మీ చేతుల్లోనే లేటెస్ట్ ఫ్యాషన్...     ఆడవాళ్లు ట్రెండ్ ను ఫాలో అవడం అందరికి తెలిసిందే. కొత్త కొత్త లేటెస్ట్ ఫ్యాషన్ మార్కెట్ లోకి ఏది వచ్చిన కూడా దానిని ఫాలో అవడం చేస్తుంటారు. కానీ ట్రెండ్ ను ఫాలో అవడం కన్నా మీరే కొత్త ట్రెండ్ ను మీకోసం తయారు చేసుకోవచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన దుస్తులకు చక్కని లుక్ వస్తుంది. శరీరంలో ఛాతీ భాగం కాస్త బొద్దుగా ఉన్నవారు చేతుల విషయంలో జాగ్రత్తపడాలి. బుట్ట చేతులు, వదులుగా ఉండే చేతులు, కుచ్చులుండేలా.... అసలు కుట్టించుకోకూడదు.   ఒంటికి అతుక్కుని ఉండే మోడల్ ఎంచుకోవాలి. కింది భాగంలో వదులుగా ఉండేలా దుస్తులు కుట్టించుకుంటే పై భాగం నుంచి దృష్టి మళ్ళుతుంది. నడుం కిందిభాగం లావుగా ఉండేవారు దుస్తుల చేతులతో తమాషాలు చేయవచ్చు. రకరకాల కుచ్చులు, బుట్ట చేతులు, వదులుగా ఉండే పొడవు చేతులు, రఫెల్స్... ఇలా ఎన్నో రకాలు ప్రయత్నించవచ్చు. అప్పుడు పైన కింద బ్యాలెన్స్ అయ్యి ఆకృతి అందంగా కనిపిస్తుంది.   మీ చేతులు సన్నగా ఉన్నాయా? ఒంటికి అటుక్కున్నట్లు, వేలడుతున్నట్లుండే ఫ్యాబ్రిక్ కాకుండా కాస్త నిలబడి ఉండే వస్త్రం ఎంచుకోవాలి. పొడవు చేతులు, మూడొంతుల పొడవున్న చేతులు ఇలాంటివారికి బాగుంటాయి. చేతులు లావుగా ఉన్నాయా? మీరు తప్పనిసరిగా మూడొంతుల పొడవుండే వదులు చేతులు కుట్టించుకోవాలి. పొట్టి చేతులు మీకు బాగోవు.   చక్కటి కుచ్చులతో ఒక మంచి షర్టు మీ వార్డ్ రోబ్ లో లేదా? ఒక మీటరు మంచి లేసు తీసుకుని మీ దగ్గరున్న తెల్ల షర్టుకి కుట్టించుకోండి. మీ దగ్గర ఒక మంచి పొడవు చేతుల తెల్ల షర్టు ఉంది. దాన్ని స్కర్టు మీద ధరించినపుడు అలాగే వేసుకోండి. అదే ప్యాంటు మీద ధరించినపుడు అలాగే వేసుకోండి. అదే ప్యాంటు మీద ధరించినపుడు అంచుల్ని రెండు మడతలు పైకి మడిచారనుకోండి. స్టైల్ గా ఉంటుంది.

'బుట్ట'లో పడాల్సిందే!     * కొత్తొక వింత పాతొక రోత అంటుంటారు. ఈ సామెతని మార్చే టైమొచ్చింది. ముఖ్యంగా ఫ్యాషన్ ప్రపంచం ఈ మాటని కొట్టి పారేస్తోంది. ఎందుకంటే అక్కడ పాత కొత్తని డామినేట్ చేస్తోంది.      * ఎప్పుడో ఫాలో అయ్యి, తర్వాత ఔట్ డేటెడ్ అయిపోయిన ఎన్నో స్టైల్స్ మళ్లీ కొత్తగా మార్కెట్లోకి వచ్చి కూర్చుంటున్నాయి. కళ్లు చెదరగొట్టేస్తున్నాయి. మతులు పోగొట్టేస్తున్నాయి. అలా వచ్చిన వాటిలో బుట్ట చేతులు ఒకటి. మనకి ఇవి బుట్ట చేతులు. కానీ ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం కాస్త స్టయిల్ గా పఫ్డ్ స్లీవ్స్ అని పలకాలి.     * ఒకప్పుడు చిన్నపిల్లల గౌన్లంటే బుట్ట చేతులు ఉండాల్సిందే. అలాగే పరికిణీల మీదకి కుట్టే జాకెట్లకి కూడా బుట్ట చేతులు పెట్టేవారు. ఆ తర్వాత మెల్లగా బుట్ట చేతులు బై బై చెప్పేశాయి. త్రీ ఫోర్త్, ఫుల్ స్లీవ్స్ వచ్చేశాయి.      * అవి ప్లెయిన్ గా ఉండేవే తప్ప ఎక్కడా బుట్ట కనిపించేది కాదు. అయితే ఎప్పుడో బుట్టలో పెట్టేసిన ఆ ఫ్యాషన్ ఇప్పుడు మళ్లీ మొదలైంది. అయితే ఈసారి పిల్లల గౌన్లకీ, పరికిణీ జాకెట్లకే కాదు... జీన్స్ మీద వేసే షర్టులకి కూడా బుట్టలు పెట్టడం మొదలైంది. * లాంగ్ ఫ్రాక్...  టీషర్ట్స్.. ఫార్మల్ షర్ట్.. శారీ బ్లౌజ్... ఒక్కటి కాదు, దేనికి బుట్ట చేతులు పెట్టినా దాని అందమే వేరు అన్నట్టుగా ఉందిప్పుడు. చూస్తున్నారు కదా ఫొటోలు! మరి మీరు కూడా బుట్ట చేతులు పెట్టించండి. బుట్టబొమ్మలా తయారై అందర్నీ బుట్టలో పడేయండి! -Sameera  

