well planned when handling a child simultaneosly. However, plans dont always be successful ones, however, practice makes one perfect. Slowly your child also gets used to your routine and understands that Mom cannot be disturbed always. Working from home involves Phone calls and so many phone calls..for every big matter to be discussed, we should pick up the Phone..the Child will be irate looking at Mom always on phone calls...they start to cry, fuss and fret the moment we hold the phone, sometimes they even learn to turn off the computer or hide the phone..it is very risky when we have Important, Urgent Business calls with Clients, or someone new we need to get in business with.   Following these steps makes our life easy: Making up our mind that we will be calm and not frustrated, today. Arranging a play area/room for the child and a work station for you, that is not in an easy-reach zone to the Child. Setting up a daily routine for them so that they know what to expect. Making sure you dont get your child too used to watching TV, just to make them stay quiet. Spending short moments with them. Not being angry with the Child when they are sleepy/hungry or need your help. Informing the Employer that you have a Child/ or more than one so that they oblige your short breaks of being away from the phone or computer. Hope these tips help you have a better day!!!   - Prathyusha Talluri

  Practice meditation: Entering motherhood is very hectic. Having sleepless nights and caring for the newborn leads to stress. After delivery, chances of suffering from blood pressure is very common among women. So, practice meditation. It relaxes your mind, flushes out toxins form the body and boosts up your immune system.   Healthy diet: It is very important to follow a healthy diet during and after pregnancy. Especially after the delivery, the body becomes weak. So you need take care of the dietary intake after delivery. To stay healthy, include foods that are nutritious and filling. Spinach, broccoli, whole grains, fresh fruits and nuts are a must have. Consult your doctor before eating spicy and oily food immediately after delivery (especially after c-section).   Rest: Be very careful if you have had a c-section delivery. This is one important tip to stay healthy in the postpartum state. As your body is weak post delivery, you need to take appropriate rest. If you have had a vaginal delivery, you just need rest for 2 weeks. However, women who go through C-section delivery have to be on bed rest at least for 1-2 months. If you walk or lie carelessly, the stitches will break and the pain will increase.   Breast feeding: It is very important for a new mom to breastfeed the newborn. This is one of the tips to stay healthy after delivery. Many women avoid breastfeeding as it damages the shape of the breast. The first milk is very nutritious and important for the baby. If you do not give the first milk, the baby can suffer from jaundice. Even the mother can suffer from acute breast pain. Skipping breastfeeding can build lumps inside the tissues of the breast and gradually lead to breast cancer.   These are few tips to stay healthy after your delivery....

