ఫ్యాషన్ రంగంలో మాడల్స్ తో పాటు, వెండితెర పై వెలుగులు జిమ్మే ముద్దుగుమ్మలదో ప్రత్యేక స్థానం, మరీ మాడరన్ గా ఉండే దుస్తుల్లో ఉన్న హీరోయిన్స్ ని కథకనుగుణంగా ఉంటారు కాబట్టి ఇష్టపడినా, కొన్ని పాత్రలు లేదా వారి వేషధారణ మన జీవన శైలికి దగ్గరగా ఉండి, ముఖ్యంగా సినిమాలకే ఎసెట్ అయ్యేలా ఉండే హీరోయిన్స్ కాస్ట్యూమ్స్ ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. మామూలు స్థాయి జీవితం గడిపే వారి దగ్గరినుండి సొసైటీలో ఒక లెవెల్ మెయిన్ టైన్ చేసే వారి వరకు వారికంటూ ఒక గుర్తింపు తెచ్చిపెట్టేవే దుస్తులు. మాడరన్ గా కనిపించడం, కంఫర్ట్ గా ఉండటం , ఇలాంటి విషయాలు పెద్ద ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యేటప్పుడు ఏ మాత్రం చెల్లవు. దానికి తోడు ప్రిస్టేజ్ మ్యాటరొకటి.. మరంతే కదా ఫంక్షన్ కి వచ్చే వారు వందల్లో ఉన్నా మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని కోరుకోని వారెవరుంటారు చెప్పండి. అందుకే అలాటి ప్రత్యేకతను కోరుకునే మీ కోసం, అందునా సినిమాలను అతిగా ఇష్టపడే మా తెలుగువన్ పాఠకుల కోసం సరికొత్తగా మీ ముందుకు తీసుకు వచ్చాం, బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసిన సెన్సేషనల్ మూవీ దేవదాస్ సారీ కలెక్షన్ …... Festive Saree SAAA17 USD $125     Regal Saree SAVP4530 USD $123 Gorgeous Saree SAVP4539 USD $202     Gorgeous Saree SASURP2123 USD $351   Exotic Saree SAAC2112 USD $156     Exquisite Saree SAAC2213 USD $178       Beautiful Saree SAAC2214 USD $236          

  పటియాల సల్వార్ కమీజ్                         పంజాబీ సూట్ మాదిరిగానే నిండుగా ఉండి , ఏ వయసువారికైనా కంఫర్టబుల్ గా ఉండే రీతిలో సరికొత్త డిజైన్స్ తో అలరిస్తున్నాయి పటియాలా కలెక్షన్స్. ఇంత పర్టికులర్ గా ఈ డిజైన్స్ గురించి డిస్కస్ చేస్తున్నామంటే ఇవేమీ మార్కెట్ లోకి కొత్తగా వచ్చిన మాడలేమీ కాదు, అలాగని తక్కువ అంచనా వేయకండి. ఈ పటియాలా డ్రెస్ కి రాజుల నాటి చరిత్ర ఉంది. పూర్వం పంజాబ్ లోని పటియాలా అనే ప్రాంతాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడట. ఆయన ఎప్పుడూ బ్యాగీ టైపు సల్వార్ తో పాటు ఫుల్ స్లీవ్స్ ఉన్న కమీజ్ వేసుకునేవాడంట. ఆయన వేషధారణ నచ్చిన జనం ఆ డ్రెస్ కి పటియాలా డ్రెస్ అని పిలవడం పెట్టారు. ధరించిన వారికి కంప్ఫర్ట్ ఉండి వెరైటీగా, నిండుగా కనిపించే ఈ పటియాలా డ్రెస్ కి ఇప్పటికీ జనంలో అంతే క్రేజ్ ఉంది. ఈ పటియాల సల్వార్ కమీజ్, చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసులవారికి, మంచి లుక్ ని ఇస్తాయి. దానితో పాటు చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి. ఇప్పుడు ఈ పటియాల సూట్ లలోను సరికొత్త డిజైన్స్ వచ్చాయి. మనకు నచ్చిన మెటీరియల్ వాడొచ్చు, నచ్చిన ఎంబ్రాయిడరీ చేయించుకోవచ్చు, నచ్చిన సైజుల్లో కుట్టించుకోవచ్చు. ధరించగానే హుందాగా, నిండుగా కనిపించే పటియాలా డ్రెస్ లను ఇష్టపడేవారికోసం, చూడగానే ఆకర్షించే రీతిలో ఉన్న కొన్ని పర్టికులర్ డిజైన్స్ మీ ముందుకు తీసుకు వచ్చింది తెలుగువన్.        