నెయిల్ పాలిష్ ఇలా కూడా వేసుకోవచ్చు...!   ఒక్కొక్కరికి ఒక్కో అలవాటు ఉంటుంది. కొందరు కుక్కల్ని పెంచుకుంటే, మరికొందరు పిల్లుల్ని పెంచుకుంటారు. ఇంకొందరయితే గోళ్లు పెంచుకుంటారు. గోళ్లు పెంచడం అంటే అలా ఇలా కాదు... చాలా శ్రద్ధ తీసుకుంటారు... ఇంకా చెప్పాలి అంటే గోళ్ళపైన ఎంతయితే శ్రద్ధ పెడతారో నెయిల్ పాలిష్ చేసుకోవడంలో కూడా అంతే శ్రద్ధ వహిస్తారు. నెయిల్ పాలిష్ లో క్రియేటివిటీ ఏ రేంజ్ కి వెళ్లిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  

ఏ ముఖానికి ఏ ఇయర్ రింగ్ సెట్ అవుతుందో తెలుసా..?   అమ్మాయిలు తమ తొలి ప్రాధాన్యత దేనికిస్తారంటే అందానికి.. అందుకే అందంగా కనిపించడానికి తల నుంచి పాదాల దాకా జాగ్రత్తలు తీసుకుంటారు. డ్రెస్ తీసుకుంటే దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్, నెయిల్ పాలిష్, లిప్‌స్టిక్, జ్యూవెలరీ అన్ని పర్‌ఫెక్ట్‌గా చూసుకుంటారు. ఇకపోతే ఇది వరకటి రోజుల్లో చెవికి దిద్దులు, రింగులు పెట్టుకుని సరిపెట్టుకునేవారు. కానీ రీసెంట్ ఇయర్స్‌లో ట్రెండ్ మారింది.. రకరకాల ఇయర్ రింగ్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే డ్రెస్‌ను బట్టి కాకుండా ముఖాన్ని బట్టి వీటిని సెలెక్ట్ చేసుకోవాలంటున్నారు డిజైనర్స్.. మరీ ఏ ముఖానికి.. ఎలాంటి ఇయర్ రింగ్ సెట్ అవుతుందో ఈ వీడియో చూసి తెలుసుకోండి.  https://www.youtube.com/watch?v=mbPlQzBHQ8I    

RUNWAY FEET   Something that keeps changing and repeating?! Fashion Trend... Dresses, designs, colors, looks..all follow a trend, sometimes they are new, sometimes they are the old revamped ones. Footwear industry follows a trend, a season, an economy too. A few new designs that are basically inspired by the olden designs are hot now. With summer fast arriving in India, the flat soles would occupy the top shelves and the high heel versions rule every season anyways.   For a lady who is used to wearing slight heeled versions, changing to a flat option suddenly would be shocking to her feet. The bones and nerves are not ready, so gradual change to flatter versions is suggested. However, wearing high heels often is not good for health, everyone suggests. It might be boring to hear the same story, but on a long run one can't escape but will realise.     Wrong shoe size might result in foot corns and bad blood circulation. Afternoons are the best to buy footwear, thats when the feet breathe well and are in their actual size. So this time you want to buy a new pair, you might have to get permission from work or college to leave early.   - Prathyusha Talluri

