మనం అమ్మాయిలం.. మనం ఉపయోగించే ఏ వస్తువైనా అందంగా, వెరైటీగా, స్టైల్‌గా వుండాలి. ఇప్పుడు అందరి దగ్గరా పెన్‌డ్రైవ్‌లు వుండటం మామూలైపోయింది. అయితే ఎవరి దగ్గర ఎలాంటి పెన్‌డ్రైవ్స్ ఉన్నప్పటికీ, మన అమ్మాయిల దగ్గర వుండే పెన్‌డ్రైవ్‌లు మాత్రం చూడ్డానికి పెన్‌డ్రైవ్‌ల మాదిరిగా వుండకూడదు. అప్పుడే మన స్టైల్‌కి ఓ ఐడెంటిటీ. అందుకే మనలాంటి అమ్మాయిల కోసమే వెరైటీ పెన్‌డ్రైవ్‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి. హార్ట్‌లాగా, హ్యాండ్ బ్యాగ్‌లాగా, లిప్‌స్టిక్‌లాగా, చెప్పల్‌లాగా... ఇలా ఒకటేమిటి.. వందల రకాల్లో వెరైటీ పెన్‌డ్రైవ్‌లు మార్కెట్లో దొరుకుతున్నాయి.. వీటిని చూస్తే మీక్కూడా మీ పాత పెన్‌డ్రైవ్‌ని పారేసి ఇలాంటి వాటిని కొనుక్కోవాలని అనిపిస్తోంది కదూ...?

  పరికిణీలు మారుతున్నాయి   అంచున్న పొడుగు పరికిణీలు ఒకప్పుడు ఒక వెలుగు వెలిగాయి. ఆ తర్వాత మిడ్డిలు, స్కర్ట్స్ రాకతో అవి కాస్త వెనక బడ్డాయి. ఎదో ఓణిలు వేసినప్పుడు మాత్రమే పరికిణీలు వేసుకునేవారు అమ్మాయిలు. అయితే ఈ మద్య మళ్ళి ట్రెండ్ మారింది. లేహంగాలు అని ..సైడ్ కి చున్ని లు వేస్తూ ...చిన్నా, పెద్దా కూడా వేస్తున్నారు. అయితే అవికూడా ..ఒణి ల తో కాబట్టి అవి మన పరికిణి లిస్టు లోకి రావు. సంతోషించే విషయం ఏంటంటే ..ఇప్పుడు మన పరికిణి లు మళ్ళి ...అమ్మాయిల మనసు దోచుకుంటున్నాయి . రెగ్యులర్ గా కాలేజీ లకి కూడా వేసుకుంటున్నారు.   అయితే కాస్త వరైటి గా ..జరి,పట్టు లేసులు ,గోట డిజైన్ల అంచులతో పట్టు నుంచి జార్జెట్, కాటన్ , క్రేప్ లాంటి రకరకాల మెటీరియల్స్ తో చూడగానే ఆహా అనిపించేలా ఉంటున్నాయి . పైన అంతా ప్లైన్ గా వుంటుంది. పాదాల పైకి లాంగ్ స్కర్ట్ పొడువు తో వుండే ఈ పరికిణి లకి కింద అర చేతి మందాన్న బోర్డర్ వుంటుంది. ఆ బోర్డర్ కి సరిపోయేలా జాకెట్టు ని డిజైన్ చేస్తున్నారు . లాంగ్ స్లీవ్స్ తో చూడటానికి భలే వుంటాయి . అటు ఓల్డ్ ఫ్యాషన్ , ఇటు న్యూ లుక్ ...మీరు ట్రై చేయండి ...మీ టేస్ట్ కి తగ్గట్టు డిజైన్ చేయించు కోండి.   ..రమ

