కొందరు ఆడవాళ్లలో డిప్రెషన్ ఎక్కువ... ఎందుకంటే!   మగవారితో పోల్చుకుంటే ఆడవారిలో డిప్రెషన్ ఎక్కువ. ఈ విషయాన్ని వైద్యులు ఎప్పుడోనే పసిగట్టేశారు. ఆడవారిలో ప్రత్యేకంగా ఉండే హార్మోనులు, వారి పట్ల కఠినంగా ఉండే సమాజం వల్లే వారిలో డప్రెషన్ ఎక్కువ అని తేల్చేశారు. కానీ కొందరు ఆడవాళ్లు మరింత త్వరగా డిప్రెషన్తో బాధపడటం వైద్యులని కలచివేసింది. దీని వెనుక కారణం ఏమిటో కనుక్కోవాలని అనుకున్నారు. ఫలితం ఇదిగో... వేర్వేరు ఆడవారిలో డిప్రెషన్ తీరుని గమనించేందుకు 1,300 మంది ఆడవారిని పర్యవేక్షించారు. వీరిలో estradiol అనే హార్మోనులే మార్పులే వారి డిప్రెషన్ తీరుని ప్రభావితం చేస్తున్నట్లు తేలింది. మనం తరచూ వినే estrogen అనే హార్మోనులో ఒక ముఖ్య రసాయనమే ఈ estradiol. ఈ estradiol రుతుక్రమాన్ని నియంత్రించడంతో పాటుగా భావోద్వేగాలను ప్రభావితం చేసే serotoninను కూడా అదుపులో ఉంచుతుంది. అదే ఒకోసారి డిప్రెషన్కు దారితీస్తుంది. ఆడవారిలో estradiol హార్మోను తగినంత లేకపోతే డిప్రెషన్తో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. మెనోపాజ్ తర్వాత కొందరు తీవ్రమైన డిప్రెషన్కు లోనుకావడానికి కారణం కూడా ఇదే అంటున్నారు. త్వరగా మెనోపాజ్ దశకు చేరుకునేవారు, రుతుక్రమం సరిగా లేనివారిలో డిప్రెషన్ లక్షణాలు కనిపించడానికి కారణం ఇదే! డిప్రెషన్ అనేది కేవలం మన బయట పరిస్థితుల వల్లే కాదు, శరీరంలోని హార్మోనుల వల్ల కూడా ఏర్పడవచ్చని తేలిపోయింది. కాబట్టి తరచూ నిరాశకి లోనవ్వడం, ఆకలి మందగించడం, జీవితం, త్వరగా భావోద్వేగాలకి లోనుకావడం, జీవితం నిస్సారంగా తోచడం, నిద్రలేమి... లాంటి సమస్యలు వచ్చినప్పుడు, అశ్రద్ధ చేయకుండా ఓసారి వైద్యుని సంప్రదించి చూడమని సూచిస్తున్నారు. హార్మోను లోపం వల్లే ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నట్లయితే, వైద్యులు తగిన చికిత్సను అందించే అవకాశం ఉంటుంది కదా!  

గోళ్ల రంగుకి అమ్మాయిల బరువుకి లింకేంటి..?     గోళ్ల రంగు..ఇదివరకటి రోజుల్లో పెళ్లిళ్లకో, వేరే ఏదైనా శుభాకార్యాల కోసమో అందంగా రెడీ అవ్వడానికి అమ్మాయిలు గోళ్ల రంగు వేసుకునేవారు. కానీ కాలం మారింది..గోళ్లరంగు వేసుకోవడానికి ప్రత్యేకంగా సందర్భం ఏమీ అక్కర్లేదని నిరూపిస్తున్నారు ఈ కాలం అమ్మాయిలు. ఏ రోజుకు ఆ రోజు డ్రస్సుకు మ్యాచ్ అయ్యేలా పాత నెయిల్ పాలిష్‌ని రిమూవ్ చేసి కొత్తది వేసుకుంటున్నారు మగువలు. అయితే ఇలాంటి వారు ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే తరచూ నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల బరువు పెరుగుతారట. డ్యూక్ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో నివ్వెరపరిచే వాస్తవాలు బయటపడ్డాయి..ముఖ్యంగా నెయిల్ పాలిష్‌లో ఉండే ట్రైఫీనైల్ ఫాస్ఫేట్ అనే పదార్థం వల్ల గోళ్ల రంగులు ఎక్కువ కాలం మన్నుతాయి. ఫ్లాస్టిక్ పదార్థాలు, ఫోమ్ ఫర్నిచర్‌కు త్వరగా మంటలు అంటుకోకుండా ఈ రసాయనాన్ని వాడుతారు. కానీ ఇది అంతిమంగా హార్మోన్లపై ప్రభావం చూపెడుతోందని పరిశోధకులు నిర్థారించారు. పశువుల మీద చేసిన పరీక్షలలో వాటికి సంతానోత్పాత్తికి సంబంధించిన సమస్యలు తలెత్తాయి. అయితే మనుషుల్లో బరువు పెరిగే లక్షణాన్ని గుర్తించారు. మార్కెట్లో దొరుకుతున్న సుమారు 3 వేల రకాల నెయిల్ పాలిష్‌లు సేకరించి వాటిని పరీక్షించగా వాటిలో 49 శాతం ట్రైఫీనైల్ ఉంది. గోళ్ల రంగు వేసుకున్న 10-14 గంటల తర్వాత వాళ్ల శరీరంలోని టీపీహెచ్‌పీ మోతాదు దాదాపు ఏడు రెట్లు పెరిగింది. అయితే కృత్రిమ గోళ్లు పెట్టుకుని, వాటికి మాత్రమే రంగులు వేసుకున్న వాళ్లకు మాత్రం అలా పెరగలేదు. అందువల్ల తరచు గోళ్ల రంగులు వేసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని..దానివల్ల శరీరంలో పలు రకాల మార్పులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. తప్పనిసరైతే చర్మానికి తగలకుండా చూసుకోవాలని, అలా తగిలితే రక్తంలోకి వెళ్లే అవకాశం కూడా ఉందంటున్నారు..కాబట్టి బీ కేర్ ఫుల్..

