మధ్య తరగతి మహిళ సాధించిన విజయాలు  

  దేశం మర్చిపోయిన మహిళా శాస్త్రవేత్త - అన్నామణి     ఆమధ్య ఇస్రో వందకు మించిన ఉపగ్రహాలను ఆకాశంలోకి పంపగానే దేశం యావత్తూ గర్వపడింది. ఇస్రోలో మహిళా శాస్త్రవేత్తల మీద ప్రత్యేకమైన కథనాలు రాసేందుకు పత్రికలన్నీ ఉత్సాహ పడిపోయాయి. మంచిదే! కానీ ఆడవారిలో నూటికి ఒక్కరు కూడా చదువుకునే అవకాశం లేని రోజుల్లోనే... ఒక మహిళ విజ్ఞానరంగంలో దూసుకుపోవడం ఎంతటి విజయమో కదా! అలాంటి అరుదైన విజయాన్ని సాధించిన వ్యక్తి ‘అన్నామణి’. కేరళలోని ట్రావెన్కోర్ పట్నానికి సమీపంలోని ఓ చిన్న ఊరిలో 1918లో జన్మించారు అన్నామణి. తండ్రి ఇంజనీర్ కావడం చేతనో ఏమో... చిన్నప్పటి నుంచే ఆమెకు చదువంటే చాలా ఇష్టంగా ఉండేదట. ఆ ఇష్టంతోనే విపరీతంగా పుస్తకాలను చదివేవారు. ఆమె ఎనిమిదో ఏట బంగారు దిద్దులను బహుమతిగా ఇస్తానంటే కాదు... బ్రిటానికా ఎన్సైక్లోపీడియా కావాలని అడిగారట అన్నామణి. ఆమె పెరిగేకొద్దీ చదువు పట్ల ఆమె ఆసక్తి కూడా పెరుగుతూనే వచ్చింది. అందుకనే తన తోటివారంతా త్వరత్వరగా పెళ్లిళ్లు చేసేసుకుంటే, అన్నామణి మాత్రం చదువుకునేందుకే ప్రాధాన్యతని ఇచ్చారు. అలా తనకి ఇష్టమైన భౌతికశాస్త్రంలో బీఎస్సీ ఆనర్స్ డిగ్రీని సాధించారు. చదువు పూర్తయిపోయిన తరువాత డాక్టరేట్ పట్టా కోసం సర్ సి.వి.రామన్ లేబొరేటరీలో చేరారు మణి. అక్కడ ఒకటి కాదు, రెండు కాదు కాంతి గురించి ఏకంగా ఐదు రీసెర్చి పేపర్లను అందించారు. అయినా స్త్రీ అన్న కారణంగా మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజి ఆమెకు పీహెచ్డీ పట్టాను అందించేందుకు సిద్ధపడలేదు. ఏవో చిన్నాచితకా సాకులు చూసి ఆమె శ్రమను వృధా చేసేసింది. అయినా అన్నామణిలో పట్టుదల ఏమాత్రం తగ్గలేదు సరికదా... ఈసారి ఉన్నత విద్య కోసం ఏకంగా అమెరికాకే ప్రయాణమయ్యారు. అమెరికాలో వాతావరణశాస్త్రం (Meteorology)లో ఉన్నతవిద్యను పూర్తిచేసి 1948లో దేశానికి తిరిగివచ్చారు అన్నామణి. అ సమయంలో దేశంలోని విజ్ఞానరంగం ఇంకా ప్రారంగభదశలోనే ఉంది. శాస్త్రపరిశోధనకు తగిన మౌలిక సదుపాయాలు కానీ, స్థిరమైన సంస్థలు కానీ లేవు. అలాంటి పరిస్థితులలో పునేలోని Indian Meteorological Departmentలో చేరారు అన్నామణి.   విజ్ఞానరంగానికే అంతగా ప్రాముఖ్యత లేని ఆ కాలంలో ఇక వాతావరణశాస్త్రం గురించి చెప్పేదేముంది. అసలు వాతావరణానికి ఓ ప్రత్యేకమైన శాఖ అన్న విషయమే జనాలకి ఆశ్చర్యంగా ఉండేది. అలాంటి శాఖతో అద్భుతాలు చేసి చూపారు అన్నామణి. దేశంలోని వివిధ ప్రాంతాలలో సోలార్ రేడియేషన్ స్థాయిని కొలిచే ప్రయత్నం చేయడం; ఓజోన్ పొర తీరు గురించి ఎప్పటికప్పుడు వివరాలను సేకరించడం; పవన విద్యుత్తు, సోలార్ విద్యుత్తుని ఉత్పత్తి చేసేందుకు అనువైన ప్రాంతాలను ఎంపిక చేయడం... ఇలా వాతావరణ శాఖకి కూడా ఓ ప్రత్యేకత ఉందని నిరూపించారు. ఆ ప్రతిభతోనే భారత వాతావరణశాఖకు డిప్యూటీ డైరక్టర్ జనరల్ స్థాయికి చేరుకున్నారు. ఆడవారికి చదువే దండగనుకునే కాలంలో ఉన్నత విద్యతో పాటు ఉన్నతమైన పదవులనీ అలంకరించారు అన్నామణి. ఆవిడ వృత్తి జీవితమే కాదు, వ్యక్తిగత జీవితం కూడా అంతే ఉన్నతంగా ఉండేది. చిన్నప్పుడు ఎప్పుడో గాంధీగారిని చూసి ప్రభావితం అయిన అన్నామణి తన జీవితాంతమూ ఖాదీ వస్త్రాలనే ధరించేవారు. ఎంతసేపూ విజ్ఞానరంగానికి ఏదన్నా చేయాలనే తలంపుతో ఆమె అవివాహితగానే మిగిలిపోయారు. దేశానికి ఇంత సేవ చేసినా కూడా మీడియా ఆమెను విస్మరించడం ఆశ్చర్యకరం. అన్నామణి చనిపోయి ఇప్పటికి 15 సంవత్సరాలు గడుస్తున్నా దేశ ప్రజలు ఆమె సేవలను గుర్తుచేసుకోకపోవడం బాధాకరం. బహుశా అన్నామణి ఇలాంటి గుర్తింపునో, కృతజ్ఞతనో ఆశించి తన జీవితాన్ని గడిపి ఉండరు. విజ్ఞానం పట్ల ఆసక్తి, చేస్తున్న పనికి న్యాయం చేయాలనే తపనే ఆమెను ముందుకు నడపించి ఉంటాయి. అంత ఉన్నతంగా ఆలోచించడం మనవల్ల కాదు కాబట్టి, ఆమెని ఇంకా గుర్తించలేకపోతున్నాం. - నిర్జర.

Bridal Makeup Tips      Usually bridal makeup is heavy as the girls want to look special, but less is more and keep it minimal. It's a good idea for a bride to start taking care of her skin and hair a couple of months before the wedding day. With a glowing skin, the job gets much easier for a makeup artist to achieve a flawless base. The makeup starts with primer to smoothen out the skin. After that, comes foundation. Get the base right. Most of us want to look fairer than what we already are, which is a very bad idea as you end up looking made up. Even the pictures come out very badly. So make sure the base is applied and blended very well and matches skin tone. Many brides go for glitter on their eyes along with heavy eye makeup. It's a complete bad idea. "It's important to do up the eyes really well. But make sure not to use too many colours or too much glitter as it looks tacky. Use highlighter under the brow bone. Use eyeliner to make the eyes stand out. Eye lashes are also a good option, but it's very important to use natural lashes with real hair. For the cheeks,coral colour looks better. as it blends well with Indian skin tone. While doing lip makeup, apply lip liner before lipstick. But make sure the lip line doesn't look different from the lipstick. Avoid using a gloss as it ends up bleeding and smudging the lipstick. Once the makeup is done, spray a makeup fix on the face to make it stay longer and fresh.  

