UTI – A woman’s nightmare!     Being a woman, the chances of developing urinary tract infection is high, as the women have shorter urethra-the tube that transports urine from bladder to external environment. Since the anus and urethral opening are closely positioned the bacteria from the intestines especially Escherichia coli are likely to escape into the urethra, infecting bladder on its way to kidneys and finally causing bacteraemia. Urinary tract infection surfaces as: a burning sensation while urinating, fever with chills, frequent urge to urinate, pain or pressure over lower abdomen, cloudy or curdy white urine and fatigue. Presence of fever and chills indicates the spread of infection; it has gone systemic from local infection. In certain conditions like pregnancy, diabetes, multiple sclerosis and any condition weakening the immune system the risk of UTI is high! When you discover any of these symptoms head straight to a physician, a urine sample may be taken to confirm the presence of UTI-causing organisms. Treatment includes the use of antibiotics, it is prescribed to complete the full cycle of medication without discontinuation. Along with medical attention, it also requires personal care which includes: Drinking lots of water to flush off the intruders and use of hot packs for the lower abdomen pain. As a part of prevention it is advised to wipe from front to back after using restroom. - Koya Satyasri    

ఇలా జరుగుతోందా... హార్మోన్ టెస్ట్ చేయించాల్సిందే!     పురుషులతో పోలిస్తే మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది. అయితే చాలామంది మహిళలు ఆ విషయాన్ని గుర్తించరు. సమస్యలు తీవ్రమై, డాక్టర్ దగ్గరకు వెళ్లాక గానీ కళ్లు తెరవరు. అలా కాకుండా ముందే దాన్ని కనిపెడితే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అసలు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉందని ఎలా కనిపెట్టాలి? సింపుల్... ఈ లక్షణాలు కనిపిస్తే హార్మోన్లు రెడ్ సిగ్నల్ ఇస్తున్నట్టే. - ప్రతి నెలా పీరియడ్స్ ఒకే సమయానికి రావాలి. అలా కాకుండా అటూ ఇటూ అవుతున్నా, అసలు రాకపోతున్నా ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్ హార్లోన్ల అసమతుల్యత ఏర్పడినట్టే.  దీన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే పీసీఓడీ సమస్య పరిగెత్తుకు వస్తుంది. - నిద్ర పట్టడం పోవడం కూడా హార్మోనల్ ఇంబాలెన్స్ కి సూచనే. - మొటిమలు అందానికి సంబంధించిన సమస్య అనుకుంటారు చాలామంది. కానీ హార్మోన్ల అసమతుల్యతకీ మొటిమలకూ సంబంధం ఉందని తెలుసా? మొటిమలు వచ్చి ఎంతకీ తగ్గడం లేదంటే హార్మోన్ల సమస్య ఉందని అర్థం చేసుకోవచ్చు. ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువ పని చేసి ఆ సమస్య ఏర్పడి ఉండొచ్చు. - హార్మోన్లు సరిగ్గా పని చేయకపోతే మెదడు మీద ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి ఆలోచనల్లో గందరగోళం, మతిమరుపు వంటి ఇబ్బందులు వస్తే ఓసారి చెకప్ చేయించుకోవడం మంచిది. - పీరియడ్స్ సమయంలో అంతకు ముందు లేని విధంగా కడుపునొప్పి, వికారం కనిపిస్తుంటే హార్మోన్ల పనితీరులో తేడా వచ్చినట్టే. - ఉన్నట్టుండి బరువు పెరిగిపోవడం, హఠాత్తుగా సన్నబడిపోవడం జరుగుతుంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది. - డిప్రెషన్, ఊరకూరకే మూడ్ మారిపోవడం వంటివి కూడా ఈస్ట్రోజన్ హార్మోన్ అసమతుల్యత వల్ల జరగవచ్చు.  మెదడులో విడుదలయ్యే సెరెటోనిన్, డోపమైన్ లాంటి హార్మోన్లను ఈస్ట్రోజన్ ప్రభావితం చేయడం వల్ల ఈ సమస్యలు వస్తాయి. - హార్మోనల్ ఇంబాలెన్స్ కారణంగా యోని పొడి బారడం, బ్రెస్ట్ టిష్యూస్ పలచబడటం లేదా మందంగా అవడం వంటివి కూడా జరుగుతాయి. సిస్టులు, గడ్డలు ఏర్పడతాయి.     వీటిలో ఏ లక్షణాలు కనిపించినా ఓసారి డాక్టర్ ని కలవండి. హార్మోన్ టెస్ట్ చేయించుకుని సమస్య ముదరకముందే దాన్నుంచి బైటపడండి.   - Sameera    

  నిద్రకు దూరం కావొద్దు...     కుటుంబ బాధ్యతలు పెరిగేకొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. ఒత్తిడి ఎక్కువయ్యేకొద్దీ నిద్ర దూరంగా వెళ్లిపోతూ ఉంటుంది. అందుకే నిద్రలేమితో బాధపడుతోన్న మహిళల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోందని తాజాగా ఓ పరిశోధన ద్వారా వెల్లడైంది. పనులన్నీ చక్కబెట్టుకుని ఎప్పటికో మంచం పైకి చేరడం, మళ్లీ ఉదయాన్నే లేచి ఇంట పనులు చేయాలనే ఒత్తిడితో రాత్రిళ్లు ఎంత ఆలస్యంగా పడుకున్నా ఉదయాన్నే నిద్ర లేచిపోవడం వల్ల చాలామంది మహిళలు కంటినిండా నిద్రపోవడం లేదట. ఇక ఉద్యోగం చేసే మహిళలైతే నిద్రలేమి కారణంగా మరింత సమస్యను ఎదుర్కొంటున్నారట. అందుకే నిద్రను నిర్లక్ష్యం చేయొద్దు అంటున్నారు డాక్టర్లు.   రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే అలసటతో పాటు నీరసం కూడా వచ్చేస్తుందట. దేనిపైనా దృష్టి నిలవదట. కండరాలు, నరాలు బలహీన పడతాయట. జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట. కోపం పెరగడం, విసుగు ఎక్కువ కావడం జరుగుతుందట. ఇవన్నీ హద్దు దాటితే మానసిక రుగ్మతకి, శారీరక అనారోగ్యానికి దారి తీయడం గ్యారంటీ అంటున్నారు డాక్టర్స్. అంతేకాదు... నిద్ర లేమిని నిర్లక్ష్యం చేస్తే కొన్నాళ్లకు పూర్తిగా నిద్ర పట్టని పరిస్థితి కూడా ఏర్పడొచ్చట.   అందుకే నిద్రను అశ్రద్ధ చేయకండి. వీలైనంత త్వరగా పడక మీదకు చేరండి. బెడ్ రూమ్ ని మీకు నచ్చినట్టుగా అలంకరించుకుంటే మనసుకు హాయిగా ఉండి నిద్ర వస్తుంది. రాత్రిళ్లు టీ, కాఫీ లాంటివి తినొద్దు. మసాలా ఫుడ్ కూడా ముట్టుకోవద్దు. త్వరగా భోంచేసి, పడుకునేటప్పటికి అది అరిగిపోయేలా చూసుకోండి. టీవీ చూస్తూ పడుకోవద్దు. సస్పెన్స్ థ్రిల్లర్లు, హారర్ నవలలు చదవొద్దు. చక్కగా స్నానం చేసి, వేడి వేడి పాలు ఓ గ్లాసుడు తాగి నిద్రకు ఉపక్రమించండి. ఈ మంచి అలవాట్లు కంటి మీదకు కునుకుని ఆహ్వానిస్తాయి. అప్పటికీ ఇబ్బందిగా ఉంటే ఓసారి డాక్టర్ ని సంప్రదించండి. అంతేకానీ నిద్రకు మాత్రం దూరంగా ఉండకండి. - Sameera  