DIFFERENT LOOK WITH GLASSES   Now the summer is coming, you need to have a few accessories. One of the most important accessories in the season is a pair of sunglasses. They not only protect your eyes from the harmful rays of the sun, but also enhance your overall look. Though, many times, people go wrong in choosing the right pair of shades as they are not aware of how to pick one that will suit their face. Here are a few tips to keep in mind the next time you go shopping for your eyewear. When selecting sunglasses, you may wonder how to pick out the best frames. First,we have to determine our face shape.   There are seven basic shapes: Round, oval, oblong, triangle, inverted triangle, diamond, and square. Once you determine your face shape, pick a frame that contrasts with the shape; for example, if you have a round face, select angular, narrow frames that are wider than they are deep in order to lengthen the face. The frame size of the sunglasses you select should also be in scale to your face. If you have tiny features, don't select over-sized frames - they will dwarf your face.   Some examples of good frames for different face shapes are: • Diamond-shaped faces: rimless frames, frames with distinctive brow-lines, or oval frames. • Square faces: softer edged frames, round, oval, even cat-eyed, also thinner frames. • Triangle shaped face: colorful frames or cat eye sunglasses, also frames with straight top lines. • Inverted triangle shaped face: rimless frames, light colors and materials • Oblong face: frames that are as wide or wider than the broadest part of the face. • Round faces: rectangular or square frames, thicker frames. • Oval faces: most frames will look good, but especially square and Wrap around.

Fashion Necklaces for a Statement   Necklaces of all kinds have been the must haves for any dress up occasion! Precious or semi-precious is necessary for certain occasions but they are a big No-no for others! Thats when fashion jewellery stands up to shout out for a stunning beauty!   Be it for sarees or Indian dresses, or even for western formals, necklaces of big beads, stones, sequins etc create a huge fashion statement. Most Clothing Line stores are carrying their brands of these necklaces. Bright colors, huge beads are the trend. You can flaunt your necklace on a western formal shirt too, not atall an odd combination. Any simple dress can be made grand with just one matching or contrast necklace of this sort.     These necklaces can be paired with a very simple matching stud or a similarly huge hangings for the ears. If you could find, finish this set with a suitable bracelet too. This time you go for shopping, take out some time to shop hop for one or two such fashion necklaces that could really make your get-up, a bright and trendy one.   Prathyusha.T  

ట్రెండీ బ్యాంగిల్స్   ఐడియా పాతది కదా అని.. తయారు చేసే గాజులు కూడా పాతకాలం మాదిరిగా ఉంటే ఈతరం వాళ్లకు ఎలా నచ్చుతాయ్..? అందుకే వాటికి న్యూలుక్ అద్దే ప్రయత్నం చేస్తున్నారు డిజైనర్లు. అలా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ట్రెండీ గాజుల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.  

3D Trend In Tattoos Fashion World is always wonderful with constant change in trends. Tattoo is one such fashion which influenced almost everyone who go along with trends. For youth, Tattoos have become symbol of pride like jewellery and accessories. Tattoos have a special page in this current fashion booklet. This is the reason, we get to see so many new designs and fashions coming up in Tattoos and in this row, now “3D”Tattoos are winning hearts of tattoo lovers.   However, tattoos can get even crazier and extend from two dimensions into three with some creativity, artistry and unexpected uses of shading. In fact, these 3D tattoos look so downright realistic that they will absolutely blow your mind. When going out for permanent tattoo gets difficult or when this permanent stuff becomes boring, then above said temporary tattoos which coming in 3D will be perfect choice.   These 3D tattoos look very natural and so many designs are in the market in many possible designs; this will allow you to change your tattoos as per your mood or suitable to occasion. These 3D tattoos are so similar like stickers we get to see in the market, but because of the 3D effect incorporated in to it gives natural look and appears, unbelievable and outstanding. Now so many artists are constantly working for you to create exceptional and highly impressive designs for you. You too want to immerge yourself into fashion world with latest 3D tattoos? then go, get started now itself. - Bhavana

