అలంకరణే కాదు ఆరోగ్యం కూడా   మగువల చేతులకు అందానిచ్చేే  గోరింటాకు.. స్త్రీ సౌభాగ్యం చిహ్నం గర్భాశయబాధలను నయం చేస్తుంది ఆషాడ మాసం వచ్చిందంటే చాలు ఆడపిల్లలు తమ చేతుల్ని గోరింటాకుతో అందంగా తీర్చిదిద్దుకుంటారు. ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవడం ఒక ఆచారం అని పెద్దలు చెబుతారు మరి ఈ ఆచారం వెనుక అసలు కథ ఏంటో తెలుసా.... గోరింటాకులో ఉండే కొన్ని ఔషధగుణాలు  ఆడవారి గర్భాశయ బాధలను నివారిస్తాయి.  అరిచేతుల్లో ఎర్రగా పండే గోరింటాకు ప్రకృతి సిద్ధంగా ఆడవారిలో వచ్చే కొన్ని సమస్యలకు పరిష్కారం చెబుతుందట. ఎండాకాలం పోయి వానాకాలం వచ్చే సంధికాలంలో ఆషాడమాసం వస్తుంది. అనేక రకాల వ్యాధులు ఈ కాలంలో పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సమయంలో ఆడవాళ్లు పెట్టుకునే గోరింటాకు వారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పురాణాల్లో గోరింటాకు గురించిన ప్రస్తావన  ఉంది.. ఈ మొక్క అసలు పేరు గౌరింటాకు…గౌరి ఇంటి ఆకు….వాడుకలో గోరింటాకుగా మారిందట. ఈ మొక్క పుట్టుక వెనుక ఉన్న కథ .. గౌరీదేవి బాల్యంలో చెలులతో వనంలో ఆటలాడే సమయాన రజస్వల అవుతుంది. ఆ రక్తపు చుక్క నేలతాకినంతనే ఓమొక్క పుడుతుంది. అది గమనించి చెలులు గౌరీదేవి తండ్రి పర్వతరాజుకుచెప్పగా సతీసమేతంగా చూసేందుకు వస్తాడు. అంతలోనే ఆ చెట్టు పెద్దదై నేను సాక్షాత్పార్వతీ రుధిరాంశతో జన్మించాను, నావలన లోకానికి ఏఉపయోగం ఉంది అని అడుగుతుంది. అపుడు గౌరి ఆచెట్టు ఆకు కోస్తుంది. ఆమె వేళ్లు ఎర్రబారిపోతాయి. గౌరి దేవి చేతులకు అలంకరణగా మారుతుంది.  దాంతో ఇకపై స్త్రీ సౌభాగ్యం చిహ్నంగా ఈ గౌరింటాకు మానవలోకంలో ప్రసిధ్ధమవుతుంది అని ఆ చెట్టులు వరం ఇస్తారు. రజస్వల సమయాన ఉద్భవించిన ఈచెట్టు,స్త్రీలగర్భాశయ దోషాలు తొలగిస్తుంది. అతిఉష్ణం తొలగించి స్త్రీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. తనవర్ణం వలన చేతులకు, కాళ్లకూ అందాన్నిచ్చే అలంకారవస్తువుగా వాడబడుతుంది.   శాస్త్రపరంగా.. గోరింటాకులో ఉండే 'లాసోన్‌' అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. కేవలం అలంకరణగానే కాదు  శాస్త్రపరంగా గోరింటాకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని వేడిని ఇది తొలగిస్తుంది. గర్భాశయదోషాలు తీసేస్తుంది. అరచేతి మధ్యలో స్త్రీ గర్భాశయానికి  చెందిన ప్రధాననాడు లుంటాయి. వాటిలోని అతి ఉష్ణాన్ని లాగేసి  గర్భాశయ సమస్యలు రాకుండా కాపాడుతుంది.  ప్రసవం తర్వాత గోరింటాకు ముద్దగా నూరి చిన్నచిన్న గోళీలుగా చేసుకుని మింగితే  ప్రసవంవలన ఏర్పడే గర్భాశయబాధలు నయమవుతాయి. మన పురాణాల్లో ఉన్నవి కట్టుకథలు కాదు.  వాటిలో ఎన్న్ ఆరోగ్యసూత్రాలు దాగి ఉన్నాయి. అయితే వీటిని మన పెద్దలు ఆచారమని చెప్పారు తప్ప వాటిల్లోనే శాస్త్రీయ పరమైన అంశాలను చెప్పలేదు. అందుకే చాలా విషయాలు మూఢాచారాలుగా మిగిలిపోతున్నాయి.