  కాబోయే తల్లి ఈ పరీక్షలు పాసవ్వాలి...   బిడ్డకు జన్మనివ్వడమంటే ఆడది మరో జన్మ ఎత్తడమే. బిడ్డ కడుపున పడిన నాటి నుండి కడుపు చీల్చుకుని ఈ భూమి మీద పడే వరకూ తల్లి పడే ఆరాటం అంతా ఇంతా కాదు. బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలని, ఆరోగ్యంగా పుట్టాలని ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే కేవలం జాగ్రత్తలు తీసుకుంటే చాలదు. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు కొన్ని పరీక్షలు కూడా చేయించుకోవాలి. ఇవే అవి... - గర్భంతో ఉన్నప్పుడు బీపీ ఎక్కువ ఉంటే బిడ్డపై ప్రభావం పడుతుంది. తల్లికి కూడా ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకోవాలి. - అలాగే షుగర్ టెస్ట్. చక్కెర పాళ్లు ఎక్కువైతే ఉమ్మనీరు పెరుగుతుంది. బిడ్డ పరిమాణం కూడా పరిమితిని మించి పెరుగుతుంది. దానివల్ల నెలలు నిండకముందే పుట్టే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు బిడ్డ కడుపులోనే చనిపోయే ప్రమాదమూ ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి. - బ్లడ్ గ్రూప్ టెస్టు కూడా చేయించాలి. ఎందుకంటే తల్లిది నెగటివ్, తండ్రిది పాజిటివ్ అయ్యి... బిడ్డది కూడా నెగిటివ్ అయితే సమస్య ఉండదు. లేదా తల్లిదండ్రులది ఏ గ్రూప్ అయినా బిడ్డది పాజిటివ్ రీసస్ ఫ్యాక్టర్ అయినా ఫర్వాలేదు. కానీ తల్లిది నెగటివ్ అయ్యి, తండ్రిది పాజిటివ్ అయ్యి, బిడ్డది కూడా పాజిటివ్ అయితే మాత్రం పుట్టుకతోనే ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. కాబట్టి ముందే బ్లడ్ గ్రూప్ ని పరీక్షిస్తే డాక్టర్లు ఒక ప్రత్యేక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా సమస్యలు రాకుండా చూస్తారు. - బిడ్డ ఆరోగ్యంగా ఎదగాలంటే తల్లిలో థైరాయిడ్ హార్మోన్ సక్రమంగా విడుదలవ్వాలి. కాబట్టి థైరాయిడ్ టెస్ట్ తప్పనిసరి. - హెచ్ఐవీ పరీక్ష కూడా తప్పకుండా చేయించాలి. అలాగే హెపటైటిస్ టెస్ట్ కూడా. - అలాగే సిఫిలిస్ టెస్ట్ కూడా చేయాలని డాక్టర్లు సూచిస్తుంటారు. ఇది కూడా తప్పనిసరి. - తల్లికి యూటీఐ ఉందేమో అన్నది కూడా పరీక్షించాలి. ఎందుకంటే యూరినరీ ఇన్ఫెక్షన్ల వల్ల బిడ్డ బరువు పెరగకపోవచ్చు. ముందుగానే డెలివరీ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. - తల్లిలో రక్తహీనత ఉన్నా బిడ్డ సరిగ్గా ఎదగదు. కాబట్టి రక్తహీనత నిర్థారిత పరీక్ష తప్పదు. ఇవి కాక బిడ్డలో జన్యుపరమైన సమస్యలేమైనా ఉన్నాయేమో తెలుసుకోడానికి ఫీటల్ అనామలీ స్క్రీనింగ్ టెస్ట్ అనీ, న్యూకల్ ట్రాన్స్ ల్యుయెన్సీ టెస్ట్ అనీ... ఇలా కొన్ని రకాల వైద్య పరీక్షలు ఉన్నాయి. అవి కూడా చేయించుకోవడం మంచిది. బిడ్డ ఆరోగ్యంగా ఉంటేనే కదా అమ్మతనంలోని కమ్మదనం రెట్టింపయ్యేది. దానికోసం ఈ మాత్రం కేర్ తీసుకోక తప్పదు మరి. - Sameera

Can You Really Lose Weight By Drinking More Water!     Water is an essential nutrient your body needs to use to burn body fat! That’s why drinking water to lose weight is an important consideration in your weight loss program. We are made up of 55-75% water - that’s a lot of water! We need all of it for chemical reactions in physiological processes to burn fat and calories. It’s also used to transfer by-products of waste (from fat breakdown) away and out of our bodies. In some cases, when you’re dehydrated and there isn't enough water to dilute the body's waste products, kidney stones may form. The liver then has to step in to help the kidney. This taxes the liver, causing it to perform poorly for its other functions. This is really bad for weight loss because one of the major functions of the liver is to burn fat.   Another healthy benefit of drinking water is that it helps maintain the body’s proper balance of body fluids. And it’s essential for replacing the large amounts of water lost each day. But drinking more water is not a magic diet formula.   Drinking water is certainly important for overall health and is a great choice for hydration because it is calorie and caffeine free. However, simply drinking water doesn't impact your hunger. Thirst and hunger are sensed by different mechanisms in your body. Thirst develops from a rise in electrolytes in your blood or a decrease in blood volume. Hunger signals stem from declines of available fuel (such as glucose) in your body. Because of these separate mechanisms, it is unlikely that your body confuses thirst with hunger.   Studies comparing people who drink water immediately before, or during, meals with those that don't drink water show no difference in the amount of calories that they consume. Drinking water can help with weight loss if you find that, in the absence of hunger, you still eat just to have something in your mouth. Drinking water, instead of eating, in these instances can help you decrease your overall daily calorie intake.   Each day, drink enough water so that your urine is clear. A recent study showed that your metabolic rate jumps within 10 minutes of drinking ice-cold water, and it stays up for an additional 30 minutes after you drink it. Research has also found that drinking an average of 6.5 cups of water per day helped people consume 200 fewer calories a day.   Drinking water is essential for keeping energy up, aiding the metabolism, burning fat, and more. It's the fluid your body needs for life, and it's an instrumental part in your weight loss. Other fluids can be useful, but water is obviously the best choice as it is calorie free. Forget about that whole eight cups a day thing, instead keep yourself hydrated whenever you can and the benefits of it are just good for your body and your health.   So stay Hydrated and stay fit! ...Divya

మీరు మీ నేస్తాలకంటే కాస్త పొడవు ఎక్కువగా ఉన్నానని సంబరపడిపోతున్నారా. పడండి... పడండి... పనిలో పనిగా మీ పోషకాహారం విషయంలో కూడా కాస్త జాగ్రత్తపడండి. లేకపోతే మీ పొడవే మీకు శాపంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.   ఇదీ పరిశోధన పొడవనేది మన జన్యువుల మీద ఆధారపడి వచ్చే లక్షణం. అయితే ఆడవారి పొడవుకీ, వారి ఆరోగ్యానికీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో చూడాలనుకున్నారు వెంజీ అనే పరిశోధకురాలు. ఇందుకోసం ఆమె 1980లో ప్రభుత్వం వద్ద తమ ఆరోగ్య వివరాలు నమోదు చేయించుకున్న 68 వేలమంది స్త్రీల గణాంకాలను సేకరించారు. ఇందులో భాగంగా వారి ఎత్తు, బరువు, నడుము కొలత, పొగతాగడంలాంటి వ్యసనాలు, ఆహారపు అలవాట్లు, శారీరిక శ్రమ... లాంటి అనేక విషయాలను పరిశీలించారు. అప్పట్లో వారి సగటు వయసు 44 ఏళ్లు. అంటే ఇప్పటికి వారందరూ కూడా ఇంచుమించుగా 70 ఏళ్లు దాటినవారే అన్నమాట!     ఇదీ సంబంధం 1980 నాటి వివరాలను మళ్లీ తాజా వివరాలతో పోల్చిచూశారు వెంజీ. 70 ఏళ్లు దాటాయి కాబట్టి వీరిలో మతిమరపు, డయాబెటిస్‌, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్‌ వంటి సమస్యలు తలెత్తడం సహజం. అయితే ఆ సమస్యలకీ పొడవుకీ సంబంధం ఉందేమో తెలుసుకునేందుకు వారిని ఐదు భాగాలుగా విభజించారు. ఆశ్చర్యం ఏమిటంటే వీరిలో పొడవు ఎక్కువ ఉన్నవారిలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలింది. వీరి కుటుంబనేపథ్యం, జాతి మూలాలు, వివాహం... వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నా కూడా ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది.   ఇదీ ఉపాయం పొడవుగా ఉండే ఆడవారికే ఎందుకీ ఆరోగ్య సమస్యలు అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు పరిశోధకులు. బహుశా వారి పొడవుతో పాటుగా వచ్చే ఇతర జన్యువులే ఈ సమస్యలకు కారణం అని ఊహిస్తున్నారు. మరి పొడవుగా ఉంటే దానికి ఫలితం అనుభవించాల్సిందేనా! అంటే దానికి మాత్రం ఓ స్పష్టమైన జవాబు సిద్ధంగా ఉంది. తమ ఆహారపు అలవాట్ల విషయంలో అశ్రద్ధ చేయని స్త్రీల మీద పొడవు ప్రభావం అంతగా కనిపించలేదట. అంటే పోషకాహారమే ఈ శాపానికి మందన్నమాట! - నిర్జర.  