ఆ రోజుల్లో సెలవు ఇస్తే ఏం!     స్త్రీలు మగవారితో సమానంగా అన్ని బాధ్యతలూ పంచుకుంటున్న రోజులివి. తాము ఏ రంగంలోనూ తక్కువ కాదని రుజువు చేస్తున్న యుగం ఇది. కానీ తమకి చేయూతగా నిలుస్తున్న ఆడవారిని సమాజం ఎంతవరకూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది అంటే జవాబు కష్టమే! వారికి మాత్రమే ప్రత్యేకమైన సమస్యలని పట్టించుకునేవారు కానీ, సహానుభూతితో స్పందించేవారు కానీ ఎవరున్నారు అంటే కనిపించేవారు తక్కవే! అందుకు ఉదాహరణే స్త్రీలు తమ రుతుక్రమం సమయంలో ఎదుర్కొనే సెలవు సమస్య!   ఎందుకీ బాధ స్త్రీలు తమ పీరియడ్స్‌ సమయంలో శారీరికమైన ఇబ్బందులను ఎదుర్కొంటారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సమయంలో వారి గర్భాశయం చుట్టూ ఉన్న రక్తనాళాల మీద విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుంది. దీనికి తోడు prostaglandins అనే రసాయనాలు కూడా విడుదల కావడంతో పొత్తికడుపు చుట్టూ ఉన్న కండరాలు కుంచించుకుపోయి మరింత బాధకి దారితీస్తాయి. కేవలం కండరాల నొప్పులే కాదు, పీరియడ్స్‌ సమయంలో రకరకాల ఆరోగ్య సమస్యలు మహిళలను చుట్టుముట్టే అవకాశం ఉంది. వాంతులు, విరేచనాలు, తలనొప్పి, వెన్నునొప్పి, క్రుంగుబాటు వంటి ఇబ్బందులెన్నింటినో ఎదుర్కోవలసి రావచ్చు. రుతుక్రమంలో వచ్చే ఇలాంటి సమస్యలని వైద్య పరిభాషలో dysmenorrhoea అంటారు.   మరోసారి వెలుగులోకి గత వారం బీబీసి రేడియో చేసిన ఒక సర్వేతో ‘పీరియడ్స్ సమయంలో ఉద్యోగం’ అనే సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ సర్వేలో పాల్గొన్న దాదాపు వేయిమంది చెప్పిన విషయాలు ఈ సమస్య తీవ్రతని తేల్చిచెప్పాయి. ఈ వేయిమందిలో 52 శాతం మహిళలు, పీరియడ్స్‌ సమయంలో వచ్చే నొప్పి తమ విధి నిర్వహణ మీద ప్రభావితం చేస్తోందని చెప్పారు. వారిలో ఒక మూడో వంతు మందైతే ఆ నొప్పి కారణంగా సెలవు తీసుకోవాల్సి వచ్చిందని వాపోయారు. ఏతావాతా ప్రతి పదిమందిలో తొమ్మిదిమంది తాము ఏదో ఒక సమయంలో పీరియడ్స్‌ నొప్పుల కారణంగా, ఉద్యోగ వేళల్లో ఇబ్బందిపడ్డామని చెప్పుకొచ్చారు. పీరియడ్స్‌ వల్ల వచ్చే నొప్పితో తరచూ ఇబ్బండి పడటం వల్ల, ఉద్యోగాన్ని మానివేసినవారూ లేకపోలేదు.   వింత సమస్య పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల గురించి మహిళలు యాజమాన్యం దగ్గర చెప్పునేందుకు జంకుతారు. యాజమాన్యమేమో దీనిని స్వయంగా పట్టించుకునే చొరవా చూపదు. ఫలితంగా కార్మికులలో సగభాగమైన మహిళలు ఈ బాధతోనే ఉద్యోగాలను నెట్టుకొస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఈ సమస్య గురించి గొంతుకలు వినిపిస్తున్నాయి. ఈ సమస్య చాలా సహజమైనదన్న విషయం యాజమాన్యం గుర్తించాలనీ, పీరియడ్స్‌ సమయంలో మహిళలు సెలవు తీసుకునే అవకాశాన్ని కల్పించాలనీ వాదనలు వినిపిస్తున్నాయి. మహిళలకు కనుక ఇలాంటి సెలవులు అందుబాటులో ఉంటే వారు మరింత సమర్థవంతంగా విధులను నిర్వహిస్తారని, యాజమాన్యం తమకు అండగా ఉందన్న తృప్తితో ఉంటారనీ పలువురు సూచిస్తున్నారు.   సాధ్యమేనా! జపాన్‌, ఇండోనేషియా, తైవాన్‌ వంటి దేశాలలో ఇప్పటికే మహిళలు రుతుక్రమంలో సెలవులు తీసుకునే సౌలభ్యం ఉంది. జపాన్‌లో అయితే దాదాపు 70 సంవత్సరాలుగా ఈ చట్టం అమలులో ఉంది. ఇక కెనడా, ఇంగ్లండ్‌ వంటి దేశాల్లో కూడా ఈ సెలవులను అమలుచేయాలన్న ఉద్యమాలు బలపడుతున్నాయి. మన దేశంలో ఒకటీ అరా సంస్థలు ఇలాంటి సెలవులను ఇస్తున్నప్పటికీ, చట్టబద్ధంగా మహిళలకు ఇలాంటి సెలవులు లభించాలంటే మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరగవలసి ఉంది. పైగా మహిళలకు ఇలాంటి సెలవులు ఇవ్వడం వల్ల చిన్న తరహా పరిశ్రమలకు నష్టం వాటిల్లుతుందనీ, పారిశ్రామికవేత్తలు మహిళలకు ఉద్యోగాలను ఇచ్చేందుకు జంకుతారనీ వాదించేవారికి మన వద్ద కొదవు లేకపోవడంతో... అసలు ఈ సౌలభ్యం మన దేశంలో వచ్చే అవకాశం ఉందా అన్నది అనుమానమే! అప్పటివరకూ బహుశా మహిళాలోకం మౌనంగా ఈ బాధని భరించాల్సిందేనేమో!   - నిర్జర.  

  Valentines Fun Ideas for All   Valentines Day has become so famous among the kids too, these days...few years ago, it was just for the youngsters..now, it is for everyone on the block..it is almost like a 'Thank you Day'. You can greet anyone who is special and send a gift for anyone who is close to your heart, it could be your Grandma, or a Best Friend, or your child can even give a card to his/her favorite Teacher. Ofcourse, the younger kids do it, the better. And so unofficially, it has become a Kids celebration day. Schools are hosting Valentines day parties for the little ones, they make heart crafts for eachother, Teachers get gifts from their cute students...Parents spend with them enjoying a sweet cupcake and lots of fun. The web has so many valentines day craft ideas for every age group. Buy a few ready-made greeting cards, or bring home few colorful papers, cut them up in heart shapes and prepare your own card, write what you like to express and Lo.,.. You are ready for the day ! Cards need not just be item ..you can bake a red velvet or a strawberry cake for your loved one, or steal a sweet recipe from someone or the internet and prepare a dessert for the evening, bring few dark chocolate packs and stash them on the couch for your special ones to find them to surprise when they crash on the couch.     I know the restaurants will be too busy that day, amd forget about going out without a dinner reservation if its a weekend, like this years...make sure to make your evening or afternoon a memorable one with family and friends by cooking and decorating together for fun. Sleepovers for kids and youngsters wouldne a lot of fun and a memory down the lane. Gather some old photographs of your couple or with your kids and family members and create a collage, set up a power-point presentation when everyone gathers for an exciting feeling and a nostaligic evening. If you are married, dig out all the old valentines day gifts your spouse gave you and arrange them on a table with candles lit up...dont forget to take new photographs of the present moments, they dont come back !! Compile an audio album of your loved ones favorite songs or your child's favorite rhymes or kids songs and play them when together for a casual amd exciting dancing time. A movie-nite with special ones is a good idea, anyways. Dine-out is fun but the restaurants are crowded that day and so you maynot be able to spend longer or have much privacy. Besides everything, those traditional surprise gifts have always been there. Make sure you give something the other person likes, not what you like. It is jot about the date, it is about the day...make it special and sweetly memorable !! Prathyusha Talluri  