  సూరత్ చీరలు ...   ఎన్ని ట్రెండ్ లు మారినా చీర కట్టుకున్న ప్రాధాన్యత ఈ నాటికీ తగ్గలేదు , అందుకే ఫ్యాషన్ డిజైనర్లు కూడా చీర అందాన్ని ఇంకెంతో వన్నె తెచ్చే సరికొత్త డిజైన్ లతో ఆకట్టుకుంటున్నారు . వంటిట్లో ఇమడగలిగే సాధారణ స్థాయి నుండి ర్యాంప్ పై చూపరులను మంత్ర ముగ్ధులను చేయగలిగే స్థాయి వరకు చీరకున్న ప్రాధాన్యత చీరదే. ప్రాంతానికో రీతిలో కనిపించే చీర కట్టు అందమంతా ఆరు గజాల వస్త్రంలో ఉంటుంది. అయినా ఒక్కొక్కరి ఒంటిమీద అది ఒక్కో రకంగా సింగారాలు ఒలుకుతుంది. దానికి తోడు డిజైనర్ల ప్రతిభ తోడైతే కనుల పండగే . అందుకే అలాంటి చీరల్లో కొన్ని మంచి డిజైన్ లను ఎంపిక చేసి మీ ముందుకు తీసుకు వచ్చింది తెలుగువన్.  ఈ చీరల్లో చెప్పుకోదగ్గ విషయమేంటంటే ఈ చీరల బ్లౌజులు కుట్టించుకోవాల్సిన అవసరం లేదు , మనకు కావాల్సిన సైజు , డిజైన్ చెప్తే ఆర్డర్ చేసిన రెండు మూడు రోజుల్లో మీ టేస్ట్ కు తగినట్టుగా అద్భుతంగా డిజైన్ చేయబడిన బ్లౌజు రెడీ అయిపోతుంది . అందునా ఒక్క కుట్టు కూడా లేకుండానే .. అంటే కస్టమైజ్డ్ బ్లౌజులన్న మాట, ఇంటరెస్టింగ్ కదూ... మరింకెందుకు ఆలస్యం , చీరల సంగతి కూడా చూసేద్దాం....            ఈ చీరలు ఫాక్స్ ఫ్యాబ్రిక్ మెటీరియల్, సిల్క్ ఫ్యాబ్రిక్ ల కలయికతో నేయబడ్డవి , వీటిని సూరత్ చీరలు అని కూడా పేర్కొంటారు .   పర్పుల్ కలర్ లో ఉండి చూడగానే ఆకట్టుకునేలా డిజైన్ చేయబడ్డ ఈ చీర ఫాక్స్ జార్జెట్ , మరియు సిల్క్ ఫ్యాబ్రిక్స్ తో తయారు చేయబడింది, చీర మొత్తం లేటెస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్ తో , ముత్యాలు పొగిడి ఆకర్షనీయంగా ఉంటుంది. SASMSSU3756 USD $ 206 Readymade Stitched saree USD $ 15 Customised Inskirt USD $12 Fall and Edging Work USD$ 2       వావ్ .. చూపు తిప్పుకోనివ్వని రీతిలో డిజైన్ చేయబడ్డ ఈ చీరను చూస్తే వదులుకోవాలనిపించట్లేదు కదూ … , పింక్ నెట్ మెటీరియల్ పై రాళ్ళు, రత్నాలు పొదిగిన ఈ చీర కట్టులో ఎవరైనా సరే ఎంత మందిలో ఉన్న తనకంటూ ఒక ప్రత్యేకత ముద్రించుకోవడం ఖాయం...   SASMSSU3718 USD $ 169 Readymade Stitched saree USD $ 15 Customised Inskirt USD $12 Fall and Edging Work USD$ 2       ఆకర్షణీయమైన ఆరెంజ్ కలర్ లో , ఒక్కసారి చూడగానే చూపు తిప్పుకోనివ్వని నిండు తనంతో , చీర మొత్తం రాళ్ళు పొదిగి అందంగా డిజైన్ చేయబడింది. దీనికి తోడు మ్యాచింగ్ అసేసరీస్ ఉంటే చూడ ముచ్చటగా ఉంటుంది .   SASMSSU1152 USD $ 351 Readymade Stitched saree USD $ 15 Customised Inskirt USD $12 Fall and Edging Work USD$ 2    