    ఒక తరాన్ని ప్రభావితం చేసిన ‘లిటిల్ ఉమెన్‌’     నవంబరు 29, 2016- ఉదయాన్నే లేచి గూగుల్‌ని తెరిచినవారందరికీ ఒక వింత డూడుల్‌ కనిపించింది. ఏదన్నా ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేసేందుకు గూగుల్‌ సెర్చ్‌ మీద కనిపించేడాన్ని డూడుల్‌ అంటారు. ఇంతకీ ఆ రోజున కనిపించిన డూడుల్ దేని గురించా అని వెతికిన వారికి అది ‘లిటిల్‌ ఉమెన్‌’ అనే పుస్తకం రాసిన రచయిత్రి గురించని తేలింది. ఆమె పేరే ‘లూసియా మే ఆల్కట్‌’.   ఈ రోజుల్లో స్త్రీవాదానికి సంబంధించిన రచనలు చేయడం అసాధ్యం కాకపోవచ్చు. వాటిని చదివే వారూ, చదివి ఆదరించేవారికీ ఏ లోటూ లేదు. కానీ దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం స్త్రీవాదానికి సంబంధించిన భావాలను అక్షరబద్ధం చేయడం, తన భావాలకు అనుగుణంగా జీవించడం అనే అంశాన్ని ఊహించడం కూడా కష్టంగానే ఉంటుంది. అలాంటి రచయిత్రి కావడం వల్లే లూసియా తొలితరం స్త్రీవాద రచయిత్రులలో ఒకరుగా మిగిలిపోయారు.     1932, నవంబరు 29న అమెరికాలోని ఫిలడెల్ఫియా అనే నగరంలో జన్మించారు లూసియా. లూసియాతో కలుపుకొని వారి తల్లిదండ్రులకి నలుగురు కూతుళ్లు. వారి కుటుంబానికి ఓ చిత్రమైన ప్రపంచం. లూసియా తల్లిదండ్రులు ‘ట్రాన్స్‌డెంటలిస్ట్‌ మూమెంట్‌’ అనే ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండేవారు. ప్రతి మనిషిలోనూ మంచితనం ఉంటుందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మంచితనాన్ని కాపాడుకునేలా జీవించాలనీ చెబుతుంది ఈ ‘ట్రాన్స్‌డెంటలిస్ట్‌ మూమెంట్‌’. ఈ ఉద్యమం మీద హైందవ మత ప్రభావం చాలా ఎక్కువ.     తల్లిదండ్రుల ఆదర్శాల మధ్యా, అక్కాచెల్లెళ్ల అనుబంధాల మధ్యా పెరుగుతున్న లూసియాకి మొదటి నుంచీ రచన అంటే చాలా ఇష్టంగా ఉండేది. దానికి తోడు ‘ట్రాన్స్‌డెంటలిస్ట్‌ మూమెంట్‌’లో ఉన్న ఎమర్సన్‌, థోరో వంటి ప్రముఖ రచయితలతో ప్రత్యక్ష పరిచయాలు కూడా ఆమెకు సాయపడ్డాయి. తన మనసులో మెదిలిన ప్రతి భావానికీ అక్షరరూపం ఇచ్చేందుకు లూసియా ప్రయత్నించేది. వేర్వేరు కలం పేర్లతో కథలు, వ్యాసాలు, నవలలు రాయడం మొదలుపెట్టింది. ఆదర్శాల హోరులో పడి కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో తన వంతు సాయంగా లూసియా చిన్నా చితకా ఉద్యోగాలు చేయసాగింది. ఏం చేసినా రచనలు మాత్రం కొనసాగించేది. ప్రతి సందర్భాన్నీ ప్రశ్నించి, ప్రతి అణచివేతనీ ధిక్కరించే లూసియాకీ ఆమె తండ్రికీ మధ్య గొడవలు మొదలైనా కూడా... ఆమె తలవంచడం నేర్చుకోలేదు. ఇటు ఆర్థికంగానూ, అటు కుటుంబ సమస్యలతోనూ ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు వచ్చినా కూడా... సాహిత్యమే ఆమెకు జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యాన్నిచ్చింది.   1861- బానిసత్వం మీద తలెత్తిన అభిప్రాయ బేధాలతో, అమెరికాలోని రాష్ట్రాలన్నీ రెండు విడిపోయిన కాలం. ఆ సమయంలో చెలరేగిన అంతర్యుద్ధంలో లూసియా నర్సుగా పనిచేసింది. బానిసత్వం గురించీ, ఆసుపత్రుల నిర్వహణా లోపాల గురించి కుండబద్దలుకొట్టినట్లుగా రాసింది. దాంతో లూసియా రచనలలోని నిజాయితీ, స్పష్టత జనానికి తెలియడం మొదలైంది. ఇక 1868లో లూసియా రాసిన ‘లిటిల్ ఉమెన్’ అనే నవల అయితే అమెరికన్‌ సాహిత్యంలో ఓ సంచలనంగా నిలిచిపోయింది.     