చిటికెలో బెడ్ లాంప్ తయారీ ఎలా?     మాములుగా పడుకునే సమయంలో బెడ్ లాంప్ లాంటివి ఆన్ చేసి పడుకోవడం మనం రోజు చేసే పని. ఒకవేళ మన ఇంట్లో బెడ్ లాంప్ లేకుంటే? లేదంటే మీరు వాడె బెడ్ లాంప్ మీకు నచ్చకపోతే ? షాప్ కి వెళ్లి కొత్త బెడ్ లాంప్ కొని తెచ్చుకుంటారు అంతే కదా! దీనివల్ల డబ్బులు వృధా అయినట్లే. ఒకవేళ మీ ఇంట్లోని వస్తువులతోనే... మీకు నచ్చినట్లుగా బెడ్ లాంప్ ను డిజైన్ చేసి తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి !. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ క్రింది విధంగా బెడ్ లాంప్ ను తయారు చేసుకోండి. మరి ఈ బెడ్ లాంప్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకుందామా...!   కావలసిన వస్తువులు : ఒక మీడియం సైజ్ వాటర్ బాటిల్, ప్లాస్టిక్ చెంచాలు (స్పూన్స్), బల్బు, కట్టర్, అంటించడానికి కావలసిన వస్తువు(ఫెవికోల్, హీటర్ లాంటివి).   తయారు చేయు పధ్ధతి : ముందుగా చెంచాల యొక్క స్టిక్ భాగాన్ని కట్ చేసుకోవాలి. అదే విధంగా బాటిల్ యొక్క కింది భాగాన్ని సమానంగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక్కొక్క చెంచాను పైన ఫోటోలో చూపించినట్లుగా హీటర్ తో అతికించుకుంటూ డెకరేట్ చేయాలి. ఇలా పూర్తిగా చేసిన తర్వాత పైన బాటిలో యొక్క మూత (క్యాప్) కు రంద్రం చేసి, దాని నుండి వైర్ ను తీసి బల్బును అమర్చుకోవాలి. ఆ తర్వాత ఆ క్యాప్ ను ఆ బాటిల్ కు బిగించేసి.. ఆ బాటిల్ ను మీకు కావలసిన ప్రదేశంలో తగిలించుకొని, బల్బు కు కరెంట్ కనెక్షన్ ఇస్తే బెడ్ లాంప్ వెలుతురుతో అదిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీ గదిలో ఇలాంటి బెడ్ లాంప్ ను మీరే తయారుచేసి పెట్టుకోండి.

  మన దగ్గరి వ్యక్తుల మనస్తత్వాలని ఎలా అర్థం చేసుకోవచ్చో సరదాగా నేర్చుకుందామా? ఎదుటి వ్యక్తికీ నచ్చిన పండు ఏదో తెలుసుకుంటే... దాని బట్టి వారి స్వభావం గురించి అంచనా వేయచ్చట. మన ఇష్టాయిష్టాలు సహజంగా మన స్వభావం, మనస్తత్వం పై ఆధారపడే ఏర్పడతాయి అంటున్నారు నిపుణులు. కాబట్టి ఆ ఇష్టాయిష్టాలు మన స్వభావానికి అద్దం పడుతాయన్నమాట. సరే నచ్చే పండుని బట్టి వారి స్వభావాన్ని ఎలా అంచనా వేయచ్చో తెలుసుకుందాం.   ఆరెంజ్ : ఆరెంజ్ ను అమితంగా ఇష్టపడే వ్యక్తుల స్వభావం ఎలా వుంటుందో చూద్దాం. వీరు చాలా సహనంగా ఉంటారు. పట్టుదల ఎక్కువ. వీరి పనితీరు నెమ్మదిగా అనిపించినా కష్టపడే తత్వం వీరి స్వంతం. ఏ బంధంలోనైనా వంద శాతం ఇస్తారు. నమ్మకస్తులు ఎవరైనా ఈ వ్యక్తులపై పూర్తి భరోసా పెట్టవచ్చు. వీరిని ఫ్రెండ్ గా పొందని వారు అదృష్టవంతులనే చెప్పాలి.   ఆపిల్ : ఆపిల్ అంటే చాలా ఇష్టమని అన్నారనుకోండి... వాళ్ళు ది బెస్ట్ టీం లీడర్స్ అని అర్థం చేసుకోవాలి. అంటే ముందుండి ఓ టీంని నడిపించే నాయకత్వ లక్షణాలు వీరి స్వంతం. ఉన్నదున్నట్టు ఎదుట వ్యక్తి మొహంపై చెప్పేస్తారు. కాస్త పోగరుబోతుల్లా కనిపిస్తారు. కాని వీరి స్వబావం అది కాదు నిజానికి. కాని మాట కాస్త కరుకుగా ఉంటుంది. వీరిలో నాయకత్వ లక్షణాలుంటాయి కానీ, వీరి లైఫ్ ను వీరే సరిగ్గా, సమర్థవంతంగా నిర్వహించుకోవటంలో కంగారు పడతారు. మామిడి : మామిడి పండును ఇష్టపడే వ్యక్తుల స్వభావం చాలా స్పష్టంగా ఉంటుంది. వీరి ఆలోచనలలో చాలా క్లారిటి వుంటుంది. వీరిని, వీరి ఆలోచనలని, పద్దతులని ప్రభావితం చేయటం అంత సులువు కాదు. వీరి ఇష్టాయిష్టాలు కూడా చాలా బలంగా ఉంటాయి. వీరి జీవితం ఎంతో చక్కగా సాగిపోతుంది. అయితే నచ్చిన వారి దగ్గర పిల్లల్లా మారిపోతారు.. అల్లరి చేసి ఆనందిస్తారు. బొప్పాయి : ఈ పండును ఇష్టపడే వ్యక్తులు మన స్నేహితులయితే చాలు. మన పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ విరుస్తునే వుంటుంది. మంచి హాస్య స్వభావులు నవ్వుతూ, నవ్విస్తూ ఉంటారు. ఇతరులతో ఎంతో దయగా ఉంటారు. కొత్త వ్యక్తులతో ఇట్టే కలిసిపోగలరు. సఖులూ. ఫైనాఫిల్, అనాస : వీళ్ళు ఏ పని చేయాలన్నా నిర్ణయం తీసుకుంటే చాలు... వెంటనే మొదలు పెట్టేస్తారు. ధైర్యం ఎక్కువ తనపై తనకుండే నమ్మకమే అందుకు కారణం. వీరికి దేనినైనా సాధించటం ఎంతో తేలిక. అయినా వ్యక్తిగతంగా వీరు ఎవరితోనూ తొందరగా కలవలేరు. కాని ఒకసారి స్నేహితులయితే ఎంతో విలువనిస్తారు ఆ బంధానికి ... కాని వీరిలో బంధంలో ఉండేవారు ఒక్కటి అర్థం చేసుకోవాలి. వీరికి మనసులోని అభిమానాన్ని బయటకి చూపించటం రాదు. నల్ల ద్రాక్ష : వీళ్ళు మృదు స్వభావులు, కాని ముక్కుపై కోపం వుంటుంది. ఎంత తొందరగా కోపం వస్తే, అంత త్వరగా చల్లారిపోతారు. వీరితో ఉండటానికి ఎవరైనా ఇష్టపడతారు. వీరికి జీవితాన్ని ఎంత అందంగా, ఆనందంగా ఉంచుకోవాలో బాగా తెలుసు. ప్రతీ క్షణాన్ని ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. సీతాఫలం : వీళ్ళు చాలా లక్ష్యాలు కలిగి ఉంటారు. చాలా తెలివైన వారు. విజయాల కోసం కష్టపడతారు. అయితే ఎదుటి వ్యక్తుల లోని లోపాలని ఇట్టే పసిగడతారు. దాంతో వీరికి శత్రువులు కూడా ఎక్కువే. వీరు అభిమానాన్ని పైకి చూపరు. ఎదుటివారు అర్థం చేసుకోవాలి. అరటి పండు : వీళ్ళు ఎదుటివారిపై ఎంతో ఇష్టాన్ని చూపిస్తారు. అందరితో ఎంతో మంచిగా ఉంటారు. మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటారు. అయితే తమ విషయానికి వచ్చేసరికి వారిపై వారికీ నమ్మకం తక్కువ. పక్కవారి తోడుకోసం చూస్తుంటారు. స్వభావసిద్ధంగా వీరు విజయాలకంటే వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.