  Manish Malhotra Collections Manish malhotra collection 2011 Atrous Black Net   Code: G3-ls100639 USD 230.05 Blouse stitching charges USD 15.85 Standard cotton petticoat USD 6.59     రెడ్, బ్లాక్ కాంబినేషన్ లో ఫాక్స్ జార్జెట్ మెటీరియల్ తో తయారైన ఈ బ్లాక్ నెట్ సారీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది , దానికి తోడు ట్రాన్స్ పెరెంట్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజు మీరు మరింత అందంగా కనిపించేలా చేస్తుంది . డార్క్ కలర్స్ కాంబినేషన్ అవ్వడం చేత మీరు దీన్ని కాజువల్ వేర్ గానే కాక , చిన్న చిన్న ఫంక్షన్స్ లో ధరించవచ్చు .     Plum Green Faux Ge  Code: G3-ls100643 USD 157.85 Blouse stitching charges USD 15.85 Standard cotton petticoat USD 6.59   చూడగానే ఆకర్షించే కలర్ కాంబినేషన్ లో ఫాక్స్ జార్జెట్ మెటీరియల్ తో తయారైన ప్లం గ్రీన్ సారీ, గోల్డ్ కలర్ బార్డర్ కి మ్యాచ్ అయ్యేలా ఉండే బ్లౌజ్ దీనికి ప్రత్యేక ఆకర్షణ . చూడటానికి సింపుల్ గా ఉండి , క్యాజువల్ వేర్ కే కాదు , చిన్న చిన్న పార్టీల్లో కూడా దీన్ని ధరించవచ్చు .   Wild Purple Faux G Code: G3-ls100642 Blouse stitching charges USD 15.85 Standard cotton petticoat USD 6.59   ఆడవారి అందాన్ని మరింత ఇనుమడింపజేసేలా వైల్డ్ పర్పుల్ మరియు డీప్ పింక్ కాంబినేషన్ లో ఆకర్షణీయంగా ఉన్న ఈ సారీ గోల్డ్ కలర్ ఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ తో చాలా హుందాగా ఉంటుంది . బ్లౌజు పై చేసిన ఎంబ్రాయిడరీ అదనపు ఆకర్షణ .     Buttery Cream Faux    Code: G3-ls100641 Blouse stitching charges USD 15.85 Standard cotton petticoat USD 6.59 సింపుల్ గా ఉన్న స్టైలిష్ గా కనిపించడంలో ఏ మాత్రం తీసిపోని మనిష్ మల్హోత్ర డిజైన్స్ లో ఇదొక కొత్త కాంబినేషన్ , బటరీ క్రీం, రెడ్ కాంబినేషన్ లో అద్భుతంగా ఉంటుంది . చీర అంతటా ఉంటే రెడ్ , పింక్, గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉండే బార్డర్ ప్రత్యేక ఆకర్షణ.              