జీరో యావలో లైఫే "జీరో"...     కరువు కాటకాలతో అల్లాడే దేశాల్లో తినడానికి ఆహారం దొరకదు కాబట్టి అక్కడ ప్రజలు బక్కచిక్కిపోయి, ఎముకలు బయటపడి ఉండటం మనం చూస్తుంటాం. కానీ నేటి కాలం యువతులకు ఏం పోయే కాలం..అన్నీ ఉన్నా కావాలని కడుపు కట్టేసుకుని సన్నగా గడకర్రలా ఉండటానికి..? ఆ దేశం, ఈ దేశం అని లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాల్లోని అమ్మాయిలు  నాజూకుతనం కోసం పడుతున్న పాట్లు అన్నీఇన్నీ కావు. అయితే సన్నబడాలనే ఉద్దేశ్యంతో శరీరావసరాలకు సరిపోని స్థాయిలో అతి తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. వారి టార్గెట్ ఒక్కటే "సైజ్ జీరో"..ఇదంతా బాగానే ఉంది కాని దీని కారణంగా బయటపడిన ఒక మానసిక వ్యాధి ప్రపంచంలోని అమ్మాయిల ప్రాణాలను హరిస్తోంది. అదే "ఎనరెక్సియా నెర్వోసా"..ఇది అత్యధిక మోడళ్లలో కనిపించే ఒక మానసిక సమస్య. తిండి తినడం వల్ల బరువు పెరుగుతుందనే ఫోబియా వల్ల వచ్చే రోగం ఇది. ఇది ఒక సాంఘిక అంటువ్యాధి..నా కన్నా ఆ అమ్మాయి సన్నగా ఉందనే ఆత్మన్యూనతా భావంతో ఈ డిజార్డర్ బారిన పడి కలత చెంది ప్రాణాల మీదకు తెచ్చుకున్న వారెందరో..తాజాగా ఇది ఇండియాలో అడుగుపెట్టింది. ఈ వ్యాధి తీవ్రతను గుర్తించిన యూరప్ అమ్మాయిలు సైజ్ జీరో నుంచి బయటపడుతుండగా..అదే సమయంలో దాన్ని ఇండియాకి తీసుకొచ్చింది కరీనా. "తషన్" చిత్రంలో కరీనా సన్నదనం చూసి బాలీవుడ్‌తో పాటు అమ్మాయిలు స్టన్నయ్యారు. ఇంకేముంది క్యాలరీలు కట్ చేసుకోవడం మొదలెట్టారు. మహానగరాల నుంచి కుగ్రామాల వరకు ఇండియాలో ఇప్పుడోక ఫ్యాషన్‌లా మారింది జీరో సైజ్. త్వరగా బరువు తగ్గాలనే ఉద్దేశ్యంతో డైటింగ్‌లు, తీవ్రస్థాయిలో వ్యాయామంతో పాటు మందులు వేసుకోవడం లాంటివి చేస్తున్నారు. అనొరెక్సియా నెర్వోసా దుష్పలితాలు: * ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో మంట * ఏకాగ్రత తగ్గడం * నిద్రలేమి * శరీరంలో పెళుసైన ఎముకలు విరిగిపోవడం * మూర్ఛవ్యాధి * హర్మోన్లలో అసమతుల్యత * రుతుక్రమంలో లోపాలు సైజ్ జీరోని సాధించడానికి చాలా పద్ధతులున్నాయి. కానీ, ఆరోగ్యవంతమైన పద్ధతులు చాలా తక్కువ. మగవాళ్లు సిక్స్ ప్యాక్‌కు కష్టపడినట్టు, అమ్మాయిలు కూడా జీరో సైజుకి అంతే కష్టపడాలి. ప్రత్యేకమైన డైట్లు, రోజువారీ ఎక్సర్‌సైజులు చేయాలి. ఇందుకు నెలల తరబడి టైం పడుతుంది. అయితే అందరికన్నా ముందు దీనిని సాధించాలని కొందరు పూర్తిగా ఆహారాన్ని మానేసి కాఫీలతో కాలం గడుపుతున్నారు. మరికొందరు స్టెరాయిడ్స్ తీసుకుంటూ..జీరో సైజ్ యావలో లైఫ్‌ని జీరో చేసుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే అతి నాజూకుతనం భారతీయ మగ కంటికి అంత ఇంపుగా అనిపించకపోవడంతో జీరో సైజ్‌ని ఎంచుకునేవారి సంఖ్య జీరోకి చేరుతోంది. అమ్మాయిలైనా అతిగా ఉన్న కొవ్వును కరిగించుకోవాలే కానీ లేనిదాని కోసం ఆరాటపడటం మంచిది కాదని గుర్తిస్తే మంచిది.