UTI-A woman’s Nightmare!     Being a woman, the chances of developing urinary tract infection is high, as the women have shorter urethra-the tube that transports urine from bladder to external environment. Since the anus and urethral opening are closely positioned the bacteria from the intestines especially Escherichia coli are likely to escape into the urethra, infecting bladder on its way to kidneys and finally causing bacteraemia. Urinary tract infection surfaces as: a burning sensation while urinating, fever with chills, frequent urge to urinate, pain or pressure over lower abdomen, cloudy or curdy white urine and fatigue. Presence of fever and chills indicates the spread of infection; it has gone systemic from local infection. In certain conditions like pregnancy, diabetes, multiple sclerosis and any condition weakening the immune system the risk of UTI is high! When you discover any of these symptoms head straight to a physician, a urine sample may be taken to confirm the presence of UTI-causing organisms. Treatment includes the use of antibiotics, it is prescribed to complete the full cycle of medication without discontinuation. Along with medical attention, it also requires personal care which includes: Drinking lots of water to flush off the intruders and use of hot packs for the lower abdomen pain. As a part of prevention it is advised to wipe from front to back after using restroom. - Koya Satyasri

  కొబ్బరినూనె కొవ్వును కరిగిస్తుందా?     నువ్వుల నూనె, వేరుశనగ నూనె, సన్ ఫ్లవర్ ఆయిల్ అంటూ రకరకాల నూనెలతో వంటలు చేస్తుంటాం. ఇప్పుడు ఆలివ్ ఆయిల్ వెంట పడుతున్నాం. అయితే మనకి ఎప్పట్నుంచో పరిచయం ఉన్న కొబ్బరి నూనెతో వంట చేయాలని మాత్రం అనుకోం. ఎందుకంటే అది మన దృష్టిలో తలకు రాసుకునేది. మన కురుల సిరులను పెంచి పోషించేది. కానీ నిజానికి కొబ్బరి నూనెతో వంట చేస్తే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? కొబ్బరినూనెలో మాధ్యమిక ట్రైగ్లిజరైడ్ ల్యూరిక్ యాసిడ్ జీవక్రియను ప్రేరేపిస్తుంది. దానివల్ల శరీరంలో కొవ్వు పేరుకోదు. శక్తిగా రూపాంతరం చెందుతుంది. దీనిలో ఉండే లాంగ్ చెయిన్ ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని పలు భాగాల్లో పేరుకునే కొవ్వును కరిగిస్తుంది. దీనికి ఆకలిని నియంత్రించే శక్తి కూడా ఉంది. దానివల్ల ఉపయోగమేంటో తెలుసు కదా? తక్కువ తిండి... తక్కువ బరువు. అది మాత్రమే కాదు... ఇది ఇన్సులిన్ విడుదల సక్రమంగా జరిగేలా చేస్తుంది. తద్వారా టైప్ 2 డయాబెటిస్ బారిన పడకుండా కాపాడుతుంది. దీనిలో ఉండే లారిక్, కాప్రిలిక్ యాసిడ్ల వంటివి రోగ నిరోధక శక్తిని మెరుగు పరుస్తాయి. పలు ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. కొబ్బరినూనె హార్మోన్ల అసమతుల్యతను క్రమబద్దీకరించి, శారీరక మానసిక ఆరోగ్యాన్ని ఇనుమడింపజేస్తుంది. ఇదీ కొబ్బరి నూనె కహానీ. కాబట్టి... కేరళవాళ్లు కొబ్బరి నూనెను వంటకాల్లో ఉపయోగిస్తారట అని చెప్పుకోవడం కాకుండా... మీరు కూడా ఇక మీదట ఆ పనే చేయండి. ఆరోగ్యంగా ఉండండి. - Sameera  