నలుగురు అక్కాచెల్లెళ్ల జీవితాల చిత్రణే ‘లిటిల్ ఉమెన్’. ఇది పేరుకి మాత్రమే ఓ కాల్పనిక నవల. కానీ అందులోని పాత్రలన్నీ లూసియా చుట్టూ ఉన్నవే. తన చిన్నతనంలో పెరిగిన వాతావరణాన్నీ, ఎదుర్కొన్న సంఘటనలనీ చిన్నపాటి మార్పులూ చేర్పులతో పాఠకుల ముందు ఉంచింది లూసియా. లిటిల్‌ ఉమెన్ నవల ఊహించని విజయాన్ని సాధించడంతో దానికి కొనసాగింపుగా మరో రెండు నవలలు రాసింది లూసియా. వేర్వేరు మనస్తత్వాలు ఉన్న నలుగురు అక్కాచెల్లెళ్ల జీవితాలు ఎలా సాగాయో తెలిపే కథనమే ఈ పుస్తకాలలోని నేపథ్యం. ఇందులోని ‘జో’ పాత్ర స్వయంగా లూసియాదే! కాకపోతే నవలలో ‘జో’కి పెళ్లవుతుంఉది. లూసియా మాత్రం ఆజన్మం వివాహం చేసుకోలేదు.   ఒక తరం అమెరికా ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన పుస్తకంగా లిటిల్‌ ఉమెన్‌ను పేర్కొంటారు. తనదైన వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకోవడం, తనను తాను మలచుకుంటూ కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం... అంతస్సూత్రంగా సాగే లిటిల్‌ ఉమెన్ ఆనాటి స్త్రీలకి ఒక చెదిరిపోని ఆశని అందించింది. ఇప్పటికీ లిటల్‌ ఉమెన్‌ అమెరికా ప్రజలకి ఇష్టమైన 10 పుస్తకాలలో ఒకటిగా నిలుస్తోంది. స్త్రీవాదానికి సంబంధించిన తీక్షణమైన భావాలు ఇందులో లేకపోయినా... స్త్రీ హృదయానికి దగ్గరగా ఉండే భావోద్వేగాలను అక్షరబద్ధం చేయడంతో తరాలు గడిచినా కూడా ఆంగ్ల సాహిత్యంలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరుచుకొంది.   - నిర్జర.

  వ్యాయామంతో మెనోపాజ్ సమస్యలు దూరం   రుతుక్రమం నిలిచిపోయిన మహిళలు ఎదుర్కొనే సమస్యల అన్నీఇన్నీ కావు. మానసికంగానూ, శారీరికంగానూ వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా రాత్రివేళల్లో ఒక్కసారిగా తల వేడెక్కిపోవడం (how flashes), విపరీతంగా చెమటలు పోయడం వంటి సమస్యలతో కంటి మీద కనుకే పట్టకుండా పోతుంది. వీటికి ఒకోసారి హార్మోను థెరపీని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కాస్తంత వ్యాయామం చేస్తే చాలు ఈ సమస్యలు ఇట్టే మాయమైపోతాయని అంటున్నారు నిపుణులు.   రుతుక్రమం (post menopause) ఆగిన స్త్రీలలో వ్యాయామం ఎంతవరకూ ప్రభావమో తేల్చుకునేందుకు స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు నడుం బిగించారు. ఇందుకోసం వారు 234 మంది స్త్రీలను గమనించారు. వీరిలో కొందరికి నిత్యం వ్యాయామం చేసే అలవాటు ఉంది. ఓ 166 మంది మాత్రం ఏ వ్యాయామమూ లేకుండా ఇంటిపట్టునే ఉండే అలవాటు కలిగి ఉన్నారు. ఈ 166 మందిలో ఓ సగం మందిని వారానికి మూడు గంటలపాటైనా వ్యాయామం చేసేలా ప్రోత్సహించారు.   ఇలా ఓ ఇరవై వారాలు గడిచిన తరువాత వారిలో hot flashes, అకారణంగా చెమటలు పట్టడం తగ్గినట్లు తేలింది. అంతేకాదు! రక్తపోటు, అధికబరువు వంటి సమస్యలు కూడా అదుపులోకి వచ్చాయట. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే ఈ అలవాటుని మరో ఏడాదిపాటు కనుక కొనసాగిస్తే వారిలో గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. అంతేకాదు! చాలా ఏళ్లుగా వ్యాయామం చేసే అలవాటు ఉన్న మహిళలు ఎంత ఆరోగ్యంగా ఉంటారో... ఏడాదిపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేసినవారు ఇంచుమించు అంతే ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది.   ఇంతకీ వ్యాయామం చేయడానికీ పోస్ట్‌ మెనోపాజ్ సమస్యలు తగ్గడానికీ మధ్య సంబంధం ఏమిటి? అంటే రెండు కారణాలు చెబుతున్నారు. వ్యాయామం చేయడం వల్ల మెదడులోని డోపమైన్‌, సెరటోనిన్‌ వంటి రసాయనాల మోతాదు పెరుగుతుందట. వీటి వల్ల ఒత్తిడి తగ్గడం, మనసు ప్రశాంతంగా ఉండటం, నిద్ర బాగా పట్టడం వంటి లాభాలు కలుగుతాయి. ఇక తరచూ వ్యాయామం చేయడం వల్ల స్త్రీలు తమ శరీరంలోని ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుకోగలుగుతారని ఇంతకుముందే తేలింది.   