    దేశానికి తిరిగివ్వాలంటే శ్రీమంతుడు కానక్కర్లేదు   గ్రామాలను దత్తతు తీసుకోవడం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. డబ్బున్న వ్యాపారవేత్తలు, పేరున్న సినిమా హీరోలు ఏదో ఒక గ్రామాన్ని దత్తతు తీసుకుని వార్తల్లో నిలుస్తున్నారు. కానీ ఒక సాదాసీదా వైద్యురాలు ఓ మారుమూల గ్రామాన్ని దత్తతు తీసుకుని వారి జీవితాల్లో భాగమైపోయిన్న వార్తని ఎప్పుడన్నా విన్నారా. ఆ వైద్యురాలే ‘సీమా సాదికా’     వైద్యురాలిగా దాదాపు ఓ దశాబ్దం క్రితమే సీమా సాదికా వైద్యవృత్తిలో పట్టా పుచ్చుకున్నారు. అయితే మారుతున్న అవసరాలకు అనుగుణంగా వైద్యంలో ఏదన్నా ప్రత్యేకమైన విభాగాన్ని ఎంచుకోవాలని సీమా అనుకున్నారు. రకరకాల అవసరాలనీ, వేర్వేరు అనుభవాలనీ దృష్టిలో ఉంచుకొని చివరికి ‘యాంటీ ఏజింగ్’ విభాగంలో ముందుకు సాగేందుకు నిర్ణయించుకున్నారు. పోషకాహారం మొదలుకొని స్టెమ్‌ సెల్‌ థెరపీ వరకూ రకరకాల పద్ధతుల ద్వారా ఒక మనిషిని మరింత యవ్వనంగా చూపించే ప్రక్రియే ఈ యాంటీ ఏజింగ్‌! యాంటీ ఏజింగ్ విభాగంలో తగినంత నైపుణ్యం సాధించిన సీమా 2009లో AURA ANTI-AGING CENTREని స్థాపించారు. కొద్దిరోజుల్లోనే ఈ కేంద్రం బెంగళూరులో మంచి పేరుని తెచ్చుకుంది.     ఆలోచన రేకెత్తించిన ప్రశ్న సీమాకి మొదటి నుంచి సామాజిక సేవ చేయడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. ఆ ఇష్టంతోనే ఆమె కర్ణాటకలోని మారుమూల గ్రామాలలో వైద్యశిబిరాలను నిర్వహించేవారు. అలా ఒకసారి ఎక్కడో వైద్యశిబిరం నిర్వహిస్తుండగా ఒకామె సీమా దగ్గరకు వచ్చింది. ‘‘మీరు ఆర్నెళ్లకి ఓసారి వైద్యశిబిరాలను నిర్వహిస్తారు. ఆ సమయంలో మాలో ఏవన్నా రోగాలు కనిపిస్తే మందూమాకూ ఇస్తారు. కానీ మీరు వెళ్లిపోయాక మా పరిస్థితి ఏంటి! అప్పుడు ఏమన్నా అనారోగ్యం వస్తే చికిత్స తీసుకునేందుకు మా దగ్గర డబ్బులు ఉండవు కదా!’’ అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నతో సీమాకి ఆలోచనలు మొదలయ్యాయి. ఏదో తాత్కాలికంగా వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తే వారి జీవితం బాగుపడదనీ... విద్య, ఉపాధి, పారిశుద్ధ్యం, పోషకాహారం వంటి ఎన్నో రంగాలలో వాళ్లు ముందుకు అడుగు వేయనిదే బతుకులు మారవనీ అర్థం అయ్యింది. ఆ ఆలోచనతోనే గత సంవత్సరం ‘నమ్మ మిత్ర’ (మన స్నేహితుడు) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటయ్యింది.     ఊరినే మార్చేశారు నమ్మ మిత్ర సంస్థ ఆధ్వర్యంలో సీమా, కర్ణాటకలోని బనాదూర్‌ గ్రామం (ధార్వాడ్‌ జిల్లా) బాగోగులను చూడాలని నిర్ణయించుకున్నారు. గ్రామస్తులలో ఉండే కుమ్ములాటలు, అభిప్రాయబేధాలు, రాజకీయాలు... వంటి అడ్డంకులన్నింటినీ దాటుకుని ఆ గ్రామాన్ని అభివృద్ధి వైపుగా నడిపిస్తున్నారు. - గ్రామంలో ఒక సోలార్‌ గ్రిడ్‌ని ఏర్పాటు చేసి 70 ఇళ్లకి విద్యుత్‌ సౌకర్యాన్ని అందించారు. - E-Shala పేరుతో గ్రామంలోని 6-10 తరగతి పిల్లలు రాత్రివేళల్లో చదువుకునేలా ఒక ఉపాధ్యాయుడినీ, దృశ్యశ్రవణ పరికరాలనీ సమకూర్చారు. - గ్రామంలో మొబైల్‌ ఫోన్‌ రిపేరింగ్‌ సెంటర్‌, కుట్టు శిక్షణా కేంద్రాలు వంటివి ఏర్పాలు చేశారు. ఊరిబడిలో కంప్యూటర్‌ ల్యాబ్‌ని ఏర్పాటుచేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. - నమ్మ మిత్ర తరఫున పనిచేసే స్వచ్ఛంద సేవకులు ఎప్పటికప్పుడు గ్రామంలోని పరిస్థితులను అంచనా వేస్తూ, అవసరమైన చోట తమ సేవలను వినియోగిస్తూ ఉంటారు. ‘నమ్మ మిత్ర’ బనాదూర్ గ్రామంలో చేస్తున్న కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇవ్వడంతో, రాష్ట్రంలోని మిగతా గ్రామాలకు కూడా ఈ సేవలను విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశానికి ఉపయోగపడాలి, గ్రామాలకు ఏమన్నా చేయాలి అన్న లక్ష్యాలు కేవలం శ్రీమంతులకే పరిమితం కాదనీ... మంచితనం, సంకల్పం ఉంటే ఎవరి పరిధిలో వారు అద్భుతాలు సాధించగలరనీ సీమా సాదికా నిరూపిస్తున్నారు.   - నిర్జర.