ఒత్తిడిని మీరు ఓడించండి... లేదంటే ఒత్తిడి మిమ్మల్ని ఓడిస్తుంది!   భారతీయ స్త్రీ... ప్రపంచంలోని అందరు స్త్రీల కన్నాఎక్కువ ఒత్తిడి ఎదుర్కొనే జీవి! కాదంటారా? ఖచ్చితంగా అనలేరు. ఒకప్పుడు మన దేశంలో మహిళలు ఇంటికే పరిమితం అయ్యేవారు. అప్పుడు వాళ్లకి కేవలం ఒక ఒత్తిడి మాత్రమే వుండేది. ఆర్దిక స్వాతంత్ర్యం లేకున్నా మానసిక ఒత్తిడి సగానికి సగం తక్కువగా వుండేది. కాని, ఇప్పుడు ఆధునిక భారతీయ మహిళ రెండు కోణాల్లో ఒత్తిడికి లోనవుతోంది. ఇంటా, బయటా ఏక కాలంలో ద్వంద్వ యుద్దం చేస్తోంది! మరి ఈ మాడన్ మానసిక ప్రెషర్ కి పరిష్కారం ఏంటి? కొన్ని సూచనలు, సలహాలు పాటిస్తే ఒత్తడి నుంచి బయటపడవచ్చు... మన దేశపు స్త్రీల సమస్యలలో అతి పెద్ద సమస్య అత్తగారే! సీరియల్స్ లో చూపినంత దారుణంగా, ఒళ్లు గగుర్పొడిచేలా అత్తా, కోడళ్ల సంబంధం వుండకపోవచ్చు కాని...వారిద్దరి మధ్యా సంఘర్షణ సహజం, అనివార్యం. ఒక్కోసారి ఇద్దరి తప్పూ వుండకపోవచ్చు కూడా. అయినా సరే ఎక్కువ ఒత్తిడి భరించే స్త్రీగా కోడలు కాస్త ధృఢంగా వుండాలి. తాను ఎలా వుండాలో అలా వుంటూనే అత్తగారి మనసు నొప్పించకుండా వుండాలి. ఆ క్రమంలో తాను మానసిక వేదనకి గురికాకుండా మాత్రం జాగ్రత్తపడాలి. తాను తానే కాని... అత్తగారు కోరుకున్న విధంగా మారిపోయే సినిమా తెరపై నటిని కాదని చెప్పగలగాలి. ఉద్యోగం చేయటం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. కాని, ఉద్యోగం వల్ల ఇంటి బాద్యతలతో పాటూ వృత్తి బాధ్యతలు కూడా స్త్రీల నెత్తిన పడుతున్నాయి. ఇలాంటి సమయంలో వాళ్లు ఆఫీస్ బాస్ వద్ద చాలా ప్రాక్టికల్ గా వుండాలి. ఎంత పని చేసినా గుర్తింపు దక్కపోతే క్లియర్ గా కమ్యూనికేట్ చేయగలగాలి. అప్పటికీ ఫలితం లేకుంటే కొత్త ఉద్యోగం అన్వేషించటం బెటర్. ఇది మనం అనుకున్నంత కష్టమైంది, అసాధ్యమైంది కాదు. ప్రపంచంలో టాలెంట్, హార్డ్ వర్క్ కి ఎప్పుడూ డిమాండ్ వుంటూనే వుంటుంది! భర్తని నూటికి నూరు శాతం నమ్మటం బార్య తప్పక చేయాల్సిన పని. కాని, అందుకోసం మీ వ్యక్తిగత కోణాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. రకరకాల్ని నైపుణ్యాల్ని, విద్యల్ని ఎప్పటికప్పుడూ నేర్చుకుంటూ వుండండి. అప్పుడు మీ భర్త దృష్టిలో మీకు విలువ పెరుగుతూ వుంటుంది. ఆయనపై మీరు ఆధారపడ్డారన్న భావం ఆయనకు కలగదు. సమానత్వం భర్త ఇచ్చేది మాత్రమే కాదు... భార్య స్వయంగా కష్టపడి సాధించుకోవాల్సిందని గుర్తుంచుకోండి! మగవాళ్లకు కూడా ఒత్తిడి వుంటుంది. కాని, ఆడవాళ్లకు రెట్టింపు ఒత్తిడి వుంటుంది. ఇందుక్కారణం ఆఫీస్ లో అద్భుతంగా పని చేయాల్సి రావటంతో పాటూ ఇంట్లో చక్కగా వండి పెట్టగలగాలి. పిల్లలు, భర్త, అత్త,మామలు... అందర్నీ సంతోషరచగలగాలి. ఈ క్రమంలో మీకు ఇంటా, బయటా ఫస్ట్ క్లాస్ మార్కులు రావాలని తాపత్రయపడకండి. ప్రతీ చోటా ప్రతీ సారీ టాపర్ గా వుండటం ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇంట్లో ప్రతీ రోజు నాలుగేసి వంటకాలు చేయకపోయినా ఫర్వాలేదు. అలాగే, ఆఫీస్ లో ప్రమోషన్ కోసం అర్థరాత్రి దాకా పని చేయాల్సిన అగత్యం లేదు. మీకు ఏది ముఖ్యమో తేల్చుకుని దాని కోసం ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పని చేస్తూ ముందుకెళ్లండి... పైన చెప్పిన అన్నిటికంటే ముఖ్యమైంది మీ పక్కనున్న స్త్రీలతో పోటిపడకపోవటం. ఆరోగ్యకర పోటీ మంచిదే కావచ్చు కాని జీవితంలో ప్రతీ విషయంలో పోటీ పడుతూ పోతే ఆరోగ్యం పాడైపోతుంది. ఈ విషయం గుర్తుంచుకొని సాధ్యమైనంత వరకూ పోటీకి దూరంగా వుండండి. పోలికను దరి చేరనీయకండి. అప్పుడు మీరు మీలా వుండగలుగుతారు. ఈ ప్రపంచంలో ఒత్తిడి లేకుండా వుండటానికి మనం మనలా వుండటం తప్ప మరో మార్గం లేదు!  

Best Summer Foods   Have you ever wondered why most people suffer from stomach ailments and viral infections during the summer months? The reason is simple. We don’t cool our bodies enough. Even if you include half a bowl of pure curd with every meal, it will largely benefit you. If you tire of curd easily, include curd based drinks, lassi or even buttermilk along with every meal.The best way to get through summer without compromising on your health is by avoiding foods that heat your body and stomach. Primarily, meat products, eggs and most protein rich foods do so.It is best to avoid them and instead consume platefuls of lightly cooked vegetables. Sometimes, it isn’t about consuming the right foods during summer, as much as it’s about the right cooking and preparation technique. In this sense, use fewer spices, because too many of them can definitely make matters worse. Use smaller quantities of heat rich spices like ginger and red chilli. Consume small quantities of every vegetable you can avail of in your local market, the key to balanced health is after all balanced variety. Summer is the season to binge on fresh fruits and fresh juices. Fruits like watermelon, all kinds of citrus fruits, apples, grapes, bananas, melons are known to hydrate the body or boost it with more energy in one way or other. During the summer months, you tend to sweat more.  This can lead to dehydration if you don’t consume the right foods and cooling, hydrating drinks.  Cucumbers have long since known to be the best kind of cooling food. If you consume a few pieces daily, it will definitely keep away upset stomachs and summer illnesses and bugs. Try to chill the cucumber before eating it so that it tastes better. You can decorate it with various kinds of seasoning to add more flavour to it.  It isn’t exactly a delicious thought to consume a whole lemon, but by keeping a piece in your mouth for a few minutes when out in the sun, it can help you stay hydrated and fresh. No food would be right enough if you don’t have enough water. Summer is the time to focus on your thirst! You will always find yourself thirsty this season. So be sure to keep drinking cooling beverages, juices and water throughout.  

How to Stay cool in Summer ?   Summer is a dreadful still it is really a pleasant season. It can present you with a pleasurable and enjoyable experience, but only when you Stay Cool. The summer heat can be dreadful for you if you could not stay cooler. Not all the people or families can afford air conditioner, and thereby staying cooler in hot summer days can be a major concern for them. If you are one of them, just do not get bothered as you can keep yourself cooler in hot summer days even without an air conditioner. 1, Take one glass and load it with the ice cubes. After that, hold the glass up to your mouth and blow gently into it. The ice will significantly cool down the air you are blowing into the glass and as the air has just one way to come out of the glass, the cold air will be driven out over your skin. It is a very simple trick and it can be an excellent alternative to air conditioning. 2, Make a thin slice of cold cucumber and place it in the middle of your forehead. This will work instantly and provide a cooling sensation for a hot day. 3, Pour some ordinary rubbing alcohol into the cloth, rub it over your face and sit in front of a fan or in the way of a cool breeze, allowing the evaporation of alcohol. The evaporation of alcohol will provide the cooling effect. Be cautious that alcohol does not get in contact with your mouth or eyes. 4, Remove your hat or shoes while you’re indoors. The majority of the body's heat gets released via the scalp, the palms of the hands and the soles of the feet. So, maintaining these areas cool will provide the surprising difference. 5, Going barefooted will also aid you to keep your body cooler. Some Other Tricks to Get Cooler * Close All Windows and Doors throughout the Day : It is very important to prepare your home against the heat. So, you should close all windows, blinds, exterior doors and curtains. It is OK that the sun hits your house in the morning but they should not be opened throughout the hottest part of the day. * Open The Windows And Doors At Evening : For allowing the cooler evening/night air to circulate through the rooms and to create a cross-breeze, it is necessary to open the windows and doors at evening. You should leave all the interior doors open to allow the cooler evening/night air to blow throughout the home. If you leave the interior doors closed, they stock up the daytime heat and your house will not cool down as much you need. * Keep The Air Flowing To Cool Down Your House : Turn on the ceiling fan, an attic fan, a box fan or an upstairs window fan for draining off the heat accumulated in upper rooms and pushing the heat outdoors. Position a portable fan, which can suck up the cooler air from the underneath floor, and blow the hot air in upward direction towards the ceiling. * Turn Off The Unnecessary Things That Generate Heat : If your phone is not being charged, there is no need to plug in the phone charger. Plugging of the phone chargers not only uses the electricity, it also generates heat. Shut down your computer if you are not using it because computers can also generate a lot of heat. Avoid the incandescent light as they are known to create heat, you can switch to compact fluorescents instead. The microwave holds a clock on it, and thereby it generates a lot of heat. If there is a clock on your coffee maker, it can also generate heat. So, avoid the use of both if not necessary. * Make Use Of Light Colors : Opt for a light-colored roof or roof coating if you have a choice. It can reflect sunlight instead of absorbing it.That is not all; you should put white sheets over furniture, cover your corduroy pillows with light-colored pillowcases and put the linen slipcovers on wool sofas during the summer months. The heat will be reflected by light-colored fabric, rather than absorption of it. Moreover, the smooth texture will provide you a feeling of coolness.  