Best Jeans for Your Body The new attention to fit means that shoppers can select jeans not only by style, but also by inseam, rise and leg opening. Trying to find the best jeans to fit your body type used to mean an exasperating tour of dressing rooms at the shopping mall. 1 This is Mid-Rise Boyfriend. A big fall fashion trend is the slouchy boyfriend jeans. This look is flattering on all body types because of the relaxed fit. 2 This is Low-Rise Straight Leg. No more gapping at the waist. this hip slung style shows off a trim middle. 3 This Mid-Rise Bootcut. A subtle flare balances out a bigger butt and thighs. 4 This is High-Rise Bell. styling highlights a tiny waist and perky butt. 5 This is Low-Rise Flare.The exaggerated hem plays up an hourglass shape. 6 This is High-Rise Skinny.This sexy style hugs every last curve. 7 This is Relaxed Trouser. A looser leg accommodates muscular thighs and calves. 8 This is Flared Trouser. Flap pockets pump up a flat rear, and a dark wash streamlines legs. 9 This is Relaxed Cigarette. They're packed with stretch-perfect for athletic legs.

మగువల మెడకు రంగుల అందాలు రంగు రంగుల దారాలు, ముచ్చట గొలిపే గొలుసులుగా మారి మగువ మెడని అలంకరిస్తే ఎలా వుంటుంది ? ఇదిగో ఇలా వుంటుంది... చూడండి ఎన్ని వెరైటీస్ వున్నాయో.... కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి, మనదంటూ ఒక ఫ్యాషన్ స్టేట్ మెంట్ ఉండేలా చూసుకోవాలి అనుకునే అమ్మాయిలు ఈ థ్రెడ్ జ్యువలరీ సెలెక్ట్ చేసుకోవచ్చు. హెండ్లూం వాడ్రోబ్ కి పర్ఫెక్ట్ మాచింగ్ జ్యువలరీ ఇది. ఎన్నెనో రంగులు, ఎన్నెన్నో డిజైన్లు, చూడటానికి ఎంత బాగున్నాయో, వేసుకుంటే ఇంకా బావుంటాయి...ఒకసారి ట్రై చేయండి. -రమ

  జీన్స్ తో పోటీ పడుతున్న ధోతీ  రోజులు ఏలా మారుతున్నాయో దానికి తగ్గట్టు ఫ్యాషన్ పోకడలు కూడా రోజురోజుకూ మారిపోతున్నాయి. నిన్న చూసిన మోడల్ ఈ రోజు ఉండదు.. ఈరోజు చూసిన మోడల్ రేపు ఉంటుందన్న గ్యారెంటీ లేదు. ఈ ఫ్యాషన్ రంగంలో రోజుకో రకం వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా డ్రెస్సింగ్.. యూత్ ని ఆకట్టుకోవడానికి ఎన్నో రకాల మోడల్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకూ జీన్స్ ప్యాంట్ల్లు వాటిలోనే వేరే మోడల్స్ వచ్చాయి.. అయితే ఇప్పుడు వాటికి చెక్ పెట్టి వాటితో పోటీపడే ధోతి ప్యాంట్లు వచ్చేశాయి. రకరకాల డిజైన్లలో ఈ ధోతి ప్యాంట్లు మార్కెట్ల్ హడావుడి చేస్తున్నాయి. సెలబ్రిటీల దగ్గర నుండి కాలేజ్ గాళ్స్ వరకూ వీటికి అందరూ ఇష్టపడుతున్నారు. మీరూ ఒకసారి ట్రైచేయండి.. ఫ్యాషన్ పోకడను అనుసరించండి..    

Paturi Silk Cotton Sarees..   చీరలంటే ఇష్టపడని మహిళలు ఉండరు. ఎన్ని ఫ్యాషన్లు వస్తున్నా.. చీరకున్న ప్రత్యేకత వేరు. అయితే ప్రస్తుత ఫ్యాషన్ కు తగ్గట్టుగా కొన్ని సిల్క్ కాటన్ చీరల కలక్షన్ ను మీ ముందుకు తీసుకొచ్చాం. ఈ వీడియో చూసి అవెంటో మీరూ కూడా ఓ లుక్కేయండి...  https://www.youtube.com/watch?v=O_T4xCib7ws  