  Beat The Heat In Style!     The weather is catching up on heat very quickly and you need some tips to prevent the heat from bothering you? There’s not much you can do about the weather but you can change your attire to stay cool. Let me use the bottom to top approach to help you decide on your summer look. Not many of us pay attention to the trouble our feet undergo during the summer months. Did you know that your feet swell up a little during the summer season? If you were unaware of this fact then you have been troubling your feet a lot, all these years. Your regular footwear makes your swollen feet very uncomfortable. You may be unaware of it immediately, but soon you will start experiencing discomfort. So what can be done for the poor swollen feet? The trick is to buy a pair of shoes/sandals of a slightly larger size than your regular preference. This will give your feet the much needed comfort in summer. Natural leather and known to expand so make a wise choice when you go shopping. Coming to your cloths, the fabric is what you need to choose correctly. I’m sure you know what not to wear, but do you know what to wear? If you are confused about that, let me clear your confusion with suggestions of simple dressing styles. You would be thinking that cotton will be my first suggestion. Let me improve your knowledge about fabrics. It is said that Linen will be a better choice over cotton in the summer months. Why? Simply because it is cooling. But, everything comes with a side effect. Linen is a fabric that requires frequent cleaning when you sweat into it. If you don’t mind that, then enjoy your summer with Linen on you. If this is not something you want to do then stick to the traditional cotton wear. Its not enough to choose the fabric, your choice of the color and style of your outfit also needs to be apt. Choose light colors that don't allow the heat to stay within. Coming to the style, you might have to do some summer shopping. Fortunately, this is not the only option. You can give a new look to your old cloths to make a perfect summer outfit. Make sure you have great tailor, because only the best can give the best. Take your cloths to the tailor and see if he or she can crop your skirts and blazers to make them summer fit. Also remember to allow your skin to breathe. Don’t suffocate it with extremely tight cloths. What about make up? I’m sure you know a million ways to present yourself beautifully. What you may not know is how to take care of your make up kit. Cosmetics too are intolerant to heat. They may melt and become unusable if you don’t protect them from the angry sun. The protection process of your make up kit begins with, placing a zip lock bag in the refrigerator and letting it remain there overnight. When you step out to conquer the world next morning, carry your make up kit in that cold bag. This will keep the heat from attacking your lipstick or foundation at least until you find a cool place to put it in. Try these tricks and enjoy summer! Kruti Beesam

  పాత ఫ్యాషన్‌ తిరిగివచ్చింది   కాలం క్షణకాలం కూడా ఆగకుండా మారిపోతుంటుంది. దాంతో పాటే మన అభిరుచులు కూడా! దాన్నే మనం ట్రండ్ అంటాం. ఇవాళ ఉన్న ట్రెండ్‌ రేపు ఉండకపోవచ్చు. కానీ.... కానీ.... ఒకోసారి ఆ ట్రెండ్ తిరిగివచ్చేస్తే! పాతికేళ్లనాటి ఫ్యాషన్‌ మళ్లీ ర్యాంప్ మీద నడిచేందుకు సిద్ధమైపోతే! అలా ఇప్పుడు తిరిగొచ్చి దుమ్ము లేపుతున్న పాత ట్రెండ్స్‌ని ఓసారి చూద్దామా! Wide legged jeans నడం కిందకి దిగేకొద్దీ వెడల్పుగా ఉండే జీన్స్‌ ఓ పాతికేళ్ల క్రితం ఫ్యాషన్‌. బెల్‌బాటంను పోలిన ఈ ప్యాంట్స్ ఎంత త్వరగా వచ్చాయో అంతే తొందరగా మాయమైపోయాయి. కానీ ఓ రెండేళ్ల క్రితం ఫ్యాషన్ ప్రపంచంలోకి తిరిగి అడుగుపెట్టాయి. మళ్లీ ఈ ట్రెండ్ మాయమైపోయేలోగా ఓ జత తీసుకునేందుకు మనం తొందరపడాల్సిందే! Platform sandals ఎంత ఎత్తు హీల్‌ ఉంటే అంత ఫ్యాషన్. కానీ హైహీల్స్‌ గురించి వైద్యులు చెప్పే మాటలు అటుంచితే... నడవడానికి కూడా చాలా అసౌకర్యంగా ఉంటుంది. అందుకేనేమో సోల్ మొత్తం ఎత్తుగా ఉండే ఒకనాటి ప్లాట్‌ఫామ్‌ చెప్పులని ఫ్యాషన్ ప్రపంచం మళ్లీ వేసుకుని చూసుకుంటోంది. Bright Sunglasses సన్‌గ్లాసెస్ అంటే నల్లగానో, ట్రాన్స్‌పరెంటగానో ఉండే రోజులు పోయాయి. 90వ దశకంలో వచ్చిన నీలం, ఆకుపచ్చ రంగులతో తళతళ్లాడిపోయే కళ్లద్దాలకు మీద మళ్లీ జనం కన్ను పడింది. అంతేకాదు.... ఇప్పుడు కళ్లద్దాలు ఎలా ఉన్నా ఫ్యాషనే! గుండ్రంగా ఉన్నా, బాగా పెద్దగా ఉన్నా, స్టీల్ ఫ్రేంతో ఉన్నా... ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచం అంతా సన్‌గ్లాసెస్‌తోనే ఆడుకుంటోంది. Brown Lipstick ఒకప్పుడు ఏ రంగు కావాలంటే ఆ రంగు లిప్‌స్టిక్‌ పెట్టుకొనేవారు. రానురానూ జనం బుద్ధిగా పెదాల రంగుకి దగ్గరగా ఉండే లిప్‌స్టిక్‌నే వాడుతున్నారు. కానీ ఇప్పుడు పాత ట్రెండ్‌ తిరిగి వచ్చింది. కాంట్రాస్ట్‌ లిప్‌స్టిక్‌కి కాలం కలిసొచ్చింది. ముఖ్యంగా బ్రౌన్‌ రంగు లిప్‌స్టిక్‌ ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో తప్పనిసరిగా పాటించాల్సిన ట్రెండ్‌! Huge Earrings చెవులకి వీలైనంత పెద్ద బుట్టల్ని వేసుకోవడం చాలా పాత ట్రెండే. దశాబ్దానికోసారి ఈ ట్రెండ్ మారుతూ.... ప్రస్తుతానికి మళ్లీ నిండైన బుట్టల మీదకి జనం మనసు మళ్లింది. సీరియల్స్ దగ్గర్నుంచీ ర్యాంప్ మీద నడకల వరకూ ఇప్పుడు బుట్టల మీదకే దృష్టి మళ్లుతోంది.     ఇవే కాదు... ఒకప్పుడు కుర్రకారుని వెర్రెత్తించిన డెనిమ్‌ జాకెట్స్, పాత సినిమాల్లో మాత్రమే కనిపించే షోల్డర్‌ ప్యాడ్స్ (shoulder pads) అన్నీ ఇప్పుడు తిరిగొస్తున్నాయి. కొత్తే కాదు... ఒకోసారి పాత కూడా వింతే అని రుజువుచేస్తున్నాయి.