డిప్రెషన్- ఒకప్పుడు ఎవరూ వినని మాట. ఇప్పుడో! ఇది ఇంటింటి సమస్య. డిప్రెషన్‌ని తేలికగా తీసుకోకూడదనీ, సైకాలజిస్టుని సంప్రదిస్తే... ఉపయోగం ఉంటుందనీ ఇప్పుడు అందరికీ అవగాహన ఉంది. కానీ ఆడవారిలో ఈ సమస్య ఎక్కువని చెబుతున్నారు పరిశోధకులు. డిప్రెషన్ తీరుతెన్నుల గురించి తెలుసుకునేందుకు కొందరు పరిశోధకులు, ఏకంగా 90 దేశాలలోని 35 లక్షల మందిని పరిశీలించారు. మగవారితో పోలిస్తే, ఆడవారు డిప్రెషన్‌తో బాధపడే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉందని వీరి పరిశీలనలో తేలింది. 12 ఏళ్ల వయసు నుంచే ఆడవారిలో తీవ్రమైన డిప్రెషన్‌ సమస్యలు కనిపించడం ఆశ్చర్యపరిచే విషయం. సాధారణంగా 12 - 13 ఏళ్లు వచ్చేసరికి ఆడ, మగ అన్న తేడాలు మొదలవుతాయి. అందుకనే ఈ దశను టీనేజి దశగా పేర్కొంటాము. ఆ వయసు నుంచి ప్రభావం చూపించే హార్మోనుల వల్లే స్త్రీలలో డిప్రెషన్‌ వచ్చే అవకాశం ఎక్కువ. పైగా టీనేజి ఆడపిల్లల చుట్టూ ఉండే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. సమాజం వారిపట్ల చూపే వివక్ష, విధించే నిబంధనలు... ఆడపిల్లల మనసు మీద ప్రభావం చూపుతాయి. వీటన్నింటికి తోడు టీనేజి వయసులోని ఆడపిల్లల మీద లైంగిక వేధింపులు జరిగే ప్రమాదం ఎక్కువ. ఈ సమస్యలన్నింటినీ పంటిబిగువున భరిస్తూ, ఆడపిల్లలు డిప్రెషన్‌తో క్రుంగిపోతుంటారు. ఆడపిల్లలు వయసు పెరిగే కొద్దీ శారీరికంగానూ, మానసికంగానూ వారు ఎదుర్కొనే సమస్యలూ పెరుగుతుంటాయి. దాంతో ఏదో ఒక దశలో వారు డిప్రెషన్ బారిన పడుతూ ఉంటారు. ఈ పరిశోధనలో తేలిన మరో విచిత్రం.... మగవారితో సమానంగా పనిచేసే చోట స్త్రీలు మరింత డిప్రెషన్‌కు లోనుకావడం! మగవారితో దీటుగా నిలిచే క్రమంలో, తమలో ఉండే ఆందోళనలను అణచిపెట్టే ప్రయత్నం జరుగుతుందనీ... అదే చివరికి తీవ్రమైన డిప్రెషన్‌కు దారితీస్తుందని విశ్లేషిస్తున్నారు. ఏతావాతా పరిశోధకులు చెప్పేదేమిటంటే- మనసుని తీరని దిగులు వేధిస్తూ, రోజువారీ జీవితం మీద ప్రభావితం చేస్తుంటే... అది డిప్రెషన్‌ లక్షణమై ఉంటుందని భావించాలి. అలాంటి సందర్భంలో వైద్యుని సంప్రదించేందుకు మొహమాటపడకూడదు. అంతేకాదు! తమ ఇంట్లో టీనేజి పిల్లలు, మరీ ముఖ్యంగా ఆడపిల్లలు ఉంటే... వారి మానసిక స్థితిని ఓ కంట కనిపెడుతూ ఉండాలి. డిప్రెషన్‌ను ఆరంభదశలోనే గుర్తిస్తే కౌన్సిలింగ్‌తోనూ, మందులతోనూ డిప్రెషన్‌ను శుభ్రంగా తగ్గించవచ్చు. లేకపోతే అది మరిన్ని తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. - నిర్జర.

  నైట్ డ్యూటీ చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా?     రోజులు మారిపోయాయి. మహిళలు కూడా పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తున్నారు. రాత్రిపూట కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. సాధికారత పరంగా ఇది సంతోషకరమే అయినా ఆరోగ్యపరంగా మాత్రం ప్రమాదకరం అంటున్నారు వైద్య నిపుణులు. ఆడవాళ్లు నైట్ డ్యూటీస్ చేయకపోవడమే మంచిది అంటున్నారు. పగలు ఉద్యోగాలు చేసేవారికంటే రాత్రిళ్లు ఉద్యోగాలు చేసే మహిళలకు బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నట్లు ఓ పరిశోధనలో తేలడమే దానికి కారణం. మామూలు వెలుతురులో కాకుండా లైట్ల కాంతిలో పని చేస్తే మెదడులో విడుదలయ్యే మెలటోనిన్ విడుదల కాదట. ఈ హార్మోన్... రొమ్ము, అండాశయ క్యాన్సర్లను ప్రేరేపించే ఈస్ట్రోజన్ మోతాదు పెరగకుండా చూసుకుంటుందట. అయితే మెలటోనిన్ మధ్యరాత్రిలో బాగా ఉత్పత్తి అవుతుందట. అది కూడా చీకటిగా ఉన్నప్పుడు. అలాంటి సమయంలో కృత్రిమ వెలుగులో పని చేయడం వల్ల ఉత్పత్తి ఆగిపోతుందట. తద్వారా క్యాన్సర్ ముప్పు పెరుగుతుందన్నమాట.     అది మాత్రమే కాదు... నైట్ డ్యూటీలు చేసే మహిళలకు పుట్టే పిల్లలు కూడా అంత ఆరోగ్యంగా ఉండటం లేదని విదేశాల్లో జరిగిన కొన్ని పరిశోధనల్లో తేలిందట. దానితో పాటు పేగుల సమస్యలు, జీర్ణక్రియ దెబ్బ తినడం వంటి మరికొన్ని సమస్యలు కూడా వచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఈ విషయం మీద ఇంకా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ... ఇంతవరకూ జరిపిన పరిశోధనల ఫలితాల దృష్ట్యా మహిళలు రాత్రిపూట ఉద్యోగాలు చేయకపోవడమే మంచిదటున్నారు నిపుణులు. - Sameera

  థైరాయిడ్ సమస్యను అధిగమించాలంటే...     ఈమధ్య కాలంలో పది మందితో మాట్లాడితో వాళ్లలో ఒకరైనా థైరాయిడ్ సమస్యతో బాధ పడుతున్నామని చెప్తున్నారు. అంతగా సమస్య పెరిగిపోయింది. చిన్నా పెద్దా తేడా లేకుండా దీని బారిన పడుతున్నారు. ఇక మహిళలనైతే ఇది వెంటాడి వేటాడుతోంది. ముఖ్యంగా యుక్త వయసు అమ్మాయిల్లోనే థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా ఏర్పడుతున్నాయని తాజాగా ఓ సర్వేలో తేలింది. అందుకే మహిళలంతా థైరాయిడ్ గురించి వీలైనంత స్పష్టంగా తెలుసుకోవడం చాలా మంచిది. రక్తంలో థైరాక్సిన్ హార్మోన్ శాతం తక్కువగా ఉండటం వల్లే థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. ఈ సమస్య వచ్చిందనడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. కాస్త పనికే అలసిపోతుంటారు. ఎంతసేపు పడుకున్నా ఇంకా పడుకోవాలనిపిస్తుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఉన్నట్టుండి బరువు పెరగడమో లేక తగ్గిపోవడమో మొదలవుతుంది. విసుగు, కోపం ఎక్కువవుతుంటాయి. గుండె దడ, టెన్షన్ పెరుగుతాయి. కొందరిలో రుతుస్రావంలో కూడా మార్పులు కనిపిస్తాయి. రుతుస్రావం అధికంగా అవ్వడం, నెలలో ఒకసారి కంటే ఎక్కువసార్లు రావడం జరగవచ్చు. లేదంటే రావాల్సిన సమయానికి రాకపోవడం, వచ్చినా సరిగ్గా అవ్వకపోవడం జరగవచ్చు. జుట్టు రాలిపోవడం, చర్మం పొడిబారిపోవడం వంటి సమస్యలు కూడా కొందరిలో కనిపిస్తాయి. కండరాల నొప్పులు కూడా రావొచ్చు. కొందరిలో గొంతు కూడా మారుతుంది. వీటిలో ఏ లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. థైరాయిడ్ సమస్య ఏర్పడిందనగానే కంగారు పడిపోవద్దు. ముందు మీకు వచ్చింది ఏ రకమైన థైరాయిడో తెలుసుకోండి. హైపో థైరాయిడిజమ్ అయితే థైరాయిడ్ గ్రంథి పనితీరు తగ్గిపోవడం వల్ల ఏర్పడుతుంది. హైపర్ థైరాయిడ్ గ్రంథి అయితే చేయాల్సిన దానికన్నా ఎక్కువగా చేయడం వల్ల వస్తుంది. మీకు ఏర్పడింది ఏ రకమైన సమస్యో తెలుసుకుని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ ని స్పష్టంగా అడగండి. థైరాయిడ్ కి డాక్టర్ సూచించిన మందులతో పాటు పోషకాహారం తీసుకోవడం మంచి పరిష్కారం. మాంసకృత్తులు, విటమిన్లు పుష్కలంగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. బి విటమిన్ ఎక్కువగా ఉండే పాలు, పాల ఉత్పత్తులు, రాగి జావ లాంటివి మేలు చేస్తాయి. ఇనుము ఎక్కువగా ఉండే గుడ్లు, ఆకు కూరలు, ఖర్జూరం వంటివి తీసుకోవడం వల్ల నీరసం, అలసట తగ్గుతాయి. సోయా గింజలు, పాలకూర, వెల్లుల్లి, తృణధాన్యాలు, మొలకెత్తిన విత్తనాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. జంక్ ఫుడ్ కి పూర్తి దూరంగా ఉండండి. ఉప్పు విషయంలో అన్నిటికంటే ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. అయొడైజ్డ్ ఉప్పు మాత్రమే వాడాలి. అలాగే వ్యాయామం కూడా తప్పనిసరి. మందులు వాడుతూ, పోషకాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటే థైరాయిడ్ సమస్యను చక్కగా అధిగమించవచ్చు. -Sameera