  మీలో ప్రత్యేకత ఏంటో  మీరే గుర్తించండి   ఆడవాళ్ళలో ఉన్న ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, అందరిలో అన్నీ కళలని గుర్తిస్తారు, వారికి అన్నీ అమరుస్తూ పైకి వచ్చేలా చూస్తారు. కానీ తమ విషయం వచ్చేసరికి, తరువాత చూద్దాంలే అనుకుంటారు. ఒక సంగీతమో ,సాహిత్యమో, లేక ఇంకేదైనా ఒక ఇష్టమైన పనో ఉందనుకోండి దాన్ని నెరవేర్చడానికి టైమ్ కావాలి, కానీ అందరి బాగోగులు చూసేసరికి వారికి తమకంటూ సమయమే మిగలదు. ధాంతో ఆ ఆశ ఎక్కడో అడుగున పడిపోతుంది. మామూలుగా అయితే ఇది పెద్ద విషయం కాదనట్టు వదిలేస్తారు. కానీ ఇలా కొన్ని ఏళ్ళు గడిచాక ఎక్కడో ఎవరో తమకి నచ్చిన పని చేస్తూ. కనబడతారు, అంతే ఇంకమనసులో బాధ మొదలు. ఇంకా ప్రతి నిముషం ఆ విషయం మనసుని  తోలుస్తూనే ఉంటుంది. ఆ బాధలో ఇంట్లో పనులు భారంగాను కష్టపడి పోతున్నట్టు అనిపిస్తుంది వారికి. చిరాకు ఎక్కువై చిర్రుబుర్రు మంటుంటారు. ఇంట్లో వాళ్లకేమో విషయం అర్ధం కాక "మొన్నటిదాకా బానే ఉండేది ఈ మధ్య ఏమైందో ఎంటో", అనుకుని బాధపడుతుంటారు. పోనీ ఆడవారు చెప్పచ్చుగా అనుకోవచ్చు, నిజమే చెప్పచ్చు కానీ తనకంటూ ఒక ఇష్టం ఉందని చెప్పడం ఆడవారికి ఇంకా అలవాటు కావటం లేదు, నవ్వుతారేమో అన్న భయం కూడా తొడవుతుంది. దాంతో ఈ సమస్య పెద్దదై ఇంట్లో గొడవలు మొదలవుతాయి.. అందుకే ఆడవారు తమ ఇష్టాలు తమలో ఉన్న టాలెంట్ ని వారే గుర్తించి బయటపెట్టుకోవాలి, అందరికీ నిర్మొహమాటంగా చెప్పుకోవాలి. ఇంక ఈ విషయంలో  ఇంట్లో వారి బాధ్యత కూడా చాలా ఉంది. ఇంత లేట్ ఏజ్ లో ఇదెందుకు అని అనకుండా,వారిని ప్రోత్సహించాలి.   * ఎంతో లేట్ అయిందని అనుకునే కన్నా, ఇప్పటికైనా మొదలు పెట్టా కదా, అని మిమ్మల్ని మీరే శెభాష్ అనుకోండి. * ఇంట్లో వారి పనులు అన్నీ మీరే చేసెయ్యాలనుకోకుండా పనిని అందరితో పంచుకోండి అప్పుడు మీకంటూ కాస్త సమయం దొరుకుతుంది. * మీలానే ఆలోచించే ఇంకొకరినో లేదా ఒక గ్రూప్ నో కలుసుకోండి. అప్పుడు మీకు తోడు దొరకడమే కాదు ఆ పనిలో ఉత్సాహం కూడా కలుగుతుంది. * ఒకవేళ ఇంట్లో మిమ్మల్ని ప్రోత్సహించే వారు లేరనుకోండి, నిరాశపడకండి, ఈ మధ్య కాలంలో ఇంటర్నెట్ లో దొరకని వీడియో లేదు, మీ కావాల్సింది మీ ఫ్రీ టైమ్ లో మీ ఇంట్లోనే నేర్చుకోవచ్చు. చివరిగా ఒక మాట మీ బాద్యత మీ ఇంటి పట్ల ఉండాలనుకోవడంలో అస్సలు తప్పులేదు ,కానీ అదే బాధ్యత మీ పట్ల కూడా కాస్త చూపిస్తే, జీవితం సుఖమయంగా ఉంటుంది. మీరే కాదు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆనందంగా ఉంటారు, ఆలోచించండి..... --Pushpa

ఆడవాళ్లని వస్తువులుగానే చూస్తారు!     ఆడది విలాసవస్తువు కాదు. ఆడవాళ్లని సెక్స్ సింబల్స్‌గానే భావించడం సంస్కారం కాదు... ఇలాంటి మాటలు మనం వింటూనే ఉంటాము. ఆ మాటల వెనుక నిజం ఉన్నదనీ మనకు తెలుసు. కానీ నిజంగా మన మెదడు ఆడవాళ్లని, మగవాళ్లని చూసే తీరులో ఏమన్నా మార్పు ఉందా? అన్న అనుమానం వచ్చింది ఓ పరిశోధకుడికి. బెల్జియంకు చెందిన Philippe Bernard అనే ఈ పరిశోధకుడు తనకు వచ్చిన అనుమానాన్ని ఓసారి నిజమో కాదో తేల్చుకోవాలనుకున్నాడు. మన మెదడు వస్తువులని వేరేగా, మనుషులని వేరేగా గమనిస్తుంది. అందుకు ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒక పెన్ను ఉందనుకోండి. అందులోని క్యాప్ మాత్రమే చూపిస్తే.... అది పెన్నుకి సంబంధించిన భాగమని పసిగట్టేస్తాం. అదే ఒక మనిషి ముక్కుని మాత్రమే చూపిస్తే, అది ఎవరితో కనిపెట్టేందుకు చాలా ఇబ్బంది పడతాము. వస్తువులనీ, మనుషులనీ పసిగట్టడంలో మరో తేడా కూడా ఉంది. మనుషులని తిరగేసి చూసినప్పుడు, వారు ఫలానా అని గుర్తించడం కొంచెం కష్టం. కానీ వస్తువులని తిరగేసి చూసినా, మామూములుగా చూసినా... ఇది పెన్ను, ఇది పుస్తకం, ఇది టీవీ అని ఠక్కున చెప్పేయగలుగుతాం. వస్తువులనీ, మనుషులనీ మెదడు ప్రాసెస్ చేసే తీరునిబట్టి, జనం ఆడవాళ్లని ఎలా చూస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు పరిశోధకులు. ఇందుకోసం తక్కువ దుస్తులలో ఉన్న మోడల్స్ బొమ్మలని ఎన్నుకొన్నారు. వీరిలో మగవారి ఫొటోలు, ఆడవారి ఫొటోలు రెండూ ఉన్నాయి. ఈ ఫొటోలను కొందరికి తిరగేసి చూపించారు. ఆ తర్వాత కాసేపటికి అదే ఫొటోని సరిగ్గా నిలబెట్టి చూపించి... ‘ఇందాక మీరు చూసిన ఫొటోలో వ్యక్తే ఇందులో ఉన్న వ్యక్తీ ఒకరేనా!’ అని అడిగారు. పరిశోధకులు సైతం ఆశ్చర్యపోయేలా... ప్రేక్షకులు ఆడవారి ఫొటోలను సరిగ్గానే పోల్చుకోగలిగారు. కానీ మగవారి ఫొటోలని పోల్చుకోవడంలో కాస్త ఇబ్బంది పడ్డారు. అంటే! ఆడవారిని వస్తువులుగానూ, మగవారిని మనుషులుగానూ గుర్తిస్తున్నారన్నమాట. ఇలా గుర్తించినవారిలో ఆడవారు, మగవారు ఒకేవిధంగా తప్పు చేయడం మరో విచిత్రం! ఈ వివక్ష కేవలం ప్రకటనలో కనిపించే మహిళల పట్లేనా లేకపోతే, మన నిజజీవితంలో ఎదురుపడే ప్రతి ఆడవారినీ మనం వస్తువులుగానే చూస్తున్నామా అని తేల్చేందుకు త్వరలోనే మరో పరిశోధన చేపట్టనున్నారట. Philippe Bernard చేసిన ఈ పరిశోధన ఫలితం కాస్త బాధ కలిగించేదే! అయితే తరతరాలుగా మన సమాజం ఆడవారిని చూస్తున్న తీరు వల్లే, మన మెదడు కూడా ఇలా మారిపోయి ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. మరి దీని పర్యవసానం ఏమిటో !!! - నిర్జర.