Heroine Aditi Myakal's Sankranthi Special Collection 2018..   తెలుగు పండుగల్లో సంక్రాంతికి అతి పెద్ద పండుగ. ఈ పండుగ రోజు మాత్రం అమ్మాయిలు పట్టు పరికిణీలు, లంగా ఓణీలు ధరించి అచ్చమైన తెలుగు అమ్మాయిల్లా తయారవుతారు. అయితే ఒకప్పుడు పట్టు పరికిణీలు ధరించేవారు కానీ... ఇప్పుడు ఫ్యాషన్ పెరిగిపోయింది. మరి ఎంత ఫ్యాషన్ పెరిగిపోయినా.. వాటికి ఉన్న ప్రత్యేకత మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటుంది. అయితే వాటికి కొంచెం హంగులు దిద్దితే చాలు... అటు ఫ్యాషన్ ను.. ఇటు తెలుగుదనాన్ని చూపించవచ్చు. అలాంటి వారి కోసమే ఈ సంక్రాంతికి కొన్ని కలక్షన్స్ మీ ముందుకు తీసుకొచ్చాం. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీడియో చూడండి..  https://www.youtube.com/watch?v=iV5bMTRdyDE

How To Choose a Right Hand Bag..   ప్రస్తుతం ఫ్యాషన్ ఎంత పెరిగిపోయిందే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాళ్లకి వేసుకునే చెప్పుల దగ్గర నుండి.. గోళ్లకు వేసుకునే నెయిల్ పాలిష్ వరకూ అన్ని మ్యాచింగ్ ఉండేలా.. ట్రెండీగా చూసుకుంటా. కానీ... ఒక్క విషయంలో మాత్రం మనం అంత కాన్సన్ ట్రేషన్ చేయం. అదే హ్యాండ్ బ్యాగ్ విషయంలో. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండే మనం... హ్యాండ్ బ్యాగ్ విషయంలో మాత్రం లైట్ తీసుకుంటాం. అలాంటి వారికోసమే ఈ వీడియో. మనకు ఎలాంటి హ్యాండ్ బ్యాక్ కావాలి.. సింపుల్ గా ఎలా సెలక్ట్ చేసుకోవచ్చు.. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అజల్ ఆలీ అక్బర్ పలు సూచనలు ఈ వీడియో ద్వారా ఇస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం...ఈ వీడియో చూసి అవేంటో తెలుసుకోండి...https://www.youtube.com/watch?v=mf0f4m7h55U

  Welcome This 2018 With Your Style Statements   ట్రెండీగా, ఫ్యాషన్ గా ఉండాలని అందరికీ ఉంటుంది. కానీ కొంత మంది ఫ్యాషన్ కు తగ్గట్టు ఎంచుకోవడంలో మాత్రం చాలా కష్టపడుతుంటారు. అలాంటి వారి కోసమే కొన్ని కలక్షన్స్ ను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాం.  https://www.youtube.com/watch?v=02Xbwou64Ro

Belleza Fashion.. Trendy Jewellery...   ఆడవారి అందాన్ని అలంకరించుకునేందుకు చేతులకు గాజులు, చెవులకు దిద్దులు, కాళ్లకు పట్టీలు ఎంత అవసరమో... అలాగే మెడకు కూడా అలంకరణ అవసరమే. అసలే మ‌గువ‌ల కంఠాన్ని శంఖంతో పోల్చుతారు. మరి అలాంటిది మెడను అలా బోసిగా వదిలేస్తే ఎమన్నా బావుంటుందా. ఓ అందమైన కంఠాభరణాన్ని ధ‌రిస్తే ఎంత బావుంటుంది. ఈరోజుల్లో ఫ్యాషన్ కూడా కాస్త ఎక్కువైంది కాబట్టి.. దానికి తగ్గట్టుగానే ఎన్నో కంఠాభ‌ర‌ణాలు దొరుకుతున్నాయి.  కాలేజ్ అమ్మాయిలు ధ‌రించేవి ఫ్యాన్సీ కంఠాభ‌ర‌ణాల దగ్గర నుండి.. పెద్దవారికి సైతం ఎన్నోమోడల్స్ ను మీ ముందుకు తీసుకొచ్చింది Belleza Fashion Trendy Jewellery. వాటిలో కొన్ని డిజైన్స్ మీకోసం... https://www.youtube.com/watch?v=G7JcsfZQv0c