  ఆడవారి ముక్కు... మరింత షార్పు     మనిషికీ, మనిషికీ వాసన పసిగట్టడంలో కొంత తేడా ఉండవచ్చు. కానీ మగవారికంటే ఆడవారి ముక్కులు మహా చురుగ్గా పనిచేస్తాయంటే నమ్మగలమా? నమ్మితీరాలంటున్నారు శాస్త్రవేత్తలు. మగవారితో పోలిస్తే ఆడవారి ముక్కు చురుగ్గా పనిచేస్తుందేమో అన్నది మొదటి నుంచీ ఉన్న అనుమానమే! కానీ ఎవరు ఎంత ప్రయత్నించినా, ఆ వాదనకు రుజువు కనుక్కోలేకపోయారు. బ్రెజిల్కు చెందిన శాస్త్రవేత్తలు ఈ విషయంలో తాడోపేడో తేల్చేద్దామనుకున్నారు. అందుకోసం వాళ్లు Isotropic fractionators అనే పరీక్షని రూపొందించారు. ఈ పరీక్షతో మెదడులో ఏ భాగానికి సంబంధించి ఎన్ని కణాలు ఉన్నాయో ఖచ్చితంగా లెక్కకట్టవచ్చునట!   Isotropic fractionatorsని ఉపయోగించి కొందరిని పోస్ట్మార్టం చేశారు. వారి మెదడులో వాసనని పసిగట్టే olfactory bulb వంటి ప్రాంతాలలోని కణాలను లెక్కగట్టే ప్రయత్నం చేశారు. దీంతో వాసనకి సంబంధించిన న్యూరాన్లు ఆడవారిలో 50 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. బహుశా ఆడవాళ్లకి పుట్టుకతోనే వాసనకి సంబంధించి ఎక్కువ కణాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు.   మనకి తెలియకుండానే ముక్కు చాలా విషయాల్ని తెలియచేస్తుంటుంది. బయట వర్షం పడుతున్నా, ఎక్కడన్నా మంటలు చెలరేగుతున్నా... కొన్ని వాసనలు వస్తుంటాయి. పిల్లల్ని పెంచే క్రమంలో తల్లులకి ఈ సూచనలు చాలా ఉపయోగపడతాయి. అందుకనే ప్రకృతి వాళ్లకి వాసన చూస్తే శక్తిని అధికంగా అందించి ఉంటుంది. అదే నైపుణ్యం తర్వాత ఆహారం సేకరించడానికీ, వంటలు చేయడానికీ ఉపయోగపడుతోంది.   వాసన మన ఇంద్రియాలలో ఒక భాగం. మనం పొందే రకరకాల అనుభూతులకి ప్రేరణ. ఒక మంచి వాసన మన మనసు, శరీరాల మీద కూడా ప్రభావం చూపవచ్చు. అలా చూసుకుంటే ఆడవాళ్లు అదృష్టవంతులనే చెప్పుకోవాలి. - నిర్జర.  

ఉగాదినాడు నువ్వుల నూనేతో స్నానం...   Ugadi begins with a ritualistic oil bath with sesame oil. Watch this video to know why one should not miss sesame oil bath on Ugadi day…

పీరియడ్స్ రాకపోవడానికి కారణాలెన్నో!     మహిళల ఆరోగ్యం పీరియడ్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. నెలసరి సరైన సమయానికి రాకపోవడం వల్ల లెక్కనేనన్ని సమస్యలు వచ్చిపడుతుంటాయి. పీరియడ్స్ ఆలస్యంగా వచ్చినా, రావాల్సిన దానికన్నా ముందే వచ్చేసినా కూడా సమస్యే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే రెండు మూడు నెలల వరకూ రాని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆ పరిస్థితి వస్తే కానీ కొందరు దీని గురించి ఆలోచించరు. అదేదే ముందే నెలసరి ఎందుకు క్రమం తప్పుతుందో తెలుసుకుంటే సమస్య ఆదిలోనే అంతమవుతుంది. కాబట్టి మీ సమస్యకి వీటిలో ఏది కారణమో వెంటనే తెలుసుకోండి. * ఒత్తిడి ఎక్కువైతే ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్ హార్మోన్ల స్థాయిలో మార్పులు వస్తాయి. ఆ ప్రభావం రక్త ప్రసరణపై పడి నెలసరిలో తేడాలు వస్తాయి. * ఆహారపు అలవాట్లలో తేడా వచ్చినా కూడా సమస్య వస్తుంది. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తగినన్ని పోషకాలు అందకపోవడం వల్ల బరువు తగ్గి రుతుక్రమంపై ప్రభావం పడుతుంది. లేదా జంక్ ఫుడ్ లాంటివి ఎక్కువ తినడం వల్ల బరువు పెరిగి సమస్య వచ్చి ఉండొచ్చు. * హార్మోన్ల అసమతుల్యతను లెక్క చేయకపోవడం, చికిత్స తీసుకోకపోవడం వల్ల క్రమక్రమంగా పీరియడ్స్ లో తేడా వస్తుంది. * చాలామందికి తెలియని విషయం ఏమిటంటే... మితిమీరి వ్యాయామం చేయడం కూడా ఈ సమస్యను తెచ్చి పెడుతుంది. ఎక్సర్ సైజ్ మోతాదు మించడం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుందట. తద్వారా సమస్య ఏర్పడుతుందన్నమాట. * దీర్ఘకాలిక వ్యాధులకు యాంటి బయొటిక్స్ వాడటం వల్ల కూడా సమస్య వస్తుంది. * కొంతమంది ఏవో ముఖ్యమైన పనులున్నాయనో, పూజలూ వ్రతాలూ ఉన్నాయనో పీరియడ్స్ రాకుండా మందులు వేసేసుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా ఓసారయితే ఫర్వాలేదు కానీ తరచుగా ఇలా చేస్తుంటే మాత్రం సమస్యలు రావడం ఖాయం. సహజంగా వచ్చేదాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల అది క్రమం తప్పి మనల్ని ఇబ్బంది పెడుతుంది. చూశారు కదా! వీటిలో ఏ కారణమైతేనేమి... పీరియడ్స్ కి అడ్డు పడుతోందంటే దాన్ని మనం అడ్డుకునే తీరాలి. కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లండి. కారణం తెలుసుకోండి... దానికి తగిన చికిత్స తీసుకోండి. - Sameera