  ఆడవారికి అలెర్జీల శాపం   బిడ్డకు జన్మనివ్వడం స్త్రీకి వరం.... కానీ ఆ వరంతో పాటుగా ఆమె శరీరంలో ఎన్నో శాపాలనూ అనుభవించాల్సి ఉంటుంది. రుతుక్రమంలో సమస్యలు, గర్భధారణలో ఇబ్బందులు, మెనోపాజ్ బాధలూ... ఈ వ్యధలన్నీ ఒక స్త్రీకే అర్ధమవుతాయి. ఈ కష్టాలకి తోడుగా మరో ఇబ్బందిని కూడా కనుగొన్నారు శాస్త్రవేత్తలు.   స్త్రీలో సంతానోత్పత్తికి కారణమయ్యే ఈస్ట్రోజన్ హార్మోను వల్ల ఆమెలో అలెర్జీ సమస్యలు ఎక్కువగా తలెత్తే ప్రమాదం ఉందంటున్నారు వియన్నా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. పూల నుంచి వచ్చే పుప్పొడి వారిలో త్వరగా అలెర్జీ సమస్యలను కలిగిస్తాయట. కొన్ని రకాల ఆహారపదార్థాలు సరిపడకపోవడం (ఫుడ్ అలెర్జీ), ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులూ త్వరగా తలెత్తుతాయట.   పదేళ్ల వయసు వరకూ మగపిల్లలు త్వరగా అలెర్జీ బారిన పడతారనీ, ఆ తరువాత కాలంలో ఆడవారు ఈ సమస్యను త్వరగా ఎదుర్కొంటారనీ తేల్చారు. వారి శరీరంలోని హార్మోనులలో వచ్చే మార్పులే ఇందుకు కారణమని గమనించారు. ఆడవారిలోని ఈస్ట్రోజన్ హార్మోను వల్ల శరీరంలోని కణజాలం త్వరగా వాపు (inflammation) చెందుతుంది. శరీరాన్ని రక్షించుకునేందుకు ఈ inflammation అవసరమే అయినా, ఒకో సందర్భంలో ఇది అలెర్జీకి దారితీస్తుంది. ఇదే సమయంలో... మగవారిలో ఈస్ట్రోజన్ బదులు టెస్టోస్టెరోన్ అనే హార్మోను ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ హార్మోను సూక్ష్మజీవులను చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలదు. అసలే స్త్రీ శరీరంలోని హార్మోనుల అలెర్జీని ప్రేరేపిస్తాయి అనుకుంటే.... వాటికి ఆధునిక చికిత్సలు కూడా తోడవుతున్నాయి. గర్భధారణం కోసమో, మెనోపాజ్ సమస్యల నుంచి తేరుకునేందుకో ఈ మధ్యకాలంలో హార్మోను థెరపీని అనుసరించే స్త్రీల సంఖ్య పెరిగిపోతోంది. ఇక గర్భనిరోధక మాత్రలు కూడా హార్మోనులను ప్రభావితం చేసే విషయం తెలిసిందే! ఇవన్నీ కలిసి స్త్రీలలో అలెర్జీ ప్రమాదాన్ని గట్టు దాటిస్తున్నాయి.   ఈ పరిశోధన కేవలం కొత్త విషయాన్ని కనుగొనేందుకే కాదు... అలెర్జీల బారి నుంచి తప్పించుకునేందుకు కూడా ఉపయోగపడనుంది. ఆస్తమా లేదా అలెర్జీలతో బాధపడే ఆడవారు ఇకమీదట మందులు వాడేటప్పుడు, హార్మోను చికిత్సలు తీసుకునేటప్పుడు... వైద్యునితో తమ సమస్య గురించి చెప్పుకోవాలని సూచిస్తున్నారు. కేవలం ఆస్తమానే కాదు! ఎంతకీ వీడని తలనొప్పులు, చర్మం మీద దద్దుర్లు, కీళ్లనొప్పులు వంటి సమస్యలు కూడా అలెర్జీ కారణంగానే వచ్చే అవకాశం ఉందనీ... ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు కూడా వైద్యునితో చర్చించాలని చెబుతున్నారు. హార్మోన్లకీ, ఆలెర్జీకీ ఉన్న సంబంధం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. మున్ముందు ఈ విషయమై మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది. వాటి వల్ల అలెర్జీలని ఎదుర్కొనే చికిత్సలలోనూ, హార్మోను చికిత్సలలోనూ సమూలమైన మార్పులు రావచ్చు. - నిర్జర.    