Trendy Churidars in Ikaths Handlooms.. రోజు రోజుకి ఫ్యాషన్ పెరిగిపోతున్నా అతివల ఆల్ టైం ఫేవరెట్ డ్రెస్సింగ్ మాత్రం చుడీదార్స్. క్యాజువల్ గా అయినా పార్టీకైనా ఇట్టే అమరిపోయే ప్రత్యేకత చుడీదార్స్ ది. అదే హ్యాండ్ లూమ్ చూడీదార్స్ అంటే ఇంకా బావుంటాయి. అలాంటి చుడీదార్స్ లో లేటెస్ట్ కలెక్షన్ మీ కోసం అందిస్తుంది Ikaths Handlooms. మీరూ ఓ లుక్కేయండి...  https://www.youtube.com/watch?time_continue=2&v=n2wHOBbfjCU

Kora Silk Sarees !! ఫ్యాషన్ ప్రపంచంలోకి ఎన్ని మోడ్రన్ డ్రెసెస్ వచ్చినా అతివలు ప్రత్యేక సందర్భాలలో చీరలకే ప్రాధాన్యమిస్తారు. ఎంత ఫ్యాషన్ పెరిగిపోయినా చీరకున్న ప్రత్యేకత వేరు. ఇది పాతబడటం అంటూ ఉండదు. అందుకే మారుతున్న కాలాన్ని బట్టి డిజైన్లు తేడా ఉంటాయేమో కానీ... చీరకున్న ప్రాధాన్యత మాత్రం పోదు. అందులోవే ఈ కోర సిల్క్. అటు ఫ్యాషన్ కు తగ్గట్టు... ఇటు కట్టుకోవడానికి వీలుగా ఉండే కొన్ని కోర సిల్క్ డిజైన్లు మీకోసం.. https://www.youtube.com/watch?v=E430IuY6B60

ఇదే లేటెస్ట్ ఫ్యాషన్...!   https://www.youtube.com/watch?v=wBlUCwagfQs  

Samantha Reddy Boutique Saree Latest Fashion Designs 2017..!   ఆడవాళ్ళకి అమితంగా నచ్చేవి ఏంటంటే ఠక్కున వచ్చే సమాధానం చీరలు అని. ఎందుకంటే ఆడవాళ్ళకి, చీరలకి ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. అదే డిజైనర్ చీరలంటే ఇంక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి అలాంటి వాళ్ళ కోసం ఫ్యాషన్ కలెక్షన్. ఈ వీడియో చూడండి, చీరలంటే ఇలా ఉండాలి అంటారు...  https://www.youtube.com/watch?v=uFCcigamQ1g

కిరాకు పుట్టిస్తోన్న కిమోనో ఫ్యాషన్ సౌలభ్యత కోసం మనం ఎన్నో విధానాలను అవలంభిస్తాం.. వస్త్రధారణ నుంచి ఆహారం వరకు అన్నీ రోజు రోజుకు మారిపోతున్నాయి. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే. అప్పట్లో చీరలకు మాత్రమే పరిమితమైన ఆడవారికి మారుతున్న ఫ్యాషన్ వైవిధ్యమైన డిజైన్లను అందించింది. వాటిలో జబ్బల జాకెట్లు, బుట్ట చేతులు, త్రీ ఫోర్త్ హ్యాండ్స్, ఫుల్ స్లివ్స్, విమానం రెక్కలు ఇలా ఎన్నో రకాల ఫ్యాషన్లను చూశాం. తాజాగా ఇప్పుడు కిమోనోపై పడ్డారు. జపాన్‌కు చెందిన ఈ లేటెస్ట్ ట్రెండ్ గురించి మరిన్ని విషయాలు ఈ వీడియో చూసి తెలుసుకోండి.  