    ఆడవారి గుండెపోటు తీరే వేరు     గుండెపోటు అనగానే మనకు గుండెను చేత్తో పట్టుకుని విలవిల్లాడిపోయే దృశ్యాలే కనిపిస్తాయి. కానీ అన్ని సందర్భాలలోనూ గుండెపోటుని సూచించే లక్షణం ఇదే అన్న అపోహలో ఉండవద్దు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా స్త్రీలలో వచ్చే గుండెపోటు మరింత భిన్నమైన సూచనలను అందిస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆడవారికే ప్రాణాంతకం: రొమ్ము క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్ వంటి క్యాన్సర్ల వలనే స్త్రీలలో మరణాలు ఎక్కువని చాలామంది భ్రమ పడుతూ ఉంటారు. నిజానికి ప్రపంచవ్యాప్తంగా స్త్రీల మరణాలకు గుండెజబ్బులే ముఖ్య కారణం అని WHO సైతం తేల్చిచెబుతోంది. పైగా మగవారితో పోలిస్తే ఆడవారు గుండెపోటు వచ్చాక కోలుకునే అవకాశం తక్కువని కూడా కొన్ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. గుండెపోటు వచ్చిన వెంటనే చికిత్సని తీసుకోకపోవడం దీనిని ముఖ్య కారణంగా భావిస్తున్నారు. వైద్యునికి కూడా తోచనిది: మగవారిలో గుండెపోటుకి సంబంధించిన సూచనలు అందరికీ తెలిసినవే! ఎడమ చేయిలాగడం లేదా మొద్దుబారిపోవడం, గుండె దగ్గర విపరీతమైన నొప్పి, ఊపిరి అందకపోవడం... వంటి లక్షణాలు కనిపించిన వెంటనే మగవారు జాగ్రత్తపడిపోతుంటారు. కానీ స్త్రీల విషయంలో ఇలా కాదు! పై లక్షణాలే కాకుండా వెన్ను నొప్పి, వికారం, దవడ లాగడం, కళ్లు తిరగడం, నీరసించిపోవడం, కడుపులో నొప్పి రావడం వంటి ఇతర లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు అది ఏదో పని ఒత్తిడి వలన తాత్కాలికంగా ఏర్పడిన సమస్యగా భావిస్తుంటారు. కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందనో, కాస్త మర్దనా చేస్తే తీరిపోతుందనో అశ్రద్ధ చేస్తుంటారు. ఒకోసారి సాధారణ వైద్యులు కూడా ఈ లక్షణాలు గుండెపోటుకి చిహ్నమమని గుర్తించలేకపోతుంటారట. ఫలితం! అత్యవసర వైద్యం అందాల్సిన సమయం కాస్తా దాటిపోతుంది. అందుకనే గుండెపోటు మగవారికంటే ఆడవారినే ఎక్కువగా కబళిస్తోంది. అశ్రద్ధ కూడదు: 40 ఏళ్ల వయసు దాటినవారు, రక్తపోటుతో బాధపడేవారు, వంశపారంపర్యంగా గుండెజబ్బులు ఉన్నవారు, అధిక కొలెస్టరాల్ వంటి సమస్యలు ఉన్నవారు... ఎలాంటి సూచననీ అశ్రద్ధ చేయడం మంచిది కాదు. శరీరంలో ఏదన్నా భరించలేని నొప్పి వచ్చినప్పుడు వెంటనే వైద్యుని సంప్రదించడం ముఖ్యం. అసలు అలాంటి పరిస్థితి రాకుండా నివారించేందుకే ప్రయత్నించమంటున్నారు నిపుణులు. రోజుకి కనీసం ఒక అరగంటపాటైనా వ్యాయామం చేయమనీ, రక్తపోటు వంటి సమస్యలకు అశ్రద్ధ చేయకుండా చికిత్స తీసుకోమనీ సూచిస్తున్నారు. అన్నింటికీ మించి ఒత్తిడిని కనుక అదుపులో ఉంచుకోగలిగితే గుండెపోటుని కూడా అదుపులో ఉంచుకొన్నట్లే అంటున్నారు. - నిర్జర.

 గురక వల్ల గుండెకు పొంచి ఉన్న ప్రమాదం   గురక వల్ల కలిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు, గురక పెట్టే వారి సంగతి అటుంచితే ఆ గురక వాళ్ళ నిద్రాభంగమై ఇబ్బంది పడే వారి బాధ వర్ణనాతీతం. ఇప్పటి వరకు గురక సర్వసాధారణ విషయం, అంతే కాదు గురక పెడుతున్నారంటే ప్రశాంతంగా పడుకుంటున్నారనే అపోహ ఉండేది. అభివృద్ధి చెందిన వైద్య విజ్ఞానం గురకకు సంబంధించి ఎన్నో వాస్తవాలను కళ్ళ ముందు ఉంచుతోంది, గురక వల్ల గుండెకు ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తుంది..  గురక - కారణాలు గురక పెట్టడానికి అధిక బరువు కూడా ఒక కారణం కావచ్చు, లేదా కొండ నాలుక పొడుగ్గా ఉండటం, మెడ అతి సన్నగా ఉండటం లేదా ఏ కారణం చేతనైనా ముక్కు రంధ్రాలు మూసుకుపోయి నప్పుడు శ్వాస పీల్చడం కష్టమై నోటితో శ్వాస పీలుస్తుంటారు . ఈ క్రమంలో గొంతులో ఉండే సాఫ్ట్ పాలెట్ కణజాలం కదలికల వల్ల గురక వస్తుంది. మనం సాధారణంగా కూర్చున్నప్పుడో, నిలుచున్నప్పుడో, లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడో మన నోట్లో ఉండే నాలుక ఫ్లాట్ గా ఉండి కొండ నాలుక నిలువుగా ఉంటుంది. మనం ముక్కు ద్వారా గాలి పీల్చినప్పుడు గాలి ముక్కు రంద్రాల ద్వారా లోపలి వెళ్లి గొంతు ద్వారా ఊపిరి తిత్తుల్లోకి వెళుతుంది. కానీ పడుకున్నప్పుడు, ముఖ్యంగా గురక పెట్టేవారిలో కొండనాలుక గొంతులోని వెనుక భాగాన్ని కప్పేస్తుంది, అందువల్ల ఊపిరి పీల్చడం కష్టమైపోతుంది, కాబట్టి నోటితో గాలి పీల్చడం మొదలుపెడతారు. గురక - అనారోగ్యం ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే గురకపెట్టే వారందరికీ గురక వ్యాధి ఉన్నట్టు కాదు. అలాగని గురక పెట్టేవారందరికి ఆరోగ్య సమస్యలు రావు. గురక గురకలా ఉంటె సమస్యేం లేదు, అది ఇబ్బందికరంగా మారినప్పుడే సమస్యలు మొదలవుతాయి. గురకపెట్టే వారిని గమనిస్తే వారు మధ్య, మధ్యలో దగ్గుతుంటారు , నోటితో శ్వాస పీలుస్తూ ఇబ్బంది పడుతుంటారు.గురకను నిర్లక్ష్యం చేస్తే క్రమేణా వ్యాధి ముదిరి గాలి లోపలికి వెళ్ళే ప్రక్రియ పూర్తిగా నిలిచి పోతుంది. ఊపిరితిత్తుల్లోకి చేరాల్సిన ఆక్సిజన్ శాతం తగ్గి శరీరంలోని ముఖ్య అవయవాలకు ఆక్సిజన్ అందక గుండె ఎక్కువ సార్లు కొట్టుకోవడం మొదలుపెడుతుంది..  గురక వ్యాధి వున్నవారికి రక్తపోటు, మదుమేహం లాంటి వ్యాధులు ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి, నిద్రలేమి, శరీరానికి సరిపడా పోషకాలు అందక ఆరోగ్యం క్షీణించి ప్రాణాంతక మయ్యే అవకాశాలు ఉన్నాయి. గురక నివారణ గురకను ఒక్కసారిగా నివారించడం కష్టమే, కానీ అదుపులో ఉంచుకోవడం సాధ్యమే. బరువు తగ్గడం, ఆల్కహాల్ తగ్గించడం, సిగరెట్లకు దూరంగా ఉండటం మొదటిదైతే, రాత్రి పడుకునేటప్పుడు వెల్లకిలా కాకుండా ఒక వైపుకు తిరిగి పడుకోండి, తద్వారా నోరు తెరుచుకునే అవకాశం తక్కువ కాబట్టి ముక్కు ద్వారా గాలి లోపలికి వెళ్లి గురక తగ్గుతుంది.