  హాఫ్ మూన్ బ్యాగ్... సరికొత్త స్టైల్ స్టేట్మెంట్!   మోడ్రన్ అమ్మాయికి మరింత మోడ్రన్ లుక్ తేవడంలో హ్యాండ్ బ్యాగ్స్ తక్కువ పాత్రేమీ పోషించవు. అందుకే ఎప్పటికప్పుడు మార్కెట్లోకి రకరకాల హ్యాండ్ బ్యాగులు వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు మరో కొత్త రకం బ్యాగ్స్ రంగప్రవేశం చేశాయి. అవే హాఫ్ మూన్ బ్యాగ్స్. పేరులోనే తెలుస్తోంది కదా వీటి ప్రత్యేకత ఏంటో! అవును... ఇవి అర్ధ చంద్రాకారంలో ఉంటాయి.   చందురుని మించిన అందం ఈ ప్రపంచంలో దేనికీ లేదంటారు. అలాంటి చంద్రునితోనే పోలుస్తున్నారంటే ఈ బ్యాగ్స్ ఎంత అందంగా ఉంటాయో ఊహించవచ్చు. ఊహించడం ఎందుకు! ఇక్కడ కనిపిస్తున్నాయి కదా... మీరే చూడండి. రకరకాల రంగులు... రకరకాల సైజులు... దేని అందం దానిది. దేని సొగసు దానిది. జీన్స్ వేసినా... స్కర్ట్ వేసినా... గౌను అయినా... కుర్తీ అయినా... దేనిమీదకైనా ఇవి నప్పుతాయి. మీకంటూ ఓ స్టైల్ స్టేట్మెంట్ ని క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సమ్మర్ లో ధరించే షార్ట్ డ్రెస్సెస్ మీదికి ఇవి చక్కని కాంబినేషన్!       లెదర్, సాఫ్ట్ లెదర్, కాటన్... ఇలా రకరకాల మెటీరియల్స్ తో వీటిని తయారు చేస్తున్నారు. రకరకాల క్లచ్ లు అమర్చడం వల్ల కూడా వీటి అందం మరింత పెరుగుతోంది. హ్యాండ్ బ్యాగ్స్ ఇష్టపడని వాళ్లకి హాఫ్ మూన్ పర్సులు కూడా దొరకుతాయి. రాళ్లు, పూసలు వంటి వాటితో అలంకరించిన అందమైన బ్యాగ్స్ కూడా బోలెడు. మంచి క్వాలిటీ ఉన్నవి మూడు వందల నుంచి మొదలవుతున్నాయి.       ఇక లేట్ చేయకండి. ఇప్పటివరకూ మీ కలెక్షన్లో హాప్ మూన్ బ్యాగ్ లేకపోతే వెంటనే కొనేయండి. మాంచి లుక్స్ తో అదరగొట్టండి. బోలెడన్ని కాంప్లిమెంట్స్ కొట్టేయండి. - Sameera  