బెంగాలీ స్టైల్లో చీర కట్టుకోవడం నేర్చకోండి   షాపింగ్ వెళ్లినప్పుడల్లా కంటికి నచ్చిన చీరలు కొనేస్తూ ఉంటారు. కొనేటప్పుడు బాగానే ఉంటుంది. కానీ చీరలతో బీరువా నిండిపోయినప్పుడు ఏ చీర కట్టుకోవాలో తికమకపడుతూ ఉంటారు మగువలు. సరే ఆ సంగతి పక్కనబెడితే.. 29 రాష్ట్రాలున్న మనదేశంలో ఒక్కో రాష్ట్రానికి ఒక్కో ప్రత్యేకశైలి. అవి వస్త్రధారణ కావొచ్చు, ఆహారపు అలవాట్లు కావొచ్చు. గతంలో ఆ ప్రాంతానికే పరిమితమైన సాంప్రదాయాలు మారుతున్న కాలంతో పాటుగా రాష్ట్రాల సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు వ్యాపించాయి. దసరా సమయంలో గుజరాత్‌లో మాత్రమే ఆడే దాండియా ఇప్పుడు అన్ని చోట్లా కామన్.. అలాగే ముంబై, పుణేలలో వేడుకలా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలు ఇప్పుడు మారుమూల పల్లెలకు వ్యాపించాయి. ఇక హిల్సా, రసగుల్లా, ప్రముఖ రచయితలకు కేంద్రంగా నిలవడంతో పాటు స్టైల్‌గా ఉండటంలో కూడా బెంగాలీలు ఫేమస్. బెంగాలీ ఆడపడుచుల సాంప్రదాయ వస్త్ర ధారణ ఇప్పుడు దేశం మొత్తం విస్తరించింది. ఆ చీరకట్టును మీరు ట్రై చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూడండి.  

ప్రమిద డెకరేషన్.. చూసి ఎంజాయ్ చేయండి!     ‘ఎప్పుడూ బిగినేసేనా... మడిసన్నాక కాసింత కాలాపోసనుండాలి’... అంటాడు ‘ముత్యాలముగ్గు’లో  రావుగోపాల్రావ్. ‘మనిషి అన్నాక... కొత్తగా ఆలోచించాలి’ అని... ఆ డైలాగ్ తో చెప్పకనే చెప్పారన్నమాట. అంటే... మనం మామూలుగా చేసే పనుల్నే కొత్తగా చేస్తే.. సరిపోతుంది. ఉదాహరణకు ప్రమిదల్ని తీసుకుందాం. దీపావళికి వరుసగా ప్రమిదలు వెలిగిస్తాం కదా. మట్టి ప్రమిదల్లో నూనెపోసి దీపాలను వెలిగించేసి ‘దీపావళి’ని ‘మమ’ అనిపించేస్తాం కదా. అలా కాకుండా కొత్తగా ఆలోచిస్తే?. మట్టి ప్రమిదల్నే తీసుకొని వాటిని ఇంకేమైనా చేయొచ్చేమో ఆలోచిస్తే?.. రంగులేసి, డెకరేట్ చేసి.. ఆ ప్రమిద లోంచి వచ్చే వెలుగుల్లో కొత్త రంగులు కనిపించేలా ప్లాన్ చేస్తే? అద్గదీ ‘దీపావళి’ అంటే. ఈ వీడియోలో... మామూలు ప్రమిదకు కొత్త శోభను తీసుకురావడానికి ఈ అమ్మాయ్ చేసిన ప్రయత్నం చూడండి. నిజంగా వండర్. మీకూ ట్రై చేయాలనుంటే..  ఈ వీడియో వైపు ఒక్కసారి లుక్కేయండి. మీ ఇంటి దీపావళిని స్వర్ణకాంతుల మయం చేసుకోండి.         