చెప్పుకోలేని సమస్యకు చెప్పుకోదగ్గ పరిష్కారం!     పైల్స్... ఈ సమస్య ఉందని పైకి చెప్పుకోడానికే సిగ్గు చాలామందికి. ముఖ్యంగా మహిళలు అయి మరీ ఇబ్బంది పడతారు. దురద, నొప్పి, మంట వేధిస్తున్నా చూపించుకోడానికి సిగ్గేసి డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లరు. అలా అని నిర్లక్ష్యం చేస్తే ఇది సర్జరీ వరకూ తీసుకెళ్తుంది. కాబట్టి ఈ చిట్కాలను పాటించండి. పైల్స్ ని మీ నుంచి దూరంగా పంపించేయండి. - ముందు ఆహారంలో ఉప్పు, పులుపు, కారం తగ్గించేయండి. పీచు పదార్థాలను పెంచండి. రోజుకు నాలుగైదు లీటర్ల నీటిని తాగండి. ఫ్రూట్స్, నట్స్, స్ప్రౌట్స్ ఎక్కువ తీసుకోండి.  - తగినంత నిద్రపోండి. మానసిక ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా పైల్స్ ఇబ్బంది పెడతాయి. - స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్లకు చెక్ పెట్టండి. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ కూడా తగ్గించండి. - అంజూరపు పండ్లను రాత్రంతా నీటిలో నాబెట్టి, ఉదయాన్నే పరగడుపున ఆ నీళ్లు తాగితే సుఖ విరేచనం అవుతుంది. రోజూ అలా చేయడం వల్ల మెల్లగా పైల్స్ తగ్గిపోతాయి. - నీటిలో నాలుగు బిర్యానీ ఆకులు, మూడు వెల్లుల్లి రేకులు వేసి మరిగించాలి. ఈ నీటిని రోజుకు మూడుసార్లు పైల్స్ ఉన్న చోట రాస్తే మెల్లగా వాపు, నొప్పి తగ్గిపోతాయి. - టీ ట్రీ ఆయిల్ లో ఆముదం కానీ బాదం నూనె కానీ కలిపి రాసినా ఫలితం ఉంటుంది. కలబంద గుజ్జు రాసినా మంచిదే. - పైల్స్ నొప్పి భరించలేనిదిగా ఉంటే... వేడిపాలలో నిమ్మరసం కలుపుకుని మూడు గంటలకోసారి చొప్పున రోజంతా తాగండి. బాధ తగ్గుముఖం పడుతుంది. - రోజూ పడుకునే ముందు నిమ్మరసంలో దూది ముంచి పైల్స్ మీద పెట్టుకోండి. దీనివల్ల కొద్ది కాలానికి సమస్య తీరిపోతుంది.      ఇన్ని చేసినా తగ్డకపోతే సమస్య ముదిరినట్టు లెక్క. అప్పుడు మాత్రం సిగ్గు పడకుండా డాక్టర్ దగ్గరకు వెళ్లండి. లేదంటే మరీ ముదిరిపోయి పరిస్థితి చేయి దాటవచ్చు! -Sameera  

    ఊబకాయంతో స్త్రీలకు క్యాన్సర్‌     అధికబరువు చాలా అనారోగ్య సమస్యలకు దారితీస్తుందన్న విషయం కొత్తేమీ కాదు. అయితే ఇది ఏకంగా క్యాన్సర్‌కే దారితీస్తుందని తేల్చిన ఓ పరిశోధన ఇప్పుడు కలవరాన్ని రేపుతోంది. కాస్త బరువే కదా అని అశ్రద్ధ చేసేందుకు వీల్లేని పరిస్థితి కల్పిస్తోంది. భారీ పరిశోధన క్యాన్సర్‌కు ఊబకాయానికి మధ్య సంబంధాన్ని గమనించేందుకు అమెరికాలో ఒక భారీ పరిశోధనను చేపట్టారు. ఇందులో భాగంగా 50 నుంచి 79 ఏళ్ల మధ్య వయసున్న 74000 మహిళల జీవితాలను గమనించారు. వీరంతా 18, 35, 50 ఏళ్ల వయసులో ఎంత బరువు ఉండేవారో కనుక్కొన్నారు. ఫలితం! పదేళ్లపాటు ఊబకాయంతో బాధపడే స్త్రీలు క్యాన్సర్‌ బారిన పడేందుకు పదిశాతం ఎక్కువ ప్రమాదం ఉన్నట్లు తేలింది. నాలుగు రకాల క్యాన్సర్లు ఈ 74 వేలమంది స్త్రీలను 12 ఏళ్లపాటు గమనించిన తరువాత వారిలో ఏకంగా 6,300 మంది ఏదో ఒక క్యాన్సర్‌ బారిన పడటాన్ని గమనించారు. వీటిలో గర్భాశయం, వక్షోజం, పేగు, మూత్రపిండాలకు సంబంధించన క్యాన్సర్‌ అధికంగా కనిపించింది. పైగా ఊబకాయం తగ్గకపోతే కనుక ఇలా క్యాన్సర్‌ వచ్చే అవకాశం ప్రతి పదేళ్లకీ మరో ఏడు శాతం పెరగడాన్నీ గమనించారు. కారణం లేకపోలేదు ఊబకాయం అంటేనే మన జీవనశైలి అస్తవ్యస్తంగా ఉందని చెప్పే సూచన. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే చిరుతిండి, తగినంత వ్యాయామం లేకపోవడం, నిరంతరం కదలకుండా కూర్చుని ఉండటం వంటి అలవాట్లతో ఊబకాయం ఎలాగూ తప్పదు. దీనికి తోడు ఒంట్లో పేరుకునే అధిక కొవ్వు ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లను దెబ్బతీస్తుందట. హార్మోన్లలో ఏర్పడిన ఈ అసంతులత స్త్రీలలో కలిగే వక్షోజ, గర్భాశయ, అండాశయ క్యాన్సర్లకు దారితీసే ప్రమాదం ఉంటుంది. పైగా ఊబకాయంతో శరీరంలో రక్తనాళాలు ఉబ్బిపోతాయి. Inflammationగా పేర్కొనే ఈ పరిస్థితి కూడా క్యాన్సర్ సహా అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చని ఊహిస్తున్నారు. జాగ్రత్త అవసరం అమెరికా వంటి దేశాలలో పదింట ఏడుగురు మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు కదా అనుకుంటే పరిస్థితులు చేజారిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకనే చిన్నవయసు నుంచే ఆరోగ్యం మీద తగినంత శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు పరిశోధకులు. శరీరం ఎప్పటికప్పుడు తగినంత బరువులో ఉండేలా జాగ్రత్త తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ మాట అటుంచితే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు సైతం దరిచేరకపోవచ్చునని భరోసా ఇస్తున్నారు.   - నిర్జర.  