According to researches done in the recent times, people who run live longer than those who don’t. And this should be that one big reason for you to put on your running shoes and head straight to run for a long and healthy life. There is no question that the fitter you are and the more exercise you do, the longer you live and the better your quality of life. The human body gets most of its vitamin D from sun exposure, but since people spend all of their time indoors, the number of them suffering from vitamin D deficiency is on a steady rise. Taking your run outside can help boost your levels to ward off depression, prevent type 2 diabetes, and strengthen your bones. To run, all you need is a good pair of shoes. It couldn't be simpler. And everyone knows how to run. You may not have perfect form yet, but you already know how to place one foot in front of the other and settle into a comfortable pace. Though it is simple sans any fancy equipment like the ones in the gym, it gives maximum health benefits. Running also gives your ticker a world-class workout. When your legs hit their stride they squeeze blood toward your heart, which in turn forces it to pump the blood right back. The faster you run, the harder your heart works and the stronger it gets. Joggers also have a leg up against heart disease, stroke, and diabetes, and running has been shown to lower blood pressure, raise good cholesterol, and boost immunity to colds and other viruses. Your time on the treadmill can even prevent vision loss, it seems. Stress can actually cause a number of health and mood problems. It can also diminish appetite and sleep quality. When you run, you force your body to exert excess energy and hormones. Running also helps to reduce your chances of developing tension headaches. In fact, there are few things in the world that can better or more rapidly treat depression than exercise such as running. Whether you’re new to the running scene or already a running pro, setting yourself a challenge is a fantastic way to make sure you’re constantly making progress. Most weight-loss and fitness programmes fall on stony ground because clearly defined goals were not put in place. Setting yourself a long-term target of running a half or even full marathon can be the ideal stimulus to keep you on track - Divya

  Signs that you are B12 deficient     Vitamin B12 performs several important functions in the body, deficiency of which can develop a number of heath issues. Vitamin B12 deficiency is defined by low levels of stored B12 in the body that can result in anemia, a lower-than-normal number of red blood cells. Your metabolism wouldn't run smoothly without it. B12 is majorly found in animal products like eggs, meat, shellfish, and dairy. Up to 15% of people don't get enough B12, and they're more likely to be vegetarians. Lets now look at the symptoms of B12 deficiency. Some of the earliest signs of a deficiency include feeling dragged, confused, weak and dizziness. Since they can be attributed to so many other possible triggers, most people don't think to be tested. If these symptoms hit and stick around for weeks, it's best to consult your doctor and rule out other causes say experts. Fatigue is yet another major sign of B12 deficiency. That's because your body relies on the vitamin to make red blood cells, which carry oxygen to your organs. And without enough oxygen in your cells, you'll feel tired no matter how long you sleep.   Mood swings is another major symptom of  lack of B12, as it wreaks havoc on your mood, possibly leading to depression or anxiety. Doctors say it may have something to do with the fact that B12 is involved in the synthesis of brain chemicals, such as serotonin and dopamine, that help regulate mood. Also, B12 plays an important role in white blood cell production, and white blood cells are essential for proper immune system functioning. Not only can a lack of B12 lower your immunity, some immune system disorders can increase your likelihood of becoming deficient. Grave's disease, for example, an autoimmune condition of the thyroid causing hyperthyroidism, is a risk factor for developing pernicious anemia, which in turn leads to B12 deficiency. - Divya

  లేటు వయసులో విడాకులతో ఆరోగ్యం     భారతీయ వివాహ వ్యవస్థలో విడాకులు చివరి అస్త్రమే కావచ్చు. కానీ పాశ్చాత్య జీవన విధానంలో అది ముఖ్య భాగమే! భాగస్వామి నచ్చకపోతే వేరుపడిపోవడం అక్కడ అతి సహజం. కానీ వివాహం వల్ల వేరు పడటం వల్ల ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావం ఉంటుందన్నది పరిశోధకులకి ఎప్పుడూ ఆసక్తిగానే ఉండేది. ఇప్పుడు లేటు వయసులో స్త్రీల ఆరోగ్యం మీద వారి వివాహ బంధం ఎలాంటి ప్రభావం చూపుతుందా అని ఓ పరిశోధన జరిగింది. రుతుక్రమం నిలిచిపోయిన స్త్రీలలో అనేక సమస్యలు తలెత్తుతాయి. వారి శరీరంలోని హార్మోనుల పనితీరులో అనేక మార్పులు వస్తుంటాయి. కానీ వివాహం అయిన స్త్రీలతో పోల్చుకుంటే, ఒంటరి స్త్రీలు కాస్త ఆరోగ్యంగా ఉన్నట్లు తేలడం ఆశ్చర్యకరం. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు అమెరికా పరిశోధకులు  79 వేల మంది స్త్రీల ఆరోగ్యాన్ని మూడేళ్లపాటు నిశితంగా గమనించారు. వీరి ఆహారపు అలవాట్లనీ, వారి ఎత్తుకి తగిన బరువునీ (BMI), శారీరక శ్రమ చేసే తీరునీ నమోదు చేశారు. ఇతరులతో పోలిస్తే విడాకులు తీసుకున్న స్త్రీలు బరువు తగ్గినట్లు తేలింది. పైగా వీరు శారీరిక శ్రమ కూడా అధికంగా చేస్తున్నట్లు గమనించారు. పెళ్లి పెటాకులైపోయిందన్న డిప్రెషన్తోనే ఇలా చేస్తున్నారనడానికి మాత్రం తగిన ఆధారాలు లేవంటున్నారు. లేటు వయసులో విడాకులు తీసుకోవడం వల్ల, తమ ఆరోగ్యం మీద కాస్త శ్రద్ధ పెట్టేందుకు అవకాశం ఉంటుందనీ... తినే ఆహారం, చేసే వ్యాయామంలోనూ తగినన్ని మార్పులు చేస్తారనీ అంటున్నారు. పైగా పెళ్లయిన వారు, అందులోనూ కొత్తగా పెళ్లయినవారు భర్తతో కలిసి భోజనం చేస్తూ... తాము ఎంత తింటున్నామో గమనించుకోరు. విడాకులు తీసుకున్నవారిలో ఈ సందర్భం ఎలాగూ ఉండదు. అదీ విషయం! ఇన్నాళ్లూ వివాహ బంధం వల్ల ఉన్న లాభాల గురించే పరిశోధనలు జరిగాయి. కానీ ఇప్పుడు విడాకులు తీసుకోవడం వల్ల కూడా కాస్తా కూస్తో లాభం ఉందని ఈ పరిశోధన తేలుస్తోంది. అలాగని ఓ నాలుగైదు కిలోల బరువు తగ్గడం కోసం విడాకులు తీసుకోమన్నది పరిశోధకుల సూచన కాదు. ఏ వయసులో ఉన్నా, ఎలాంటి బంధంలో ఉన్నా ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ తీసుకుంటూ ఉండాలన్నదే వీరి అభిమతం. మితమైన ఆహారం తీసుకోవాలి, అందులో తగినన్ని పోషకాలు ఉండాలి, ఆ పోషకాలు ఒంటికి పట్టేలా వ్యాయామం చేయాలి... ఇవే ఏ ఆరోగ్య నిపుణుడైనా అందించే సలహా! కాకపోతే ఇకమీదట శ్రీవారు బరువు పెరిగిపోతున్నావంటూ ఎగతాళి చేస్తే.... ‘విడాకులు తీసుకుంటే సరి నా బరువు తగ్గిపోతుంది,’ అంటూ ఘాటైన జవాబు చెప్పేయొచ్చు. - నిర్జర.