నక్షత్రాన్నిబట్టి వస్త్రాలు ధరిస్తే మంచిది (దసరా స్పెషల్)     దసరా పండుగ వచ్చేసింది. ఈ తొమ్మిది రోజులు దేశమంతా ఘనంగా ఉత్సవాలు , జరుపుకుంటారు. పూజలు చేసి, నైవేద్యాలు అమర్పించి కొత్త బట్టలు ధరించి ఆనందోత్సాహాలతో గడుపుతారు. దసరా తొమ్మిది రోజులూ ప్రతిరోజూ ఆ వారాన్నిబట్టి, ఆ రోజు నక్షత్రాన్నిబట్టి ప్రత్యెకించిన రంగుల వస్త్రాలు ధరిస్తే మంచిదని శాస్త్రం చెప్తోంది.       మొదటిరోజు :- దుర్గామ్మవారిని పూజలందుకొమ్మని ఆహ్వానించే ఘటస్తాపన మహోత్సవం. శైలపుత్రిగా,గిరితనయగ, పార్వతి అమ్మవారుగా కీర్తించబడే అమ్మ పుట్టింది కొండ, కోనల్లోంచి.అంటే ప్రక్రుతిలోంచి.అందుకే ప్రక్రుతికి ప్రతీకగ పసుపు రంగు దుస్తులు  ధరించడం ఈరోజు శుభప్రదం.   రెండవరోజు :- పార్వతి అమ్మబారి  రూపాన్ని పూజిస్తారు. శివునికోసం తపస్సు చేసింది.అనుకున్నది సాధించే పట్టుదల చూపింది. అందుకు చిహ్నంగా ఆకుపచ్చని బట్టలు ధరించాలి.   మూడవరోజు :- పెళ్లైన వనితగ, సకల సౌభాగ్యరూపిణిగా చంద్రఘంట రూపంలో అమ్మ పూజలందుకుంటుందీరోజు.ఆమె నుదుటన  అర్థచంద్రుడు ఘంటలాగా ఉంటాదు.శివుని పెళ్లాడటానికి ఆమె చూపిన ధైర్యానికి,పోరాటస్ఫూర్తికి గుర్తుగా బూడిద రంగు దుస్తులు ధరిస్తే మేలు.   నాలుగవరోజు:- కూష్మాండరూపిణిగా అమ్మవారిని పూజిస్తారు ఈరోజు.సూర్యునిలో నివ్నసించి బ్రహ్మాండాన్ని స్రుష్టించిన లయకారిణి. వులుగు,శక్తి ప్రసాదిస్తుంది. దానికిగుర్తుగా ఆరెంజ్ రంగు దుస్తులు ధరించాలి.   ఐదవరోజు :- కార్తికేయుని తల్లిగా స్కందమాతగా పూజిస్తారు.తెల్లని వస్త్రాలు ఈరోజు ధరించలి.   ఆరవరోజు :- కాత్యాయనిగ పూజిస్తారు ఈరోజున. మహిషాసురుని సమ్హరించి అరుణిమతో ఉంటుంది కాబట్టి ఎర్రని వస్త్రాలు ధరిస్తే మంచిది.   ఏడవరోజు :- చిమ్మచీకటి, కాళరాత్రి రూపంలో అమ్మవారిని పూజిస్తారు. అన్ని సమస్యలు, బాధల నుంచి తప్పించె తల్లిని కీర్తించే రోజు నీలిరంగు దుస్తులు వేసుకోవాలి.   ఎనిమిదవరోజు :- మహాగౌరి రూపంలో అమ్మవారిని పూజిస్తారు ఈరోజున.పాపాలను తుడిచివేసె బాలికగా,అందాలరాశిగా తేజస్సు ఉట్టిపడే తల్లిని గులాబీ వస్త్రాలు  ధరించి మొక్కితే  మంచిది.   తొమ్మిదవరోజు :- సిద్ధిధాత్రిగా, అపూర్వ శక్తిస్వరూపిణిగా  కొలుస్తారు ఈరోజున. ఆమెను పూజించిన శివునికి శక్తులు ఇచ్చిన తల్లి భక్తులకూ ఇస్తుందని నమ్మకం. వంగరంగు వస్త్రాలు ధరించాలి ఈరోజు.   పదవరోజు :- చెడు మీద మంచి సాధించిన విజయం. దసరా పండుగన పంచవన్నెల్లో యే రంగునైనా ధరించవచ్చు. - Sridevi