 మీ వయసును తగ్గించుకోండి 30 నిమిషాల్లో Look Younger in 30 Minutes                                                   ఆఫీస్ నుండి తిరిగి రాగానే హమ్మయ్యా... రోజు గడిచిపోయింది అన్న ఫీలింగ్, ఫ్రెష్ అయి కాస్త రిలాక్స్ అవుదామని కూర్చునే లోపే పిల్లలు హోం వర్క్ తీసుకుని వచ్చి కూర్చుంటారు, వాళ్ళ సంగతి చూసి డిన్నర్ కోసం ఏం ప్లాన్ చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు గుర్తుకు వస్తుంది. కజిన్ ఎంగేజ్ మెంట్ . కంపల్సరిగా అటెండ్ అవ్వాలి, టైం చూస్తే అరగంట కన్నా ఎక్కువగా లేదు. ఏముంది పార్టీకి అటెండ్ అవుతున్నామన్న ఎగ్జైట్ మెంట్ కన్నా, అమ్మో.. ఇంత షార్ట్ పీరియడ్ లో ఎలా రెడీ అవ్వాలి అన్న టెన్షన్, అప్పటికప్పుడు పార్లర్ కి వెళ్ళలేరు, అలాగని అలసటతో పీక్కుపోయినట్టున్న మొహంతో పార్టీ కి వెళ్ళ లేరు...అదిగో అలాంటప్పుడే ఎక్స్ పర్ట్స్ చిట్కాలు పనికి వస్తాయి. వాటిని కాస్త ఓపిగ్గా పాటిస్తే చాలు , నిగనిగలాడే అందం మీ సొంతం .                         ఇప్పుడు  మీరు మొట్ట మొదటిగా చేయాల్సింది కాసేపు శ్రమ అనుకోకుండా పరుగెత్తడం , ఏంటి... ఆశ్చర్యపోతున్నారా..? నిజమండి బాబు , పరుగెత్తడం వల్ల ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో పక్కన పెడితే రక్తప్రసరణ క్రమబద్ధమవుతున్దన్నది మాత్రం వాస్తవం, ఇక్కడ మనకు కావాల్సింది కూడా అదే, ఎందుకంటే రక్తప్రసరణ అనేది సరిగ్గా ఉంటే చర్మంలో కాంతి దానికదే వచ్చేస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్ గా పరుగెత్తడం మొదలుపెట్టండి. అలా ఒక అయిదు నిమిషాలు పరుగెత్తడానికి స్పెండ్ చేసి రెండవ చిట్కా దగ్గరికి రండి .   రెండవ చిట్కా : ఒకసారి అద్దం ముందు నిలబడి మిమ్మల్ని మీరు చూసుకోండి . మీ మొహం లో అన్నింటికన్నా డల్ గా ఉన్న ఏరియా ఏది..? అఫ్ కోర్స్ కళ్ళే.. ఏముంది అక్కడినుండే మొదలుపెడదాం . చిన్న కాటన్ ముక్క ను తీసుకుని రెండుగా విడదీసి రోజ్ వాటర్ తో తడిపి ఐదు నిమిషాలు మీ కళ్ళ పై ఉంచి కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి. మూడవ చిట్కా : ఆలస్యం చేయకుండా ఇంట్లో ఉన్న రెండు టొమాటో లను తీసుకుని వాటి రసం తీసి మొహానికి ఫేస్ ప్యాక్ లా వేసి 3 నిమిషాలుంచి కడగండి. ఏముంది మీ మోహంలో నిగారింపు మీరే చూడగలుగుతారు. నాలుగవ చిట్కా: ఇక అతి పెద్ద సమస్య తల వెంట్రుకలు, ఫంక్షన్స్ కి వెళ్ళాలని ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి జుట్టు ఓ పట్టాన అర్జెస్ట్ అవ్వడం కష్టం. అందుకని విసుక్కోకుండా జుట్టు మధ్య రెండు మూడు సార్లు వేళ్ళు పోనిచ్చి వాటిని అలాగే కాసేపటి వరకు పట్టి ఉంచండి. చివరగా కండిషనర్ అప్లయ్ చేసి వాటిని అలాగే వదిలేయండి. నాలుగవ చిట్కా : ఇక పెదాల విషయానికొస్తే లైట్ గా లిప్ గ్లాస్ వాడండి . అది మొహంలో కొత్త మెరుపు రావడానికి దోహదపడుతుంది. పై చిట్కాలను ఒక అర గంట సేపు పాటించారంటే మీరు ఇదివరకటి కంటే అందంగా , నాజూగ్గా కనిపించడం ఖాయం. వీటితో పాటు మీరు కాస్త సంతోషంగా, కాన్ఫిడెంట్ ఉండటానికి ప్రయత్నించారంటే డౌటే లేదు, పార్టీ లో స్పెషల్ ఎట్రాక్షన్ మీరే అవుతారు.