  ట్రెండీ బాగ్స్ కాదు …..ఫ్రెండ్లీ బాగ్స్    కాలేజ్, ఆఫీస్, షాపింగ్ ఇలా ఎటు వెళ్లినా సరే మనవెంట బ్యాగ్ ఉండాల్సిందే. అలాంటిది మనకు సూటయ్యే బ్యాగ్ ఏది..? ప్రజెంట్ ఏ ట్రెండ్ బ్యాగ్స్ చక్కర్లుకొడుతున్నాయో తెలుసుకోండి.. హ్యాండ్‌‌బ్యాగ్స్ చూడడానికి అందంగానే కాదు.. మనకి సౌకర్యవంతంగా కూడా ఉండాలి. ఇంకా మనకు ఈ మధ్య సందర్భాన్ని బట్టి వేసుకునే హ్యాండ్ బాగ్స్ అన్ని ఒకచోట కంబోపాక్స్ లో దొరుకుతున్నాయి ఆన్ లైన్  షాపింగ్ లో ఇలా అయితే, అన్నీ బ్యాగ్స్ అందరికీ సూట్ కావు.. మన శరీరాకృతిని బట్టీ బ్యాగ్స్‌ని ఎంచుకోవడం వల్ల ఇంకా అందంగా కనిపిస్తాం. ఎత్తు తక్కువగా ఉండేవారికి పొడవు బ్యాగ్స్ అంటే స్లింగ్ బ్యాగ్ తరహావి బాగుంటాయి.. సన్నగా, పొడవుగా ఉన్నవారికి పొట్టి బ్యాగులు బాగుంటాయి. మార్కెట్లోకి ఇప్పుడు స్టైలీష్ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. అందులో మీకు నచ్చినవి ఎంచుకోవచ్చు.. ఫ్లోరల్, డిజిటల్ బ్యాగ్స్ ప్రజెంట్ ట్రెండ్ ఆఫీస్ కి , కిడ్స్ కి లంచ్ పెట్టడానికి కూడా ఇప్పుడు చాల మంది ఈ జూట్ బాగ్స్ వాడుతున్నారు స్లింగ్ బ్యాగ్స్ కూడా మరింత ఫ్యాషన్‌గా మారాయి.. ఇక వేసవి సెలవులకి టూర్ కి వెళ్లే వాళ్ళకోసం ఈ ట్రావెల్ బాగ్స్ చాల బాగుంటాయి. బ్యాక్ ప్యాక్ బ్యాగ్స్ అయితే ఎప్పుడూ ట్రెండీనే కాబట్టి మీకు అనువైన బ్యాగ్స్ ఎంచుకోండి.. ఫ్యాషన్ ఐకాన్‌గా నిలవండి..

వేసవిలో పూల సొగసులు   సెగలు కక్కే వేసవిలో మనసూ, శరీరం చల్లదనాన్ని కోరుకోవడం సహజం. అందుకే మీ వస్త్రధారణలో పూలకు ప్రాధాన్యం ఇచ్చి చూడండి. మీ అల్మారాలో పూల ప్రింట్లు ఉన్న దుస్తులు ఉన్నాయా? కనీసం పూల రంగుల్లోని టాప్‌లు ఉన్నా ఫరవాలేదు. అవన్నీ మీ మనసుని హాయిగా ఉంచుతాయి. పైజామా, పలాజోలు లాంటివయినా ఆ ప్రింట్లలో ప్రయత్నించి చూడండి. * ఉక్కకు తాళలేకపోతున్నాం అనుకునే వారు.. చిన్నచిన్న పూల ప్రింట్ల టాప్‌లు వేసుకుని అడుగున కాస్త వదులుగా ఎలాంటి డిజైను లేని సాదా ప్యాంట్లో, స్కర్టులో వేసుకోవచ్చు. *  పైన పూల ప్రింట్లు వేసిన కుర్తీలకు జీన్స్‌ జతయితే అదిరిపోతుంది. కాలంతో సంబంధం లేని ఈ ఫ్యాషన్‌కి చిన్న మార్పులు చేసుకుంటే ఈ వేసవిలో మరింత ట్రెండీగా నిలిచిపోవచ్చని అంటున్నారు ఫ్యాషన్‌ నిపుణులు. *  మా దగ్గర ఫ్లోరల్‌ప్రింటు కుర్తాలు, జీన్స్‌ లేవు అంటారా? అయితే ఒక చక్కని పూల స్కార్ఫ్‌ కానీ, దుపట్టా కానీ´ కొనేయండి. అటు టాప్‌లపైనా పనికొస్తాయి.. కుర్తాలకూ సరిపోతాయి. *  మెడలో వేసుకునే హారాలూ, హెయిర్‌క్లిప్స్‌, బ్యాగులూ, బ్రేస్‌లెట్లూ, టోపీలూ, చెప్పులు వీటికి పూల డిజైన్లని ఎంపిక చేసుకుని చూడండి. *  సాయంత్రం పూట వేడుకలకు వెళ్లేవారు పూల ప్రింట్లున్న మ్యాక్సీలు, గౌన్లు ఎంచుకోవచ్చు. అలాగే పూల ప్రింటుతో ఉన్న జార్జెట్‌చీరను కట్టుకున్నా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆకట్టుకునేలా కూడా కనిపిస్తారు.  