A Woman's Health Needs     Women health care is very different from the health care advised to men. There are things that need to been seen differently when it comes to caring for a woman’s health. Let us explore different aspects of it. A nutritious meal is the beginning of  healthy lifestyle for a woman. Try to include all essential nutrients in your meal. A balanced diet can keep you active and energetic throughout the day. Whole grain, high fibre diet along with low fat dairy products is advised to keep your body healthy. Eating right is not enough. You must have good exercise too. Heart disease is known to be the leading cause of death among women. A daily routine that includes at least 30 minutes of exercise is a must for every woman. This is they only method to keep heart diseases at bay. Consumption of alcohol or smoking cigarettes can greatly damage the human body. This has more adverse effects on a woman’s body. Studies on women’s health reveal that consumption of limited amount of alcohol contributes positively to a lady’s health. 12 to 14 grams of alcohol is considered ideal. You must also remember to avoid skin cancer. Sun protection is a crucial aspect in this matter. Get a sunscreen of SPF 15 to prevent the sun from attacking you. All women above 40 years of age must know ways to protect herself from breast cancer. The American Cancer Society suggests that women of this age should be conscious of the slightest change in their breasts and get a regular mammogram to be sure that there is no breast cancer. Every lady must give attention to her health needs. A healthy woman can make the entire family healthy. - Kruti Beesam

    Reasons Why Guava is Nutritious!     Winter fruit guava has rich nutritional value. The guavas contain dietary fiber, sugars, fat, protein, phytochemical, vitamins, electrolytes and minerals. Apart from all the nutrients packed in the fruit, it contains 80% water. Astringents, in guava, are alkaline in nature and have disinfectant and anti-bacterial properties, inhibiting microbial growth and removing extra mucus from the intestines. Other nutrients such as vitamin-C, Carotenoids and potassium, strengthen and tone the digestive system. Guava is rich in vitamin C. This vitamin fights off free radicals, prevents oxidative damage and cancer. They provide your immune system with lots of antioxidants and antioxidants are the major lines of defense against free radicals formation.   Guava is also a magnesium rich fruit which acts as a nervous relaxant. It helps to relax muscles and nerves of the body. So after a hard work out, a guava is certainly what you need to relax your muscles and give your system a nice energy boost. Magnesium present in guavas helps in relaxing your nerves and muscles. In today’s stressful times, consuming a guava to combat stress and relax is certainly a good idea. Magnesium is a relaxant for your nervous system and is present in guava. It relaxes both nerves and muscles. After strenuous physical activity, what more good would be than grabbing a guava. One guava fulfils about 12% of your daily recommended intake of fibre, making it extremely beneficial for your digestive health. Eating guavas daily can is rich in fibre which helps in clearing the blocked pathway and thus relieving constipation. Guava also contains copper but only in trace amounts. The good is that the copper in guava keeps the functioning of your thyroid gland proper and good.   Another reason that guava is such a great weight loss food is because it is free of cholesterol and very low in digestible carbohydrates. Guava is also rich in fiber. Fiber content is important to lose weight. Guava will make you feel full for long, prevents constipation, encourages better food digestion and most importantly it helps in reducing the amount of saturated fat absorbed by your body. Guava can aid weight loss as it effectively prevents or slows down the absorption of sugar in the blood. As you know, sugar is a big problem when you are trying to lose weight. It is this ability that makes this fruit great for diabetics.   ..Divya

The Primitive - Raw Food Diet!!     The diet plan that includes food in its purest form i.e, raw and some times even organic. People following this diet, will find raw fruits,  vegetables, nuts, sprouted seeds, seeds rarely even unpasteurized dairy products, raw eggs, fish and meat as their staples. The main principle is; heating or cooking destroys the nutrients and natural enzymes which might be essential for boosting digestion and fight chronic diseases. The dictum followed is " Food cooked is as good as dead". Some people believe cooked food becomes toxic and thus is unsuitable for consumption. But the reality is contrary cooking makes the food digestible and also boosts some of the nutrients such as beta-carotene and lycopene besides killing the bacteria making it safe for consumption. While its is claimed to clear up headaches, allergies, boosts immunity and memory also improve arthritis and some disease, sadly none are scientifically proven. The food is usually cold or warmed up but not beyond 118 Fahrenheit. The food can be made edible by the use of blenders, processors and dehydrators. The prep work that goes into this diet is immense, it requires extensive shopping and  being very choosy. Eating outdoors is yet another challenge. The cons of this diet are: it require high degree of motivation and grit to follow this difficult diet plan. Some of the nutrient deficiencies are iron, calcium and vitamin B12. When eating raw, the risk of food poisoning is high, thus not advisable for expecting mothers, young children,  elderly, people with weak immune responses, people on steroids and people with chronic medical illnesses such as chronic kidney disease, eating raw may precipitates an acute episode which mag be life threatening. As this diet promotes the intake of more and more fruits and vegetables, controls hypertension, reduces  the chances of stroke, heart failure, osteoporosis, stomach cancer, kidney diseases, diabetes mellitus type 2 and also aid in weight loss. However, there has been no scientific validation of these pros, but this diet plan helps in leading a healthy lifestyle, which might shield from diseases!! - Koya Satyasri    

Power Foods for the Brain     Powerful foods for powerful brain. here some power foods for the brain increase your mental ability and improve your memory and boost your brainpower.   Almonds : Those tiny little nuts are rich in antioxidants and also contain omega-3 fatty acids. Eating a few almonds everyday can be absolutely worth it Fish: If you are a non-vegetarian and love eating fish, you have some good news. Salmon, tuna and other fatty fish are considered to be rich in protein, calcium Eating fish aids the development of the brain. Eggs: Just as fish, eggs are a great source of omega-3 fatty acids which facilitate the brain cell development process. Including this high-in-protein, low fat and Vitamin E rich food in your daily diet will prove to be an excellent decision. Salad: Green leafy vegetables like lettuce, spinach and others like carrot, broccoli, and cabbage are an apt choice of food for your brain. These fibre-rich foods are rich in antioxidants like Vitamin C and E that protect the brain.  