  ప్రపంచ వ్యాప్తంగా ఏ ఫిల్మ్ ఫెస్టివల్స్ జరిగినా ముఖ్యంగా హై లెట్ అయ్యేవి రెండే రెండు అంశాలు అవి మంచి సినిమాలు, గ్లామెరస్ ఫ్యాషన్. ఈ రెండు అంశాలే రెడ్ కార్పెట్ కి ఎంతో విలువను చేర్చుతాయి. ఈ సారి బాలీవుడ్ తారలతో తళుక్కుమన్న కేన్స్ ఫెస్టివల్ మరింత కళకళలాడింది. ఐశ్వర్యా రాయ్ ధరించిన ఇంత మంది తారలున్న ఐశ్వర్యా రాయ్ కళ్ళు చెదిరే అందంతో వెలిగిపోయి ఫెస్టివల్ ఓపెనింగ్ నైట్ కి ప్రత్యేక కళ తీసుకు వచ్చింది. జిమ్మీ ఛూ క్లచ్ వర్క్ తో ఉన్న ఎలీసాబ్ గౌన్ లో ఆకట్టుకుంది. మరుసటి రోజు స్ట్రాప్ లెస్ గౌన్ మరియు వైట్ శాటిన్ అర్మాని ప్రైవ్ గౌన్ లో ' స్లీపింగ్ బ్యూటీ" ప్రీమియర్ షో లో భాగంగా కార్పెట్ వాక్ చేసింది. ఈ 37 ఏళ్ళ ప్రపంచ సుందరి తన రాబోయే చిత్రం 'హీరోయిన్ ' ఫస్ట్ లుక్ ని మథుర్ భండార్కర్ తో కలిసి రిలీజ్ చేసింది.         “ ద ఆర్టిస్ట్" ప్రీమియర్ షో లో భాగంగా హాజరైన సోనం కపూర్ కేన్స్ ఫెస్టివల్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, చెప్పుకుంది.. జీన్ పాల్ గాల్టియర్ గౌన్ లో చోపార్డ్ ఇయరింగ్స్ , అమర్ పాలి రింగ్ ధరించిన సోనం కపూర్ కేన్స్ ఫెస్టివల్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.    