 Age Appropriate Fashion knowledge In kids   Following fashion trends for kids is fun! Shopping for girls is especially interesting...however, too much is too bad. Incorporating too much fashion consciousness into girls or even boys right when they are in middle school is not good business....Parents are complaining these days that girls in elementary school, these days, are talking about fashion and dressing up...leaving hair open and not listening to parents when it comes to dressing appropriately and decently.Where is the innocence gone?? How to install that right kind of dressing sense without the odd fashionista kinda feeling is the key!! Moms might struggle but if managed well, your girls will learn the right dressing culture. Applying makeup, nail polishes, lipsticks right when girls are toddlers might be fetching Mom appreciation and accolades for having a cute, beautiful girl but that lays the foundation already. Sametime, the harsh chemicals used in cosmetics these days are definitely not the ones we should be introducing to children...the later the better. With boys too, wearing shoes and accessories that are advertised just the previous day on TV, being rude and stubborn if parents dont buy them the stuff... Building a sense of responsible shopping wrt., dressing and staying as natural as possible when it comes to make up helps raise a happy amd healthy child....you may feel these things dont have to be taken seriously but trust me, they all add up to a good foundation - An age appropriate fashion conscious child! - Prathusha Talluri

Tulle Dresses for Little Girls   We can create a fashion statement by dressing up little girls too...infact, they look so cute when dressed up with extremely bright colors too. We can easily experiment with their dresses. Tulle skirts have been in fashion for many years and they make a peek every now and then in almost all occasions...weddings, birthday parties, school casuals, play dates etc......'there is no rule to wear a Tulle'! Here are a few ideas for Mom's to see their Little Girls in Tulle dresses....experiment with neck lines, waist belts, leggings, hair bands, etc to pair up with Tulle skirts and dresses. These dresses are readily available in every Kids wear stores and many designers  are creating various designs too. The soft materials, non-prickly embellishments, girly and cute colors make these dresses attractive for children also to easily like them and wear happily......choosing cleverly with all these aspects in mind is the key when it comes to selecting clothes for kids, else we all know, they are simply going to reject even the most beautiful dress just because the material is rough, the color is not pleasing, the size is tight.......so Mom's shop for the best Tulle dress that suits your princess this season!!! - pratyusha.T

వేళ్లకి పండ్లు కాస్తున్నాయ్!     చెట్లకి పండ్లు కాయడం మామూలే. కానీ ఇప్పుడు వేళ్లకి కూడా కాస్తున్నాయ్. ఫ్రూట్ ఫిల్డ్ మానిక్యూర్ పుణ్యమా అని. ఒకప్పుడు చేతులకి, వేళ్లకి, గోళ్లకి గోరింటాకు పెట్టి ఆ రంగుకే మురిసిపోయేవారు. ఆ తరువాత నెయిల్ పాలిష్ లు వచ్చాయ్. వాటిని వేసుకుని భలే ఉన్నాయే అని సంబరపడేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. నెయిల్ పాలిష్ ను మామూలుగా వేసుకోవడం లేదు. రకరకాల డిజైన్లను వేసుకుంటున్నారు. వాటిలో అత్యంత పాపులర్ అయిపోయింది ఫ్రూట్ ఫిల్డ్ మానిక్యూర్.     ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిది. అందుకే ఇప్పుడు ఆహారంలో ప్రథమ పాత్ర పండ్లే పోషిస్తున్నాయ్. చివరికి నెయిల్ ఆర్ట్ లో కూడా అవి దూరిపోయాయ్. కావాలంటే ఈ ఫొటోలు చూడండి మీకే తెలుస్తుంది. స్ట్రాబెర్రీస్, యాపిల్స్, ఆరెంజెస్, అవకాడో, పీచ్, డ్రాగన్ ఫ్రూట్, పైనాపిల్, వాటర్ మిలన్... ఒక్కటేమిటి, వేళ్లకు కాయని పండంటూ లేదు.     ఈ రకమైన నెయిల్ ఆర్ట్ లో రకరకాలుగా డిజైన్స్ వేస్తున్నారు బ్యూటీషియన్లు. గోళ్లపై పండ్ల ఆకారాలను అద్దడం ఒక రకమైతే... పండ్ల ముక్కల్ని గోళ్లమీద అతికించారా అన్నట్టుగా వేసే డిజైన్లు మరో రకం. మరో రకం కూడా ఉంది. పండ్ల ఆకారంలో గోటిని వదిలేసి మిగతా భాగమంతా పెయింట్ చేస్తుంటారు. అదనపు ఆకర్షణ కోసం స్టోన్స్, కుందన్స్ అతకడం కూడా జరుగుతోంది. చక్కని రంగులు, అద్భుతమైన డిజైన్లతో నఖ సౌందర్యం రెట్టింపవుతోంది. సిటీస్ లో అయితే ఆల్రెడీ పెయింట్ చేసిన ఆర్టిఫీషియల్ నెయిల్స్ కూడా దొరుకుతున్నాయి. వీటిని కొనుక్కుని జస్ట్ అలా గోళ్లకు అతికించేసుకోవడమే. స్కిక్కర్స్ రూపంలో కూడా దొరుకుతున్నాయి.     బట్టలు, హెయిర్, శాండిల్స్, జ్యూయెలరీ అంటూ రోజుకో రకం స్టయిల్ ని ఫాలో అవుతోన్న యూత్ కి ఈ ఫ్రూట్ నెయిల్స్ భలే నచ్చేస్తున్నాయి. దాంతో తమ వేళ్లకి రోజుకో రకం పండ్లని కాయిస్తున్నారు. మీరు కూడా మొదలుపెట్టేయండి మరి! - Sameera    