ఇవి తింటే బరువు పెరగరు!   ఏవి తింటే బరువు పెరుగుతారు అంటే టకటకా చెప్పేస్తారు. కానీ ఏవి తింటే బరువు పెరగరు అంటే ఆలోచనలో పడతారు. అవి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో ఇవి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. మిగిలినవాటి సంగతేమో తెలీదు కానీ... ఓ ఆరు రకాల ఆహారాల వల్ల బరువు పెరగరన్నది మాత్రం కచ్చితం. అవేంటంటే... * కోడిగుడ్లలో ఉండే ల్యూసిన్ అనే అమైనో యాసిడ్ బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందదట. అయితే ఉడికించిన కోడిగుడ్డు మాత్రమే తినాలి అంటున్నారు డాక్టర్స్. పైగా ఉడికించిన కోడిగుడ్డు తినగానే కడుపు ఉబ్బరంగా అనిపించి, కడుపు నిండినట్లుగా అనిపిస్తుందట. దానివల్ల ఇక ఎక్కువ ఆహారం తీసుకోలేమట. అందుకే ఉడికించిన కోడిగుడ్డుకు ఓటేయమంటున్నారు. * దానిమ్మ గింజలో ఉండే పీచు వల్ల కొన్ని తినగానే కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుందట. అందుకే ఎక్కువ తిన్నా బరువు పెరుగుతామేమోనన్న భయం ఉండదు. * ఆలివ్ ఆయిల్ లో ఉండే మోనో శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొల్రెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను కాపాడతాయి. కాబట్టి బరువు పెరిగే సమస్యే లేదు. * చేపల్లో కొవ్వు అన్నదే ఉండదు. అందుకే క్యాలరీలు చాలా తక్కువ. కాబట్టి మాంసాల జోలికి పోకుండా వీలైనంత ఎక్కువగా చేపలు తింటే నాన్ వెజ్ తిన్న ఫీలింగూ ఉంటుంది, బరువూ పెరగరు. కాకపోతే కూర వండుకుని తినాలి తప్ప ఫ్రై చేసుకోకూడదు. * పచ్చని కాయగూరలు, ఆకుకూరల్లో నీళ్లు శాతం ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండినట్టు అనిపిస్తుందట. కాబట్టి ముదురు ఆకుపచ్చ రంగుల్లో ఉండే కూరగాయలను ఎక్కువగా తింటే బరువు పెరగరు. * వెజిటబుల్ సూప్స్ వల్ల కూడా క్యాలరీలు పెద్దగా పెరగవు. పైగా భోజనం ముందు వాటిని తాగితే కడుపు నిండినట్టు అనిపించి ఎక్కువ తినం. కాబట్టి వెజిటబుల్ సూప్స్ తాగడం మంచిదనేది విదేశీ యూనివర్శిటీ పరిశోధనలు తేల్చిన విషయం. Sameera

ఔషధాల ఆకుకూర -పాలకూర     కూరగాయల్లో ప్రతి ఒక్కదానిలో కొన్ని ప్రత్యేక పోషకాలుంటాయి. ముఖ్యంగా ఆకుకూరల్లో పోషకాల శాతం అధికం. పాలకూర గురించి చెప్పాలంటే ప్రత్యేక విశేషమే. ఇందులో ఆరోగ్యపరంగా, ఔషధపరంగా ఎన్నో సుగుణాలున్నాయి. * గర్భిణీలకు: పాలకూరలో ఫోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. గర్భవతులు, శిశువులకు పాలిచ్చే తల్లులకు ఇది మంచి పోషకాహారం. ఫోలిక్‌యాసిడ్ లోపం కారణంగా గర్భవతుల్లో కనిపించే మెగలోబ్లాస్టిక్ ఎనీమియా వ్యాధిని పాలకూరతో దూరంగా ఉంచవచ్చు. ఫోలిక్‌యాసిడ్ గర్భంలో శిశువు ఎదుగుదలకు సహకరిస్తుంది. అందుకని గర్భిణులు ఆహారంలో ప్రతిరోజూ పాలకూరను తీసుకోవడం వల్ల శిశువు జనన లోపాలను అరికట్టవచ్చు. అంటే గర్భస్రావం, రక్తస్రావం, అలసట, శ్వాస సరిగా ఆడకపోవడం, బరువుతగ్గడం, డయేరియా తదితర సమస్యలకు పాలకూర మంచి పరిష్కారం. * మలబద్దకం: పాలకూర రసం జీర్ణకోశంలో ఉన్న చెడును శుభ్రపరుస్తుంది. అంతేకాదు పేగులను ఉత్తేజపరుస్తుంది. * శ్వాసకోశవ్యాధులు: తాజా పాలకూర ఆకులకు రెండు చెంచాల మెంతులు, చిటికెడు అమ్మోనియం క్లోరైడ్, తేనె కలిపి జ్యూస్‌లా చేసుకోవాలి. బ్రాంకైటిస్, టీబీ, ఆస్త్మా, పొడిదగ్గు మొదలైన వాటికి ఇది ఒక చక్కని నివారణగా పనిచేస్తుంది. 30ఎమ్ఎల్ మందును రోజుకి మూడుసార్లు చొప్పున తీసుకోవచ్చు. * ఎనీమియా: పాలకూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీంతో హిమోగ్లోబిన్, ఎర్ర రక్తకణాలు పెరుగుదలకు ఇది తోడ్పడుతుంది. రక్తాన్ని మంచిగా వృద్ధిచేసి ఎనీమియా బారిన పడకుండా పాలకూర సర్వదా సంరక్షిస్తుంది. పాలకూరలో మిగతా అన్నింటికంటే ఎ-విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్య పెరుగుదలకు ఉపకరిస్తుంది. ముఖ్యంగా కళ్లను కాపాడుతుంది. రాత్రిపూట కనిపించే రేచీకటి సమస్య రాకుండా కాపాడడానికి పాలకూర ఒక మంచి పరిష్కారం. * దంత సమస్యలు: పాలకూర రసం పంటిచిగుళ్లను దృఢ తరం చేస్తుంది. పంటి చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే ప్రతిరోజూ పాలకూర- క్యారెట్ జ్యూస్‌ని కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. * మూత్రాశయ సమస్యలు: పాలకూర రసానికి కొబ్బరినీళ్లు కలుపుకుని రోజుకి రెండుసార్లు తాగడం వల్ల మూత్రం ధారాళంగా వస్తుంది. ఇంకా ఏముంది! పాలకూరలో క్యాల్షియం, ఆల్కాలిన్ ఎలిమెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి కణజాలాన్ని శుభ్రంగా ఉంచడంలోనూ రక్తంలో ఉన్న ఆల్కాలిన్‌ను నిలబెట్టడంలోనూ తోడ్పడతాయి. జీర్ణాశయంలో యాసిడ్లు ఎక్కువగా ఉత్పత్తి అవడానికి కారణమయ్యే ఎన్నో రకాల వ్యాధులను అడ్డుకునే శక్తి పాలకూరలో ఉంది. 