ఇండియన్ ఫ్యాషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వారిలో హేమంత్ త్రివేది ఒకరు. ఈయన ఫ్యాషన్ స్టైలిస్ట్, ఫ్యాషన్ షో కొరియోగ్రాఫర్, ప్రొఫెసర్. ఆస్ట్రేలియా, న్యూయార్క్ లాంటి దేశాల్లో తమ చదువు పూర్తి చేసిన హేమంత్ త్రివేది తన కరియర్ కి మాత్రం ఇండియానే ఎంచుకున్నారు. దాదాపు ఇరవై ఏళ్లుగా S.N.D.T. యూనివర్సిటీ లో ప్రొఫెసర్ గా తమ విలువైన సేవలందిస్తున్న హేమంత్ త్రివేది దానితో పాటు ప్రముఖ శీతల్ గ్రూప్ లో డిజైన్ డైరెక్టర్ గా చేస్తున్నారు. హేమంత్ డిజైన్స్ ఆయన కెరియర్ కే కాదు , అప్పుడప్పుడే మాడలింగ్ రంగంలో పుంజుకుంటున్న ఎందరో మాడల్స్ కి ఎసెట్ అయ్యాయి. 1995, 1998, 2000 లో వరసగా మిస్ వరల్డ్ గా ఎన్నికైన ఐశ్వర్యా రాయ్ , డయానా హేడెన్, ప్రియాంక చోప్రా లే దానికి ఉదాహరణ. ప్రపంచ ప్రఖ్యాతి గడిస్తూ ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ కే తలమానికంగా ఉన్న ఈ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ నిజంగా ఇండియన్ ఫ్యాషన్ ఇండస్ట్రీ గర్వించదగ్గ విషయం. త్రివేది డిజైన్ ప్రదర్శనలు ఇండియాలోనే కాదు, U.K, U.S, చైనా, ఈజిప్ట్, మారిషస్, శ్రీలంక, U.A.E. దాదాపు సౌత్ ఈస్ట్ దేశాల్లో తన కీర్తిని చాటుకున్నాడు .  

  ఫ్యాషన్ మారుతూనే ఉంటుంది... ఫ్యాషన్ అనేది స్థిరంగా ఉండదు. మారుతూనే ఉంటుంది. దీనిమీద ఒక జోక్ కూడా ఉంది. రోమ్ లో ఒకావిడ లేటేస్ట్ ఫ్యాషన్ దుస్తులు తీసుకుని, అక్కడే ట్రయల్ రూం లో వేసుకుంది. బిల్లు చెల్లించిన వెంటనే పరుగుకు లంకించుకుంది. మధ్యలో ఒక స్నేహితురాలు ఎదురై "ఎదైనా ఘోరం జరిగిందా, ఎందుకు పరిగెడుతున్నావు?" అని అడిగింది. "అవును, ఘోరాలే జరుగుతున్నాయి. ఈ నిమిషం ఉన్న ఫ్యాషన్ రెండో నిమిషానికి మారిపోతోంది. అందుకే ఈ దుస్తులు అవుట్ డేటెడ్ కాకముందే కొందరైనా చూడాలని పరుగు తీస్తున్నా" అని చెప్పిందట. నిజంగా ఫ్యాషన్స్ చాలా త్వరగా మారిపోతున్నాయి. కొన్నాళ్ళు పొట్టి చేతులు ఫ్యాషన్. ఇంకొన్నాళ్ళు పొడవు చేతులు ఫ్యాషన్. మరి కొన్నాళ్ళు మోచేతులదాకా ఫ్యాషన్. కొన్నాళ్ళు రిస్టువాచీ దాకా చేతులుంటే ఫ్యాషన్. ఇంకొన్నాళ్ళు మెగా స్లీవ్స్., మరికొన్నాళ్ళు స్లీవ్ లెస్ .. మెడలూ అంతే- రౌండ్ నెక్, వీ నెక్, స్క్వేర్ నెక్, బోట్ నెక్, లో నెక్, హై నెక్.. ఇలా ఎన్ని రకాల నెక్కులో! ప్రతిదీ మారుతుంటుంది. పాతనీళ్ళు పోతుంటాయి, కొత్తనీళ్ళు వచ్చి చేరుతుంటాయి. ఒకసారి టాప్, బాటమ్ కు మాచ్ అయితే ఫ్యాషన్. ఇంకోసారి కాంట్రాస్ట్ గా ఉంటే ఫ్యాషన్. జీన్సులో ఎన్ని ఫ్యాషన్లు లేవు? రంగులు, డిజైన్ల సంగతి అలా ఉంచి వెలిసిపోయి, పాతబడినట్లు ఉండే ఫేడేడ్ జీన్స్, కాలిపోయినట్టు మసిబారినవి, చిరుగులతో ఉండేవి -ఇలా ఎన్ని రకాలో! పాంటుల్లో బెల్ టైపు, న్యారో టైపు, పారలల్సు, డిజైన్ ఉన్నవి, లేకుండా ప్లైయినువి ఇలా పలు రకాలు. కనుక ఫ్యాషన్ చేంజెస్ కు తగ్గట్టు మన దుస్తులను డిజైన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఫ్యాషనబుల్ గా, అధునాతనంగా కనిపిస్తాం.  