నచ్చినవాడితో పరిచయం ఎలా పెంచుకోవాలి....? ప్రతి అమ్మాయికి కూడా అందరూ అబ్బాయిల యొక్క దృష్టిని తమ వైపు చూసేలా చేసుకోవడం చాలా సులభం. కానీ తనకు ఇష్టమైన అబ్బాయితో మొదటిసారిగా మాట్లాడటం ఎలాగో తెలియక కంగారు పడుతుంటారు. మీకు నచ్చిన అబ్బాయిని ఆకర్షించేలా చేయడంతో పాటు, ఇద్దరి మధ్య సంభాషణ ఎలా మొదలు పెట్టాలో కొన్ని చిన్ని ప్రయత్నాలు చూద్దామా...!   మీకు ఇష్టమైన వ్యక్తి దగ్గరకు ఆత్మ విశ్వాసంతో వెళ్ళి ‘హాయ్, మనం ఇంతకు ముందు ఎక్కడైనా కలిసామా?'' అని ఇలా పలకరించండి. అతని దగ్గర నుండి ఎటువంటి సమాధానం వచ్చినా సరే.. మీ మధ్య ఖచ్చితంగా సంభాషణ మొదలవుతుంది. దీనివల్ల మీకు ఇష్టమైన వ్యక్తితో మాట కలుపుకోవడానికి ఇది ఒక మంచి ప్రయత్నం.     ప్రపంచంలో తల్లిదండ్రులకైనా సహాయం చేస్తారో లేదో తెలియదు కానీ.. అమ్మాయిలు అడిగిన వెంటనే అబ్బాయిలు ఏ పనైనా చేయడానికి ముందుకు వస్తారు. మీకు నచ్చిన వ్యక్తి దగ్గరగా ఉంటే అతడిని ఏదైనా సహాయం అడగండి. మీరు అతన్ని అలా అడగడం వల్ల అతను లక్కీగా ఫీల్ అవుతాడు. ఇంకా మీరేదైనా అడ్రెస్ కనుక్కోవాలనుకొన్నప్పుడు, మీ చేతిలో ఏదైనా బరువైన వస్తువు ఉన్నప్పుడు, లేదా అతను కూర్చున్న పక్కనే ప్లేస్ ఉంటే.."కుర్చోవచ్చా" అంటూ ఏదో ఒక విధంగా వారి సహాయం అడగండి. అమ్మాయిలకు హెల్ప్ చేయడం అంటే అబ్బాయిలకు చాలా ఇష్టం. సరదా. ఎప్పుడైతే అతను మీకు హెల్ప్ చేస్తారో అప్పుడు ఇక చిరునవ్వుతో థాక్స్ చెప్పండి అక్కడి నుండే మొదలవుతుంది మీ మధ్య అసలైన ముచ్చట్లు.     మీకిష్టమైన వ్యక్తితో దగ్గరగా మాట్లాడాలి అనుకుంటే... అతనికి దగ్గరగా వెళ్ళుతున్నప్పడు తెలియకుండానో లేదా పోరపాటుగానో మీ దగ్గర ఉన్న పెన్, బుక్స్, కూరగాయలు, ఖర్చిఫ్ వంటి ఏదైనా ఒక వస్తువును వదిలేయండి. దాంతో వాటిని మీకు ఖచ్చితంగా తీసి ఇస్తాడు. కానీ మీరు పడేసుకున్న వస్తువు అతనికి కనిపించేలా మాత్రమే పడేయండి. లేకపోతే అతని స్థానంలోకి మరో హీరో దిగిపోతాడు. అతను చేసిన సహాయానికి చిరునవ్వు నవ్వి, కృతజ్ఞతలు తెలియజేయండి. ఇలా చేయడం వల్ల అప్పుడు అతను కూడా బదులిస్తాడు. దీనివల్ల మీరు ఇపుడు మాట్లాడకపోయినా మరోసారి కలిసినపుడైనా.. ఈ విషయం గుర్తు చేసి అతనితో మాట్లాడవచ్చు.     ఈ సలహాలతో ఖచ్చితంగా అబ్బాయిలు ఫ్లాట్ అయిపోతారు. ఇంకెందుకు ఆలస్యం. మీ గ్రీకువీరుడు కోసం మీ ప్రయత్నాలు మొదలుపెట్టండి మరి.

  Steps to make your WORK FROM HOME Life Easy     Managing to work and having a young child is not atall an easy task. Everyday starts with a thought and a worry if we can handle things in a better way today or not. Having a child who needs our attention and having kids who go to School/ College is totally different. Every moment of our day should be well planned when handling a child simultaneosly. However, plans dont always be successful ones, however, practice makes one perfect. Slowly your child also gets used to your routine and understands that Mom cannot be disturbed always. Working from home involves Phone calls and so many phone calls..for every big matter to be discussed, we should pick up the Phone..the Child will be irate looking at Mom always on phone calls...they start to cry, fuss and fret the moment we hold the phone, sometimes they even learn to turn off the computer or hide the phone..it is very risky when we have Important, Urgent Business calls with Clients, or someone new we need to get in business with.   Following these steps makes our life easy: Making up our mind that we will be calm and not frustrated, today. Arranging a play area/room for the child and a work station for you, that is not in an easy-reach zone to the Child. Setting up a daily routine for them so that they know what to expect. Making sure you dont get your child too used to watching TV, just to make them stay quiet. Spending short moments with them. Not being angry with the Child when they are sleepy/hungry or need your help. Informing the Employer that you have a Child/ or more than one so that they oblige your short breaks of being away from the phone or computer. Hope these tips help you have a better day!!!   - Prathyusha Talluri

  Practice meditation: Entering motherhood is very hectic. Having sleepless nights and caring for the newborn leads to stress. After delivery, chances of suffering from blood pressure is very common among women. So, practice meditation. It relaxes your mind, flushes out toxins form the body and boosts up your immune system.   Healthy diet: It is very important to follow a healthy diet during and after pregnancy. Especially after the delivery, the body becomes weak. So you need take care of the dietary intake after delivery. To stay healthy, include foods that are nutritious and filling. Spinach, broccoli, whole grains, fresh fruits and nuts are a must have. Consult your doctor before eating spicy and oily food immediately after delivery (especially after c-section).   Rest: Be very careful if you have had a c-section delivery. This is one important tip to stay healthy in the postpartum state. As your body is weak post delivery, you need to take appropriate rest. If you have had a vaginal delivery, you just need rest for 2 weeks. However, women who go through C-section delivery have to be on bed rest at least for 1-2 months. If you walk or lie carelessly, the stitches will break and the pain will increase.   Breast feeding: It is very important for a new mom to breastfeed the newborn. This is one of the tips to stay healthy after delivery. Many women avoid breastfeeding as it damages the shape of the breast. The first milk is very nutritious and important for the baby. If you do not give the first milk, the baby can suffer from jaundice. Even the mother can suffer from acute breast pain. Skipping breastfeeding can build lumps inside the tissues of the breast and gradually lead to breast cancer.   These are few tips to stay healthy after your delivery....