Healthy Heart Diet Tips You can lower your chances of getting heart disease by eating healthy. For a healthy heart, Weight control and regular exercise are critical for keeping your heart in shape but the food you eat may matter just as much. * Eat a diet low in fat, especially animal fats and palm and coconut oils. (These foods contain saturated fat and cholesterol. Saturated fat and cholesterol can cause heart disease.) * Choose a diet moderate in salt and sodium. * Maintain or improve your weight. * Eat plenty of grain products, fruits and vegetables. * Choose milk with 1% fat or skim milk instead of whole milk. * Eliminate fried foods and replace them with baked, steamed, boiled, broiled, or microwaved foods. * Cook with oils which are low in fat and saturated fat like corn, safflower, sunflower, soybean, cottonseed, olive,canola, peanut and sesame oils. Stay away from oils and shortenings that are high in fat and saturated fat. * Smoked, cured, salted and canned meat, poultry and fish are high in salt. Eat unsalted fresh or frozen meat, poultry and fish. * Replace fatty cuts of meat with lean cuts of meat or low-fat meat alternatives. * In recipes requiring one whole egg try two egg whites as a lower fat alternative. * Replace sour cream and mayonnaise with plain low-fat yogurt, low-fat cottage cheese, or low-fat sour cream and mayonnaise. * Substitute hard and processed cheeses for low-fat, low-sodium cheeses. * Use herbs and spices as seasoning for vegetables and potatoes instead of salt and butter. * Replace salted crackers with unsalted or low-sodium whole-wheat crackers. * Substitute canned soups,bouillons and dry soup mixes which are high in salt for sodium-reduced soups and bouillons. * Replace white bread, white rice, and cereals made with white flour with whole-wheat bread, long-grain rice, and whole-grain cereals. * Substitute snacks high in salt and fat with low-fat, low salt snacks. Cut-up vegetables and fruits are a quick healthy snack.  

చక్కెర చిక్కులు తగ్గించుకోండిలా!      డయాబెటిస్ ఒక్కటి వస్తే చాలు... దాని వెనకాల తట్టెడు రోగాలు చుట్టుముడతాయి. అందుకే దాని పేరు చెబితే చాలు ప్రపంచమంతా వణికిపోతోందిప్పుడు. అలా అని వస్తుందేమో అని భయపడుతూ కూర్చుంటే ఎలా? రాకుండా ఉండటానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి కదా! వీలైనంత వరకూ చక్కెరను ఒంట్లోకి వెళ్లకుండా ఆపగలిగితే మంచిది. అందుకోసం మొత్తం నోరు కట్టేసుకోనక్కర్లేదు. ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు... * స్వీట్ల మోతాదు తగ్గించండి. ఒకవేళ తిన్నా చక్కెరతో చేసిన వాటికంటే బెల్లంతో చేసిన వాటినే తీసుకుంటూ ఉంటే కాస్త బెటర్. *ప్రాసెస్ చేసిన ఫుడ్ జోలికి పోవద్దు. వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది. వాటి బదులు ఫ్రూట్స్ తో చేసే ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ చాట్ లాంటివి ఎంచుకోండి.  * కూల్ డ్రింక్స్ బదులు జ్యూసులు, బటర్ మిల్క్ లాంటివి తాగండి. * కేక్స్, కుకీస్ లాంటివి కూడా ఎక్కువ తినకూడదు. తినాలనిపిస్తే అప్పుడప్పుడూ ఓ చిన్న ముక్క. అంతే తప్ప ఒకేసారి నాలుగైదు ముక్కలు లాగించేశారో... అంతే సంగతులు. * పాలు, పెరుగు వంటి వాటిలోని చక్కెర త్వరగా కొవ్వుగా మారిపోతుంది. కాబట్టి బయట పెరుగు కొనకండి. అవి రోజుల తరబడి నిల్వ ఉంచుతారు కదా! ఇంట్లోనే ఎప్పటికప్పుడు పెరుగు తోడు పెట్టుకుని తాజాగా ఉండగానే తినేస్తే మంచిది. * సాస్ లనీ, డిప్స్ అనీ ఏవేవో దొరకుతున్నాయి మార్కెట్లో. అస్సలు టెంప్ట్ అవ్వొద్దు.  * ఐస్ క్రీమ్స్ ఎక్కువ తినకండి. అంతగా టెంప్ట్ అవుతుంటే నీళ్లశాతం ఎక్కువగా ఉండి, ఏదో కొద్దిగా ఫ్లేవర్ ఉండే ఐస్ ఫ్రూట్స్ ఉంటాయి. అవి తిని సరదా తీర్చుకోండి. అలాగే చాక్లెట్లు కూడా. మితిమీరి తినవద్దు. అంతగా తినాలనిపిస్తే మామూలు చాక్లెట్ కాకుండా డార్క్ చాక్లెట్ తినండి. * తినగలిగితే మామూలు రైస్ మానేసి బ్రౌన్ రైస్ తినడం మొదలుపెట్టండి. మొదట్లో కష్టంగా ఉంటుంది కానీ మెల్లగా అలవాటైపోతుంది. అలాగే బ్రెడ్ కూడా బ్రౌన్ బ్రెడ్ తింటే ఏ భయమూ ఉండదు.       ఇవన్నీ మనం చేయగలిగినవే. ఫుడ్ విషయంలో అవసరం కంటే టెంప్టేషన్ ఎక్కువగా పని చేస్తూ ఉంటుంది. అందుకే ఆకలి లేకపోయినా తినాలనిపించి తినేస్తుంటాం. టెంప్ట్ అవ్వడం మానేస్తే అసలు సమస్యే ఉండదు. అబ్బే లేదు అంటే మాత్రం పైన చెప్పిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. చక్కెరతో చిక్కులు రాకుండా ఉంటాయి.     