  ఎప్పటికప్పడు స్పెషల్ గా... ఆడపిల్లలు సహజంగా అందానికి, అలంకారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. స్పెషల్ అపియరెన్స్ తో కనిపించాలని కలలు కంటారు. ఆ కలలను నిజం చేసుకునేందుకు కృషి చేస్తారు. అందంగా, ఫ్యాషనబుల్ గా ఉండేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు. డ్రెస్ కాన్షస్ బాగా పెరిగింది. కాలేజ్, లేదా ఆఫీసుకి ఏ డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచించడం పరిపాటి. ఎవరికి వారు తాము ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి స్పెషల్ అపియరెన్స్ కోసం తపిస్తూ, అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక పెళ్ళిళ్ళు, పేరంటాల్లాంటి ప్రత్యేక సందర్భాలు వస్తే చెప్పనవసరం లేదు. గంటల తరబడి ఆలోచిస్తారు. పూర్వం పండుగలు, పబ్బాలకు మాత్రమే కొత్త బట్టలు కొనుక్కునేవాళ్ళం. ఇప్పుడలా కాదు. ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడే, పరుగున వెళ్ళి కోనేసుకోవడం. చేతిలో నాలుగు రూపాయలు గలగలలాడితే, చలో షాపింగ్. ఇంట్లో పిల్లి పిల్లల్ని పెట్టిందా, కొత్త బట్టలు కొనుక్కోడానికో సాకు దొరికినట్టే. కుక్క పిల్లను ఇంటికి తెచ్చుకుని వారం రోజులయిందా, కొత్త డ్రెస్ కొనుక్కుని సెలెబ్రేట్ చేసుకోవాల్సిందే. కనుక ఇప్పుడు కొత్త బట్టలు కొనుక్కోడానికి పెద్ద అకేషన్లేం ఉండనక్కర్లా. ఎప్పటికప్పడు స్పెషల్ గా ఉండడమే సిసలైన ఎయిమ్. పూర్వం ఫంక్షన్స్ లో బర్త్ డే బేబీ లేదా పెళ్ళికూతురు మాత్రమే మెరిసిపోయేవాళ్ళు. ఇప్పుడలా కాదు, అసలు వ్యక్తితో పాటు ఆ పార్టీకి వచ్చినవాళ్ళు కూడా చమకాయిస్తున్నారు. అదీ సంగతి. ఎప్పుడో ఓరోజు తళుక్కున మెరవడం కాదు, ప్రతిరోజూ తళతళలాడాలి, తళుకులీనాలి అనుకుంటున్నారు చిన్నాపెద్దా అందరూ.