  లేడీ డాక్టరు దగ్గరకు వెళ్లడమే మంచిదా!     ప్రపంచంలో వంద మంది ప్రసిద్ధ వైద్యుల జాబితాను తయారుచేయమని అడిగితే.... అందులో బహుశా 90 శాతం మగవారే కనిపిస్తారు. కారణం స్పష్టమే! ఆడవారు ఎంత నైపుణ్యం చూపినా, దానిని సమాజం అంగీకరించేందుకు వెనుకడుగు వేస్తూనే ఉంటుంది. కానీ గణాంకాలను పరిశీలిస్తే, నిజాలు వేరేలా కనిపిస్తాయి. అందుకు ఉదాహరణగా ఓ పరిశోధన.. వైద్యాన్ని అందించడంలో మగ డాక్టర్లకీ, లేడీ డాక్టర్లకీ మధ్య వ్యత్యాసం ఉంటుందన్న విషయం ఎప్పుడోనే బయటపడింది. రోగులకు వైద్యం చేసేటప్పుడు లైడీ డాక్టర్లు నియమనిబంధనలను తూచా తప్పకుండా పాటిస్తారనీ, రోగులకు సమాచారాన్ని అందించడంలో లోటు రానివ్వరని పరిశోధకులు చెబుతూ ఉంటారు. ఇలాంటి పద్ధతుల వల్ల రోగులకు మేలు జరుగుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే అవి ఏకంగా రోగుల ప్రాణాలనే కాపాడుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది. హార్వర్డు విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు స్త్రీ, పురుష వైద్యుల దగ్గరకి వెళ్లే రోగుల పరిస్థితి ఏమిటా అని గమనించారు. ఇందుకోసం 2011 – 14 మధ్య చికిత్స పొందని ఓ పదిలక్షల మంది రోగుల తీరును గమనించారు. వీరిలో లేడీ డాక్టర్ల దగ్గరకు వెళ్లిన రోగుల పరిస్థితి చాలా మెరుగ్గా ఉన్నట్లు తేలింది. మగ డాక్టర్ల వద్ద వైద్యం చేయించుకున్న రోగులతో పోలిస్తే వీరు తిరిగి ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఓ ఐదు శాతం తక్కువగా ఉన్నట్లు బయటపడింది. కేవలం ఆసుపత్రిలో చేరడమే కాదు.. లేడీ డాక్టర్ల వద్ద వైద్యం చేయించుకున్న రోగుల ఆయుష్షు కూడా మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇతరులతో పోలిస్తే వీరిలో అర్థంతరంగా చనిపోవడం అనేది ఓ ఐదు శాతం తక్కువగా కనిపించింది. అలా చూసుకుంటే పరిశోధకుల వద్ద ఉన్న రోగులలో దాదాపు 32,000 మంది ఆయుష్షు దీర్ఘంగా సాగినట్లు తేలింది. అదీ విషయం! స్వభావసిద్ధంగా నియమనిబంధనలను అనుసరించే మనస్తత్వం వల్లనైతేనేం, రోగులతో ఉన్న సంబంధబాంధవ్యాల వల్లనైతేనేం... స్త్రీ వైద్యుల దగ్గర చికిత్స తీసుకునే రోగుల పరిస్థితి మెరుగ్గా అన్నట్లు ఈ పరిశోధనతో బయటపడింది. కానీ విచిత్రం ఏమిటంటే... మగ డాక్టర్లతో పోలిస్తే, లేడీ డాక్టర్లకు దాదాపు ఎనిమిది శాతం తక్కువ వేతనాలు లభిస్తాయట. అంతేకాదు! ఆసుపత్రులలో పనిచేసే లేడీ డాక్టర్లకు పదోన్నతుల విషయంలో కూడా అన్యాయం జరుగుతూ ఉంటుందన్న ఆరోపణలూ ఉన్నాయి. - నిర్జర.  

ఉల్లిపాయతో అండాశయ క్యాన్సర్‌కు చెక్   అండాశయ క్యాన్సర్! ఏటా లక్షకు పైగా స్త్రీల ప్రాణాలను హరించే మాయదారి. అతి ప్రాణాంతకరమైన క్యాన్సర్లలో ఇదీ ఒకటి. దీని బారినవారిలో 40 శాతం మంది మాత్రమే ఐదేళ్లకు మించి జీవితాన్ని చూడగలుగుతారు. కానీ ఇలాంటి ఉపద్రవానికి ఉల్లిపాయలు నివారణగా నిలిచే అవకాశం ఉందని తేలడం అద్భుతమే కదా! ఆ అద్భుతం నిజమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు.   భయపెట్టే గణాంకాలు: స్త్రీలలో అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం కేవలం ఒక్క శాతమే ఉంటుంది. కానీ వంశంలో కనుక ఈ వ్యాధి ఉంటే, ఆ ఒక్క శాతం అవకాశం కాస్తా 40 శాతంగా మారిపోతుంది. ఇక ఊబకాయం, సంతానలేమి, హార్మోన్ థెరపీ వంటి మరికొన్ని కారణాల వల్ల కూడా ఈ క్యాన్సర్ దాడి చేసే ప్రమాదం ఏర్పడుతుంది. అండాశయ క్యాన్సర్తో వచ్చే లక్షణాలని ఏదో రుతుసంబంధమైన ఇబ్బందులుగా భావించి నిర్లక్ష్యం చేసే ప్రమాదం లేకపోలేదు. ఫలితంగా ఆదిలోనే తుంచగలిగే ఈ వ్యాధి ముదిరిపోతుంది. అప్పటివరకూ అండాశయానికి మాత్రమే పరిమితమై ఉన్న క్యాన్సర్ కణాలు శరీరంలోని మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తాయి. పైగా ఒకసారి ఈ క్యాన్సర్కు చికిత్స తీసుకున్నాక 80 శాతం మందిలో ఇది మళ్లీ తిరగబెట్టే ప్రమాదం లేకపోలేదు. వైద్య సదుపాయాలు అరకొరగా ఉండే మనలాంటి దేశాల్లో ఈ పరిస్థితి మరెంత ప్రాణాంతకంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.   ఉల్లిపాయ వైద్యం: జపానుకి చెందిన కుమనోటో విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఉల్లిపాయలో ఉండే ‘Ononion A’ (ONA) అనే రసాయనాన్ని ఎలుకల మీద ప్రయోగించారు. వీరి ప్రయోగంలో అండాశయ క్యాన్సర్ని నివారించడంలో ఈ ONA అనేకరకాలుగా తోడ్పడుతుందని తేలింది. - మన శరీరంలోని macrophages అనే రక్షణ వ్యవస్థ క్యాన్సర్ కణాల మీద దాడి చేస్తుంది. ఈ దాడిలో క్యాన్సర్ కణాలది పైచేయిగా మారినప్పుడు అవి ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందడం మొదలుపెడతాయి. కానీ ONA అనే రసాయనం శరీరంలోకి చేరిన తరువాత క్యాన్సర్ కణాల వృద్ధి గణనీయంగా తగ్గిపోయినట్లు తేలింది. - ఒకవైపు క్యాన్సర్ కణాలు మన శరీర రక్షణ వ్యవస్థ మీద దాడి సాగిస్తుండగానే, MDSC అనే కణాలు కూడా వాటికి తోడై మన రక్షణ వ్యవస్థని బలహీనపరుస్తాయి. ONA రసాయనంతో ఈ MDSC కణాలు నిర్వీర్యం కావడాన్ని శాస్త్రవేత్తలు గమనించారు. - ఉల్లిపాయలోని ఈ ONA శరీరాన్ని లోలోపల్నుంచే రక్షించడమే కాకుండా, క్యాన్సర్తో పోరాడేందుకు వాడుతున్న మందులు మరింత ప్రభావవంతంగా పనిచేయడంలో తోడ్పడ్డాయట. - అప్పటివరకూ అండాశయానికి పరిమితమైన క్యాన్సర్ కణాలు ఇతర అవయవాలకు సోకకుండా కూడా ONA అడ్డుకోవడాన్ని గమనించారు.   కొత్త ఆశలు: ఇప్పటివరకూ అండాశయ క్యాన్సర్ వస్తే దాని నివారించడం కష్టమన్న అభిప్రాయం ఉండేది. ఈ భయంతోనే కొందరు ముందుగానే అండాశయాన్ని తొలగించుకుని ఇతరత్రా ఆరోగ్య సమస్యలను భరిస్తున్నారు. కానీ ఈ తాజా పరిశోధనతో అండాశయ క్యాన్సర్ను ఖచ్చితంగా నివారించవచ్చన్న ఆశలు మొదలయ్యాయి. ఈ ONA రసాయనం వల్ల ఉపయోగం ఉందంటూ అటు ప్రభుత్వాలు, ఇటు వైద్యలోకం అంగీకరిస్తే కనుక ONAతో కూడిన మందులు త్వరలోనే మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.   - నిర్జర.