ఫ్లోరల్ ఫ్యాషన్... లేటెస్ట్ ప్యాషన్!   ఒకప్పుడు పువ్వులు తలలో పెట్టుకుని మురిసిపోయేవారు. కానీ ఇప్పుడు పూలు ఒళ్లంతా పూయించుకుంటున్నారు. అర్థం కాలేదా? ఈ ఫొటోలు చూడండి అర్థమైపోతుంది. ఒకప్పుడు చిన్నపిల్లలకి పువ్వుల పువ్వుల గౌన్లు కుట్టించేవారు. కానీ ఇప్పుడు పెద్దవాళ్లకే ఈ పువ్వుల పిచ్చి పట్టుకుంది. ఆ పిచ్చి కాస్తా ఫ్యాషనైపోయింది. దాంతో ఎక్కడ చూసినా పువ్వులే. చీరలు, స్కర్ట్స్, జాకెట్స్, ఫ్రాక్స్, అనార్కలి సూట్స్... డ్రెస్ ఏదైనా సరే పూలు ఉండాల్సిందే. బట్టలు మాత్రమే కాదు... హ్యాండ్ బ్యాగ్స్, శాండిల్స్, హ్యాట్స్ లాంటి వాటన్నిటి మీద పూల డిజైన్సే. ఈ ఫ్లోరల్ ఫ్యాషన్ అందరికీ ఎంత ప్రీతి పాత్రమైపోయిందంటే... చివరికి అబ్బాయిలు కూడా పూల చొక్కాలు వేసుకుని మురిసిపోతున్నారు. ఇక సెలబ్రిటీల సంగతి చెప్పాల్సిన పని లేదు. బాబు బంగారం సినిమాలోని ఓ పాటలో నయనతార కట్టిన ఫ్లోరల్ శారీస్ ఎంత అందంగా ఉంటాయో. బాలీవుడ్ భామలైతే ప్రతి అకేషన్ కీ ఫ్లోరల్ డిజైన్స్ ఉన్న దుస్తుల్నే ప్రిఫర్ చేస్తున్నారు.     కాటన్, సిల్క్, క్రేప్ తదితర మెటీరియల్స్ పై రంగురంగుల పూలను చూస్తోంటే నిజంగానే మతిపోతోంది. కుసుమాల అందాలు చూడటానికి రెండు కన్నులూ చాలవనిపిస్తోంది. నిజానికి పూల డిజైన్ల కోసమని ప్రత్యేక ధరలేమీ లేవు. ఆ డిజైన్ ఏ మెటీరియల్ మీద వేశారన్నదాన్ని బట్టే రేటు. అందుకే ఓ చక్కని ఫ్రాక్ ఐదు వందల లోపే వచ్చేస్తోంది. చూడచక్కని చీర ఏడెనిమిదొందలకే దొరికేస్తోంది. మరింకా ఆలోచిస్తున్నారేంటి... మీరు కూడా వెంటనే ఓ మాంచి ఫ్లోరల్ డ్రెస్ కొనేయండి మరి!   - Sameera