  అమెరికాకు తీసిపోని ఇండియన్ ఫాషన్ డిజైనర్స్ ఈ తరం పిల్లల్ని, పెద్దల్ని ఆకట్టుకుంటున్నవి డిజైనర్ వేర్. ఈమధ్యకాలంలో డ్రెస్ కాన్షస్ బాగా పెరిగింది. మనది పేద దేశమే అయినా అనేకమంది డిజైనర్ వేర్ పట్ల మొగ్గు చూపుతున్నారు. వాటికి అలవాటు పడుతున్నారు. డిజైనర్ దుస్తులు అందంగా, కంఫర్టబుల్ గా ఉంటాయని చెప్తున్నారు. తమ వార్డ్ రోబ్ ను డిజైనర్ వేర్ తో అలంకరిస్తున్నారు. పార్టీలకు, ఫంక్షన్లకే కాకుండా కాజువల్ వేర్ గా కూడా డిజైనర్ క్లోత్స్ వాడుతున్నారు. ఇంతకీ డిజైనర్ వేర్ అంటే ఏమిటి? ఏదో మామూలు టైలర్స్ కత్తిరించి కుట్టినవి కాకుండా ఒక ఫాషన్ డిజైనర్ సరికొత్త తరహాలో ఆలోచించి, రూపొందించినవి. ఫాషనబుల్ గా, క్రియేటివ్ గా, ఎట్రాక్టీవ్ గా, ఎక్స్ట్రార్డినరీగా ఉండే డిజైనర్ క్లోత్స్ చాలా ఎక్స్ పెన్సీవ్ అని తెలుసు కదా. అయినా వీటిని కొంటున్నారు, ఆనందిస్తున్నారు. మన దేశం ఎందులోనూ తీసిపోదని మధురా గార్మెంట్స్, అరవింద్ మిల్స్, ఆదిత్య బిర్లా లాంటి టెక్స్టైల్ కంపెనీలు చాటిచెప్తున్నాయి. పోటీపడి ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆకర్షణీయమైన దుస్తులను రూపొందిస్తున్నాయి. ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నాయి. హేమంత్ త్రివేది, మనీష్ మల్హోత్రా, రోహిత్ గాంధీ అండ్ రాహుల్ ఖన్నా లాంటి ఫాషన్ డిజైనర్స్ ప్రపంచ ప్రసిద్ధి పొందారు.

             Hyderabad Fashion Week - 2011            ఫ్యాషన్ వీక్ అనేది వారం రోజుల పాటు ఫ్యాషన్ డిజైనర్స్ తమ  ప్రతిభను    ప్రదర్శించుకోవడానికి  ఒక  మహత్తరమైన వేదిక .              అలాంటి వేదికే హైదరాబాద్ లోని మారియట్ హోటల్ లో జరిగింది. నిదా మహ్మూద్,   షాయ్నా N.C.,  మీరా , ముజాఫర్ అలీ , సోనియా పున్వాని తదితర డిజైనర్లు తమ ప్రదర్శనతో  అలరించారు .                  హైదరాబాద్ మహానగరం మరోసారి ఫ్యాషన్ వెలుగుల్లో మునిగి తేలింది . రెండవ  రోజు  షో అనుకున్న సమయానికి కాస్త ఆలస్యంగా మొదలైనందుకు  కాస్తంత  నిరుత్సాహ పడినా , ప్రఖ్యాత డిజైనర్ల ప్రదర్శనలతో వెలుగు నింపుకుంది . వీటికి తోడు  కామ్నా జేఠ్మలాని , సంజన లాంటి ప్రముఖ నటీమణులు ర్యాంప్ పై క్యాట్ వాక్ చేసి ఫ్యాషన్ షో లో కొత్త ఉత్సహాన్ని నింపారు.                              ఇదిలా ఉంటే నిదా మహ్మూద్ ప్రదర్శించిన డిజైన్లు ఆకర్షణగా నిలిచాయి . హిందీ సినిమాలకు సంబంధించిన కలెక్షన్లు , గబ్బర్ హ్యాండి క్రాఫ్ట్ స్,  షోలే బ్లౌజేస్ , సల్వార్ కమీజ్, 1970 – 80 మధ్య కాలంలో వచ్చిన హిందీ సినిమాలతో  ఇన్స్ పైర్డ్ అయి తయారు చేసిన కలెక్షన్స్ హై లెట్ అయ్యాయి .           హైదరాబాద్ ఫ్యాషన్ షో 2011 మరిన్ని ఫోటోల కోసం ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. http://www.teluguone.com/tmdb/galleries/Hyderabad-Fashion-Week-11th-May-en-709.html