మాతృత్వంతో మెదడు మారిపోతుంది     మాతృత్వం తరువాత తల్లి జీవితం మారిపోతుంది. ఆరోగ్యంలో చిన్నాచితకా మార్పులు వస్తాయి. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే! కానీ ఆమె మెదడులో సైతం మార్పులు వస్తాయనీ... కొన్ని ఏళ్ల తరబడి ఆ మార్పులు ఆమెలో ఉండిపోతాయనీ తేలింది. మాతృత్వం ముందు – తరువాత తల్లి మెదడులో మార్పు నిజమా కాదా తెలుసుకునేందుకు స్పెయిన్లోని పరిశోధకులు ఓ 25 మంది స్త్రీలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 30 ఏళ్లు దాటినవారే. త్వరలో తల్లి కావాలని ఆశిస్తున్నావారే. ఆ సమయంలో వీరి మెదడుని స్కానింగ్ చేశారు. తిరిగి వారు గర్భం ధరించిన తరువాతా, పిల్లల్ని కన్న తరువాత కూడా వారి మెదడుని పరిశీలించారు. మార్పు కనిపించింది మాతృత్వం తరువాత స్త్రీల మెదడులోని కొన్ని ప్రాంతాలలో స్పష్టమైన మార్పులు కనిపించాయి. ఇతరుల అవసరాలను, అభిప్రాయాలను నిశితంగా పరిశీలించగలిగే భాగంలో ఈ మార్పు కనిపించింది. అయితే దీని వలన వారి జ్ఞాపకశక్తిలో ఎలాంటి లోటూ రాకపోవడాన్ని గమనించారు. కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా మాతృత్వం సాధించినా, సహజ పద్ధతులలోనే గర్భాన్ని ధరించినా కూడా ఈ మార్పు కనిపించి తీరింది. అయితే మగవారిలో మాత్రం ఇలాంటి మార్పులేవీ కనిపించలేదు. తండ్రిగా మారక ముందు వారి మెదడు ఎలా ఉందో, తరువాత కూడా అదే తీరు కొనసాగింది. కారణం ఉందట! తల్లి మెదడులో ఈ మార్పు నిష్కారణం ఏమీ కాదంటున్నారు పరిశోధకులు. అప్పుడే పుట్టిన పసిపిల్లలు చాలా అల్పంగా, నిస్సహాయంగా ఉంటారు. వారి అవసరాలను గమనించుకోవాలంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. తల్లి మెదడులో ఏర్పడే ఈ మార్పు ఆమెలో అప్రమత్తతను పెంచేదిలా ఉంటుందట. అందుకనేనేమో పిల్లలకు రెండేళ్లు వచ్చేవరకూ కూడా తల్లిలో ఈ మార్పు అలాగే ఉంది. ఆ తరువాతే వారి మెదడు సాధారణ స్థితికి చేరుకోవడాన్ని గమనించారు. పిల్లల్ని చూడగానే మాతృత్వం పొందిన తల్లిలో మార్పు ఆమె పిల్లల సంరక్షణకేనా అని ధృవీకరించేందుకు మరో ప్రయోగం చేశారు పరిశోధకులు. తల్లులకి వారి పిల్లల ఫొటోలను చూపించి, ఆ సమయంలో వారి మెదడులో ఏమన్నా మార్పులు ఏర్పడుతున్నాయోమో పరిశీలించారు. ఆశ్చర్యంగా, తమ పిల్లల ఫొటోలను చూడగానే వారి మెదడులోని అనేక భాగలు చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టాయి! పసిపిల్లలను నిశితంగా గమనించుకునేందుకు, వారు ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టేలా శిక్షణ ఇచ్చేందుకు తల్లి మెదడులో ఈ మార్పులు జరిగినట్లు తేలిపోయింది. స్త్రీల మాతృత్వంలో ముఖ్య పాత్రని వహించే ఈస్ట్రోజెన్, ప్రొగెస్టెరాన్ అనే హార్మోనులే ఈ మార్పుకి కూడా కారణం అవుతున్నాయని ఊహిస్తున్నారు.  - నిర్జర.  