గోళ్ల రంగుకి అమ్మాయిల బరువుకి లింకేంటి..?   గోళ్ల రంగు వేసుకుంటే బరువు పెరుగుతారా..? అసలు గోళ్ల రంగుకి.. శరీర బరువుకి సంబంధం ఏంటీ..? పరిశోధనలో ఏం తేలింది..? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=SoTbYnQ6BTQ

  Are you eating more protein than needed?     Protein is awesome. It’s essential for maintaining a lean, healthy body composition. Our bodies simply wouldn't be able to build and repair its cells without protein. Protein is made up of amino acids that are the building blocks of body tissues, including muscles, blood vessels, hair, skin, and nails. It's also involved in the production of enzymes and hormones that help the body to function normally. But anything in excess than what our body requires is doing no good to our health. Are you eating too much protein? Here are some signs that you could be taking in more than what is required. One of the major signs is that your cholesterol levels slowly but steadily are rising. According to a research, it could very well have to do with the amount of protein you’re eating. Also the fact that you see that you start gaining weight. If you're eating excess animal protein or downing protein shakes this is bound to happen. Meat often means extra fat and also calories. And many protein shakes have added sugar to make them taste better. Over time, too many excess calories, no matter from fat, sugar, or protein, will cause weight gain. To shift your meals in a healthier direction, aim for balanced meals that include lean protein, whole grains, fruit and vegetables. Low energyis another major problem we see with ultra-high protein diets. Your brain needs carbs in all their sugary, starchy glory to stimulate the production of the mood-regulating hormone serotonin. Strip them from your diet, and you're more likely to feel grouchy, irritable. Bad breath is something that’s often accompanied by high-protein, low-carb diets. Low carb intake causes bad breath due to ketosis. According research when we don’t eat enough carbs, the body gets energy from fats and protein and this process causes bad breath. Another issue is indigestion and kidney problem. The fact that protein is hard to digest makes it great for weight loss. But this advantage is also a curse. Our stomachs can’t process excess protein, especially from animal sources. As a result, eating too much protein can cause constipation, nausea and indigestion. One of the waste products created by the kidneys during the filtering process is blood urea nitrogen. Researchers and physicians use blood urea nitrogen levels to evaluate kidney function, and it's also a measure of how hydrated a person is.  It's important to pay attention to this sign specifically, as kidney stones can also be caused by a high-protein diet. Depending on other factors, when you put your kidneys into overdrive, the risk of kidney stones increases for those who are already prone because of particular issues with absorbing specific forms of calcium, mostly from leafy greens, surprisingly enough. - Divya

    ఫ్యాషన్‌తో వెన్నునొప్పి వస్తుందా!     చిరోప్రాక్టిక్ మెడిసిన్ అని ఒక తరహా వైద్యం ఉంది. వెన్నుపూస మీద కలిగే ఒత్తిడి కారణంగానే శరీరంలో అనేక సమస్యలు ఏర్పడతాయన్నది వీరి వాదన. ఆధునిక వైద్యం వీరి చికిత్సా విధానాన్ని అంతగా అంగీకరించనప్పటికీ... చిరోప్రాక్టిక్ చికిత్సకి పాశ్చాత్య దేశాలలో మంచి ఆదరణ ఉంది. ఆ చికిత్సని అందించే అధికారిక సంస్థలూ ఉన్నాయి. వాటిలో ఒకటి  British Chiropractic Association (BCA). ఈ సంస్థ కొన్ని వందల మందిని పరిశీలించిన మీదట ఈమధ్యనే ఒక నివేదికను వెల్లడి చేసింది. ఆధునిక మహిళల వస్త్రధారణ వల్ల నానారకాల సమస్యలు ఏర్పడతాయన్నది ఇందులోని సారాంశం. మరి వారి వాదనలేంటో వినండి...   బిగుతైన జీన్స్‌:- బాగా బిగుతుగా ఉండే జీన్స్ వంటి దుస్తులను ధరించడం వల్ల కాళ్లలోని సహజమైన కదలికలు తగ్గిపోతాయట. దానివల్ల నడిచేటప్పుడు పూర్తి బరువంతా మన కీళ్ల మీదే పడుతుందని హెచ్చరిస్తున్నారు. బరువైన హ్యాండ్‌బ్యాగ్స్:- ఇప్పటి మహిళలు మోస్తున్న హ్యాండ్‌ బ్యాగ్స్ చాలా బరువుగా ఉంటున్నాయని వాపోతోంది BCA సంస్థ. పైగా వీటిని భుజానికి కాకుండా, మోచేతులకి తగిలించుకోవడం వల్ల... ఒకవైపు భుజాన్ని కిందకి లాగివేసే పరిస్థితి ఏర్పడుతోందట. దీనివల్ల వెన్నునొప్పి ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. బరువైన కోట్లు:- మన దగ్గరైతే తక్కువ కానీ... పాశ్చాత్య దేశాలలో ఇంతింత బరువుండే ఉన్ని దుస్తులను వేసుకుంటారు. తల మీద బరువుంచే ఇలాంటి దుస్తుల వల్ల మెడనొప్పి వంటి సమస్యలు వస్తాయట. హైహిల్స్:- హైహీల్‌ చెప్పుల గురించి ప్రత్యేకంగా మళ్లీ చెప్పుకోనవసరం లేదేమో! కానీ ఇలాంటి చెప్పుల వల్ల వెన్నుపూస మీద లేనిపోని ఒత్తిడి ఏర్పడుతుందని మరోసారి హెచ్చరిస్తోంది BCA. పట్టీలేని చెప్పులు – చెప్పులైనా, షూస్‌ అయినా పాదం వెనక భాగం నుంచి పట్టు అందించేలా ఉండాలి. కానీ ఇప్పుడు ధరించే పాదరక్షలు ఫ్యాషన్‌ కోసం కేవలం కాలి వేళ్ల మీదే ఆధారపడి ఉంటున్నాయి. దీని వల్ల పాదాలు, నడుములలో లేనిపోని సమస్యలు తలెత్తుతాయంటున్నారు. బరువైన ఆభరణాలు:- సందర్భాన్ని బట్టి మెడలో బరువైన ఆభరణాలను వేసుకోవడం ఇప్పుడ తరచూ కనిపించేదే! దీని వల్ల మెడలో ఉండే ఎముకల మీద లేనిపోని ఒత్తిడి కలగడమే కాకుండా, శరీర భంగిమలో కూడా తేడా వస్తుందట.   ఒక్కముక్కలో చెప్పాలంటే మన సహజమైన కదలికలను ప్రభావితం చేసే ఎలాంటి దుస్తులైనా, అలంకరణలైనా... ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. BCA నివేదిక ప్రకారం 73 శాతం మంది ఏదో ఒక తరహా వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అయితే వారలో మూడోవంతు మందికి తమ నొప్పికి కారణం అసహజమైన వస్త్రధారణ అని తెలియనే తెలియదు! అయితే ఈ వాదనను ఇంగ్లీషు వైద్యులు కొట్టిపారేస్తున్నారు. మన వెన్ను మరీ అంత సున్నితమైనదేమీ కాదనీ.. చిన్నా చితకా బరువులని నిర్భయంగా మోయగలదని చెబుతున్నారు. కొద్దిపాటి ఒత్తిడిని ఆనాయాసంగా తట్టుకోగలదని హామీ ఇస్తున్నారు. అంటే ఎవరి మాట వినాలో ఇక మనమే నిర్ణయించుకోవాలన్నమాట!                           - నిర్జర.