కొందరు ఆడవాళ్లలో డిప్రెషన్ ఎక్కువ... ఎందుకంటే!   మగవారితో పోల్చుకుంటే ఆడవారిలో డిప్రెషన్ ఎక్కువ. ఈ విషయాన్ని వైద్యులు ఎప్పుడోనే పసిగట్టేశారు. ఆడవారిలో ప్రత్యేకంగా ఉండే హార్మోనులు, వారి పట్ల కఠినంగా ఉండే సమాజం వల్లే వారిలో డప్రెషన్ ఎక్కువ అని తేల్చేశారు. కానీ కొందరు ఆడవాళ్లు మరింత త్వరగా డిప్రెషన్తో బాధపడటం వైద్యులని కలచివేసింది. దీని వెనుక కారణం ఏమిటో కనుక్కోవాలని అనుకున్నారు. ఫలితం ఇదిగో... వేర్వేరు ఆడవారిలో డిప్రెషన్ తీరుని గమనించేందుకు 1,300 మంది ఆడవారిని పర్యవేక్షించారు. వీరిలో estradiol అనే హార్మోనులే మార్పులే వారి డిప్రెషన్ తీరుని ప్రభావితం చేస్తున్నట్లు తేలింది. మనం తరచూ వినే estrogen అనే హార్మోనులో ఒక ముఖ్య రసాయనమే ఈ estradiol. ఈ estradiol రుతుక్రమాన్ని నియంత్రించడంతో పాటుగా భావోద్వేగాలను ప్రభావితం చేసే serotoninను కూడా అదుపులో ఉంచుతుంది. అదే ఒకోసారి డిప్రెషన్కు దారితీస్తుంది. ఆడవారిలో estradiol హార్మోను తగినంత లేకపోతే డిప్రెషన్తో బాధపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. మెనోపాజ్ తర్వాత కొందరు తీవ్రమైన డిప్రెషన్కు లోనుకావడానికి కారణం కూడా ఇదే అంటున్నారు. త్వరగా మెనోపాజ్ దశకు చేరుకునేవారు, రుతుక్రమం సరిగా లేనివారిలో డిప్రెషన్ లక్షణాలు కనిపించడానికి కారణం ఇదే! డిప్రెషన్ అనేది కేవలం మన బయట పరిస్థితుల వల్లే కాదు, శరీరంలోని హార్మోనుల వల్ల కూడా ఏర్పడవచ్చని తేలిపోయింది. కాబట్టి తరచూ నిరాశకి లోనవ్వడం, ఆకలి మందగించడం, జీవితం, త్వరగా భావోద్వేగాలకి లోనుకావడం, జీవితం నిస్సారంగా తోచడం, నిద్రలేమి... లాంటి సమస్యలు వచ్చినప్పుడు, అశ్రద్ధ చేయకుండా ఓసారి వైద్యుని సంప్రదించి చూడమని సూచిస్తున్నారు. హార్మోను లోపం వల్లే ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నట్లయితే, వైద్యులు తగిన చికిత్సను అందించే అవకాశం ఉంటుంది కదా!  

గోళ్ల రంగుకి అమ్మాయిల బరువుకి లింకేంటి..?     గోళ్ల రంగు..ఇదివరకటి రోజుల్లో పెళ్లిళ్లకో, వేరే ఏదైనా శుభాకార్యాల కోసమో అందంగా రెడీ అవ్వడానికి అమ్మాయిలు గోళ్ల రంగు వేసుకునేవారు. కానీ కాలం మారింది..గోళ్లరంగు వేసుకోవడానికి ప్రత్యేకంగా సందర్భం ఏమీ అక్కర్లేదని నిరూపిస్తున్నారు ఈ కాలం అమ్మాయిలు. ఏ రోజుకు ఆ రోజు డ్రస్సుకు మ్యాచ్ అయ్యేలా పాత నెయిల్ పాలిష్‌ని రిమూవ్ చేసి కొత్తది వేసుకుంటున్నారు మగువలు. అయితే ఇలాంటి వారు ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలంటున్నారు పరిశోధకులు. ఎందుకంటే తరచూ నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల బరువు పెరుగుతారట. డ్యూక్ యూనివర్శిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో నివ్వెరపరిచే వాస్తవాలు బయటపడ్డాయి..ముఖ్యంగా నెయిల్ పాలిష్‌లో ఉండే ట్రైఫీనైల్ ఫాస్ఫేట్ అనే పదార్థం వల్ల గోళ్ల రంగులు ఎక్కువ కాలం మన్నుతాయి. ఫ్లాస్టిక్ పదార్థాలు, ఫోమ్ ఫర్నిచర్‌కు త్వరగా మంటలు అంటుకోకుండా ఈ రసాయనాన్ని వాడుతారు. కానీ ఇది అంతిమంగా హార్మోన్లపై ప్రభావం చూపెడుతోందని పరిశోధకులు నిర్థారించారు. పశువుల మీద చేసిన పరీక్షలలో వాటికి సంతానోత్పాత్తికి సంబంధించిన సమస్యలు తలెత్తాయి. అయితే మనుషుల్లో బరువు పెరిగే లక్షణాన్ని గుర్తించారు. మార్కెట్లో దొరుకుతున్న సుమారు 3 వేల రకాల నెయిల్ పాలిష్‌లు సేకరించి వాటిని పరీక్షించగా వాటిలో 49 శాతం ట్రైఫీనైల్ ఉంది. గోళ్ల రంగు వేసుకున్న 10-14 గంటల తర్వాత వాళ్ల శరీరంలోని టీపీహెచ్‌పీ మోతాదు దాదాపు ఏడు రెట్లు పెరిగింది. అయితే కృత్రిమ గోళ్లు పెట్టుకుని, వాటికి మాత్రమే రంగులు వేసుకున్న వాళ్లకు మాత్రం అలా పెరగలేదు. అందువల్ల తరచు గోళ్ల రంగులు వేసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని..దానివల్ల శరీరంలో పలు రకాల మార్పులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. తప్పనిసరైతే చర్మానికి తగలకుండా చూసుకోవాలని, అలా తగిలితే రక్తంలోకి వెళ్లే అవకాశం కూడా ఉందంటున్నారు..కాబట్టి బీ కేర్ ఫుల్..