    ఓ స్లీపింగ్ బ్యూటీ బాధ   స్లీపింగ్‌ బ్యూటీ అనే జానపద కథ మనందరికీ తెలిసిందే! ఏళ్ల తరబడి సుదీర్ఘంగా నిద్రపోయే రాజకుమారి గురించిన కథే స్లీపింగ్‌ బ్యూటీ. కథ కాబట్టి వినడానికీ, చదువుకోవడానికీ బాగానే ఉంటుంది. కానీ నిజంగా ఎవరికన్నా అలాంటి అనారోగ్యం ఉంటే... అది భరించేవారికే తెలుస్తుంది.   చెదిరిపోయిన కలలు ఇంగ్లండుకి చెందిన బెత్‌ గుడియర్‌ మహా చురుకైనా పిల్ల. ఎలాగైనా చైల్డ్‌ సైకాలజిస్టు కావాలన్నది ఆమె ఆశయం. బెత్‌ తన ఆశయాన్ని సాధిస్తుందనడంలో ఎవరికీ ఏ అనుమానమూ లేదు. ఎందుకంటే బెత్‌ చదువులో చాలా ముందుండేది. ఇదంతా ఐదేళ్ల క్రితం మాట. బెత్‌కి అప్పుడే 17 ఏళ్లు వచ్చాయి. స్నేహితుల మధ్యా, సన్నిహితుల మధ్యా ఆమె పుట్టినరోజు ఘనంగా జరిగింది. కానీ పుట్టినరోజు సంతోషం కొద్ది రోజుల్లోనే ఆవిరైపోయింది. ఓ రోజు బెత్‌ పడుకున్న మనిషి పడుకున్నట్లే ఉండిపోయింది. ఆ రోజు పడుకున్న బెత్‌ దాదాపు ఆరు నెలల వరకు సరిగా నిద్ర లేవనే లేదు.     స్లీపింగ్‌ బ్యూటీ సిండ్రోమ్‌ బెత్‌కి ఏమైందో ఆమె తల్లి జెనిన్‌కి అర్థం కాలేదు. భర్త తోడు లేకపోయినా అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తన కూతురి పరిస్థితి చూసి ఆమె మనసు తల్లడిల్లిపోయింది. మెదడులో కణితి కారణంగానో, రక్తస్రావంచేతనో ఆమె అలా నిద్రపోతోందేమో అని భయపడింది. బెత్‌ పరిస్థితి చూసి వైద్యులకి కూడా ఏమీ తోచలేదు. కానీ ఇంతలో ఒక వైద్యుడికి తాను విన్న స్లీపింగ్‌ బ్యూటీ సిండ్రోమ్‌ గుర్తుకురావడంతో... అదే ఇది అన్న నిర్ధరణకు వచ్చారు.   ఇప్పటికీ రహస్యమే! సుదీర్ఘకాలం పాటు అకస్మాత్తుగా నిద్రలోకి జారుకునే ఈ స్లీపింగ్‌ బ్యూటీ సిండ్రోమ్‌కి కారణం ఏమిటన్నది ఇప్పటివరకు శాస్త్రవేత్తలకు తెలియనేలేదు. కాకపోతే ఇది జన్యవులలో లోపం వల్ల ఏర్పడుతుందనీ, శరీరంలో ఏదన్నా ఇన్ఫెక్షన్‌ సోకినప్పుడు ఈ రోగం ఒక్కసారిగా బయటపడుతుందనీ అనుమానిస్తున్నారు. నిద్రనీ, ఇంద్రియాలను నియంత్రించే మెదడులోని ధాలమస్‌, హైపోధాలమస్ అనే భాగాలు దెబ్బతినడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందని తేలింది. 20వ శతాబ్దపు ఆరంభంలో కెల్విన్‌, లెవిన్‌ అనే ఇద్దరు వైద్యులు దీనిని గుర్తించడంతో... వారి పేరు మీదుగా Kleine–Levin syndrome (KLS) అన్న పేరు పెట్టారు. కానీ స్లీపింగ్‌ బ్యూటీ సిండ్రోమ్‌ అన్న పేరుతోనే ఇది ప్రచారంలో ఉంది.   నూటికి కాదు కోటికి స్లీపింగ్‌ బ్యూటీ సిండ్రోమ్ ఎక్కడో లక్షల్లో ఒకరికి మాత్రమే సోకే అవకాశం ఉందట. సాధారణంగా 16 ఏళ్ల యుక్తవయసులో ఈ రోగం దాడి చేస్తుంది. ఈ వ్యాధి సోకినవారు వారాల తరబడి దీర్ఘనిద్రలో ఉండిపోతారు. రోజులో ఒకటి రెండు గంటలు మాత్రమే కాస్త మెలకువగా ఉంటారు. అది కూడా ఏదో మత్తులో ఉన్నవారిలాగా తూగుతూ ఉంటారు. ఆ కాస్త సమయమూ కాలకృత్యాలను తీర్చుకోవడం, ఆహారం తీసుకోవడంలో గడిచిపోతుంది. ఇలా కొన్నాళ్ల నిద్రావస్థ తరువాత మళ్లీ ఓ రెండు వారాలు మామూలుగా ఉంటారు. ఆ తరువాత మళ్లీ నిద్ర! ఇలా ఓ పదేళ్ల పాటు ఈ విషవలయం తప్పదు. అదృష్టం ఏమిటంటే ఓ పది, పన్నెండేళ్ల తరువాత రోగం దానంతట అదే తగ్గిపోతుంది.   జీవితం వృధా స్లీపింగ్‌ బ్యూటీ సిండ్రోమ్‌కి ఇప్పటివరకూ తగిన చికిత్స ఏదీ అందుబాటులో లేదు. అందుబాటులో ఉన్న మందులు కూడా ఎంతవరకు క్షేమం అన్నదాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ రోగం వల్ల శారీరికంగా కలిగే బాధకంటే మానసికమైన వేదన ఎక్కువ. నిద్రావస్థ నుంచి బయటకు వచ్చిన తరువాత, రోగి మామూలు స్థితికి చేరుకోవడానికి కాస్త సమయం పడుతుంది. ఆ అయోమయం వల్లనైతేనేమీ, తన కాలం వృధా అయిపోయిందన్న బాధతో అయితేనేమి తీవ్రమైన క్రుంగుబాటులోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. పైగా ఆడుతూపాడుతూ తిరగాల్సిన యుక్తవయసులో, కెరీర్ మంచి ఊపులో ఉండే దశలో ఈ వ్యాధి దాడి చేయడం వల్ల వారి జీవితమే తలకిందులైపోతుంది. అలాంటి సమయంలో వారికి నేనున్నానన్న భరోసాని అందించడం అవసరం. అదృష్టవశాత్తూ బెత్‌కి అలాంటి భరోసా ఉంది. ఆమెను కంటికి రెప్పలా చూసుకునే తల్లి ఎలాగూ ఉంది, దానికి తోడు బెత్‌ గురించి తెలిసి ఆమెకు దగ్గరైన ఓ యువకుడు కూడా ఆమె బాగోగులను గమనించుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. తమ ప్రాణమైన బెత్ ఈ సిండ్రోమ్ నుంచి త్వరగా కోలుకోవాలని వారిద్దరూ ఆశిస్తున్నారు.     - నిర్జర.  

    Are You Making These Toothbrushing Mistakes!     Here are some of the most common Toothbrushing mistakes we commit in our everyday lives. Dental hygiene is very important for a healthy body. So make sure you avoid the following mistakes and maintain your teeth well.   Do not brush your teeth at least till 30 minutes after you have had your food. Just after you have eating something the pH-level in your mouth is lower than normal, and more acidic, so brushing can be very abrasive and harmful. So brushing your teeth immediately after eating food can be damaging for your teeth.   The amount of time you brush also makes a lot of difference. The average person’s brushing time is only 45 seconds. While anything shorter than 2 minutes doesn’t give the fluoride in your toothpaste enough time to attach to the enamel in your tooth enamel. Researchers say that over brushing teeth too can cause sensitivity. Brushing teeth is brilliant but not for too long is what researchers say. Experts recommend brushing for not more than two-three minutes as over brushing teeth can cause sensitivity.   Go for soft or extra soft bristles. If the bristles are too stiff they can hurt your gums. Brushes with medium or hard bristles used with some force can remove the protective enamel coating your teeth. This results in sensitive teeth and gums that hurt when you drink something cold. Experts recommend changing your brush every three to four months, as the bristles become frayed and less effective, and the brush can gather bacteria on the brush and handle.   Never leave your tooth brush in the restroom after you are done with brushing your teeth. Majorly for hygiene purposes. Consider storing your toothbrush someplace other than your bathroom as when you flush your toilet the contents of your toilet bowl are sprayed in all directions. So its always recommended that you assign a place specifically for your toothbrush in the house and make sure that the place is clear of any dust. And also clean the brush everyday before you start brushing. Although your toothbrush looks clean after you have finished brushing, bacteria that can cause bad breath and cavities can grow on the brush. Rinse the brush when you’ve finished to help remove the harmful bacteria.   It’s good to brush your teeth properly but do not get carried away. Brushing more than three times a day might not be ideal say experts. Over brushing your teeth can cause sensitivity. That's because too much can wear down your teeth's outer shell, called enamel, and damage your gums. Also while brushing be gentle as it doesn’t take a lot of force to remove plaque which is on your teeth.     ..Divya