    అస్తమా - నివారణ     గతంతో పోలిస్తే వైద్య రంగం చాలా పురోగతి సాధించింది. నిన్న మొన్నటి వరకు చికిత్సే లేదనుకున్న ఎన్నో వ్యాధులకు చికిత్స అందించగలుగుతున్నారు. కానీ అస్తమాకు మాత్రం ఇప్పటివరకు పర్మనెంట్ సొల్యుషన్ రాలేదు. అస్తమా ఏ వయసులో వారికైనా రావచ్చు, చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరికైనా అస్తమా బాధించవచ్చు.అస్తమా శ్వాస నాళాలకు సంబంధించిన వ్యాధి.           అస్తమా సాధారణంగా ఎలర్జీవల్ల కలుగుతుంది. మనం పీల్చిన గాలి, లోపలికి వెళ్ళేప్పుడు ఎలర్జీవల్లగాని, ఒత్తిడివల్ల గాని బ్రాంకియోల్స్‌ లోపల పొర వాస్తుంది. మ్యూకస్‌ మెంబ్రేన్‌ ముడుచుకుపోతుంది. గాలి ప్రసరించే దారులు ముడుచుకుపోయి శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతుంది. గురకవస్తుంటుంది. దగ్గు రావచ్చు. ఉన్నట్టుండి ఆయాసం మొదలై శ్వాస పీల్చలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు.వర్షాకాలం వచ్చిందంటే చాలు అస్తమా రోగులు వణికిపోతుంటారు. కాస్త చల్లటి గాలులు వీచినా, చల్లటి ఆహారపదార్థాలు తిన్నా, తాగినా శ్వాసలో ఇబ్బంది మొదలవుతుంది. అందుకే అస్తమా బాధితులు ఇబ్బంది ఎక్కువ కాకముందే తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : మన చుట్టూ వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి, వీలైతే ప్రతిరోజూ వాకింగ్ చేయాలి. కొవ్వు పదార్థాలను తినడం తగ్గించాలి. నూనెలో వేయించిన ఫాస్ట్ ఫుడ్స్, చేపలు, తదితరాలను స్వీకరించకపోవడం మంచిది. చల్లదనాన్నిచ్చే పుచ్చకాయ, బీరకాయ, ఖర్బూజా వంటివి తినకూడదు. ఫ్రిజ్ లో ఉంచిన వస్తువులు పెరుగు అసిడిక్ ఆమ్లం అధికంగా ఉన్న నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి పళ్ళ రసాలను తీసుకోరాదు. ఇబ్బంది తగ్గే వరకు కారం, పులుపు తగ్గించడం మంచిది. ఆహారాన్ని తినేటప్పుడు బాగా నమిలి తినాలి, వీలయితే ఆహారం కడుపు నిండా కాకుండా, కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి. పడుకోవడానికి కనీసం మూడు గంటలు ముందుగానే రాత్రి భోజనం తినేయడం మంచిది. మునగాకులో కఫం తొలగించే గుణాలు పుష్కలం, కాబట్టి మునగాకు బాగా తినాలి.  అస్తమాకు చికిత్స లేదు , నివారణ ఒక్కటే మార్గం అస్తమాకు చికిత్స లేదు, అలాగని అస్తమాను నిర్లక్ష్యం చేస్తే క్రానిక్ ఎయిర్ వేస్ డిసీజ్ గా మారి ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి ఎప్పటికప్పుడు డాక్టర్ ని సంప్రదిస్తూ ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, పౌష్టికాహారం తింటూ, మన చుట్టూ వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు అస్తమా తీర్వ్రతరాన్ కాకముందే ఇంట్లోనే కొన్ని నియమాలు పాటించడం ద్వారా అస్తమాను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.    ఇంట్లోనే అస్తమాకు ఉపశమనం తేనే   తేనే అస్తమాకు మంచి ఉపశమనకారిగా పని చేస్తుంది. రెండు చుక్కల తేనే అస్తమా వ్యాధి గ్రస్తుల ముక్కులో పోసినట్లయితే , అస్తమా వ్యాధి గ్రస్తులు శ్వాస ఇబ్బందుల నుండి కాస్త కోలుకునే అవకాశముంది. అత్తిపండు తో ఉపశమనం     అత్తిపండు అస్తమా రోగులకు మంచి ఔషధకారి. అత్తిపండును వేడి నీళ్ళలో బాగా కడిగి రాత్రంతా ఉంచి మరునాడు ఉదయం రోగులకు ఇస్తే అస్తమాతో పాటు దగ్గు నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.   నిమ్మకాయ ఒక నిమ్మకాయ రసాన్ని ఒక గ్లాసు నీళ్ళలో కలిపి భోజనంతో పాటు తీసుకోవాలి. ఉసిరికాయ     5 గ్రాముల ఉసిరికాయను ఒక టేబుల్ స్పూన్ తేనే తో కలిపి ప్రతి ఉదయం పరగడుపున సేవిస్తే మంచి టానిక్ లా పని చేస్తుంది.    కాకర వేళ్ళతో అస్తమా ఉపశమనం కాకర వేళ్ళు అస్తమా వ్యాధిగ్రస్తులకు వరం. ఈ మందుకు వందల ఏళ్ళ నాటి చరిత్ర ఉంది, ఒక టేబుల్ స్పూన్ నిండా కాకర వేళ్ళ ను పొడిచేసి తేనే లో లేదా తులసి రసంలో కలిపి రోజుకు ఒక పూట చొప్పున సేవిస్తే అస్తమా అస్తమా తగ్గుముఖం పడుతుంది.   ములక్కాడ ఆకులతో ఉపశమనం   180ml నీళ్ళలో గుప్పిట నిండా ములకాడ ఆకులను ఉడకబెట్టి కాస్త ఉప్పు, మిరియాల పౌడర్, కాస్తంత నిమ్మరసం కలిపి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. అల్లం ఒక టీ స్పూన్ నిండా అల్లం రసం తీసుకుని ఒక కప్పు మెంతి డికాషన్ లో కలిపి ఉదయం, సాయంత్రం రెండు పూటలా సేవిస్తే మంచి ఫలితం ఉంటుంది. వెల్లుల్లి   అస్తమా ప్రారంభదశలో ఉన్న రోగులు రోజూ పది వెల్లుల్లి పాయల్ని తీసుకుని 30 ml పాలలో మరగబెట్టి రోజుకొకసారి సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. వాము అర టీ స్పూన్ నిండా వాము గింజల్ని తీసుకుని ఒక గ్లాసు మజ్జిగలో కలిపి రోజు రెండు పూటలా సేవిస్తే అస్తమాతో పాటు దగ్గుతో బాధపడేవారికి ఉపశమనం కలుగుతుంది. దీనితోపాటు వాము గింజల్ని వేడినీళ్ళలో వేసి అస్తమాతో బాధపడేవారికి ఆవిరి పడితే రిలీఫ్ గా ఉంటుంది. కుంకుమ పువ్వు     5 గ్రాముల కుంకుమ పువ్వును ఒక టేబుల్ స్పూన్ నిండా తేనేలో కలిపి రోజుకు ఒకసారి సేవించినట్లయితే మంచి ఔషధకారిగా పని చేస్తుంది.    ఉపవాసం , ఎక్సర్ సైజు   వారానికొకసారైనా ఉపవాసం చేయడం, ఎక్సర్ సైజు చేయడం మంచిది. యోగాఎక్స్ పర్ట్ ను సంప్రదించి శ్వాసకు సంబంధించిన ఆసనాలు వేస్తే ఉపశమనం కలుగుతుంది.