    ఒక తరాన్ని ప్రభావితం చేసిన ‘లిటిల్ ఉమెన్‌’     నవంబరు 29, 2016- ఉదయాన్నే లేచి గూగుల్‌ని తెరిచినవారందరికీ ఒక వింత డూడుల్‌ కనిపించింది. ఏదన్నా ప్రత్యేక సందర్భాన్ని గుర్తుచేసేందుకు గూగుల్‌ సెర్చ్‌ మీద కనిపించేడాన్ని డూడుల్‌ అంటారు. ఇంతకీ ఆ రోజున కనిపించిన డూడుల్ దేని గురించా అని వెతికిన వారికి అది ‘లిటిల్‌ ఉమెన్‌’ అనే పుస్తకం రాసిన రచయిత్రి గురించని తేలింది. ఆమె పేరే ‘లూసియా మే ఆల్కట్‌’.   ఈ రోజుల్లో స్త్రీవాదానికి సంబంధించిన రచనలు చేయడం అసాధ్యం కాకపోవచ్చు. వాటిని చదివే వారూ, చదివి ఆదరించేవారికీ ఏ లోటూ లేదు. కానీ దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం స్త్రీవాదానికి సంబంధించిన భావాలను అక్షరబద్ధం చేయడం, తన భావాలకు అనుగుణంగా జీవించడం అనే అంశాన్ని ఊహించడం కూడా కష్టంగానే ఉంటుంది. అలాంటి రచయిత్రి కావడం వల్లే లూసియా తొలితరం స్త్రీవాద రచయిత్రులలో ఒకరుగా మిగిలిపోయారు.     1932, నవంబరు 29న అమెరికాలోని ఫిలడెల్ఫియా అనే నగరంలో జన్మించారు లూసియా. లూసియాతో కలుపుకొని వారి తల్లిదండ్రులకి నలుగురు కూతుళ్లు. వారి కుటుంబానికి ఓ చిత్రమైన ప్రపంచం. లూసియా తల్లిదండ్రులు ‘ట్రాన్స్‌డెంటలిస్ట్‌ మూమెంట్‌’ అనే ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండేవారు. ప్రతి మనిషిలోనూ మంచితనం ఉంటుందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మంచితనాన్ని కాపాడుకునేలా జీవించాలనీ చెబుతుంది ఈ ‘ట్రాన్స్‌డెంటలిస్ట్‌ మూమెంట్‌’. ఈ ఉద్యమం మీద హైందవ మత ప్రభావం చాలా ఎక్కువ.     తల్లిదండ్రుల ఆదర్శాల మధ్యా, అక్కాచెల్లెళ్ల అనుబంధాల మధ్యా పెరుగుతున్న లూసియాకి మొదటి నుంచీ రచన అంటే చాలా ఇష్టంగా ఉండేది. దానికి తోడు ‘ట్రాన్స్‌డెంటలిస్ట్‌ మూమెంట్‌’లో ఉన్న ఎమర్సన్‌, థోరో వంటి ప్రముఖ రచయితలతో ప్రత్యక్ష పరిచయాలు కూడా ఆమెకు సాయపడ్డాయి. తన మనసులో మెదిలిన ప్రతి భావానికీ అక్షరరూపం ఇచ్చేందుకు లూసియా ప్రయత్నించేది. వేర్వేరు కలం పేర్లతో కథలు, వ్యాసాలు, నవలలు రాయడం మొదలుపెట్టింది. ఆదర్శాల హోరులో పడి కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో తన వంతు సాయంగా లూసియా చిన్నా చితకా ఉద్యోగాలు చేయసాగింది. ఏం చేసినా రచనలు మాత్రం కొనసాగించేది. ప్రతి సందర్భాన్నీ ప్రశ్నించి, ప్రతి అణచివేతనీ ధిక్కరించే లూసియాకీ ఆమె తండ్రికీ మధ్య గొడవలు మొదలైనా కూడా... ఆమె తలవంచడం నేర్చుకోలేదు. ఇటు ఆర్థికంగానూ, అటు కుటుంబ సమస్యలతోనూ ఆత్మహత్య చేసుకోవాలన్న తలంపు వచ్చినా కూడా... సాహిత్యమే ఆమెకు జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యాన్నిచ్చింది.   1861- బానిసత్వం మీద తలెత్తిన అభిప్రాయ బేధాలతో, అమెరికాలోని రాష్ట్రాలన్నీ రెండు విడిపోయిన కాలం. ఆ సమయంలో చెలరేగిన అంతర్యుద్ధంలో లూసియా నర్సుగా పనిచేసింది. బానిసత్వం గురించీ, ఆసుపత్రుల నిర్వహణా లోపాల గురించి కుండబద్దలుకొట్టినట్లుగా రాసింది. దాంతో లూసియా రచనలలోని నిజాయితీ, స్పష్టత జనానికి తెలియడం మొదలైంది. ఇక 1868లో లూసియా రాసిన ‘లిటిల్ ఉమెన్’ అనే నవల అయితే అమెరికన్‌ సాహిత్యంలో ఓ సంచలనంగా నిలిచిపోయింది.     నలుగురు అక్కాచెల్లెళ్ల జీవితాల చిత్రణే ‘లిటిల్ ఉమెన్’. ఇది పేరుకి మాత్రమే ఓ కాల్పనిక నవల. కానీ అందులోని పాత్రలన్నీ లూసియా చుట్టూ ఉన్నవే. తన చిన్నతనంలో పెరిగిన వాతావరణాన్నీ, ఎదుర్కొన్న సంఘటనలనీ చిన్నపాటి మార్పులూ చేర్పులతో పాఠకుల ముందు ఉంచింది లూసియా. లిటిల్‌ ఉమెన్ నవల ఊహించని విజయాన్ని సాధించడంతో దానికి కొనసాగింపుగా మరో రెండు నవలలు రాసింది లూసియా. వేర్వేరు మనస్తత్వాలు ఉన్న నలుగురు అక్కాచెల్లెళ్ల జీవితాలు ఎలా సాగాయో తెలిపే కథనమే ఈ పుస్తకాలలోని నేపథ్యం. ఇందులోని ‘జో’ పాత్ర స్వయంగా లూసియాదే! కాకపోతే నవలలో ‘జో’కి పెళ్లవుతుంఉది. లూసియా మాత్రం ఆజన్మం వివాహం చేసుకోలేదు.   ఒక తరం అమెరికా ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేసిన పుస్తకంగా లిటిల్‌ ఉమెన్‌ను పేర్కొంటారు. తనదైన వ్యక్తిత్వాన్ని ఏర్పరుచుకోవడం, తనను తాను మలచుకుంటూ కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం... అంతస్సూత్రంగా సాగే లిటిల్‌ ఉమెన్ ఆనాటి స్త్రీలకి ఒక చెదిరిపోని ఆశని అందించింది. ఇప్పటికీ లిటల్‌ ఉమెన్‌ అమెరికా ప్రజలకి ఇష్టమైన 10 పుస్తకాలలో ఒకటిగా నిలుస్తోంది. స్త్రీవాదానికి సంబంధించిన తీక్షణమైన భావాలు ఇందులో లేకపోయినా... స్త్రీ హృదయానికి దగ్గరగా ఉండే భావోద్వేగాలను అక్షరబద్ధం చేయడంతో తరాలు గడిచినా కూడా ఆంగ్ల సాహిత్యంలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పరుచుకొంది.   - నిర్జర.