Can You Really Lose Weight By Drinking More Water!     Water is an essential nutrient your body needs to use to burn body fat! That’s why drinking water to lose weight is an important consideration in your weight loss program. We are made up of 55-75% water - that’s a lot of water! We need all of it for chemical reactions in physiological processes to burn fat and calories. It’s also used to transfer by-products of waste (from fat breakdown) away and out of our bodies. In some cases, when you’re dehydrated and there isn't enough water to dilute the body's waste products, kidney stones may form. The liver then has to step in to help the kidney. This taxes the liver, causing it to perform poorly for its other functions. This is really bad for weight loss because one of the major functions of the liver is to burn fat.   Another healthy benefit of drinking water is that it helps maintain the body’s proper balance of body fluids. And it’s essential for replacing the large amounts of water lost each day. But drinking more water is not a magic diet formula.   Drinking water is certainly important for overall health and is a great choice for hydration because it is calorie and caffeine free. However, simply drinking water doesn't impact your hunger. Thirst and hunger are sensed by different mechanisms in your body. Thirst develops from a rise in electrolytes in your blood or a decrease in blood volume. Hunger signals stem from declines of available fuel (such as glucose) in your body. Because of these separate mechanisms, it is unlikely that your body confuses thirst with hunger.   Studies comparing people who drink water immediately before, or during, meals with those that don't drink water show no difference in the amount of calories that they consume. Drinking water can help with weight loss if you find that, in the absence of hunger, you still eat just to have something in your mouth. Drinking water, instead of eating, in these instances can help you decrease your overall daily calorie intake.   Each day, drink enough water so that your urine is clear. A recent study showed that your metabolic rate jumps within 10 minutes of drinking ice-cold water, and it stays up for an additional 30 minutes after you drink it. Research has also found that drinking an average of 6.5 cups of water per day helped people consume 200 fewer calories a day.   Drinking water is essential for keeping energy up, aiding the metabolism, burning fat, and more. It's the fluid your body needs for life, and it's an instrumental part in your weight loss. Other fluids can be useful, but water is obviously the best choice as it is calorie free. Forget about that whole eight cups a day thing, instead keep yourself hydrated whenever you can and the benefits of it are just good for your body and your health.   So stay Hydrated and stay fit! ...Divya

మీరు మీ నేస్తాలకంటే కాస్త పొడవు ఎక్కువగా ఉన్నానని సంబరపడిపోతున్నారా. పడండి... పడండి... పనిలో పనిగా మీ పోషకాహారం విషయంలో కూడా కాస్త జాగ్రత్తపడండి. లేకపోతే మీ పొడవే మీకు శాపంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు శాస్త్రవేత్తలు.   ఇదీ పరిశోధన పొడవనేది మన జన్యువుల మీద ఆధారపడి వచ్చే లక్షణం. అయితే ఆడవారి పొడవుకీ, వారి ఆరోగ్యానికీ మధ్య ఏమన్నా సంబంధం ఉందేమో చూడాలనుకున్నారు వెంజీ అనే పరిశోధకురాలు. ఇందుకోసం ఆమె 1980లో ప్రభుత్వం వద్ద తమ ఆరోగ్య వివరాలు నమోదు చేయించుకున్న 68 వేలమంది స్త్రీల గణాంకాలను సేకరించారు. ఇందులో భాగంగా వారి ఎత్తు, బరువు, నడుము కొలత, పొగతాగడంలాంటి వ్యసనాలు, ఆహారపు అలవాట్లు, శారీరిక శ్రమ... లాంటి అనేక విషయాలను పరిశీలించారు. అప్పట్లో వారి సగటు వయసు 44 ఏళ్లు. అంటే ఇప్పటికి వారందరూ కూడా ఇంచుమించుగా 70 ఏళ్లు దాటినవారే అన్నమాట!     ఇదీ సంబంధం 1980 నాటి వివరాలను మళ్లీ తాజా వివరాలతో పోల్చిచూశారు వెంజీ. 70 ఏళ్లు దాటాయి కాబట్టి వీరిలో మతిమరపు, డయాబెటిస్‌, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్‌ వంటి సమస్యలు తలెత్తడం సహజం. అయితే ఆ సమస్యలకీ పొడవుకీ సంబంధం ఉందేమో తెలుసుకునేందుకు వారిని ఐదు భాగాలుగా విభజించారు. ఆశ్చర్యం ఏమిటంటే వీరిలో పొడవు ఎక్కువ ఉన్నవారిలో ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు తేలింది. వీరి కుటుంబనేపథ్యం, జాతి మూలాలు, వివాహం... వంటి అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నా కూడా ఈ వ్యత్యాసం స్పష్టంగా కనిపించింది.   ఇదీ ఉపాయం పొడవుగా ఉండే ఆడవారికే ఎందుకీ ఆరోగ్య సమస్యలు అన్న ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు పరిశోధకులు. బహుశా వారి పొడవుతో పాటుగా వచ్చే ఇతర జన్యువులే ఈ సమస్యలకు కారణం అని ఊహిస్తున్నారు. మరి పొడవుగా ఉంటే దానికి ఫలితం అనుభవించాల్సిందేనా! అంటే దానికి మాత్రం ఓ స్పష్టమైన జవాబు సిద్ధంగా ఉంది. తమ ఆహారపు అలవాట్ల విషయంలో అశ్రద్ధ చేయని స్త్రీల మీద పొడవు ప్రభావం అంతగా కనిపించలేదట. అంటే పోషకాహారమే ఈ శాపానికి మందన్నమాట! - నిర్జర.