పోస్ట్‌ మెనోపాజ్‌లో వ్యాయామం వల్ల లాభం గురించి చెప్పారు సరే! ఇంతకీ ఎలాంటి వ్యాయామం చేయాలన్న దానిమీద కూడా స్పష్టమైన సూచనలు ఇస్తున్నారు. నడవడం, జాగింగ్, ఈత, సైక్లింగ్‌... ఇలా అరగంట పాటు ఒంటికి అలసట కలిగించేలా ఏ వ్యాయామాన్నయినా ఎంచుకోమని చెబుతున్నారు. వారానికి కనీసం ఓ మూడుసార్లన్నా ఈ వ్యాయామాలను చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చునట.   - నిర్జర.  

 Vinayaka Nimajjanam should be ‘Eco-Friendly’ rather than ‘Turning Toxic’!     Ganesh Chathurthi marks the birthday of Lord Ganesha and is celebrated with great pomp and show throughout the country. Ganesh-Utsav, which begins on Ganesha Chaturthi, culminates on Anant Chaturdashi. Hence Ganesh-Utsav is celebrated for 10 days in the month of Bhadrapada. The last day of festivity is known as Vinayaka Nimajjanam. On the Vinayaka Nimajjanam day, Ganesha is given a grand farewell and the idols that were installed for the festival are carried to the nearby river, lake or sea front and immersed with a lot of devotion by chanting the slogan: "Ganpati bappa moriya". But after celebrating the festival with such enthusiasm, Lord Ganesha’s farewell is turning the water bodies’ toxic – is our procedure of Idol Worship and Nimajjanam right? Here are some eco-friendly methods of Vinayaka Nimajjanam:- Take a large size tub or bucket, fill it with water and immerse the idol of Shree Ganesh in the tub or the bucket. Let the idol dissolve completely and later this water can be poured in sacred plants like tulsi. One can reuse the same idol every year and immerse a betel nut instead to symbolically complete the ritual. Making idols out of naturally occurring materials like Clay or Sandalwood paste is always a better option, since the idols dissolve completely in water. Immersing the idols in small, closed tanks than water bodies helps reduce the pollution. Encouraging the concept of ‘Green Ganesha’ & ‘Plant Ganesha’ will give us a cleaner greener future. We hope you would like our article. After all our devotion shouldn't depend upon the size of our idols, right? Be the change you want to see. Next year, let us all make a promise to ourselves to celebrate the festival in a pure manner, which is eco-friendly. Let's dirty our hands a little for a greener future! - Priya Ganapathi

  ఇంట్లోనే బుల్లి బొజ్జగణపతి   వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఓ బుల్లి వినాయకుడు ఉండాల్సిందే. ఇంకా వారం రోజుల టైం ఉంది కాబట్టి మనం ఇంట్లో పెట్టుకునే వినాయకుడిని బయట కెమికల్స్ వేసి తయారు చేసే వినాయకుడిని పెట్టుకోవడం కన్నా మట్టితో చేసే వినాయకుడిని పెట్టుకుంటే ఎంతో మంచిది. ఈ బుల్లి వినాయకుడిని మన ఇంట్లో ఉండే పిల్లలతోనే తయారు చేయిస్తే వారు కూడా చాలా హ్యాపీగా ఫీలవుతారు. మరి తయారుచేయడం ఏలాగో ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతోంది...   https://www.youtube.com/watch?v=1xVBKPiMFDE