  వ్యాయామంతో మెనోపాజ్ సమస్యలు దూరం   రుతుక్రమం నిలిచిపోయిన మహిళలు ఎదుర్కొనే సమస్యల అన్నీఇన్నీ కావు. మానసికంగానూ, శారీరికంగానూ వారు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా రాత్రివేళల్లో ఒక్కసారిగా తల వేడెక్కిపోవడం (how flashes), విపరీతంగా చెమటలు పోయడం వంటి సమస్యలతో కంటి మీద కనుకే పట్టకుండా పోతుంది. వీటికి ఒకోసారి హార్మోను థెరపీని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కాస్తంత వ్యాయామం చేస్తే చాలు ఈ సమస్యలు ఇట్టే మాయమైపోతాయని అంటున్నారు నిపుణులు.   రుతుక్రమం (post menopause) ఆగిన స్త్రీలలో వ్యాయామం ఎంతవరకూ ప్రభావమో తేల్చుకునేందుకు స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు నడుం బిగించారు. ఇందుకోసం వారు 234 మంది స్త్రీలను గమనించారు. వీరిలో కొందరికి నిత్యం వ్యాయామం చేసే అలవాటు ఉంది. ఓ 166 మంది మాత్రం ఏ వ్యాయామమూ లేకుండా ఇంటిపట్టునే ఉండే అలవాటు కలిగి ఉన్నారు. ఈ 166 మందిలో ఓ సగం మందిని వారానికి మూడు గంటలపాటైనా వ్యాయామం చేసేలా ప్రోత్సహించారు.   ఇలా ఓ ఇరవై వారాలు గడిచిన తరువాత వారిలో hot flashes, అకారణంగా చెమటలు పట్టడం తగ్గినట్లు తేలింది. అంతేకాదు! రక్తపోటు, అధికబరువు వంటి సమస్యలు కూడా అదుపులోకి వచ్చాయట. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే ఈ అలవాటుని మరో ఏడాదిపాటు కనుక కొనసాగిస్తే వారిలో గుండెజబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు. అంతేకాదు! చాలా ఏళ్లుగా వ్యాయామం చేసే అలవాటు ఉన్న మహిళలు ఎంత ఆరోగ్యంగా ఉంటారో... ఏడాదిపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేసినవారు ఇంచుమించు అంతే ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది.   ఇంతకీ వ్యాయామం చేయడానికీ పోస్ట్‌ మెనోపాజ్ సమస్యలు తగ్గడానికీ మధ్య సంబంధం ఏమిటి? అంటే రెండు కారణాలు చెబుతున్నారు. వ్యాయామం చేయడం వల్ల మెదడులోని డోపమైన్‌, సెరటోనిన్‌ వంటి రసాయనాల మోతాదు పెరుగుతుందట. వీటి వల్ల ఒత్తిడి తగ్గడం, మనసు ప్రశాంతంగా ఉండటం, నిద్ర బాగా పట్టడం వంటి లాభాలు కలుగుతాయి. ఇక తరచూ వ్యాయామం చేయడం వల్ల స్త్రీలు తమ శరీరంలోని ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుకోగలుగుతారని ఇంతకుముందే తేలింది.   పోస్ట్‌ మెనోపాజ్‌లో వ్యాయామం వల్ల లాభం గురించి చెప్పారు సరే! ఇంతకీ ఎలాంటి వ్యాయామం చేయాలన్న దానిమీద కూడా స్పష్టమైన సూచనలు ఇస్తున్నారు. నడవడం, జాగింగ్, ఈత, సైక్లింగ్‌... ఇలా అరగంట పాటు ఒంటికి అలసట కలిగించేలా ఏ వ్యాయామాన్నయినా ఎంచుకోమని చెబుతున్నారు. వారానికి కనీసం ఓ మూడుసార్లన్నా ఈ వ్యాయామాలను చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చునట.   - నిర్జర.  

 Vinayaka Nimajjanam should be ‘Eco-Friendly’ rather than ‘Turning Toxic’!     Ganesh Chathurthi marks the birthday of Lord Ganesha and is celebrated with great pomp and show throughout the country. Ganesh-Utsav, which begins on Ganesha Chaturthi, culminates on Anant Chaturdashi. Hence Ganesh-Utsav is celebrated for 10 days in the month of Bhadrapada. The last day of festivity is known as Vinayaka Nimajjanam. On the Vinayaka Nimajjanam day, Ganesha is given a grand farewell and the idols that were installed for the festival are carried to the nearby river, lake or sea front and immersed with a lot of devotion by chanting the slogan: "Ganpati bappa moriya". But after celebrating the festival with such enthusiasm, Lord Ganesha’s farewell is turning the water bodies’ toxic – is our procedure of Idol Worship and Nimajjanam right? Here are some eco-friendly methods of Vinayaka Nimajjanam:- Take a large size tub or bucket, fill it with water and immerse the idol of Shree Ganesh in the tub or the bucket. Let the idol dissolve completely and later this water can be poured in sacred plants like tulsi. One can reuse the same idol every year and immerse a betel nut instead to symbolically complete the ritual. Making idols out of naturally occurring materials like Clay or Sandalwood paste is always a better option, since the idols dissolve completely in water. Immersing the idols in small, closed tanks than water bodies helps reduce the pollution. Encouraging the concept of ‘Green Ganesha’ & ‘Plant Ganesha’ will give us a cleaner greener future. We hope you would like our article. After all our devotion shouldn't depend upon the size of our idols, right? Be the change you want to see. Next year, let us all make a promise to ourselves to celebrate the festival in a pure manner, which is eco-friendly. Let's dirty our hands a little for a greener future! - Priya Ganapathi

  ఇంట్లోనే బుల్లి బొజ్జగణపతి   వినాయక చవితి వచ్చిందంటే ప్రతి ఇంట్లో ఓ బుల్లి వినాయకుడు ఉండాల్సిందే. ఇంకా వారం రోజుల టైం ఉంది కాబట్టి మనం ఇంట్లో పెట్టుకునే వినాయకుడిని బయట కెమికల్స్ వేసి తయారు చేసే వినాయకుడిని పెట్టుకోవడం కన్నా మట్టితో చేసే వినాయకుడిని పెట్టుకుంటే ఎంతో మంచిది. ఈ బుల్లి వినాయకుడిని మన ఇంట్లో ఉండే పిల్లలతోనే తయారు చేయిస్తే వారు కూడా చాలా హ్యాపీగా ఫీలవుతారు. మరి తయారుచేయడం ఏలాగో ఈ వీడియో చూస్తే మీకే అర్ధమవుతోంది...   https://www.youtube.com/watch?v=1xVBKPiMFDE    

సుగంధ నూనెలతో ఇల్లు పరిమళభరితం     ఇల్లు పరిమళభరితంగా ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది. ఐతే కొన్నిసార్లు వంట చేసిన తరువాత ఏర్పడే ఘాటు వాసనలతో, గాలి, వెలుతురు లేక ఏర్పడే దుర్వాసనలతో ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అటువంటి సమస్యలని రసాయనాలతో కాకుండా సుగంధ నూనెతో పరిష్కరించుకోవచ్చు.   * అరబకేట్ నీటిలో పావుకప్పు వెనిగర్, పెద్ద చెంచా నిమ్మరసం నూనె కలిపి గదిలో కాస్త చల్లితే.. గదిలోని వంట వాసనలు పోయి హాయి వాతావరణంతో నిండిపోతుంది. * కార్పెట్లు మురికిగా మారి దుర్వాసన వస్తుంటే.... కప్పు బేకింగ్ సోడాకి, చెంచాడు ఏదైనా సుగంధ నూనేలని కలపాలి. ఈ మిశ్రమాన్ని కార్పెట్ పై చల్లి తెల్లారి వాక్యుమ్ క్లీనర్ తో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. * కిటికీ అద్దాలు దుమ్ముపట్టి ఉంటే కప్పు వెనిగర్ కి చెంచా లావెండర్ పరిమళన్ని జోడించి తుడిస్తే సరి. అవి తలుక్కుమనడమే కాకుండా సువాసనభరితంగా కూడా ఉంటాయి. * వంట చేసిన తరువాత గది అంతా ఆవరించే ఘాటు వాసనలు తొలగిపోవడానికి ఒక గిన్నె నిండా నీళ్ళు తీసుకొని దానిలో దాల్చిన చెక్కని వేసి మరిగిస్తే గది చక్కని పరిమళాలు వెదజల్లుతుంది. * దుస్తులు ఒక్కచోట పోగుపడి.. ముక్కిపోయిన వాసన వస్తుంటే ఎండలో ఆరవేయ్యాలి. వీలుకానప్పుడు నిమ్మ, లావెండర్ వంటి ఏదైనా పరిమళంలో ఒక జేబు రుమాలుని ముంచి దానిని దుస్తుల మధ్య ఉంచితే సరిపోతుంది.