    Are You Suffering From Winter Blues!     Did you know that the climate that you are in makes a huge difference in the way your mental state is? Many people have been a victim of this phenomenon. This is called as the seasonal affective disorder. This could especially be seen during the winters, when the climate is quite gloomy and the body generally feels a tad bit too lazy unlike in summers to be more active while going about doing your things. It's thought to occur when daily body rhythms become out-of-sync because of the reduced sunlight. Cold temperatures generally make it all too easy to curl up on the couch and let your active lifestyle take a backseat. Some people have depression year round that gets worse in the winter. While for others they have seasonal affective disorder alone, as they struggle with low moods only in the cooler, darker months. Researchers found this tendency to have seasonal mood and behavior changes occurs in different degrees, sometimes with mild changes and other times severe mood shifts. Symptoms of this disorder include a tendency to oversleep, crying spells, loss of appetite or overeating, morning sickness and lethargy. Other manifestations include difficulty in completing tasks and interacting with family and friendsas well as repulsion to social activities. These inturn lead to depression, existential crisis, a feeling of helplessness, lack of motivation and will to engage in activities. If the winter blues is about lack of daylight, it’s no surprise that treatment involves getting more light into your life. If you feel low in winter, get outside as often as you can, especially on bright days. Sitting by a window can also help.   Winters are when the family gets together too for a long holiday and you're overwhelmed with family obligations. This could also be one of the reasons to lead to the disorder. But it's entirely within your power to decline any stress. If you just can't avoid sitting next to a relative that drives you crazy, take a deep breath before engaging in conversation with her, this according to research decreases your anxiety and stress levels. Moving around is helpful to everyone's mood. It's common knowledge that regular exercise holds the power to lift your spirits, so be active. Researchers found that even a single exercise session at any intensity can increase positive mood feelings and decrease the negative ones. And let go of things that are not under your control and this will ease out the stress levels to a great extent. ..Divya

Gluten intolerance symptoms     These days you get to see a lot of eateries and also packaged foods which are specifically making food for people who are gluten intolerant. The awareness towards this has been increasing by the day. But did you know the symptoms which suggests you are allergic to gluten? Lets look at some of the signs.  Gluten intolerance is linked to in some cases to depression, anxiety and mood disorders. Once gluten is removed from the diet in the gluten sensitive, depression and anxiety can actually be resolved. Depression is a serious health concern for many people. Symptoms of depression can include feelings of hopelessness, lack of interest, low energy, appetite changes, sleep changes, anger, and more. Some patients do require medication to correct persistent imbalances with depression. Fatigue, brain fog or feeling tired after eating a meal that contains gluten. Being unable to think clearly is just as stifling as it sounds. When you feel disconnected or just plain “out of it”, it might not be all in your head. Gluten can have the affect known as “foggy brain” in sensitive individuals. Diagnosis of chronic fatigue or fibromyalgia. These diagnoses simply indicate your conventional doctor cannot pin point the cause of your fatigue or pain.  Complete gluten intolerance, also known as celiac disease, is a genetic, autoimmune digestive disorder. Every single autoimmune disease in which gluten as a contributor has been investigated has shown that gluten sensitivity is a contributor to that disease, says a research. If you have been diagnosed with an autoimmune disease and are experiencing some of the other symptoms we’ve mentioned, the culprit for all could be a gluten intolerance. Anyone who has ever experienced a migraine knows how seriously painful they can be. While not all cases of migraines are related to gluten, it’s been linked as a significant cause for some. Migraines are commonly caused by food intolerances like chocolate or gluten. If you get chronic migraine headaches, it may be a gluten intolerance. If you notice some strange rashes or unusual looking patches of skin you may want to consider that gluten could be to blame. Psoriasis, Hives Dermatitis herpetiformis often occur because gluten triggers an immune response, resulting in the production of antibodies that circulate in the bloodstream and get deposited into the dermis. The interaction is the cause of skin flare-ups, especially in the case of dermatitis herpetiformis. - Divya

    Benefits of Detox Water     With a few simple ingredients you can transform the normal regular water into a detoxifying masterpiece and reap even more benefits from it than drinking just plain water. This is something you can do every single day, or as part of a broader detoxing program. Detox water has become one of the most popular forms of detoxifying beverages, and there’s nothing more bloat-reducing and cleansing for the body. Detoxification, or cleansing, is a process that requires the circulation of detoxifying liquids through the body, so that the organs which are responsible for these functions (like the liver, kidneys, lungs and skin) can fulfill their tasks more easily, without being overloaded.   People who detox have a variety of reasons for doing so. Many people want to lose weight or boost their immune systems through the massive doses of fiber and vitamin C in these drinks. Many people too want to make their skin look and feel better, which can be done by adding ingredients like cucumber to their water. Cucumber contains silica, which is known to reverse signs of aging and diminish damage done by environmental exposure to sun and wind. Cucumbers are one of the most hydrating vegetables because they’re mostly made up of water.   Many detox programs include cucumbers on them for this very reason, and adding them to your water pulls out their minerals so you’re getting an added benefit. Mix in the lemon juice and you’re getting the cleansing effect of citric acid and helping to clear out the digestive system. Lemon or lime juice helps stimulate and regulate the digestive track which is why it’s so helpful with constipation, heartburn and gas, stimulates bile production, and thins out bile, which allows it to flow more freely. Bile is produced by the liver and ends up in the small intestine to break down lipids (fats) that we’ve consumed. The mint makes things taste fresh and crisp, and goes nicely with the lemon and cucumber while providing additional nutrients and benefits.   Water is just plain good for us, but it’s thought that it helps flush nasty toxins and waste through our system, giving organs like the liver and kidney an easier time doing their job. Despite being nutritionally rich, detox juices should not be used as meal substitute. Obviously, physical exercise and a rich and balanced diet continue to be a priority.   ..Divya